Friday, 10 July 2026

Blog

Featured సాహితీ

మండికారి బాలాజీ గారికి *కరోనా వారియర్* అవార్డు

లాక్డౌన్ సమయంలో పేదలకు నేను చేసిన సహాయమును గుర్తించి *విశ్వగురు వరల్డ్ రికార్డ్స్* వారు అచ్చంపేట కు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మండికారి బాలాజీ గారికి *కరోనా వారియర్* అవార్డును అందజేసిన సందర్భంగా *మిత్రమండలి సేవాసంస్థ* ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఎన్నో ఏండ్లుగా సేవలందిస్తున్న మండికారి బాలాజీ గారికి ఈ అవార్డును అందజేసిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అధినేత రాం బాబు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బాణాల హరీష్ కుమార్ , గంగాపురం శ్రీనివాస్, పోల సాయిబాబు , చంద్రమోహన్ ,భీరం నరేందర్ రెడ్డి, పోల అశోక్ , ఆకుతోట కాశీలింగం,శ్రీమతి కేతరాజు కమల రాణి , శ్రీమతి ఉమాదేవి , శ్రీమతి పెద్ది మాధవి , బాలమని , గార్లపాటి శ్రీనివాస్, శ్యామ్ సుందర్ ,మేడిశెట్టి రమేష్ ,ఫుల్జాల శ్రీనివాస్ ,శ్రీధర్ శర్మ,నారాయణలు పాల్గొన్నారు.

Featured అనంతపురం

శ్రీ కృష్ణదేవరాయ ఉత్తమ సేవా పురస్కారం: టి.వి.రెడ్డి

పెనుగొండ పట్టణం లోని నామా రామయ్య ఫంక్షన్ హాలులో మనం ఫౌండేషన్ మరియు శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన “శ్రీకృష్ణదేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలు”కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహిత్య,సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ,కవి టి.వి.రెడ్డి కి ప్రముఖకవి,కళారత్న శ్రీ.బిక్కికృష్ణ ,మదర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ.అశోక్ కుమార్ చేతులమీదుగా “శ్రీ కృష్ణదేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారం”అందజేశారు.టి.వి.రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల ఉద్యోగ పర్వం అనంతరం విశ్రాంత జీవితంలో కూడా సాహిత్య,సామాజిక సేవలపై ఉన్న మక్కువ చేత “తెలుగు వెలుగు సాహిత్య,సామాజిక సేవా సంస్థను స్థాపించి,ఒంటరిగా ఏమిచేయలేము అనుకునే వారిని సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తూ,”కలిసిఉందాం -కలుపుకుపోదాం”అనే లక్ష్యంతో అటు సాహిత్యంలోను,ఇటు సామాజికంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.ముఖ్యంగా కరోనా విజృంభించిన రోజులలో దేవుడికంటే మిన్నగా సేవలు చేస్తున్న పోలీసులకు,పారమెడికల్ సిబ్బందికి,పారిశుద్ద కార్మికులకు,పాత్రికేయులకు,వలస కార్మికులకు,నిరుపేదలకు టీ,బిస్కెట్స్, మాస్క్ లు,నిత్యావసర సరుకులు దాతల సహాయంతో పంపిణీ చేయడం జరిగింది.”కరోనాపై కలం” అంటూ జాతీయ స్థాయిలో ఆన్లైన్ లో కవి సమ్మేళనం నిర్వహించి బహుమతులతో కవులను ప్రోత్సహించాము.పై సేవలకు గుర్తింపుగా పురస్కారం అందుకున్నందులకు సహకరించిన మిత్రులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

గుడివాడ రైతుబజార్ ప్రతిపాదనలను సిద్ధం చేయండి*

*గుడివాడ శాంతినగర్లో రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయండి* *మున్సిపల్ కమిషనర్‌కు మంత్రి కొడాలి నాని ఆదేశం* గుడివాడ పట్టణం శాంతినగర్లో 2 వ రైతుబజార్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. గురువారం స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా రైతుబజార్ ఏర్పాటుపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో గతంలో గుడివాడ రైతుబజార్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు రైతుబజార్ కు కూరగాయలను తెచ్చి విక్రయిస్తున్నారని, స్టాల్స్ చాలక రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యం 10 వేల మందికి పైగా వినియోగదారులు రైతుబజార్‌కు వస్తుంటారన్నారు. అయితే పట్టణంలో ఒకచోట మాత్రమే రైతుబజార్ ఉండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు కూరగాయలను కొనుగోలు చేయాలంటే రైతుబజార్ ఉన్న ప్రాంతానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గుడివాడ పట్టణం శాంతినగర్లోని మంచినీటి రిజర్వాయర్ సమీపంలో 2 వ రైతుబజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ 2 వ రైతుబజార్లో 16 నుండి 20 స్టాల్స్ ఉంటాయన్నారు. నాగవరప్పాడు, వలివర్తిపాడు, పరిసర ప్రాంతాలకు చెందిన రైతులకు ఈ 2 వ రైతుబజార్ అనుకూలంగా ఉంటుందన్నారు. తక్కువ సమయంలో, రవాణా ఖర్చుల భారం లేకుండా రైతులు తమ కూరగాయలను రైతుబజార్ కు తెచ్చి అమ్ముకునే వీలు కలుగుతుందన్నారు. మరోవైపు శాంతినగర్ పరిసర ప్రాంతాల వినియోగదారులకు కూడా 2 వ రైతుబజార్ సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. 2వ రైతుబజార్లో స్టాల్స్ నిర్మాణానికి రూ. 40 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి తనకు అందజేయాలని, ప్రభుత్వం నుండి నిధులు మంజూరయ్యేలా చూస్తానని మంత్రి కొడాలి నాని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రైతుబజార్లో స్టాల్స్ కొరత ఉందని, 2 వ రైతుబజార్ ఏర్పాటైతే మరికొంత మంది రైతులు తాము పండించే కూరగాయలను కూడా విక్రయించే అవకాశం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులకు కూడా నాణ్యమైన కూరగాయలు అతి తక్కువ ధరలకే అందుతాయని చెప్పారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని శాంతినగర్ ప్రాంతంలో 2 వ రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి కొడాలి నాని ఆదేశించారన్నారు. అంచనాలను వెంటనే రూపొందించి నివేదికను మంత్రి కొడాలి నానికి అందజేస్తామని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

కరోనా వ్యాక్సిన్ ను ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా అందించాలి: . …….  యం.వి.రమణయ్య          

కరోనా వ్యాక్సిన్ ను ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా అందించాలి .శ్రీ. వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు…  ఆర్యా! విషయం: రాష్ట్రంలో ప్రజలందరికీ సురక్షితమైన కోవిడ్  టీకా ఉచితంగా ఇవ్వాలని ……. కోటి మంది ప్రజలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  దేశంలోనే అగ్రగామిగా నిలవడాన్ని యావత్ దేశ ప్రజలు హర్షించారు. అలాగే ప్రజారోగ్య వేదిక కూడా అభినందిస్తున్నది. నేడు కరోనా విపత్తు నుండి ప్రజలు తమ ప్రాణ రక్షణకై వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారుు. ఎందుకంటే ఇంత వరకు కోవిడ్ నివారణకు మందులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితులలో వ్యాక్సిన్ మూడవదశ క్లినికల్ ట్రైల్స్ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని కంపెనీలు ప్రభుత్వ అనుమతుల కోసం సిఫార్సు చేసుకుని ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కూడా దీనికి తగినట్లుగా మార్గదర్శకాలను, ప్రణాళికలను మరియు మౌలిక సదుపాయాల ఏర్పాటులో నిమగ్నమై ఉందని తెలుస్తున్నది.  ఇప్పటికే కేరళ, తమిళనాాడు, మధ్యప్రదేశ్ మరియు బీహారు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తామని బహిరంగ ప్రకటనలు చేశాయి. కోవిడ్ మరియు  లాక్ డౌన్ అనంతర కాలం లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయిన నేపథ్యంలో ప్రజలు కోవిడ్ టీకానీ కొనుక్కొని తీసుకునే పరిస్థితి లేదు. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సురక్షితమైన  టీకాను ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని ప్రజారోగ్య వేదిక విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ఈ మొత్తం నిర్వహించే కార్యక్రమం, ఇచ్చే టీకా ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ  ఎంతమందికి ఇస్తారు, అలాగే టీకా వివరాలు దాని సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలగు అంశాలతో కూడిన సమగ్రమైన వివరాల ప్రకటనను ముందుగానే విడుదల చేయాలని కూడా ప్రజారోగ్య వేదిక విజ్ఞప్తి చేస్తున్నది.  ఈ మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రభుత్వ అజమాయిషీ లోనే జరగాలని, అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులలోని మౌలిక సదుపాయాలను మరియు ప్రైవేటు వైద్య సిబ్బందిని కూడా వినియోగించుకుని ఈ సురక్షిత ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాలని కోరుతున్నాం. …….  యం.వి.రమణయ్య          ( రాష్ట్ర అధ్యక్షులుు)     …   కామేశ్వరరావు       (  రాష్ట్రర ప్రధాన కార్యదర్శి)

Featured

వైకుంఠరావు??సంస్మరణ సభ*??..: సురేంద్ర రెడ్డి,

ప్రచురణార్థం* *??సంస్మరణ సభ*??.. *APTF లో జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వివిధ పదవులలో పనిచేసి* *నెల్లూరు జిల్లా ఉపాధ్యాయ ఉద్యమం లో చెరగని ముద్ర వేసిన C.వైకుంఠరావు గారు* *7.12.2020 న అనారోగ్యంతో మరణించారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ వారి ఆశయాలు కొనసాగించే లక్ష్యం గా ఆయన జ్ఞాపకాలను, అనుభవాలను చర్చించే లక్ష్యం తో 20.12.2020 న ఉదయం 9.00 గంటలనుండి 12.30 వరకు నెల్లూరు B.V.నగర్ లోని సంఘమిత్ర విద్యాలయం నందు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సంస్మరణ సభ నిర్వహించుచున్నాము. కావున పై సంస్మరణ సభలో వారి సమకాలీనులు మరియు నేటియువతరం ముఖ్యంగా హాజరై వారి ఆశయాలను, విలువలను పుణికిపుచ్చుకోవాలి*. *కావున ఎక్కువ మంది ఉపాధ్యాయులు, అభిమానులు హాజరు కావాలని మనవి చేయుచున్నాము*. *ఇట్లు* *ఎ.సురేంద్ర రెడ్డి,అధ్యక్షుడు*. *యం.పిచ్చిబాబు,ప్రధాన కార్యదర్శి* *APTF జిల్లా శాఖ* ………………………….. Lunch follows.

Featured సాహితీ

కొల్లాయి గట్టితేనేమి” గ్రంథావిష్కరణ: డా.ఏనుగు నరసింహారెడ్డి

కరీంనగర్ అదనపు జిల్లా పాలనాధికారి శ్రీ డా.ఏనుగు నరసింహారెడ్డి గారు,సంస్కృతి పరిరక్షణ సేవా సమితి,హైదరాబాద్ సంస్థ గాంధీ జీవితం,ఆదర్శాలు,వ్యక్తిత్వం పై నిర్వహించిన కవితల పోటీలో ఎంపికైన కవితలతో ప్రచురించబడిన “కొల్లాయి గట్టితేనేమి” 90 మంది కవుల కవితా సంకలనాన్ని కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారి శ్రీ డా. ఏనుగు. నరసింహారెడ్డి గారు17 గురువారం సాయంత్రం తమ కార్యాలయంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ జీవితంపై ఎన్ని కవితా సంకలనాలు వచ్చినా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయని,ఆ మహనీయుని జీవితం,మార్గం సదా ఆచరణీయాలని అన్నారు”జాతీయోద్యమంలో చెరగని ముద్ర వేసిన జాతిపిత, మహాకవి రవీంద్రనాధ్ ఠాగూర్ చే ‘మహాత్మా’ అనిపించుకున్న నిరాడంబరుడు,రవి అస్తమించని సామ్రాజ్యపు పునాదులను సత్యాహింసలతో కదిలించిన స్వరాజ్య సమరయోధుడు మహాత్మాగాంధీ” అని అన్నారు”గ్రామ స్వరాజ్యం కోసం పరితపించిన గాంధీ కులవృత్తులను గౌరవించారని,అస్పృశ్యతా నివారణ కు కంకణం కట్టుకున్న గొప్ప సంస్కర్త”అని సంస్కృతి పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చింతపట్ల వెంకటరమణాచారి మౌనయోగి అన్నారు.కార్యక్రమంలో చింతపట్ల వెంకట రమణాచారి, ఉదయసాహితి కరీంనగర్ అధ్యక్షులు,కవి శ్రీ వైరాగ్యం. ప్రభాకర్,అండాల్ ప్రింటర్స్ అధినేత శ్రీ ఎర్రమరాజు. రామరాజు, కొల్లాయి గట్టితేనేమి కవితా పోటీలో ద్వితీయ బహుమతి పొందినశ్రీమతి సి.హెచ్.రజిత తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ వాదన వేరు గా ఉంది:నిమ్మగడ్డ రమేశ్‌కుమార్

*స్థానిక ఎన్నికలకు కరోనా అడ్డంకి కాదు* బిహార్‌, రాజస్థాన్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికలే నిదర్శనం టీకాల కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదు *వైద్య ఆరోగ్య సిబ్బందిని ఎన్నికలకు వినియోగించుకోం* రాష్ట్ర ప్రభుత్వానికి పిటిషన్‌ వేసే హక్కులేదు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎస్‌ఈసీ *నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వాదన* అమరావతి : ఏపీలో 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కరోనా అడ్డంకి కాజాలదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. బిహార్‌, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాలు ఈ మధ్య విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎన్నికలు అడ్డంకిగా మారతాయని రాష్ట్ర ప్రభుత్వం (పిటిషనర్‌) పేర్కొంటోందని, నిజానికి వ్యాక్సిన్ల వినియోగానికి కేంద్రం అనుమతివ్వలేదని, ఇందుకు జాతీయ విధానం ఖరారు కాలేదని తెలిపారు. ఎన్నికల కోసం రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బందిని వినియోగించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్‌14 కింద పిటిషన్‌ దాఖలు చేసే హక్కే లేదని, ఆ ఆర్టికల్‌ వ్యక్తులకు వర్తిస్తుంది తప్ప ప్రభుత్వాలకు కాదని పేర్కొన్నారు. పిటిషన్‌కు ఏ రకంగానూ విచారణార్హత లేదన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రధానాధికారి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. అందులోని వివరాలివీ… *కరోనా తగ్గడంతోనే* రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఏర్పడాలని పాఠశాలలు, సినిమాహాళ్లు, మాల్స్‌ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. అత్యంత ఎక్కువ జనసాంద్రత ఉన్న హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక తీసుకున్నాం. మరోవైపు రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బిహార్‌లో కొవిడ్‌ కారణంగా శాసనసభ ఎన్నికల వాయిదాకు సుప్రీంకోర్టు అంగీకరించని విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. రక్షణ చర్యల మధ్య ఆ రాష్ట్ర ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు, తాజా పరిస్థితుల దృష్ట్యా ఏపీలో పరిస్థితులు త్వరలో మరింత కుదుటపడతాయని ఎన్నికల సంఘం భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే ఎన్నికలు నిర్వహించాలనుకున్నాం. అక్టోబరు 21న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించగా… ఎన్నికల నిర్వహణకు ఉన్న అభ్యంతరాలను పేర్కొంటూ, గణాంకాలను జత చేస్తూ వారు లేఖ ఇచ్చారు. కరోనా రెండో వేవ్‌ వచ్చే అవకాశముందనే అభ్యంతరాన్ని నోటిమాటగానే పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను ప్రథమ ప్రాధాన్యంగా భావిస్తూ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ఎన్నికల షెడ్యూలు, నిర్వహణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. నిజానికి ఈ కేసులో పిటిషనర్‌గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సహకరించాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర యంత్రాంగంతో వీడియో సమావేశ ఏర్పాటుకు ప్రధాన కార్యదర్శి సహకరించలేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితో వివిధ అంశాలపై మాట్లాడాకే ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చాం. రాష్ట్రంలోని 19 రాజకీయ పార్టీలను సమావేశానికి రావాలని పిలిచాం. 11 పార్టీలు హాజరయ్యాయి. ఎన్నికలపై వారి అభిప్రాయాలు తీసుకున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు తీసుకున్న చర్యల్ని వివరించాం. జాగ్రత్తలు చేపడుతూ ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీలు కోరాయి. ఈ సమావేశాన్ని అధికార వైకాపా బహిష్కరించింది. చర్చల ప్రక్రియను విమర్శిస్తూ రాజ్యాంగపరంగా ఎన్నికల సంఘానికి ఉన్న గౌరవాన్ని, గుర్తింపునకు భంగం కలిగేలా వ్యవహరించింది. *పూర్తి విరుద్ధం* ఇప్పటికే ఆచరణలో ఉన్న న్యాయసూత్రాలకు పిటిషనర్‌ వాదన పూర్తి విరుద్ధం. పైగా ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో జోక్యం చేసుకునే హక్కులేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మధ్యే కేరళ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ ఉత్తర్వులను కేరళ హైకోర్టులో కొందరు సవాల్‌ చేశారు. ఆ రిట్‌ పిటిషన్‌ను 2020 నవంబరు 5న కేరళ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఎన్నికలు నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. *ఎన్నికల ప్రధానాధికారిపై సీబీసీఐడీ విచారణ* రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహ ఫలితాన్ని చూశారు. ఎన్నికల నిర్వహణ మధ్యలో ఉండగానే ఎన్నికల ప్రధానాధికారిపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సహాయాధికారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ సామగ్రిని సీజ్‌ చేశారు. *ప్రభుత్వానికి హక్కులేదు* ఆర్టికల్‌ 14 కింద తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని ప్రభుత్వం(స్టేట్‌, రాజ్యం) వాదించడానికి లేదు. ప్రభుత్వానికి ఏ హక్కు లేదో అది ఉల్లంఘించినట్లుగా రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం ఏ మాత్రమూ చెల్లదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తి కాదు. రాజ్యాంగంలోని 14, 18, 20, 21, 22, 25, 27, 31… ఏ ఆర్టికల్‌ ప్రకారం చూసినా ప్రభుత్వాన్ని పౌరునితో పోల్చడం, వ్యక్తిగా చూడటం సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ ఏ రకంగానూ చెల్లదు. ప్రభుత్వానిదో మాట.. మంత్రులదో మాట స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కరోనాను కారణంగా చూపుతోంది. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే కరోనాను తగ్గించగలిగామని రాష్ట్ర మంత్రులు, అధికారులు అంటున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను పెద్దపీట వేస్తూ స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ ధర్మాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. ఎన్నికల వల్ల కరోనా కేసులు పెరుగుతాయనే రాష్ట్ర ప్రభుత్వ వాదన అర్థరహితం. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని, రాష్ట్ర యంత్రాంగం అంతా అదేపనిలో ఉంటుందన్న ప్రభుత్వ వాదనలోనూ పసలేదు. వ్యాక్సినేషన్‌కు క్లినికల్‌ అనుమతులు రావాల్సి ఉన్నాయి. జాతీయ విధానం ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వ్యాక్సినేషన్‌కు మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. వ్యాక్సినేషన్‌లో నిమగ్నమయ్యే వైద్య ఆరోగ్య సిబ్బంది సేవల్ని ఎన్నికల్లో వినియోగించుకోబోం.

Featured

పాస్టర్ నిర్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మినీ వెహిల్ ద్వారా ఉచిత భోజనం. ఏసి నాయుడు .

ఈరోజు ఉదయం17.12.2o2o నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండయ్య పాలెం ఎలుకలకు పాలెంలో అబే డింగ్ హోమ్ చర్చి హారిగరీ హెల్పర్స్ వారు పాస్టర్ నిర్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏడు లక్షల రూపాయలతో ఒక మినీ వెహికల్ లో మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లు తయారు చేసి గ్రామాల ప్రాంతాల్లో వచ్చేటువంటి పేదలకు రోడ్డు మార్గాన ప్రతిరోజు భోజనం ప్యాకెట్లు పంచి పెట్టడం జరుగుతుంది అదే కాక కొండాయపాలెం ఎలుకుల పాలెం వారి చర్చి వద్ద సోమ బుధ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచిరాత్రి 9 గంటల వరకు పేదలకు భోజన సౌకర్యం కలదు ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ ఉపయోగించుకోవాలని పాస్టర్ నిర్మల కుమార్ గారూ కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు ఏఎంసీ చైర్మన్ ఏసి నాయుడు గారు చేతుల మీదగా మొబైల్ భోజనం వాహనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఏసు నాయుడు గారు మాట్లాడుతూ డిసెంబర్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం శుభపరిణామం పాస్టర్ నిర్మల కుమార్ గారూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ ప్రభువు కృప నిండుగా వారి మీద ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతం వైసిపి నాయకులు మహేష్ తా లూరి సురేష్ బాబు ధర్మారావు రమణయ్య హరి కుమార్ వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

సమాజంలో మమ్మల్ని భాగస్వాములు చేయండి* ___ సెక్స్ వర్కర్స్ వేడికోలు*

*మాపై వివక్షత చూపకుండా సమాజంలో మమ్మల్ని భాగస్వాములు చేయండి* ___ *మీడియా సమావేశంలో సెక్స్ వర్కర్స్ వేడికోలు* అక్రమ రవాణా కు గురికాబడి ప్రత్యామ్న్యాయ ఉపాది అవకాశాలు లేక సమాజంలో అవహేళనలు, వేదింపులు, హింస, చిన్న చూపు తో పాటు అప్పులు ఉబిలో నుంచి బయటకు రాలేక తమ జీవనం కోసం తప్పనిసరి పరిస్తుల్లో “సెక్స్ వర్కర్స్” గా మారి తమ జీవితాలు వెళ్ళదీస్తున్న సెక్స్ వర్కర్స్ నేడు కోవిడ్ మహమ్మారి వల్ల మరింత దుర్భల పరిస్థితి లో కొట్టుమిట్టాడుతున్నారు .. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని ఆదుకొని వీరికి ప్రత్యామ్న్యాయ జీవనోపాదులు కల్పించాలని అక్రమ రవాణా భాధితుల రాష్ట్ర సమాక్య “విముక్తి” రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి మెహరున్నీసా కోరారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో “సెక్స్ వర్కర్స్ పై హింసను నిరోధించాలి అనే అంతర్జాతీయ దినోత్సవం” (International Day to End Violence Against Sex workers) పురష్కరించుకొని అక్రమ రవాణా భాధితుల సమాఖ్య – విముక్తి మరియు ఇండియా లీడర్స్ ఫోరం అగనేస్ట్ ట్రాఫికింగ్ (India Leaders forum against trafficking- ILFAT) రాష్ట్ర శాఖ సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో షుమారు రెండు లక్షల మంది మహిళలు వ్యభిచారం లో మగ్గుతున్నారని వీరిలో షుమారు ఒక లక్ష మంది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే “రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ” కార్యక్రమ్మాల్లో రిజిస్టర్ కాబడి ఉన్నారు. వీరు కాక అక్రమ రవాణా నుంచి విముక్తి పొందిన వారు మరో రెండు వేల మంది ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న సెక్స్ వర్కర్స్ లో షుమారు 60% మంది తమ 15 నుంచి 25 ఏళ్ళ వయస్సు లోపల అక్రమ రవాణా కు గురికాబడి అనంతరం సెక్స్ వర్కర్స్ గా తమ జీవితాలు వెళ్ళదీస్తూ ఉన్నారు. కోవిడ్ తర్వాత రాష్ట్రంలో సెక్స్ వర్కర్స్ పై పలురకాల హింసలు పెరిగాయి అని అవి షుమారు 55% గా ఉంది అని అంటూ ఇటీవల్ ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే లో తెలిపింది. వీరిలో వ్యభిచార గృహాలలో ఉండేవారిలో 35% ఉండగా, హైవే, డాబాలు, వివిధ రహదారులు పక్కన వ్యభిచారం చేసేవారిలో 58% మంది ఉండగా, వీరిని ఉంచుకొన్న వాళ్ళు, బ్రోతల్ ఓనర్స్ మరియు కుటుంభ సబ్యులు వల్ల 45% పలు రకాల హింసలు కు గురి అవుతు ఉన్నారు. కోవిడ్19 మహమ్మారి ప్రభావం అట్టడుగున ఉన్నవారిపై అసమానంగా ప్రభావం చూపగా, సెక్స్ వర్కర్స్ పై దాని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. మహమ్మారి సమయంలో పని కోల్పోవడం దేశం లోని వివిధ రెడ్ లైట్ ప్రాంతాలు మరయు మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని వ్యభిచార ప్రాంతాల నుండి భారీగా 70% సెక్స్ వర్కర్స్ పైగా తమ స్వంత గ్రామాల్లోని తమ ఇంటికి తిరిగి రావలసి వచ్చింది. వారు తమ గ్రామాలు, ఇళ్ళకు తిరిగి రావడం నిజమగ వారికి ఒక తప్పనిసరి పరిస్థితే. అందుకు కారణం అనేక మంది సెక్స్ వర్కర్లకు, వారి కుటుంబాలు మరియు సంఘాల నుండి తాము చేసే వ్యభిచారం చుట్టూ ఉన్న కళంకం మరియు బహిష్కరణ కారణంగా “ఇంటికి తిరిగి రావడం” ఒక ఎంపిక కాదు సత్వ అనే సంస్థ ఇటీవల ఇతర ప్రాంతాలు నుంచి వచ్చిన ఒక 1 4 5 మంది సెక్స్ వర్కర్స్ తో ఒక శాంపిల్ సర్వే చేయడం జరిగింది. • సెక్స్ వర్కర్స్ వారి సంపాదన 100% పూర్తిగా తగ్గిపోయింది అన్నారు • 74% మంది ఎక్కువ వద్దికి ప్రవేటు వ్యక్తులు నుంచి అప్పులు తీసుకొన్నట్లు తెలిపారు. • 88% మందికి ప్రత్యామ్న్యాయ జీవనోపాదులు లేవని, 61% మందికి అసలు ఎటువంటి జీవనోపాదులు లేవని తెలియజేశారు • 57% మంది ఇతర ఉపాది అవకాశలు ఉంటే చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాని ఈ కోవిడ్ వల్ల ఎటువంటి ఉపాది అవకాశాలు వారికి లభించలేదు. ఫలితంగా వారు వారి కుటుంభాలు చాలా ఇబ్బందులు ఎడుర్కొనవలిసిన పరిస్థితే ఏర్పడింది • కోవిడ్ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వీరిలో కొంత మందికి ఉపాది అవకాశాలు లభించాయి. అయితే వీరికి తగిన విద్య, పనిలో నైపుణ్యాలు లేనందువల్ల, వివిధ జీవనోపాదులు గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలీ చాలని అతి తక్కువ వేతనం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు • ప్రత్యామ్నాయ జీవనోపాధిని వారికి అవాంఛనీయమైన లేదా అసాధ్యమైనదిగా చేసే ఇతర ముఖ్య కారణాలు: వారు ఇష్టపడే జీవనోపాదులు లభ్యం కాకపోవడం, బ్రోతల్ గృహాల వెలుపల వారు ఉండటానికి స్థలం లేకపోవడం, వేశ్యాగృహం లో ఉంటూ బయట ప్రత్యామ్న్యాయ ఉపాది, ఉద్యోగం తీసుకోవడంలో సిగ్గు, సమాజం తనను ఆదరిస్తారో లేదో అనే భయం మరియు పిల్లల సంరక్షణ కు తగిన మద్దతు లేకపోవడం / పిల్లలను ఒంటరిగా వేశ్యాగృహంలోనే విడిచిపెట్టడానికి ఇష్టం లేకపోవడం లాంటి భయాలు కూడా ఉన్నాయి. దీనికి తోడు కొన్ని సంస్థలు / వ్యక్తులు తప్పుడు వాగ్దానాలు చేయడం గురించి కూడా భయాందోళనలు. డిమాండ్స్: • ప్రభుత్వ ప్రణాలికలు మరియు సంక్షేమ ప్రయోజనాల నుడ్ని మమ్మల్ని మినహాహించవద్దు. మా పేదరికం, మా దుర్బలత్వం , అట్టడుగు స్తాయిలో ఉన్న మమ్ము సమాజంలో కలపండి • ఈ దేశంలోని మిగతా పౌరలందరికి లాగే మాకు సమాన హక్కులు ఇవ్వండి- రేషన్ కార్డులు అందుకునే హక్కు, బ్యాంకు ఖాతాలు తెరుచుకునే హక్కు, జనధాన్ యోజన ప్రోయోజనాలు పొందే హక్కు అధర్ కార్డులు, స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసుకునే ఆర్ధిక ప్రయోజనాలు పొందే హక్కు • మేము వేశ్యాగృహం నిర్వాహకులు, మేడంలు మరియు పింప్ లు వల్ల మాత్రమే కాకుండా కొంతమంది అవినీతి పోలీస్ అధికారులు, ప్రైవేటుగా అధిక వడికి అప్పులు ఇచ్చే వారి ద్వారా కూడా మేము హింసకు, దోపిడీకి గురవుతున్నామని ప్రభుత్వాలు గుర్తించాలి, అలాగే మా సాధికారత, అన్ని రకాల దోపిడీ నుంచి మాకు రక్షణ కల్పిస్తూ మా సమస్యలు, మా హక్కులు వినడానికి వీలుగా ఒక పాలసీని రూపొందించండి • మమ్మల్ని నేరస్తులుగా చూడకండి, మా నిస్సహాయత ను ఆధారంగా చేసుకొని మమ్మ్మల్స్ని లైంగిక దోపిడీకి గురిచేసి మా నుండి లాభం పొందిన వారందరిని నేరస్తులుగా గుర్తించి వారికీ శిక్షలు వేయండి • సెక్స్ వర్కర్స్ 35 ఏళ్ళు దాటినా తర్వాత తమ జీవనం కోసం వ్యభిచార గృహాల యజమానులు, పింప్, మేడం మరియు త్రాఫ్ఫికెర్స్ గా మారకుండా వారిని నివారించటానికి వీలుగా సెక్స్ వర్కర్స్ కు రక్షణ, ఆర్ధిక పునరావాసం తో పాటు వారి సాధికారత కోసం రాష్ట మరియు జాతీయ స్తాయిలో ఒక పాలసీ ని రూపొందించండి • మమ్మల్ని రెస్క్యూ చేసిన వెంటనే పునరావాసం పేరున మమ్మల్ని ఆశ్రయ గృహాలలో నెలలు, ఏళ్ళు తరబడి ఉంచి మా (మానవ) హక్కులకు బంగం కలిగించవద్దు. అందుకు బదులుగా కమ్యూనిటీ ఆధారిత పునరావాస విధానాలను అనుసరించండి • అన్ని రకాల మానవ అక్రమరవాణా అడ్డుకునేందుకు వీలుగా ఒకే చట్టాన్ని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము • అక్రమరవాణాకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని చట్టాలు మరియు విధానాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండేందుకు రాష్ట ప్రభుత్వం పర్యవేక్షణ కమిటీ ని ఏర్పాటు చేయాలి. ఈ పర్యవేక్షణ కమిటీ లో సెక్స్ వర్కర్స్ మరియు అక్రమరవాణా నుండి విముక్తి పొందిన బాధితులు ను కూడా సబ్యులుగా నియమించాలి. • సెక్స్ వర్కర్స్ కు వివిధ ఉపాధి పధకాల్లో శిక్షణ ఇచ్చి ప్రత్యామ్న్యాయ జీవనోపాదులు వెంటనే ఏర్పాటు చేయాలి. • వారు ఉపాది శిక్షణలు పొందే సమయంలో వారి జీవనం కోసం ప్రతేక జీవన్ బ్రుతి కల్పించాలి. • సెక్స్ వర్కర్స్ కు GO Ms No: 1/2003 ప్రకారం సామజిక అవసరాలు (గృహాలు,ఆరోగ్య కార్డులు, గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు) తో పాటు తమ పిల్లల చదువు, రక్షణ భాద్యతలు ప్రభుత్వాలు చేపట్టాలి . • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్స్ వర్కర్స్ ను అప్పుల బానిసత్వం నుంచి విముక్తి కలిగించాలి. అందుకు వీలుగా ఆర్థిక భద్రత (బ్యాంకు ఖాతాలను తెరవడం, కొత్త వెంచర్లను ప్రారంభించడానికి రుణాలు తీసుకోవడం మరియు భవిష్యత్తు కోసం పొదుపులు ప్రారంభించడం) అందించే ప్రత్యామ్నాయ జీవనోపాధి ప్రణాళికలను అందించడం ద్వారా రుణ బంధాల గొలుసును విచ్ఛిన్నం చేయాలి. • స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అందించి సేవలు పొందే సెక్స్ వర్కర్స్ మాత్రమే వారి వద్దః రిజిస్టర్డ్ అయి ఉన్నారు. కాబట్టి మిగిలిన సెక్స్ వర్కర్స్ కూడా రిజిస్టర్ అయ్యేవిధమగా ఒక విధానం రూపొందించాలి • చాలా మంది వ్యభిచారంలో ఉన్న మహిళలు బిసి, ఎస్సీ, ఎస్టీ వంటి గ్రూపులకు చెందినవారు, ఆయా సంబంధిత కార్పొరేషన్ సంస్థలు ద్వార వారికి G.O.Ms No.1 ప్రకారం రుణాలు ఇవ్వడంలో మద్దతు ఇవ్వాలి. అలాగే పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండేలా సెక్స్ వర్కర్స్ సిబిఓల నుండి సిఫారసు రావాలి. మహిళలందరినీ వివిధ విభాగాలలోని అన్ని సంబంధిత పథకాలతో కవర్ చేయవచ్చ. • సెక్స్ వర్కర్లకు ప్రభుత్వ పథకాల జాబితాను ఎలా వినియోగించాలో అవగాహన కల్పిస్తూ మరియు వారికి ఆ పథకాల గురించి అవగాహనా కల్పించాలి • సెక్స్ వర్కర్స్ మరియు అక్రమ రవాణా బాధితులపై కళంకం మరియు వివక్షకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: సెక్స్ వర్కర్స్ పట్ల వివక్షత తొలగించేలా చేయడానికి మరియు వారు తిరిగి సమాజంలో పునరేకీకరణను మరింత అంగీకరించేలా సమాజం యొక్క మనస్తత్వాన్ని మార్చడానికి పౌర అవగాహన సదస్సులు ప్రారంభించబడాలి. • కోవిడ్ మహమ్మారి నేపద్యంలో సుప్రీం కోర్ట్ ఆదేశాలు మేరకు సెక్స్ వర్కర్స్ అందరికి కనీసం ౩ నెలలు రేషన్ పంపిణి చసి వారికీ ఆర్ధిక సహకారం అందించాలి. ప్రభుత్వం నుండి

Featured ఆంధ్రప్రదేశ్

ఏలూరు ఘటన వ్యాధి కాదు… రియాక్షన్ మాత్రమే: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్

ఏలూరు ఘటన వ్యాధి కాదు… రియాక్షన్ మాత్రమే: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ ఏలూరు ఘటనపై సీఎం జగన్ సమీక్ష సీఎంకు వివరాలు తెలిపిన కమిషనర్ భాస్కర్ తాగునీటిలో ఏమీలేదని వెల్లడి ఆహారంపై అనుమానాలు మిగిలున్నాయని వివరణ మరో నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని వ్యాఖ్యలు సీఎం జగన్ ఏలూరు ఘటనపై నిర్వహించిన సమీక్షలో ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పిలు నివేదికల ఆధారంగా సీఎంకు ఏలూరు ఘటనపై వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడానికి కారణం వ్యాధి కాదని, రియాక్షన్ కారణంగానే ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారని భావిస్తున్నామని వెల్లడించారు. అయితే ప్రజల ఆరోగ్యం దెబ్బతినడానికి స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఏలూరు ఘటనలో బాధితుల రక్తంలో నికెల్, సీసం ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. తాగునీటిలో ఏ సమస్యాలేదని నివేదికలు చెబుతున్నాయని, ఇక ఆహారంపై అనుమానాలు మిగిలున్నాయని తెలిపారు. ప్రజలు తీసుకునే ఆహారంలో సీసం, నికెల్ ఉండొచ్చని, ఏదైనా పురుగుమందుల అవశేషాలు కలిసినందువల్ల ఇలా జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. గాల్లోనూ ఎలాంటి కాలుష్యం లేదని కాలుష్య నియంత్రణ మండలి నివేదిక వెల్లడిస్తోందని భాస్కర్ వివరించారు. కొన్ని హానికారకాల మూలంగా ప్రజలు రియాక్షన్ కు గురైనట్టు భావిస్తున్నామని తెలిపారు. అయితే, ప్రజలు రియాక్షన్ కు గురికావడానికి దారితీసిన కారణాలు తెలిసేందుకు మరో నాలుగు రోజుల సమయం పడుతుందని అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.