Saturday, 5 September 2026
  • Home  
  • డ్రైనేజీ దుస్థితితో విలవిల్లాడుతున్న ఏటికొప్పాక.. అధికారులు మేల్కొనేందెప్పుడు?
- అనకాపల్లి

డ్రైనేజీ దుస్థితితో విలవిల్లాడుతున్న ఏటికొప్పాక.. అధికారులు మేల్కొనేందెప్పుడు?

ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో డ్రైనేజీ కాలువల దుస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. గ్రామంలోని డ్రైనేజీ నీరంతా పులపర్తి వైపు వెళ్లే ప్రధాన కాలువలోకి చేరుతుండగా, కాలువ పూర్తిగా మురుగునీరు, చెత్తతో నిండిపోయి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. ఫలితంగా మురుగునీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. కాలువకు ఆనుకుని చెత్తను విచ్చలవిడిగా వేయడం, సకాలంలో శుభ్రపరిచే చర్యలు చేపట్టకపోవడంతో దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం నెలకొంది. ముఖ్యంగా సమీపంలోని ఆర్టిజన్స్ కాలనీ నివాసితులు, ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ఈ ప్రాంతం గుండా వెళ్లాల్సి రావడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి కాలువను పూర్తిస్థాయిలో శుభ్రపరచడంతో పాటు చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని వారు కోరుతున్నారు.

ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో డ్రైనేజీ కాలువల దుస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. గ్రామంలోని డ్రైనేజీ నీరంతా పులపర్తి వైపు వెళ్లే ప్రధాన కాలువలోకి చేరుతుండగా, కాలువ పూర్తిగా మురుగునీరు, చెత్తతో నిండిపోయి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. ఫలితంగా మురుగునీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.
కాలువకు ఆనుకుని చెత్తను విచ్చలవిడిగా వేయడం, సకాలంలో శుభ్రపరిచే చర్యలు చేపట్టకపోవడంతో దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం నెలకొంది. ముఖ్యంగా సమీపంలోని ఆర్టిజన్స్ కాలనీ నివాసితులు, ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ఈ ప్రాంతం గుండా వెళ్లాల్సి రావడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి కాలువను పూర్తిస్థాయిలో శుభ్రపరచడంతో పాటు చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని వారు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.