Sunday, 21 June 2026
  • Home  
  • ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే తాటతీస్తాం.= తహశీల్దార్ యు మధుసూదన్ రావు
- తిరుపతి

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే తాటతీస్తాం.= తహశీల్దార్ యు మధుసూదన్ రావు

ప్రభుత్వ భూములలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు. ప్రభుత్వ భూములు జోలికొస్తే….. జైలుకు పంపుతాం పున్నమి ప్రతినిధి ,రామచంద్రపురం. ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడితే తాటతీస్తామని తహశీల్దార్ యు మధుసూదన్ రావు తెలిపారు. ఆదివారం మండలంలోని అనుపల్లె రెవెన్యూలో ప్రభుత్వ భూముల పరిరక్షణ లక్ష్యంగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 182 లోని గుట్ట పోరంబోకు స్థలంలో నూతికుంటపల్లి హరిజనవాడ గ్రామానికి చెందిన గుండె కాయల సుధాకర్ కుటుంబ సభ్యులు భూ ఆక్రమణలకు పాల్పడి గుట్టను చదువు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై రెవెన్యూ పోలీస్ అధికారులు సంయుక్తంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసామన్నారు. అనుపల్లి రెవెన్యూ లెక్క దగ్గరలో గ్యాప్ ఏరియా ఎక్కువ ఉంది. అందులో భూ పంపిణీ కార్యక్రమంలో ఇచ్చిన డీకేటీ పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ భూములుగా నమోదు చేస్తామన్నారు. రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడితే భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. గ్రామాలలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ భూముల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరంతరం ప్రభుత్వ భూముల పరిరక్షణపై నిఘ పెట్టాలన్నారు. ఎక్స్క్యూలేటర్, హిటాచి యంత్రాల యజమానులు ప్రభుత్వ భూములు అక్రమంగా వాహనాలను ప్రవేశింపజేసే చదును చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. ఫోటో రైట్ అప్ 1.. నూతుగుంటపల్లిలో ప్రభుత్వ భూములు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు.

ప్రభుత్వ భూములలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు.

ప్రభుత్వ భూములు జోలికొస్తే….. జైలుకు పంపుతాం

పున్నమి ప్రతినిధి ,రామచంద్రపురం.

ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడితే తాటతీస్తామని తహశీల్దార్ యు మధుసూదన్ రావు తెలిపారు. ఆదివారం మండలంలోని అనుపల్లె రెవెన్యూలో ప్రభుత్వ భూముల పరిరక్షణ లక్ష్యంగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 182 లోని గుట్ట పోరంబోకు స్థలంలో నూతికుంటపల్లి హరిజనవాడ గ్రామానికి చెందిన గుండె కాయల సుధాకర్ కుటుంబ సభ్యులు భూ ఆక్రమణలకు పాల్పడి గుట్టను చదువు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై రెవెన్యూ పోలీస్ అధికారులు సంయుక్తంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసామన్నారు. అనుపల్లి రెవెన్యూ లెక్క దగ్గరలో గ్యాప్ ఏరియా ఎక్కువ ఉంది. అందులో భూ పంపిణీ కార్యక్రమంలో ఇచ్చిన డీకేటీ పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ భూములుగా నమోదు చేస్తామన్నారు. రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడితే భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. గ్రామాలలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ భూముల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరంతరం ప్రభుత్వ భూముల పరిరక్షణపై నిఘ పెట్టాలన్నారు. ఎక్స్క్యూలేటర్, హిటాచి యంత్రాల యజమానులు ప్రభుత్వ భూములు అక్రమంగా వాహనాలను ప్రవేశింపజేసే చదును చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.

ఫోటో రైట్ అప్

1.. నూతుగుంటపల్లిలో ప్రభుత్వ భూములు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.