Friday, 10 July 2026

Blog

Featured

దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మహానేత ఎల్.కె.అద్వానీ :బిజెపి జిల్లా నాయకులు బోలా

మనుబోలు(పున్నమి విలేఖరి ) 8, నవంబర్: రామ మందిర నిర్మాణంపై అలుపెరుగని పోరాట యోధుడు అభినవ ఛత్రపతి బి.జె.పి సీనియర్ నాయకులు యల్.కె.అద్వానీ గారి జన్మదినోత్సవ సందర్భంగా కాగితాలపూర్ గ్రామమునందుబిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు ఆధ్వర్యంలో చెట్లను నాటినారు ఈ సందర్భంగా బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి బీజేపీని స్థాపించడంలో అద్వానీ ప్రముఖులు అని అద్వానీ బీజేపీ అధ్యక్షుడిగా అత్యధిక కాలం పనిచేశారు అన్నారు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ప్రచారంలో భాగంగా రథయాత్ర చేపట్టారు అన్నారు1984లో రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీ నేడు భారతదేశ రాజకీయాల్లో ఉన్నతమైన శక్తిగా ఎదిగిందంటే అందుకు అద్వానీనే కారణమని తెలిపారు ఇప్పటి వరకు ఐదుసార్లు లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు .

Featured

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే కాకాణి

మనుబోలు (పున్నమి విలేకరి) 23, అక్టోబర్ : మనుబోలు మండలంకాగితాలపూరులో శుక్రవారం సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్లు ఇళ్ళస్ధలాలు రైతుభరోసా తదితర ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందుతున్నాయాలేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇళ్ళస్ధలాలు ప్రతిఒక్కరికి అందేలాచూడాలని అధికారులు నుఆదేశించారు ఈ సందర్భంగా స్ధానిక విలేఖరులతో మాట్లాడుతూ గత టీడిపి ప్రభుత్వంలో పెన్షన్లు మంజూరుకావలంటే సంవత్సరంకు జన్మభూమిసభలు పెట్టి ఇచ్చేవారని వైకాపా ప్రభుత్వంలో నెలకు పెన్షన్ ఒక్కరోజులో రేషన్ కార్డు మంజూరుచేస్తున్నామని ఇదే మా ప్రభుత్వ ప్రత్యేకతన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలకంటే మిన్నగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారన్నారు. రైతులకు ఎళ్ళవేళల అందుబాటులో వుండి వారిసంక్షేమం కొరకు పాటుపడుతున్నామన్నారు. అనంతరం పలుసమస్యలపై అర్జీలను స్వీకరించి సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకముందు గ్రామ యువ నాయకులు, రాజా,రవి దశయ్య ,ఏడుకొండలు ఆధ్వర్యంలో బాణాసంచా బొకే శాలువాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సమీక్షలో ప్రతిలబ్దిదారుని సమస్యలు అడిగితెలుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో హరిగోపాల్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి , భాస్కర్ గౌడ్,శివకుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, గుండాల ఆదినారాయణ, అశోక్ స్ధానిక నాయకులతోపాటు ఎమ్మార్వో ఎంపిడిఓ అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు .ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Featured

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారిగా బిసిలకు పెద్దపీట

మనుబోలు( పున్నమి విలేఖరి)19 ,అక్టోబర్ : ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు 139 B.C కులాలకు చెందిన 56 B.C కార్పొరేషన్ చైర్మన్లను ఎన్నిక చేస్తూ నిర్ణయం తీసుకున్నా సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్కిల్ లోని స్వర్గీయ డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలవేసి, మండల వైయస్ఆర్ సీపీ నాయకులు పాలాభిషేకం చేశారు బీసీ పక్షపాతిగా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ఆయనకు దక్కుతుందని బీసీలకు రాజాధికారం అందించాలన్న ఆశయంతో ముందుకు వెళుతున్నారని తెలియజేశరు జగన్ చూసి చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలి అని అన్నారు బిసి లకి తగ్గిన ప్రాధాన్యత ను ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని చూసి ఇంకనైన చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలని జిల్లా బీసీ నాయకులు,జిల్లా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ అన్నారు.బిసిల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్ లు చేసిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు బిసి లను అడ్డంగా చేసుకొని అధికారంలోకి వచ్చి బీసీలను మరచిపోయి నాడని విమర్శించారు.బీసీ ల అభివృద్ధి కి పైసా కేటాయించిన దాఖలాలు లేవని అన్నారు తమ ప్రభుత్వం బిసి సంక్షేమ దిశగా అడుగులు వేస్తోందన్నారు ఈ కార్యక్రమంలోనాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,కుడుముల వెంకటరమణయ్య,రంగారెడ్డి ,భాస్కర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు

Featured

నూతన వ్యవసాయ చట్టాలు చరిత్రాత్మకం: భాజపా మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి

మనుబోలు (పున్నమి విలేకరి)18,అక్టోబర్: ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు చరిత్రాత్మకంగా నిలిచిపోతాయని భాజపా మనుబోలు మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఆయా చట్టాల గురించి వివరించే కరపత్రాలను ఆదివారం ఆయన మండలకేంద్రంలో రైతులు, ప్రజలకు పంపిణీ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నచ్చిన ధరలు నిర్ణయించుకుని స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. ఆయన మాట్లాడుతూ  జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని పార్లమెంట్లో మరియు రాజ్యసభ లో అనుమతి పొందటం జరిగిందని, ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను దళారీ వ్యవస్థ ద్వారా కాకుండా రైతులు నేరుగా వారు పండించిన పంటలు వారే ధరలు నిర్ణయించి అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది, రైతులు ఆదాయం రెట్టింపు అవుతుంది అని చెప్పటం జరిగింది.ఈ పధకం లోని ముఖ్య సమాచారం కరపత్రాలు ద్వారా ప్రచురించి మండలంలోని రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. మనుబోలు మండల బిసి మోర్చా మండల అధ్యక్షుడుగా వీరంపల్లి. గ్రామానికి చెందిన రాచురు. వెంకయ్య ను మండల కమిటీ ఆద్వర్యంలో మండల అధ్యక్షుడు. ఓడూరు.శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోలా.శ్రీనివాసులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చల్లా.లక్ష్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఇరగరాజు వెంకయ్య, ఉపాధ్యక్షుడు ముప్పవరపు చిన్న, మండల నాయకులు యనమల. శ్రీనివాసులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured

కమ్యూనిస్టుదే సంపూర్ణ స్వాతంత్ర నినాదం

 ప్రపంచానికి కమ్యూనిజమే ప్రత్యామ్నాయ : కమ్యూనిస్టు పార్టీమండల కార్యదర్శి దేవదానం మనుబోలు (పున్నమి విలేఖరి)17, అక్టోబర్ :భారత కమ్యూనిస్టు ఉద్యమ శత వార్షికోత్సవాల కార్యక్రమాన్ని మనుబోలు మండల సిపిఎం కార్యాలయంలో శనివారం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి దేవదానం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో మార్క్సిస్టు, లెనిస్టు సిద్ధాంతాలకు అంకితం అయిన కమ్యూనిస్టుపార్టీ 100 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందన్నారు.ఆనాటి నుండి నేటి వరకు రైతాంగం, మహిళలు, గిరిజనులు, దళితుల కోసం కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఎన్నో జమీందారి వ్యతిరేక, రైతాంగం ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నిర్వహించారని, జాతీయోద్యమంలోనూ కమ్యూనిస్టులు ఉద్యమించారని, ఆ పోరాటాల పర్యవసానంగానే రైతులకు, మహిళలకు కొన్ని హక్కులు వచ్చాయన్నారు. పోరాటాల ఫలితంగా వచ్చిన హక్కులు నేటి బిజెపి పాలనలో ప్రమాదంలో పడ్డాయని అన్నారు. పార్లమెంటులో కార్పొరేట్‌ వ్యవసాయానికి అనుకూలంగా మూడు చట్టాలను బిజెపి ప్రభుత్వం చేసిందని తెలిపారు. కార్మికుల హక్కులను ప్రమాదంలోకి నెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. కమ్యూనిస్టు ఆశయాలను సాధించేందుకు కమ్యూనిస్టులంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఆదిశేషయ్య, సిపిఎం నాయకులు మోహన్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

Featured

లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగే లక్ష్యం :కలెక్టర్ చక్రధర్ బాబు

మనుబోలు (పున్నమి విలేఖరి) 13 ,అక్టోబర్ : నెల్లూరు జిల్లాలో 57వేల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు జరుగుతుందని లక్ష హెక్టార్లలో చేర్చడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ చక్రధర్ పేర్కొన్నారు. మంగళవారం పిడూరులోని వివిధ రకాల ఉద్యాన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక విలేకరులతో మాట్లాడుతూ అగ్రికల్చర్ హార్టీకల్చర్ అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ మూడు శాఖల సమన్యాయంతో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు అందేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. రైతులకు అవగాహన కల్పించి వారికి కావలసిన పరికరాలు యంత్రాలు రైతుభరోసా కేంద్రాల ద్వారా అందచేయడం. అలాగే బ్యాంకులో రుణసదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. వ్యవసాయం ఉద్యాన పంటలు లాభసాటిగా సాగేందుకు కృషిచేస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గిట్టుబాటు ధర కల్పించడం జరిఢిందని రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయాలు జరపుకోవాలన్నారు. ప్రతిధాన్యం గింజ ప్రభుతమే కొనుగోలు చేస్తుందన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా వచ్చే సంవత్సరం నుండి 175 గోడౌన్లు మంజూరు చేయించేవిదంగా ప్రణాళికలు సిధ్ధంచేస్తున్నామన్నారు. రాబోయే రెండుమూడు సంవత్సరాలలో గ్రామాల్లోనే రైతులకు అన్ని వసతులు పూర్తి స్ధాయిలో అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఖాళీగావున్నా అగ్రికల్చర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీచేసి వీరందరు పొలాల్లో నేరుగా వెళ్లి రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 665 రైతుభరోసా కేంద్రాలు పూర్తిస్థాయిలో వినియెగంలో వున్నాయన్నారు.జిల్లాలోని నీరు వుండడంతో సమృద్ధిగా సాగు తాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. అన్ని మునిసిపాలిటీలకు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కొరకు రీ సర్వేను జనవరి 1నుండి ప్రారంభిస్తున్నామని దీంతో చుక్కలు భూములు సిజెఎఫ్ ఎస్ 22 ఎ వంటి సమస్యలు లేకుండా పోతాయన్నారు. మార్కటింగుకు. రైతులకు ఎటువంటి సమస్య లేకుండా చేసేందుకు తమవంతు కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం పి.డి సుభాని హార్టీకల్చర్ పి.డి ప్రవీణ్. గోపిచంద్. ఆనంద్ రైతు సూర్యప్రకాష్ ఎంటానిక్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Featured

మనుబోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం :ఒకరి మృతి

మనుబోలు,అక్టోబర్,12 (పున్నమి విలేఖరి) మనుబోలు మండలకేంద్రమైన మనుబోలు జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది మనుబోలు పోలీసుల కధనం మేరకు వివరాలిలా వున్నాయి. గుంటూరు జిల్లా నరసావుపేటకు చెందిన బి సత్యనారాయణరెడ్డి టైల్స్ వ్యాపారంలో భాగంగా చెన్నైలోని హోల్ సేల్ టైల్స్ దుకాణంలో టైల్స్ కొనుగోలు చేసి తిరుగుప్రయాణంలో మార్గమధ్యమైన మనుబోలు వెంకటరమణ హోటల్ ఎదురుగా ఆగివున్న లారీని వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో సత్యనారాయణరెడ్డి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వాహనంలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలపాలయ్యారు. వృత్తిలో భాగంగా చెన్నైనుండి తిరిగి ఇంటికి వెలుతుండగా అకస్మాత్తుగా ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మనుబోలు జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపడంవలనే తరచూ ప్రమాదాలు చోటుచేసుఠుంటున్నాయని స్ధానికులు ఆరోపిస్తున్నారు. గాయాలపాలైన ముగ్గురిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సత్యనారాయణ రెడ్డి మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించి మనుబోలు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

అమెరికా తెలుగు డాక్టర్స్ తో కరోన పరిష్కరాలు: కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి

కరోనా నివారణకు కార్మిక శాఖ ఉద్యోగులకు అమెరికా వైద్యులతో సలహాలు సూచనలు రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి సచివాలయం, సెప్టెంబర్ 14 : వెబ్ నార్(వీడియో కాన్ఫరెన్స్) ద్వారా అమెరికాకు చెందిన తెలుగు డాక్టర్ల అందించిన సలహాలు సూచనల పాటించడం ద్వారా కరోనా మహమ్మారి బారినపడకుండా కార్మిక శాఖ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యవంతమైన జీవనం పొందాలని రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయ లక్ష్మి కోరారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.జయరామ్ ఆధ్వర్యంలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన కర్నూలు నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జయరామ్ మాట్లాడుతూ, అమెరికా వైద్యులు అందించే సలహాలు సూచనల పాటిస్తూ కరోనా నుంచి కార్మిక శాఖకు చెందిన ఉద్యోగులంతా రక్షణ పొందాలని సూచించారు. అనంతరం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా నివారణకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారన్నారు. దానిలో భాగంగా కార్మిక శాఖలో కరోనా నివారణకు శ్రీకారం చుట్టామన్నారు. అమెరికాకు చెందిన అయిదుగురు తెలుగు వైద్యులు( ఎం.డి. పలమనాజిస్టులు) డాక్టర్ సుధాకర్, డాక్టర్ లోకేష్, డాక్టర్ సురేష్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శ్రీకాంత్ తో తమ శాఖ ఉద్యోగులకు కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు సూచనలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన సదస్సు చేపట్టామన్నారు. కేరింగ్ హెల్త్ సంస్థకు చెందిన డాక్టర్ సీఎల్ వెంకట్రావు, ఆర్టీఐ కమిషనర్ బీవీ రమణ కుమార్ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. లేబర్, పరిశ్రమలు, బాయిలర్, ఐఎంఎస్ శాఖలకు చెందిన 70 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారన్నారు. ఈ సందర్భంగా… పలువురు ఉద్యోగులు కరోనా నివారణ, పాజిటివ్ గా నిర్ధారణయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమెరికా వైద్యులను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరవాత ఇంటి వద్ద ఉండే వైద్య సేవలు ఎలా పొందాలి… తక్కువ ఖర్చుతో వ్యాధిని ఎలా నయం చేసుకోవాలి… ఐసోలేషన్ లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి…? అని అమెరికా వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నుంచి విముక్తి పొందిన తరవాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని, మానసికంగా ధృడంగా ఉండాలంటే ఏ చర్యలు తీసుకోవాలని, ఫిజికల్ థెరపీ ఎలా పొందాలని, కరోనా లక్షణాలు ఏస్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరాలని..? అమెరికా వైద్యులను కార్మిక శాఖ ఉద్యోగులు అడిగి తెలుసుకున్నారు. కార్మిక శాఖ ఉద్యోగుల సందేహాల నివృత్తికి అమెరికా వైద్యులు సవివరంగా సలహాలు సూచనలు అందజేశారు. భౌతిక దూరం పాటించడం, చేతులు తరుచూ శుభ్రపరుచుకోవడం, మాస్కులు విధిగా ధరించడంతో పాటు మానసికంగా ప్రతి ఒక్కరూ ధృడంగా ఉండాలని, అప్పుడే కరోనా మహమ్మారిని తరిమికొట్టొచ్చునని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా కరోనా సోకినవారు ఎటువంటి భయాందోళనలకు గురికావొద్దన్నారు. ఈ వ్యాధి ఒక ఫ్లూ లాంటిదని, బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా త్వరగా ఆరోగ్యవంతులు కావొచ్చునని వైద్యులు… ఉద్యోగుల్లో భరోసా కల్పించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంతో విలువైన సమాచారం పొందామని ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు. అమెరికా వైద్యుల చేత కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు అందజేసేలా కృషి చేసిన మంత్రి జయరామ్ కు, ముఖ్యకార్యదర్శి ఉదయలక్ష్మికి, కేరింగ్ హెల్త్ సంస్థకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కార్మిక శాఖకు చెందిన వెయ్యి మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారితో పాటు కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ జి.రేఖారాణి, అడిషనల్ కమిషనర్ అజయ్, డైరెక్టర్లు వర్మ, ఉమామహేశ్వరరావు, సామ్రాజ్యంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Featured జాతీయ అంతర్జాతీయ

సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు: మిధున్‌ రెడ్డి

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత మిధున్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంతో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు కేంద్రం నుంచి వచ్చేలా చూడమని చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలా ఒత్తిడి చేయమని కోరారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేశాము. ఈ అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తాము. జీఎస్టీ పెండింగ్ బకాయిలను రాష్ట్రానికి వచ్చేలా అధికారులతో కలుస్తాం. గరీబ్ కళ్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ‘జనాభా ప్రాతిపదికన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ మెడికల్ కాలేజ్‌ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం మద్దతు కోరారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఉంటే గిరిజనులకు లాభం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు. అంతర్వేది టనపై నిజాలు నిగ్గు తేలాలి. మతకలహాలు రెచ్చగొట్టే ప్రయత్నిస్తున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సీఆర్‌డీఏ, ఫైబర్ గ్రిడ్‌లపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరపాలి. దిశా బిల్లు, కౌన్సిల్ రద్దు బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. రఘురామకృష్ణంరాజుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి గౌరవం ఇచ్చింది. అయితే ఆయన ప్రతిపక్షాల ఎజెండా ప్రకారం నడుచుకుంటున్నారు. ఆయనపై త్వరితగతిన అనర్హత వేటు వేయాలి’ అని మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.