Friday, 10 July 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. బాబురావు

‘ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెను భారాలను మోపుతూ తిప్పలు పెడతున్నాయిని సీపీఎం నేత బాబురావు వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం పనికిరాని సంక్షేమ పథకాలను పెట్టి ప్రజల నుంచి లక్షల కోట్లు పన్నుల రూపంలో దండుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఆస్తి పన్ను చెల్లింపు విధానాన్ని ఉపసంహరించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయన అన్నారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడతున్నారన్నారు. రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆక్షేపించారు. మహిళలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆరోపించారు.

Featured తెలంగాణ

స్వర్ణకార కుటుంబం ఆర్థిక ఇబ్బందులు. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య

ఖమ్మం పట్టణంలో స్వర్ణకార కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక స్వర్ణకార కుటుంబంలో గోపాలపురం ప్రకాష్ గారి భార్య గోవిందమ్మ 48 సంవత్సరాలు,పెద్ద కుమార్తె రాధిక 31, రమ్య 30 సంవత్సరాలు ఈ ముగ్గురు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆడపిల్లల పెళ్లిళ్లు జరుగుతాయో, లేదో అని ఆలోచిస్తూ ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడవడం కష్టంగా మారడం, చాలీచాలని జీవితాన్ని నడపలేక మనోవేదనకు గురై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది చాలా ఘోరమైన బాధాకరమైన విషయం. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సమాజం తరుపున ప్రగాఢ సంతాపాన్ని చేస్తున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి ఆధునీకరణ చెందకపోవడం. గ్లోబలైజేషన్ పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల పెట్టుబడిదారుల వల, కార్పొరేట్ I జువెలరీ షాపు వల్ల స్థానిక స్వర్ణ కారులకు కుటుంబం గడిచే ఎటువంటి పరిస్థితి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఒకపక్క ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు మరొక పక్క కరోనా మహమ్మారి ప్రభావం వలన విశ్వకర్మ వృత్తిదారుల కుటుంబాలలో తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు ఈరోజుల్లో స్వర్ణకార కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు కష్టంగా ఉండి అదేవిధంగా అనారోగ్యం తో పాటు పిల్లల చదువులు ఎదిగివచ్చిన ఆడపిల్లల పెళ్లిళ్లు జరుగుతాయో జరగవు అని ఒక భయం ఏర్పడింది కాబట్టి ఇటువంటి సంక్షోభ కాలంలో ప్రభుత్వాలు స్పందించి స్వర్ణకార కుటుంబాలకు అదేవిధంగా విశ్వకర్మ వృత్తులు అయినటువంటి కమ్మరి కంచరి శిల్పి వడ్రంగం వృత్తుల వారిని ఆదుకోవాలని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో కేటాయింపులు తగు విధంగా జరిపి వృత్తుల పరిరక్షణ కి తగు చర్యలు తీసుకోవాలని విశ్వబ్రాహ్మణ సమాజం డిమాండ్ చేస్తుంది .

Featured తెలంగాణ

టీచర్ల పదోన్నతి ఎడతెగని కలేనా!**ఎం ఎన్ విజయ్ కుమార్

* *టీచర్ల పదోన్నతి ఎడతెగని కలేనా!* *రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు* *ఎం ఎన్ విజయ్ కుమార్* *RUPP STATE VICEPRESDENT*…. మిగతా అన్ని శాఖలలో పాత జిల్లాలు/ జోన్ల ప్రాతిపదికన ప్రమోషన్స్‌ కల్పిస్తూ ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి వివాదాస్పద అంశాలను ముందుకు తేవటం భావ్యం కాదు. ముప్పై సంవత్సరాల సర్వీసులో ఒక్క ప్రమోషన్‌ పొందని, ఒకే క్యాడర్‌లో ఇరవై సంవత్సరాలకు పైగా సర్వీస్‌ చేసి అర్హతలు, ఖాళీలు ఉండీ ప్రమోషన్స్‌ పొందలేకపోతున్న ఉపాధ్యాయుల మనోభావాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో అసంతృప్తికి గురవుతున్న ఒక ప్రధాన వర్గం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం. కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా వేతనాలు ఇస్తామని ఉద్యమ నేతగాను, ముఖ్యమంత్రిగాను కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆవిర్భవించగానే పదోన్నతుల పండుగేనని ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ రూపకల్పనకు రెండు రోజులు చాలని ఆయన అన్నారు. పదవీ విరమణ నాడు ప్రభుత్వ వాహనంలో ఉద్యోగిని ఇంటి వద్ద దింపి అతనికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నీ అందే విధంగా ఉండాలనీ, వేరువేరు ప్రాంతాల్లో పని చేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ ఉపాధ్యాయులను ఒకే దగ్గరికు తీసుకురావాలని పాత సంప్రదాయాలకు భిన్నంగా పీఆర్సీ కమిటీలు నివేదిక సమర్పణకు సుదీర్ఘకాలం జాప్యం చేయకుండా 3 నెలల్లోనే నివేదిక అందించేలా చూస్తామని అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి ఉద్యోగులలో ఆశలు రేకెత్తించారు. మొదట్లో ఆయన పేర్కొన్నట్లుగానే ఎంప్లాయీ ఫ్రెండ్లీ పాలనలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గానికి తెలంగాణ ఇంక్రిమెంటు; 2015లో 43శాతం ఫిట్‌మెంటుతో పీఆర్‌సీ, రెవెన్యూ ఉద్యోగుల సేవలను ప్రశంసిస్తూ ఒక నెల అదనపు వేతనం, మహిళా ఉద్యోగులకు 90 రోజుల చైల్డ్‌కేర్‌ లీవు, ‘సకల జనుల సమ్మె’ కాలానికి సెలవుల మంజూరు తదితర అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ చర్యలను రాష్ట్రప్రభుత్వం అమలు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 మే 16న వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి 18 అంశాల విషయంలో హామీలు ఇచ్చారు. అయితే ఈ హామీలు హామీలుగానే ఉండిపోయాయి. సమస్యలను పరిష్కరించటం అటుంచి, వాటిని కనీసం ఆలకించటం లేదనే అసంతృప్తి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గంలో నెలకొన్నది. రెండున్నర సంవత్సరాలైనా పీఆర్‌సీ అమలులోకి రాకపోవటం, ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లు పదవీ విరమణ వయస్సు పెంపు జరగకపోవటం, సిపిఎస్‌ రద్దు అంశంలో ప్రగతి లేకపోవటం, అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా బదిలీలు లేకపోవటం, ప్రమోషన్ల విషయంలో తీవ్ర జాప్యం జరగడం మొదలైన అంశాలు ఉద్యోగుల్లో అసంతృప్తికి దారితీస్తున్నవి. ప్రస్తుతం కరోనా విపత్తుతో నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయవర్గంలో అసంతృప్తికి ప్రధాన కారణం 2015 జులై నుంచి అంటే దాదాపుగా ‘ఆరు సంవత్సరాల నుంచి’ పదోన్నతులు లేకపోవడం. వీటి విషయంలో మిగతా ఉద్యోగులతో పోల్చితే ఉపాధ్యాయవర్గం కాస్త ఆలస్యంగా ప్రయోజనం పొందడం ఆనవాయితీగా ఉంది. దీనికి తోడుగా అర్హతలు, అవకాశాలు ఉండి కూడా ఆరు సంవత్సరాలుగా పదోన్నతులు లేకపోవడంతో వారిలో తీవ్ర నిరాశ, నిర్లిప్తతలు నెలకొన్నాయి. 2009 జనవరి 26 నాటి జీఓ. నెం. 15 ద్వారా నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 1 మొదలు తరువాతి సంవత్సరం ఆగస్టు 31 వరకు ఉన్న ఖాళీలకు సంబంధించి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చే వీలు కల్పించింది. 2010 నవంబర్ 20 నాటి జీవో నెం. 67 ద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులు ఏ నెల ఖాళీలకు తదుపరి నెలలో పదోన్నతులు కల్పించే విధంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జీవో నెం. 67 ను రద్దుచేస్తూ, జీవో నెం. 15 ప్రకారం ప్రతి సెప్టెంబర్‌ 1 నుంచి తరువాత సంవత్సరం ఆగస్తు 31 వరకు ఏర్పడిన ఖాళీలను, పదోన్నతుల ద్వారా భర్తీ చేసే విధంగా ప్రభుత్వం 2016 సెప్టెంబర్ 12న జీవో నెం. 32 జారీ చేసింది. అయినప్పటికీ గత ఆరు సంవత్సరాలుగా టీచర్ల ప్రమోషన్లు లేకపోవడంతో అటు టీచర్లకే కాక, విద్యావ్యవస్థకు కూడా తీవ్ర నష్టం జరుగుతోంది. కోర్టు కేసుల పేరుతో ప్రమోషన్లకు సంవత్సరాల తరబడి వాయిదా వేయడం శ్రేయస్కరం కాదు. రాష్ట్రంలోని మిగతా అన్ని శాఖలలో పాత జిల్లాలు, జోన్ల ప్రాతిపదికన ప్రమోషన్స్‌ కల్పిస్తూ ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి వివాదాస్పద అంశాలను ముందుకు తేవడం భావ్యం కాదు. 30 సంవత్సరాల సర్వీసులో ఒక్క ప్రమోషన్‌ కూడా పొందకుండా పదవీవిరమణ చేస్తున్న టీచర్లు, ఒకే క్యాడర్‌లో 20 సంవత్సరాలకు పైగా సర్వీస్‌ చేసి అర్హతలు, ఖాళీలు ఉండి కూడా ప్రమోషన్స్‌ పొందలేకపోతున్న ఉపాధ్యాయుల మనోభావాలను ప్రభుత్వo కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు ఈ ప్రక్రియ చేపట్టే వారికి పదోన్నతులతో పాటు అంతర్ జిల్లా మరియు సాధారణ బదిలీలు చేపట్టాలని పండిత పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఎన్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు

Featured

ఏదీ నిర్ధారణ కాలేదు* *వింతవ్యాధిపై సాగుతున్న పరిశోధనలు* ఆళ్ల

*సీసం, నికెల్‌పై అంచనాలు ప్రాథమికం* *నీళ్లలో ఈ-కోలిపైనా ఇప్పుడే చెప్పలేం: ఆళ్ల* విజయవాడ : ఏలూరులో వారంరోజులుగా కలకలం సృష్టిస్తున్న అంతుచిక్కని వింతవ్యాధికి కారణాలేమిటనేది ఇంతవరకు పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఢిల్లీ ఎయిమ్స్‌, ఐసీటీసీ తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చిన నిపుణులతో కూడిన వైద్య బృందాలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. గురువారం ఉదయం ఆళ్ల నాని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏలూరు వింత వ్యాధి బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యసేవల గురించి, ఆహార పదార్థాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఏలూరులో వింతవ్యాధికి గురైన బాధితుల రక్తపరీక్షల రిపోర్టుల ఆధారంగా వారి శరీరాల్లో సీసం, నికెల్‌, ఆర్గానో క్లోరిన్‌ తదితర అవశేషాలు ఉన్నట్టు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ అవేవీ పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదు. ఏలూరు ప్రజలు తాగుతున్న నీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా, ఇతర కారకాలు ఉన్నట్లుగా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. జాతీయ వైద్య బృందాలు ఇంకా శాంపిల్స్‌ను సేకరిస్తూ మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతీయ వైద్యబృందాల ప్రతినిధులతో మాట్లాడినపుడు, శుక్రవారం సాయంత్రానికి నివేదికలు సమర్పిస్తామని చెప్పారు. ఆ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది’’ అని వివరించారు. బుధవారం ఇద్దరు బాఽధితులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మరణించడంపై విలేకరులు ప్రశ్నించగా.. వారిద్దరూ ఏలూరులో వెలుగుచూసిన వ్యాధి లక్షణాలతో చనిపోలేదని వైద్యులు చెబుతున్నారన్నారు. ఒకరు కరోనా వైర్‌సతోను, మరొకరు ఊపిరితిత్తుల సమస్యతోను మరణించినట్లు మంత్రి చెప్పారు. బాధితులకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తుండటంతో, ఇప్పటికే వందల మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారని తెలిపారు

Featured

రాయపాటి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

రాయపాటి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు మను బోలు (పున్నమి విలేకరి)6,డిసెంబర్: రాయపాటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం దివంగత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా హరిజనవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం రాయపాటి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని కోరారు అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు రాజ్యాంగ సృష్టికర్తకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. బుజుగేంద్ర బాస్కర్ శీనువాసులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Featured

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఉపాధి హామీ సిబ్బందికి ఆర్థిక సహాయం అందజేసిన కిరణ్ కుమార్ రెడ్డి

ప్రమాదంలో గాయపడ్డ ఉపాధి హామీ సాంకేతిక సహాయకుడు. స్పందించిన అక్కంపేట మాజీ సర్పంచ్ : కిరణ్ కుమార్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేత మనుబోలు( పున్నమి విలేఖరి) 6, డిసెంబర్ :మనుబోలు మండలం ఉపాధి హామీ లో సాంకేతిక సహాయకునిగా విధులు నిర్వహించే చింతా శ్రీనివాసులు కు గత మూడు రోజుల క్రితం జరగిన ప్రమాదం లో కాలు తొలగించడం జరిగింది విషయం తెలుసుకున్న మునుబోలు మండలం అక్కంపేట మాజీ సర్పంచ్ వైకాపా యువనేత కిరణ్ కుమార్ రెడ్డి చింతా శ్రీనివాసులు కుటుంభం ను పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందించారు మనుబోలు మండలం లో ఎవరు ఆపదలో ఉన్న సాయం చేసే కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి తమ సేవ భావమును చాటుకోవడం పట్ల మండల వ్యాప్తంగా పలువురు ఆయనను అభినందించారు .

Featured

బిజెపి ఆధ్వర్యంలో మహనీయునికి ఘనంగా నివాళులు

మనుబోలు (పున్నమి విలేఖరి)6, డిసెంబర్ :మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జన్మించడం మనందరి అదృష్టం అని బిజెపి మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి అన్నారు 64 వ వర్ధంతి కార్యక్రమాన్ని మనుబోలు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, పాలన సజావుగా, సాఫీగా సాగడానికి బి.ఆర్.అంబేద్కర్ రచించి, మనకు అందించిన రాజ్యాంగమే ప్రధాన కారణం అన్నారు .బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ దళితులు, అణగారిన వర్గాలు, బలహీనవర్గాల ఉన్నతి కోసం జీవిత కాలం పోరాటం చేసి, తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బి.ఆర్ అంబేద్కర్ గారు అన్నారు. అంబేద్కర్ గారి అడుగుజాడల్లో పయణిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించనదని అన్నారు. మహనీయుడు బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనమందరం కలిసి పని చేద్దాం అని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి షేక్. షఫీ మండల ,ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చల్లా. లక్ష్మయ్య,బిజెపి రాష్ట్ర నాయకుడు మస్తాన్ గౌడ్,మండల ఉపాధ్యక్షుడు ముప్పవరపు చిన్న, మైనార్టీ మోర్చ్ అధ్యక్షుడు అల్లాభక్షు, పట్నం.వీరప్రతాప్, ఉప్పు. మనెయ్య, తురక. అంకయ్య, రాచురు. వెంకయ్య, రాజాయాదవ్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

*మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం*

  * రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం * కృష్ణజిల్లా మచిలీపట్నంలో తన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి తాపీ తో దాడి.. మంత్రి నానికి తృటిలో తప్పిన ప్రమాదం.. చినిగిన మంత్రి నాని చొక్కా వెంటనే నిందితుడిని పట్టుకున్న అనుచరులు.. తాపీ మెస్ట్రీ బడుగు నాగేశ్వరరావు గా గుర్తింపు…నిందితుడు మద్యం మత్తులో దాడి చేసినట్లు గుర్తింపు ఉద్దేశపూర్వకంగానా,లేక కక్షపూరితంగా, పథకం ప్రకార మా ప్రతిపక్ష కుట్ర అనే కోణంలో.దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

Featured

*నివార్ తుఫాను కారణంగా వి.ఎస్.యూ లో డిగ్రీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా*

నెల్లూరు జిల్లా ,పున్నమి దినపత్రిక,నవంబర్ 28, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 30వ తేది  నుంచి నిర్వహించాల్సిన  డిగ్రీ అడ్వాన్సు సప్లీమెంటరీ పరీక్షలను నివార్ తుఫాను కారణంగా వాయిదా వేయడం జరిగిందని , జిల్లా లో నివార్ తుఫాను వల్ల రోడ్లు మరియు రవాణా వ్యవస్థ దెబ్బ తిన్న కారణంగా విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షలను వాయిదా వేయడం జరిగిందని , తిరిగి మరలా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియ జేస్తామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. సవరించిన కొత్త పరీక్షల టైం టేబుల్ కొరకు విశ్వవిద్యాలయ వెబ్సైటు ను సందర్శించి తెలుసుకోవచ్చునని మరియు సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా పరీక్షల సమాచారాన్ని తెలుసుకోవచ్చునని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి తెలియజేసారు._

Featured

ఆపద కాలంలో ఆపద్బాంధవులు మనుబోలు గ్రామ దాతలు

ఆపద కాలంలో ఆపద్బాంధవులు మనుబోలు గ్రామ దాతలు విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు నివర్ తుఫాన్ లో దాతృత్వం చాటిన మానవత వాదులు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న వాహనదారులు ఆకలి తీర్చిన సేవా మూర్తులు వైసీపీ, జనసేనా, తెలుగుదేశం నేతలు దాతృత్వం స్ఫూర్తి దాయకం మనుబోలు( పున్నమి విలేఖరి) 28,నవంబర్ :ప్రకృతి విపత్తులు సంభవించిన, తుఫాను, వరదలు వచ్చిన, కరోనా లాంటి మహమ్మారి విజృంభించిన పేద ప్రజలు, బాధితులకు అండగా నిలబడి అన్నీ విధాల సహాయ సహకారాలు అందించడంలో ముందుఉంటారు ప్రాంతాలు,భాషలు,మతాలు, కులాలు వంటివి చూడకుండా కేవలం మనుషులు గా మానవత మూర్తులుగా సేవలు అందించడం జరిగింది నివర్ తుఫాను ప్రభావంతో గత మూడు రోజుల గా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, ఈ పరిస్థితులలో గూడూరు ఆదిశంకర కళాశాల జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండటం వల్ల గురువారం ఉదయం నుండి నెల్లూరు, చెన్నై మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి, దింతో వాహనాలు రోడ్డు పై బారులు తీరాయి, వర్షాలు కురవడంతో ఏక్కడ కూడా ఆహారం దొరకని పరిస్థితి, ఈ తరుణంలో ఆపద్బాంధవులు అయినా మనుబోలు దాతలు వెంటనే స్పందించి గురువారం రాత్రి నుండి వాహనదారులకు ఆహారం అందిస్తూ తమ దాతృత్వం చాటుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూడూరు జాతీయ రహదారిపై నివర్ తుఫాన్ కారణంగా గురువారం నుండి జాతీయ రహదారిపై బారి సంఖ్యలో వాహనాలు నిలచి పోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో అవస్థలు పడుతున్న ప్రయాణికులకు టీ,ఆహారం మంచినీరు అందించి తమ దాతృత్వం చాటారు,లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ మనుబోలుఎస్సీ బాయ్స్ హాస్టల్ బిసి గర్ల్స్ హాస్టల్ కు తరలించి వాళ్లందరికీ భోజన వసతి కల్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి ,కడివెటి చంద్రశేఖర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్, కిషోర్ నాయుడు ,ముంగర విజయ భాస్కర్ రెడ్డి ,చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,భాస్కర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లో సేవలు* _ నీవర్ తుఫాను కారణంగా గూడూరు జాతీయ రహదారిలో ట్రాఫిక్ జామ్ తో చిక్కుకొన్న ప్రయాణికులకు మనుబోలు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు టమాటా అన్నం అందజేసి తమ దాతృత్వం చాటారుఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, కలికి రమేష్ రెడ్డి ,శివుడు రాజా ,సాని వెంకటరమణయ్య ,నల్ల గల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు జనసేనాఆధ్వర్యంలో నివర్ తుఫాను కారణంగా గూడూరు- నెల్లూరు జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడం వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ చిక్కుకొని ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు జనసేన ఆధ్వర్యంలో రెండువందల మంది ప్రయాణికులకు వాహనదారులకు అల్పాహారం అందించడం జరిగింది మరియు మధ్యాహ్నం పొంగలి అందించడం జరిగింది . ఈ సందర్భంగా జనసేన, నాయకులు మాట్లాడుతూ జనసేన దృక్పథంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న ప్రయాణికులకు సహాయం అందించడం జరిగిందని తెలిపారు. సేవా కార్యక్రమాలకు సహకరించిన జన సైనికులు, మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తుఫాను సహాయక చర్యల్లో అధికారులకు మా సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మెగా అభిమానులు శ్రీకాంత్ ,సందీప్ ,ఉదయ్ ,సురేష్, బాబు, పవన్ పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.