Tuesday, 21 July 2026
  • Home  
  • సాహితీ శిఖరం కన్నే బోయిన వెంకటేశ్వర రావు వర్ధంతి సభ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సాహితీ శిఖరం కన్నే బోయిన వెంకటేశ్వర రావు వర్ధంతి సభ

నాలుగు దశాబ్దాలుపాటు తెలుగు సాహితీరంగంలో తనదైన ముద్ర తో ప్రాచీన ఆధునిక సాహిత్యం లో వేలాది ఉపన్యాసాలు ఇస్తూ ఆధ్యాత్మిక రంగంలో తనదైన ప్రతిభ ను చూపించిన సాహితీ శిఖరం కన్నెబోయిన వెంకటేశ్వరరావు అని ప్రముఖ సాహితీవేత్త సీనియర్ తెలుగు లెక్చరర్ నల్లా నరసింహమూర్తి అన్నారు. సోమవారం మధ్యాహ్నం అమలాపురం డాబా గార్డెన్స్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కోనసీమ రచయితల సంఘం ఆధ్వర్యంలోజరిగిన “కన్నెబోయిన వెంకటేశ్వరరావు వర్ధంతి సభ జరిగింది. సభకు కనిబోయిన వెంకటేశ్వరరావు ప్రియ శిష్యుడునల్లా నరసింహమూర్తి ముఖ్యవక్తగా విచ్చేసిప్రసంగించారు. అమలాపురం ఎస్. కె. బి. ఆర్ కళాశాలలో నాలుగు దశాబ్దాల పాటు తెలుగు అధ్యాపకునిగా ఎందరో విద్యార్థులను ఉన్నత గా తీర్చిదిద్దారని వారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి తెలుగులో ఉచిత కోచింగ్ నిర్వహించారని ఆయన అన్నారు. తెలుగు కవిత్వంలో’ శాంతి కపోతాలు’ అనే వచన కావ్యం రచించి సమాజంలో హింసకు తావు లేదని శాంతి ఒక్కటే నిలుస్తున్నది సందేశాన్ని ఆ రచన ద్వారా మనకు అందించారని ఈ కావ్యం ఆయనకు మంచి కీర్తిని తెచ్చి పెట్టిందని నరసింహమూర్తి అన్నారు.. ఒక కావ్యంతోనే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన అన్నారు.సభకు కోనసీమ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ బి.వి.వి సత్యనారాయణ అధ్యక్షత వహించారు సభకు ముందు కన్నెబోయిన చిత్రపటానికి సాహితీ వేత్త నల్లా నరసింహా మూర్తి,ముమ్మిడివరం మదర్ థెరిసా మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు సేవా శిరోమణి మెండి కమల , రచయిత్రి పోలిశెట్టి అనంతలక్ష్మీదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ వై. టి. పి వెంకటేష్., నిమ్మకాయల సురేష్, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపాద రామకృష్ణ, పసలపూడి సతీష్ పాల్గొన్నారు.

నాలుగు దశాబ్దాలుపాటు తెలుగు సాహితీరంగంలో తనదైన ముద్ర తో ప్రాచీన ఆధునిక సాహిత్యం లో వేలాది ఉపన్యాసాలు ఇస్తూ ఆధ్యాత్మిక రంగంలో తనదైన ప్రతిభ ను చూపించిన సాహితీ శిఖరం కన్నెబోయిన వెంకటేశ్వరరావు అని
ప్రముఖ సాహితీవేత్త సీనియర్ తెలుగు లెక్చరర్ నల్లా నరసింహమూర్తి అన్నారు. సోమవారం మధ్యాహ్నం అమలాపురం డాబా గార్డెన్స్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కోనసీమ రచయితల సంఘం ఆధ్వర్యంలోజరిగిన “కన్నెబోయిన వెంకటేశ్వరరావు వర్ధంతి సభ జరిగింది. సభకు కనిబోయిన వెంకటేశ్వరరావు ప్రియ శిష్యుడునల్లా నరసింహమూర్తి ముఖ్యవక్తగా విచ్చేసిప్రసంగించారు. అమలాపురం ఎస్. కె. బి. ఆర్ కళాశాలలో నాలుగు దశాబ్దాల పాటు తెలుగు అధ్యాపకునిగా ఎందరో విద్యార్థులను ఉన్నత గా తీర్చిదిద్దారని వారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి తెలుగులో ఉచిత కోచింగ్ నిర్వహించారని ఆయన అన్నారు. తెలుగు కవిత్వంలో’ శాంతి కపోతాలు’ అనే వచన కావ్యం రచించి
సమాజంలో హింసకు తావు లేదని శాంతి ఒక్కటే నిలుస్తున్నది సందేశాన్ని ఆ రచన ద్వారా మనకు అందించారని ఈ కావ్యం ఆయనకు మంచి కీర్తిని తెచ్చి పెట్టిందని నరసింహమూర్తి అన్నారు.. ఒక కావ్యంతోనే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన అన్నారు.సభకు కోనసీమ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ బి.వి.వి సత్యనారాయణ అధ్యక్షత వహించారు
సభకు ముందు కన్నెబోయిన చిత్రపటానికి సాహితీ వేత్త నల్లా నరసింహా మూర్తి,ముమ్మిడివరం మదర్ థెరిసా మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు సేవా శిరోమణి మెండి కమల , రచయిత్రి పోలిశెట్టి అనంతలక్ష్మీదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ వై. టి. పి వెంకటేష్., నిమ్మకాయల సురేష్,
ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపాద రామకృష్ణ, పసలపూడి సతీష్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.