Friday, 10 July 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

పరోపకారం సహజంగా పుట్టాలి

పరోపకారం సహజంగా పుట్టాలి మేఘము దగ్గర నీరు లేనప్పుడు, సము ద్రుని వద్దకు వెళ్ళి నీటిని తెచ్చి లోకానికి వర్షమును ఇస్తుంది. అలాగే పరోపకారం చేసి తీరాలనే కోరికగల దాత, తన దగ్గర లేకపోయినా ఏదో ఒక విధంగానైనా దానం చేసి తీరు తాడు. అంటే తాను కష్ట సమ యంలో ఉన్నప్పుడు కూడా అడిగిన వారికి లేద నక ఇవ్వడమే నిజమైన దాత లక్షణం. కర్ణుడికి గొప్ప దాత అని పేరు రావడం గమనించిన దుర్యోధనుడు తన భవనం ముందు కూడా ఒక దాన ఘంటను కట్టించాడు. దానిని మోగించిన వారికి ఏమి కావా లంటే వాటిని సమకూరుస్తానని ప్రకటించాడు. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు దుర్యో ధనుని దర్శించి, తన కూతురు పెండ్లికి అవసర మయ్యే వంట చెరకును అనుగ్ర హించమని ప్రార్థించాడు. బంగారాన్నో, ధనాన్నో కోరక కేవలం బండెడు కట్టెలను అడిగిన ఆ వెర్రి బాపని అవివేకానికి నవ్వు కొన్న దుర్యోధనుడు వెంటనే తీసుకు వెళ్ళమన్నాడు. అందుకా బ్రాహ్మణుడు ‘‘ మహారాజా! మా ఇల్లు చిన్నది. అందువలన నిలువ చేసుకొనే సౌకర్యం లేదు. అవసర మైనపుడు నేనే వచ్చి తీసుకు పోతాను. ప్రస్తుతానికి తమ మాట చాలు’’! అని చెప్పి సెలవు తీసుకున్నాడు. కొన్ని నెలలు గడిచి పోయాయి. దుర్యోధనుడు ఈ విషయం పూర్తిగా మరిచిపోయాడు. వర్షాకాలం ప్రారంభమైంది. విడవకుండా కురుస్తున్న వర్షాల వలన ఏరులన్నీ ఏకమైనాయి. ఎక్కడా ఎండు కట్టెలన్న మాట కూడా వినబడని పరిస్థితిలో ఈ బ్రాహ్మణుడు ప్రత్యక్షమై, తన బండెడు ఎండు కట్టెలను ఇప్పించమని ప్రార్థించాడు. నివ్వెరపోయిన దుర్యోధనుడు, ‘బ్రాహ్మణోత్తమా! వాతావరణ పరిస్థితిని గమనించావు కదా! కొంచెం ఎండ వచ్చేంత వరకు ఓపిక పట్టు. నీ కోరిక తప్పక నెరవేరు స్తాను’’ అని చెప్పాడు. కానీ అతడు తన కూతురి పెళ్ళి కోసం అప్పుడే వంట చెరకు అవసరమని చెప్పడంతో దుర్యోధనుడు నిస్సహాయుడైనాడు. అక్కడ నుండి సరాసరి కర్ణుని మందిరం చేరుకున్న విప్రుడు తన కథ నంతా వినిపించాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న కర్ణుడు వెంటనే పనివారిని పిలిపించాడు. తన రాజభవనంలో కొంత భాగాన్ని పగులగొట్టించాడు. భవన నిర్మాణానికి వాడిన మంచి చందనం, టేకు దూలాలను, తలుపులను ఒక బండి పై పేర్పిం చాడు. అవి తడవకుండా వాటి పై ఒక ఆచ్ఛాదన ఏర్పాటు చేయించాడు. ఆ బండిని క్షేమంగా బ్రాహ్మణుని ఇల్లు చేర్చమని భటులను పురమాయించాడు. ఆనందంగా బండితో ప్రయాణిస్తున్న బ్రాహ్మణుని చూచిన దుర్యో ధనుడు విషయాన్ని కనుగొన్నాడు. కర్ణుని దాన శీలతకు ఆశ్చర్య పోయి, మనసారా అభినం దించాడు. ‘దాన గుణం అనేది సహజంగా పుట్టవలసినదే కాని ఒకరిని చూచి అనుకరించేది కాదని గ్రహించి, తన వాకిట కట్టిన ఘంటను విప్పి వేయించాడు. నిజానికి దుర్యోధనుని దగ్గర ఉండే ఏ వాడని గుర్రపుశాలో, గోశాలో చాలు బ్రాహ్మణుని అవసరం తీరడానికి! కానీ ఆ ఆలోచనే అతనికి రాలేదు. అందుకనే అందరూ దాతలు కాలేరు. ఆ ఘనత కొంత మందికే దక్కింది. పేరు కోసం, గొప్ప కోసం, పోటీల కోసం దానాలు చేసే మనస్తత్వాన్ని ప్రక్కన పెట్టి, పరోపకారానికి దానం చేసే బుద్ధిని పెంపొందించుకొందాం. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియనంత గుప్తంగా పరులకు సహాయం చేద్దాం. ఆ ఆర్తుల రూపంలో వున్న నారాయణునికి సమర్పిస్తున్నామన్న భావ నను కలిగివున్నప్పుడు తప్పక ఆ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమౌతాం. టి.వి.శ్రీధర్‌, ‌గూడూరు.

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

చరిత్రలో శ్రీనివాస మంగాపురం

తనివితీరా స్వామివారిని దర్శించుకోవాలంటే మంగాపురం వెళ్లాల్సిందే ప్రతి యేటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో బ్రహ్మోత్సవాలు నిలువెత్తు వేంకటేశ్వరుని విగ్రహం ఈ ఆలయం ప్రత్యేకత. వేంకటాద్రి పర్వతానికి సమానమైనది బ్రహ్మాండలోకాల్లో లేదనని, శ్రీవారికి సమానమైన దేవుడు గతంలో కాని, భవిష్యత్‌లో కాని ఉండరని పెద్దలంటారు. అంతటి మహిమగల భగవానుణ్ణి దర్శించుకోవడం అంత తేలిక విషయం కాదు. వ్యయ ప్రయాసల సంగతులటుంచి, తృప్తి తీరా దర్శనం చేసుకునే వీలువుండదు. గంటల కొద్ది క్యూలో నిలబడ్డ తర్వాత దర్శనం లభించేది కొద్ది క్షణాలు మాత్రమే. ఆ క్షణాల్లోనే భక్తులకు అనిర్వచనీయమైన అలౌకికానందం కలుగుతుంది. పడిన శ్రమంతా మరిచిపోతారు. మళ్ళీ ఎప్పుడు దర్శన భాగ్యం కలుగుతుందా? అని ఎదురుచూస్తుంటారు. వీలు చిక్కగానే మళ్ళీ తిరుమలకు ప్రయాణం కడుతుంటారు. అయితే తృప్తిదీరా వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే మార్గం వుంది. అదేమంటే వేంకటాద్రి పర్వతాన్ని తాకుతున్నట్టుగా శ్రీవారి పాదాల చెంత, శ్రీవారికి ప్రతి రూపంగా వున్న కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వుంది. మూలవిరాట్టు ముందు నిలబడి నిలువెత్తు సుందర మైన ఆ విగ్రహాన్ని ఎంత సేపైనా దర్శించుకోవచ్చు. అదే శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం. శ్రీపద్మావతిదేవితో నారాయణ వనంలో వివాహం జరిగిన పిమ్మట ఈ ప్రాంతంలో శ్రీనివాసుడు కొంత కాలం నివసించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. పరిణయ అనంతరం కళ్యాణ వేంకటేశ్వరుడైన శ్రీవారు పద్మావతితో కలిసి వస్తూ తొండవాడ ఆశ్రమంలో వున్న ఆగస్త్య మహామునిని దర్శించారు. అగస్త్యుని దర్శించుకున్న నవ దంపతులు కొండ ఎక్కడానికి వెళ్తుండగా అగస్త్యుడు పసుపు గుడ్డలతో కొండ ఎక్క కూడదని చెప్పాడు. అగస్త్యుని సలహా ప్రకారం ఆ కొత్త దంపతులు శ్రీనివాసమంగా పురం అనే ప్రాంతంలో ఆరు మాసాల పాటు నివసించారు. ఈ ‌సమయంలో వారు ప్రతి రోజు అగ స్త్యుని దర్శించుకునే వారు. గడువు పూర్తయిన పిమ్మట శ్రీవారు నడిచి వెళ్ళి తిరుమల చేరా రు. శ్రీనివాసుడు నివసించిన ఈ ప్రాంతం తర్వాత శ్రీనివాస మంగాపురం అయింది. అంతకు ముందు దాని పేరు సిద్దకూటమి. శ్రీవారు కొండపైకి నడిచిన దారి శ్రీవారి మెట్టు అయింది. కళ్యాణం తర్వాత ఆయన ఇక్కడ నివసించినందున కళ్యాణ వేంకటేశ్వరుని ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధమైంది. దీన్ని ఎవరు కట్టించారన్నది ఇతమిద్ధంగా తెలియదు. అయితే ఈ ఆలయం శిధిలావస్థలో వున్నప్పుడు తాళ్ళపాక అన్నమాచార్యుల మనవడైన చిన తిరుమలయ్య పునరుద్దరించారు. తిరిగి 1967లో టిటిడి వారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. 1981 నుంచి టిటిడి వారే స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతి యేటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇటీవల ప్రహరీగోడ నిర్మించడం జరిగింది. ఆలయం ఎదుట కోనేరు నిర్మా ణం, ఆంజనేయస్వామి ఆలయం కట్టారు. రధాన్ని శాశ్వితంగా ఉంచడానికి ఒక షెల్టర్‌ ‌నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో రాళ్ళను పరిపించారు. టిటిడి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో కళ్యాణ మండపం కూడా నడు స్తోంది. తిరుపతి, మదనపల్లి రహదారిని ఆనుకొని శ్రీవారి ఆలయం ఉంది. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ ఊరికి బస్సులు నడుస్తు న్నాయి. చంద్రగిరి నుంచి కూడా మరొక మార్గం వుంది. శ్రీనివాస మంగాపురంలో నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది. 500 రూపాయల రుసుము చెల్లించి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రశాంత వాతావరణం, విశాలమైన ఆవరణం, అద్భు తమైన శిల్ప సంపద ఈ ఆలయ ప్రత్యే కతలు. ఆలయ నిర్మాణానికి పెద్ద పెద్ద బండ రాళ్ళను వాడారు. పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఉపయోగించారు. ఈ స్తంభాల పై పురాణ గాధలను దేవతామూర్తులను చెక్కారు. అన్నమాచార్యుల వంశం వారి శిల్పాలు కూడా స్తంభాల పై కనిపిస్తాయి. నిలువెత్తు ద్వార పాలకుల విగ్రహాలు గర్భగుడి ముందు దర్శనమిస్తాయి. అన్నమాచార్యుల వారి పూజా సామాగ్రి, ఆయన పూజించే దేవతా విగ్రహాలు ఈ ఆలయంలో ఇటీవల వరకు ఒక చెక్క బోషాణంలో వుండేవి. ఇప్పు డు అవి టిటిడి వారి ఆధీనంలో వున్నాయి. ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే ఎక్కువగా విజయనగర ప్రభువుల కాలంలో అభివృద్ధి జరిగినట్లు తెలుస్తుంది. సూర్యచంద్రులు, హంస లాంటి శిల్పా లు స్తంభాల పై కన్పిస్తాయి. హైదరాలీ దాడిని ఈ దేవాలయం 17వ శతాబ్దంలో ఎదుర్కొని నిలబడింది. ఈ ఆలయం పై దాడి తరువాత హైదరాలి అనారోగ్యంతో మరణించాడని చెప్తుంటారు. తొండవాడ ప్రాంతానికి చెందిన చంద్రమౌళి రెడ్డి అనే ఐఏఎస్‌ అధికారి ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. నిలువెత్తు వేంకటేశ్వరుని విగ్రహం ఈ ఆలయం ప్రత్యేకత. మిరుమిట్లు గొలిపే లైట్ల కాంతులతో, అద్భుతమైన అలంకరణలతో వేంకటేశ్వర స్వామి విగ్రహం అలరారుతూ వుంటుంది. ఎంత సేపు దర్శించుకున్నా తనవి తీరని సౌందర్యం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారిది. ప్రశాంతంగా ఎక్కువ సేపు స్వామి వారి ముందు నిలబడి ధ్యానించు కోవాలన్న కోరిక వున్నవారు ఈ ఆలయాన్ని తరచూ దర్శించుకొని తన్మయత్వం పొందవచ్చు. డాక్టర్‌ ‌గంగిశెట్టి శివకుమార్‌, ‌పున్నమి దినపత్రిక గౌరవ సంపాదకులు. సెల్‌ : 9441895343

Featured ఆంధ్రప్రదేశ్ సక్సెస్ స్టోరీస్

సాధించాలనే తపన ఉంటే అన్నీ సాధ్యమే

  మనిషి ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే ముందుగా బద్దకాన్ని వదిలివేయాలి ఎవరి జీవితం స్ఫూర్తిదాయ కమో ఎవరి జ్ఞాపకం ఒక ఆశీర్వదమో అతడే విజేత. తపన లేకుండా ఏ ఒక్కరు ఏ పనిని సాధించలేరు చేయాలనే పట్టుదల, సాధించాలనే తపన మనిషిని దేన్నయినా సాధించే స్థాయికి తీసుకెళ్తాయి. దాదాపు 100 సం।। క్రితం గాలిలో ఎగరడం అసాధ్యం. మరి ఆనాడు గాలిలో ఎగరాలన్న ప్రయత్నం రైట్‌ ‌సోదరులు చేయకుండా అసాధ్యం’ అని సరిపెట్టుకుని ఉంటే ఈ రోజు మానవుడు విమానంలో ప్రయాణించ గలిగేవాడా. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన ‘ఎడిసన్‌’ ఇక బల్బు కనిపెట్టలేము అనుకుని ఉంటే ప్రపంచం ఇప్పటికీ అంధకారంలో ఉండదా ఇవి ఉదాహరణలు మాత్రమే. ప్రయోగాలు-శాస్త్రవేత్తలు అన్ని మీకు తెలిసినవే ఇక్కడ మన ఉద్దేశ్యం శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు కాదు. ఆచరణ-ఆశయసాధన. మనిషి ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే ముందుగా బద్దకాన్ని వదిలివేయాలి ఏదైనా ఒక దానిని సాధించాలనే తపనను మనసులో ఉంచుకోవాలి. దానిపై సాధిస్తామనే నమ్మకం పెట్టుకోవాలి. దాని కోసం కృషిచేయాలి శ్రమిం చాలి పని పూర్తి చేయాలి. ఆ తర్వాతే ఫలితం కోసం ఎదురు చూడాలి. బ్రతికున్న వారం దరిలో కెల్లా నేను తెలివైనవాడిని ఎందుకంటే నాకు ఒక విషయం తెలుసు అదేమిటంటే- నాకు ఏమీ తెలియదని’’ అన్నాడు సోక్రటీస్‌. ‌నేర్చుకోవాలన్న ప్రతి మనిషి, ముందుగా నాకు ఏమీ తెలియదనుకోవాలి. తెలుసుకునే మార్గాన్ని అన్వేషిస్తాడు తెలుసుకుంటాడు. సాధిస్తాడు. 19వ శతాబ్దపు బెసి స్టేన్లీ అనే కవయిత్రి విజయం గురించి ఈ విధంగా చెప్పింది ‘‘ విజయం సాధించే వాడు ఎవరంటే, బాగా జీవించినవాడు, ఎక్కు వగా నవ్విన వాడు, ప్రేమించబడినవాడు, మేధావులచే గౌరవింపబడినవాడు చిన్న పిల్లల ప్రేమ పొందినవాడు,తన మూల ప్రతిభకు సానపెట్టి అనుకున్నది సాధించినవాడు. ఈ భూమిని తను పుట్టినప్పటి కంటే మెరుగైన ప్రదేశంగా మార్చిన వాడు, భూలోక సౌంద ర్యాన్ని ప్రశంసించకుండా ఉండలేనివాడు,ఇతరుల్లో ఉత్తమమైన దానికోసమే చూసి తన వద్ద ఉన్న ఉత్తమమైనదే వారికిచ్చినవాడు ఎవరి జీవితం స్ఫూర్తిదాయ కమో ఎవరి జ్ఞాపకం ఒక ఆశీర్వదమో అతడే విజేత. జీవితాన్ని సార్ధకం చేసే ఒక పని అర్ధా న్నిచ్చే పని మీలో ప్రాణశక్తినిరగిల్చే పని సవాళ్ళు ఎదుర్కొనే సమయంలో కూడా మీ అసలైన తత్వాన్ని వ్యక్త పరిచేదే, అదే మీ అస లైన హృదయ సంబంధమైన పని అదే మీ తపన ప్రతి ఒక్కరిలో వారికే తెలియని ఒక గొప్ప టాలెంట్‌ ఉం‌టుంది. మీకు నిజ మైన ఆసక్తి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి మీకు ఏది సరియైనదో తెలియజెప్పే మీ మనస్సాక్షి యొక్క వాణిని మీరు వినగలగాలి మీలో తపనను జ్వలిపంజేసే ఒక పనిలో మీరు నిమగ్నమవ్వాలి ఆ పనిపట్ల మీలో తపన కలిగి ఉండాలి. తపనతో జీవించే వారు చైతన్య వంతమైన వ్యక్తిత్వంతో శోభిల్లు తారు. తపన లేకుండా ఏ ఒక్కరు ఏ పనిని సాధించలేదని గుర్తుంచుకోండి. అన్నింటి కంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. ఏదైనా సాధ్యం.  బద్దిపూడి శీనయ్య, నెల్లూరు

Featured ఆంధ్రప్రదేశ్ భక్తి

చరిత్రలో గుడిమల్లాం

భారతదేశ అతి ప్రాచీన శివాలయాల్లో ఇది ఒకటి పురుష లింగాకారంలో వుండే శివలింగం ఇక్కడి ప్రత్యేకత ప్రపంచంలోనే అరుదైన శివలింగం రేణిగుంటకు 15 కి.మీ. దూరంలో ఆలయం వుంది చిత్తూరు జిల్లాలో అతి ప్రాచీన శైవ క్షేత్రం గుడిమల్లాం. గుడిపల్లం కాలక్రమేణా గుడి మల్లాంగా మారింది. నెల్లూరు జిల్లాలో తిరుగుడుపల్లం కాలక్రమేణా తిరుగుడు మల్లాంగా మారి ప్రస్తుతం మల్లాంగా పిలవ బడుతున్నది. గుడి పల్లంలో వుండడం వల్ల గుడిపల్లం అనే పేరు వచ్చింది అని కొందరంటే పల్లవుల కాలం నాటి గుడి గనుక గుడిపల్లం అనే పేరువచ్చిందని మరికొందరంటారు. ఈ గ్రామం ఏర్పేడు మండలంలో వుంది. రేణిగుంటకు 15 కి.మీ.దూరంలోను, పాపా నాయుడు పేటకు 3 కి.మీ.దూరంలోను వుంది. ఇందులో వున్న ఆలయం పేరు పరశురామేశ్వర ఆలయం. భారతదేశంలో వుండే అతి ప్రాచీన శివాలయాల్లో ఇది ఒకటని చరిత్రకారుల అభిప్రాయం. ఇలాంటి ఆలయం నేపాల్‌లో కూడా ఒకటి వుందంటారు. క్రీ.పూ.రెండు శతాబ్దాలకు ముందర ఈ ఆలయం నిర్మించబడింది. క్రీ.పూ.50వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించబడి క్రీ.శ.1125లో పూర్తి చేయబడింది. ఈ ఆలయం శాతవాహనులకు సామంతులైన బాణులు కట్టారని కొందరి అభిప్రాయం. పల్ల వులు, చోళులు, యాదవులు, విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారు. అప్పటి రాజభాషలైన ప్రాకృతము, పాళి భాష శాసనాలు ఈ ఆలయంలో నిలువెత్తు రాళ్ళ మీద కనిపిస్తాయి. ఆలయ గర్భగుడి గజపృష్ఠ ఆకారంలో కనిపిస్తుంది. గజపృష్ఠ అంటే ఏనుగు యొక్క వెనుక భాగం. దీనిని బట్టి కొందరు ముందు ఈ దేవాలయం బౌద్ద ఆరామంగా వుండి వుండవచ్చునని ఊహి స్తున్నారు. అంతేగాక పల్లంలో వున్న శివ లింగం చుట్టూ బౌద్ద నిర్మాణాలను పోలిన కట్టడాలున్నాయి. అందువల్ల బౌద్ద ఆరామంగా దీనిని ఊహిస్తున్నారు. మొత్తం మీద ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఎంతో పరి శోధన జరగవలసి వుంది. అప్పుడు గాని ఈ ఆలయాన్ని గురించిన పూర్తి వివరాలు తెలియవు. ఈ ఆలయ ప్రత్యేకత శివలింగం. మామూలు శివాలయాల్లో వున్న శివ లింగానికి ఈ ఆలయంలో వున్న శివలింగా నికి చాలా తేడా వుంది. అచ్చు మానవ పురుష లింగం ఆకారంలో ఈ శివలింగం చెక్కబడింది. ఎందుకలా జరిగింది అనేది అంతుపట్టని విషయం. ఈ విచిత్రమైన విషయాన్ని విన్న ప్రముఖ చరిత్రకారులు రాహుల్‌ ‌సాలంకృత్యాయన్‌ ఈ ఆలయాన్ని సందర్శిం చారు. ఇక్కడి నిర్మాణ శైలికి అచ్చెరు వొందారు. పడమటి వైపున గోడలో నగలు దాచ డానికి ఏర్పాటు వుంది. రాయిని జరిపితే లోపల పెట్టెలాగా కనిపిస్తుంది. అక్కడ అలాంటి నిర్మాణం వుందని ఎవరైనా చెబితే కాని మనం కనుక్కోలేము. దైవ ఆభరణాలను దాచడానికి శిల్పి చేసిన చమత్క ృతి అది. ఆలయంలో అనేక చిన్నచిన్న గుడులున్నాయి. వాటిలో సూర్య నారాయణ స్వామి దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, పార్వతీ దేవాలయం మొదలైనవి ముఖ్య మైనవి. మన రాష్ట్రంలో అరసవెల్లి తరువాత సూర్య నారా యణ విగ్రహం ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది మరియు అనాదిగా ఆరాధనలను అందు కొంటుంది. ఇటీవల వరకు ఈ ఆలయాన్ని శ్రీకాళహస్తి రాజులు పోషిస్తూ వుండేవారు. ఉత్సవాలు జరు పుతూ వుండే వారు. ఈ మధ్య కాలంలో పురావస్తు శాఖ వారు ఆలయాన్ని స్వాధీనం చేసుకొని అభివృద్ధి పరుస్తున్నారు. ఆలయానికి వెనుక పెద్ద కోనేరు, ఉత్త రము వైపున వున్న బావి చాలా పురాతన మైనవి. ముప్పై ఏళ్ళ క్రిందట ఈ బావి నీటితో పొంగి ఆ నీరు గర్భగుడిలోకి వచ్చిందంటారు. శివలింగం మీద పరశురాముడు గండ్రగొడ్డలి చేతబూని కనిపిస్తాడు. ఆ దిగువన బ్రహ్మ చెక్కబడి వున్నాడు. మహాశివరాత్రి ఉత్సవాల ను, కార్తీక సోమవారం, శ్రావణ శుక్రవారం అభిషేకాలను ప్రస్తుతం జరుపుతున్నారు. దేశం లోని పలు ప్రాంతాల నుంచి ఈ వింత ఆలయాన్ని చూడడానికి జనం వస్తుంటారు. ఆల యంలో డమరుక శబ్దం వినపడుతూ వుంటుం దని, మూలవిరాట్‌ ‌దగ్గర అర్ధరాత్రి గజ్జెల శబ్దం వినిపిస్తుందని, ముక్కోటి ఏకాదశి రోజున ఆలయంలో వింత శబ్దం వినపడుతుందని స్థానికులు కథలు కథలుగా చెపుతుంటారు. ఒకసారి ఆలయాన్ని శుద్ధి చేయడానికి పురావస్తుశాఖ వారు రసాయనాలు చల్లారు. ఆ విషయం తెలియని భక్తులు కర్పూరం వెలిగించారు. పెద్ద అగ్ని ప్రమా దం ఆలయంలో జరిగింది. ఆ ప్రమా దంలో నలుగురు చనిపోగా మరికొంత మంది గాయపడ్డారు. ఇది ఆలయ చరి త్రలో ఒక విషాదం. మొత్తం మీద ఒక గొప్ప చారిత్రక నేపథ్యం గల ఆలయం గుడిమల్లాం పరశురామేశ్వరాలయం. ఇంత మారుమూల గ్రామంలో అప్పుడు ఇంతటి విశిష్టత కలిగిన ఆలయాన్ని ఎందుకు నిర్మించారా? అని సందేహం కలుగుతుంది ఎవరికైనా! ఈ ప్రశ్నకు జవాబుగా ఒకప్పుడు స్వర్ణముఖి నది ఒడ్డున వున్న పెద్ద పట్టణం ఈ ఊరని స్థానికులు అం టారు. ఇది నిజమే అయివుండవచ్చని అనిపిస్తుంది. డాక్టర్‌ ‌గంగిశెట్టి శివకుమార్‌, ‌పున్నమి దినపత్రిక గౌరవ సంపాదకులు. సెల్‌ : 9441895343

Featured

జాతీయ యువజన దినోత్సవం :కెప్టెన్ GS యుగంధర్ రెడ్డి

10 ఆంధ్రనావల్ యూనిట్ NCC కమాండింగ్ ఆఫీసర్, కెప్టెన్ GS యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ” జాతీయ యువజన దినోత్సవం జరిగినది కార్యక్రమంలో భాగంగా ఈరోజు 12- 01 – 2021 న ర్యాలీ నిర్వహించాము ,ఈ ర్యాలీ VR కళాశాల నుండి గాంధీ బోమ్మ వరకు తిరిగి VR కళాశాల కుచేరుకున్నది 10ఆంథ్రా నావల్ యూనిట్ NCC క్యాడెట్స్ పాల్గొన్నారు .NCC నావల్ క్యాడెట్స్ ను ఉద్దేశించి లెఫ్టినెంట్ డాక్టర్ N.ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్నన్ని ప్రపంచ దశ దిశలా చాటిన , భారతీయ యువతకు దశ దశా నిర్దేశం చేసిన స్వామి వివేకానంద జన్మదినాన్ని జనవరి 12 న భారతీయులు ప్రతిసంవత్సరం జాతీయ యువజన దినోత్సవం గా జరుపుకొంటారన్ని , స్వామి వివేకానంద ను యవత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈకార్యక్రమంలో VR కళాశాల, సర్వోదయ కళాశాల, 10 ఆంధ్ర నావల్ యూనిట్ NCCక్యాడెట్స్ ,మరియు NCC ఆఫీసర్ ,లెఫ్టినెంట్ డాక్టర్ N.ప్రభాకర్ , .PI స్టాప్ ,రజనీష్ కుమార్ సింగ్,వీరభద్రారెడ్డి పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

‘‘‌లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’’ ‘‘ఈ ప్రపంచంలో వున్న సకల శక్తి నీలో వుంది. అసమర్ధుడునని భావించకు. నీవు ఏమైనా చేయగలవు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పున్నమి ప్రత్యేక కథనం ‘‘ఇనుప నరాలు,ఉక్కు కండ రాలున్న వంద మంది యువకు లను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను’’ అన్న ద్రష్ట స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉందని నూరేళ్ల క్రితమే గుర్తించి, బాహాటంగా ఆనాడే చాటిన దార్శనికత ఆయనది. సృజనాత్మక మనోవీక్షణ పక్రియకు ప్రాణం పోసి, దానిని విశ్వవా్య ప్త ప్రాచుర్యం కల్పించిన స్ఫూర్తి ప్రదాతలను పేర్కొనవలసి వస్తే ముందుగా చెప్పాల్సిన పేరు నిస్సందే హంగా స్వామి వివేకానందు డిదే. ఆధు నిక భారతదేశం ప్రపంచం లోనే ఒక మహత్తర శక్తిగా ఎదగడానికి ఆయన జీవించి ఉన్న కొద్దికాలంలోనే పటిష్టమైన పునాదులు వేశారు. ప్రజ్ఞలో, మేధా సంపత్తిలో భారతీ యులు మరెవరికి తక్కువ కాదని నిరూపించడం ద్వారా,ముఖ్యంగా భార తీయ యువతరంలో చైతన్యంనిం పడా నికి, ఆత్మ విశ్వాసం కలిగించ డానికి ఆయన తన జీవితమంతా కృషి చేశారు. ఆలోచన పటిమ, నిర్ణయ సామర్ధ్యం, వెనుదిరగని ఆచరణ, ధైర్యంతో ఫలితా లను స్వీకరించగలిగే ధీరత్వాన్ని యువకుల హృదయాల్లో ప్రతిష్ఠించడానికి వివేకా నంద ఎంత గానో ప్రయత్నించారు. భావి భారతీయ తరాలకు ఎన్నటికీ తరగని కార్యదక్షత, స్ఫూర్తిని అందజేయడం కోసం ఆయన అలుపెర గని పరిశ్రమ చేశారు. ఏ ‌దేశంలోనైనా మంచి మార్పు రావడానికి ఏళ్ల తరబడి శ్రమించాల్సిన అవసరంలేదని, యువ జనులంతా మనస్ఫూర్తిగా కలిసికట్టుగా పరిశ్రమిస్తే కొద్ది రోజుల్లోనే మార్పు సాధ్యమౌతుందని వివేకానందుని భావన. ప్రపంచ దేశాలను తిరిగిన ఆయన వివిధ దేశాలలోని యువతరానికి భారతీ య యువ తరానికి ఆలోచన విధానం లోను, మనస్తత్వంలోను ఉన్న భేదాలను ప్రస్ఫుటంగాగమనించారు.భారతదేశం ఎదుర్కొంటు న్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమ స్యల కంటే అతి పెద్ద సమస్య ఇక్కడి యువతరానికి సరియైన ఆలోచనా దృక్పథం లేకపోవ డమేనని వివేకానంద భావించారు. ఆయన తన ప్రసంగాలతో, పుస్తకాలతో, సూక్తులతో యువతరా న్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారు. ఓటమిని జీర్ణిం చుకోలేక చిన్న చిన్న పరాజయాలకే నిరా శకు గురై కృంగిపో యే భారతీయ యువతరాన్ని వివేకా నంద తన బోధ నలతో చైతన్యపర్చారు. పరాజయాల నుండి గుణపాఠాలు నేర్చు కోవాలని, ఓటమి అనేది అపకారి కాదని, అవి జీవితానికి మెరుగులు దిద్దుతుందని ఆయన భావన.ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడ మే మేలని, నిరం తంరం శ్రమించే వాడిని చూసి ఓటమి కూడా భయపడుతుందని యువతకు ఆయన ప్రబోధించారు. ధీరులు అపజయాలను చూసి కుంగి పోరని, విజయం సాధించే వరకు పోరాటం చేస్తారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించక పోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలని అనేవారు. ఓటమి కంటే విజయం బాధ్యతను పెంచుతుని, విజేతలు ఏవిధంగా ఉండా లో కూడా వివేకానంద తెల్పారు. విజయం సాధించామని విర్రవీగరాదని, విజయం నుండి వినయాన్ని నేర్చు కోవాలని సందే శాన్నిచ్చారు. అట్లే లక్ష్య సాధనలో పరాజి తులు విజయాన్ని ఎలా కైవసం చేసుకో వాలో కూడా ఆయన యువతరానికి తెల్పారు. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాస క్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించా లని, విజయానికి అసలు రహస్యం ఇదేన ని అన్నారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత కలిగిన వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడిం చలేదనేది ఆయన భావన. ఉత్సాహంతో శ్రమించడం,అలసటను ఆనందంగా అనుభవించడం అనేవి విజయాన్ని కాంక్షి ంచే వారికుండే ప్రాథమిక లక్షణాలని అనేవారు. ఒక్కరోజులో దేనిని సాధించలే మని, పట్టుదల వదలకుండా చేసే ప్రయ త్నం విజయాన్ని చేకూర్చుందనే సత్యాన్ని యువత గుండెల్లో నాటుకునేలా నొక్కి చెప్పారు. నిరాశ కమ్ముకున్న ప్రతిక్షణాన ‘‘లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’’ అని వివేకా చెప్పిన సూక్తే యువతరా న్ని చైతన్య పథం వైపుకు అడుగులు వేయి స్తుంది. భార తీయ యువతరంలో ఆయన గమ నించిన ప్రధాన లోపం భయం. మనిషి పతానికైనా-పాపానికై నా భయ మే ప్రధా నకారణమని, భయంలోనే చావు ఉందనే అభిప్రాయాన్ని వివేకానం దుడు వ్యక్తం చేశారు. ‘బలమే జీవనం. బల హీనమే మరణం’’అని ఆయన ఇచ్చిన సందేశం మానవజాతికే అతి గొప్ప సం దేశం. మనిషి శరీరాన్ని ధరించినప్పు డు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధ లను అనుభవించి తీరాల్సిందేనని, అం దుకే దృష్టిని బాధలపై ఉంచకుండా పరిష్కారం పై ఉంచండని ఉద్భోదించా రు. అత్యున్నత మైన ఆదర్శాన్ని కలిగి యువతరం ధైర్యంగా ముందుకు సాగాలనీ, ఈర్ష్యాను స్వార్ధాన్ని వదిలి పెడితే ప్రపంచాన్నే కదిలించవ చ్చునని ఆయన బలంగా నమ్మేవారు.బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరుకునే వారు. ‌చేసేది చిన్న పనైనా శ్రద్ధతో సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్నిస్తుందని, కావున ప్రతి వ్యక్తి తాను చేయగల పని చిన్నదైనా శ్రద్ధతో నిర్వహించాలని ప్రబో ధించారు. సమాజాన్ని సంస్కరించాలనుకునే వారు ముందుగా తమను తాము సంస్కరించుకో వాలని ఆయన తెల్పారు. యువత సచ్ఛీ లత కలిగిఉండాలని ఆయన ప్రతిసారి చెబుతూ ఉండేవారు.భారతీయ యువతరం యెక్క శక్తి సామర్ధ్యాలపై వివేకా నందునికి అంచంచలమైన విశ్వాసం ఉంది. భావి భారత భవిష్యత్తు యువతరం చేతిలోనే ఉందని, దేశ తల రాతలు మార్చగలిగే సత్తా వారికే మాత్రమే ఉందని ఆయన ప్రగాఢంగా నమ్మారు. అలాంటి యువతరాన్ని తన ప్రసంగాల ద్వారా చైతన్యపర్చడానికి ప్రయత్నించా రు. వివేకానందుని బోధనలు, సూ క్తులు కేవలం భారతీయ యువతరానికి మాత్రమే పరిమితం కాదు. ‌ప్రపంచంలో నిరాశ, నిస్పృహలతో సతమతమవు తున్న యువతరానికి ఆయన సూక్తులు చైతన్య ప్రబోధాలు.‘‘ఈ ప్రపంచంలో వున్న సకల శక్తి నీలో వుంది. అసమర్ధుడునని భావించకు. నీవు ఏమైనా చేయగలవు. అన్నింటిని సాధించగలవు’’ అని యువత రానికి వివేకానందుడు ఆధునిక భగవద్గీ తను బోధించారు. వివేకానందు డు నేడు భౌతికంగా లేకపోయినా ఆయన ప్రబో ధాలు, సూక్తులు సజీవంగా యువతరా నికి ప్రేరణ కలుగజేస్తూనే ఉంటాయి. యువశక్తికి నిత్యం కొత్త ప్రేరణ అందించే మహనీయునిగా ప్రపంచ నీరాజనాలు అందుకున్న వివేకానందుడు జన్మించిన గడ్డపై జన్మించడం ప్రతి భారతీయుడు చేసుకున్న అదృష్టం.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

వైద్యం పవిత్రమూ కాదు! వైద్యుడు దేవుడు కాదు!!

‘‘‌వైద్యం చాలా పవిత్రమైనది’’ ‘‘వైద్యుడు నారాయణుడితో సమానం’’ అందరి భావన. ‘‘డాక్టరు-పేషంటు’’ మధ్య సంబంధాలను వాస్తవ దృష్టితో అర్థం చేసుకోవాలి డాక్టర్లంతా మేధావులు కాదు. అందరిలో ఉన్నట్టే డాక్టర్లలో కూడా మేథావులు వుంటారు.   ‘‘‌వైద్యం చాలా పవిత్రమైనది’’ ‘‘వైద్యుడు నారాయణుడితో సమానం’’ ఇవి వారసత్వంగా కొనసాగుతున్న భావాలు. కాలం మారుతుంది. జనం మారుతున్నారు. వారి ఆలోచనా విధానం మారుతుంది. గతంలో మాదిరి వైద్యం చెయ్యాలంటే ఏ ఆకునో, కాయనో నూరి మందుగా ఇవ్వటం కుదరదు ఇస్తే జనం ఒప్పుకోరు. ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంత కాలం ఉంటాయి. ఇం కొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు, సంవత్స రాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను, అవశేషాలను వదిలిపోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం. ఆపరేషను చేయాల్సిన కేసుల్లో సర్జరీ మొదలైనప్పటి నుంచి రోగి కోలుకొనే వరకూ కేవలం డాక్టరు సమర్ధతే చాలదు. సమస్య తీవ్రత, రోగి శరీరం తట్టు కొనే తీరు, మందుల ప్రభావం, వసతులు, రోగి చెల్లింపు సామర్థ్యం మొదలైనవన్నీ వాటి వాటి స్థాయిలో కలిసి రావాలి. వాస్తవ పరి స్థితి ఒక రకంగా ఉంటుంది. రోగి దాన్ని అర్థం చేసుకొనే తీరును బట్టి వారి ఆశింపు మరో రకంగా ఉంటుంది.  జనానికి ఆధునిక వైద్యం కావాలి. వైద్యంలో నాణ్యత ఉండాలి. రోగి ఆసుపత్రిలో అడుగు పెట్టే సమయానికి అన్నీ అమరినట్టు ఉండాలి. బాధతో ఉన్నప్పుడు వైద్యం ఆలస్యం కాకుడదు. త్వరగా జబ్బు తగ్గిపోవాలి. ఇవి సగటు రోగి ఆశింపు. రోగి ఆశించినట్టు వైద్య సేవలు అందించాలంటే డాక్టరు పూర్తిగా సమర్ధుడై ఉండాలి. వైద్యాన్ని బాగా నేర్చుకోవాలి, కొత్త కొత్త పోకడల్ని నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. అందుకు వృత్తిపరమయిన ‘‘కాన్ఫెరెన్స్’’‌లకు పోతూ ఉండాలి. ఎడిషను మారినప్పుడల్లా కొత్త పుస్తకాలు మారుస్తూ ఉండాలి. జర్నళ్ళుకు చందా కడుతూనే ఉండాలి. అన్నింటికి మించి నిరంతరం చదువుతూనే ఉండాలి. రోగం చేయటంలో ఏమయినా తేడా వచ్చి వినియోగదారుల ఫారంలో కేసు పడవచ్చు. ఇన్ని కష్టాలు పడే మాకు కష్టానికి తగ్గట్టు డబ్బులు ఫీజు రూపంలో రావొద్దూ? ఇది రోగి ఆశింపుపై సగటు డాక్టరు కామెంటు. మరో వైపు డాక్టరుకి సామాజిక బాధ్యత ఉండాలని సమాజం ఖచ్చింగా ఆశిస్తుంది. ఇంజనీర్లకు, లాయర్లకూ, చార్టెడు అకౌంటెట్లకూ ఇలా ఒకరనేం ఎవరికీ సామాజికి బాధ్యతని జనం గుర్తు చేయరు. ఐ.ఐ.టీ.లో, ఐ.ఐ.ఎం.లో ప్రజల డబ్బుతో చదివిన వారిని సమాజం పట్ల మీ బాధ్యత ఏమిటని ఎవరూ అడగరు. వారు సమాజం డబ్బుతో చదవరా? కేవలం డాక్టరు మాత్రమే జనం డబ్బుతో చదువుతారా? డాక్టర్లు మాత్రమే జనాల సేవలో తరించాలా? వైద్యుల మీద చర్చవచ్చిన ప్రతిసారీ డాక్టర్లు ముందుకు తెచ్చే ప్రశ్నలు ఇవి. కొన్ని వాస్తవాలు కూడా గమనించాలి. వైద్యుడిని దేవుడిగా నెత్తిన పెట్టుకొనే జనం వైద్యంలో ఎక్కడైనా తేడా వస్తే ఊరకనే వుం డరు. అదే ‘‘దేవుడు’’ తిట్లు తినాలి. కొన్ని సార్లు తన్నులు తినాలి. మంచి సిటిజను అయితే ఇవేమీ చేయకుండా కోర్టుకు తిప్పుతాడు. మంచి డాక్టరుగా తయారవ్వమని ఆదేశించమని కాదు. నాకు డబ్బులు కట్టించమని. వైద్యులకూ, డాక్టర్లకూ మధ్య ఈ విధమైన వైవిధ్యాలు రావ టానికి కారణం ఏమిటంటే ‘‘డాక్టరు-పేషంటు’’ మధ్య సంబం ధాలను వాస్తవ దృష్టితో అర్థం చేసుకోలేక పోవటమే. సమాజంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృ తిక అంశాలలో మార్పులు అని వార్యం. వాటి తో పాటే మానవ సంబంధాలు మారిపోతాయి. పూటకూళ్ళ వారి ఇళ్ళు రెస్టారెంట్లు అయినట్టు, సత్రాలు స్టారు హోట ళ్ళు అయి నట్టు, వైద్యాన్ని డబ్బులు తీసుకొని చేసే సేవగా గుర్తించ కుండా పవిత్రమైనదిగా, డాక్ట రును దేవు డిలా, దయామయుడిలా, శాంత మూర్తిగా, రోగ పీడత దరిద్ర నారాయణులను ఆదుకొనే అవ తార మూర్తిగా భావించి నైతిక తను ఆశిస్తే ఎలా కుదురుతుందీ? జనం మారి, వైద్యం మారి, వైద్య పద్ధ తులు మారి, వైద్యానికి సంబంధించి మగతా అన్ని మారినా వైద్యుల్ని చూడటంలో జనం ఆలోచనలు మాత్రం అలాగే ఉన్నాయి. అందుకే జనం ఆశింపుకూ, వైద్యుల ప్రవర్తనకూ మధ్య అంత అంతరం. మారిన కాలంతోపాటు. డాక్టర్లూ మారు తారు. వారు చేసే వైద్యమూ మారుతుంది. దానికి తగ్గ ఖర్చూ పెరుగుతుంది. మార్పులన్నీ సామాజంలో వచ్చే మొత్తంలో భాగంగానే వుం టుంది. ఈ దృష్టిలో ఉంచుకొని డాక్టరు- పేషంటు సంబంధాన్ని చూస్తే వారి మధ్య సంబంధాలు సజావుగానే ఉంటాయి. లేదంటే పరస్పరం అనుమానంతోనే కలిసి నడవాలి. మిగతా వారిని వదిలేసి డాక్టర్ల నుండి మాత్రమే సామాజిక బాధ్యతను ఆశించటంలో మరో కనపడని కోణం కూడా ఉంది. అదేమి టంటే రోగం వ్యక్తిని ప్రత్యక్షంగా బాధకు గురి చేస్తుంది. దాన్నుండి విముక్తి పొందాలంటే డాక్ట రుతో ప్రత్యక్ష సంబంధం అవసరం. అలాగే ప్రత్యక్ష చెల్లిపు కూడా చెయ్యాలి. ఆ చెల్లింపు మనసులో ‘‘ఆయిష్టమైన చెల్లింపు’’ ఎలానో చూద్దాం. రోగం రావటం ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా రాకుండా ఉండవు. వచ్చాక వైద్యం చేయించుకోవటమూ తప్పదు. ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చక పోయినా డాక్టరు దగ్గరకో, ఆసుపత్రికో వెళ్ళి చూపించుకొని వైద్యం చేయించు కోవాలి. అంటే జబ్బున పడ్డప్పుడు డాక్టరు-రోగి సంబంధం అనివార్యమూ, అవసరము. మనిషి అవసరాలు మొత్తం రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకం మన కు కావాల్సినవి, మనం ఇష్టపడేవి, మనకు ఆనం దాన్ని ఇచ్చేవి. వీటికోసం మనమే వెంపర్లా డుతాం. ఖరీదు అయిన టీవీని కొనటం, ఆరు రెట్లు ఎక్కువ ధర చెల్లించి మనకు నచ్చిన హీరో సినిమా టికెట్టును బ్లాకులో కొనటం, దాహం వేసినప్పుడు కోకకోలా తాగటం, మందు తాగటం. ఇవి ఇష్టమైన అవసరాలు కాబట్టి ఎంత ఖర్చు అయిందనే దానితో లెక్క లేదు. రెండో రకం అవసరాలు మనకు ఇష్టం లేనివి. ఇష్టం లేకపోయినా అవసరం కాబట్టి అవి తీరాలి. కోర్టులో కేసు, రోగం వచ్చినప్పుడు వైద్యం. ఇవి వచ్చాయి కాబట్టి అవసరాలు అవుతాయికానీ నిజానికి మనమేం కోరుకోలేదు. ఇందులో లోతుపాతులు మనకు తెలియదు కాబట్టి నిపుణుల సహాయం తప్పని సరిగా కావాలి. వారికి డబ్బు చెల్లించాలి. కాబట్టి వీటి మీద ఖర్చు పెట్టటానికి అయిష్టంగానే ఉంటుంది. నెలకు పదివేల రూపాయలు ఆలో చించకుండా ‘మందు’కు ఖర్చుపెట్టే వ్యక్తి దాన్ని మానటానికి వైద్యం చేసిన డాక్టరు బిల్లు అయిదు వేలు కట్టటానికి మనసు ఒప్పదు. దీనికి ఇంత అవుద్దా అని ధర్మ సందేహం. డాక్టరు ఎక్కువ లాగుతున్నాడని లోలోన మధనం. డాక్టర్లు ఊరికే సంపాదిస్తున్నారని నింద. డాక్టర్లకు మానవత్వం లేదని కామెంట్లు. తీవ్రంగా గాయ పడ్డప్పుడు వైద్యం చేయిం చుకోకపోతే ప్రాణం పోతుందనే భయం. తక్షణ ఆపద్బాంధవుడు డాక్టరు ఎక్కడా? త్వర గా రాడే? ఆ పరిస్థితిలో, ఆ సమయంలో రోగి ఆక్రందన అలా వుంటుంది. డాక్టరు వచ్చాడు. వైద్యం జరుగుతూ వుంది. ఫరవాలేదు. ఇప్పుడు బాగుంది. ‘‘బిల్లు ఎంత అవుతుందో?’’ రోగి అను మానం. రోగం తగ్గింది. బిల్లు చేతికి వచ్చింది. అది ఎంతైనా ఉండనీ! ‘‘అమ్మ బాబోయ్‌ ఇం‌తా? ఈ డాక్టర్లుకు కరుణ లేదు. దారుణంగా దోచేసుకుంటు న్నారు’’ ఏం పెద్ద ఊడబొడిచారనీ’’ ఇవి జబ్బు నయం అయ్యాక, సగటు రోగి ఆలోచనలు. దీనికి కారణం ఇష్టం లేని ‘అవసరం’ కోసం చెల్లిం చాల్సి రావటమే. రోగికి డాక్టరు, ప్రాణం పోయేట ప్పుడు దేవుడుగానూ, రోగం తగ్గేటప్పుడు స్నేహి తుడిగా, బిల్లు కట్టించుకొనేటప్బుడు యముడిలా కనిపిస్తాడని ఒక ఆధునిక నానుడి పుట్టుకు వచ్చింది.చేయించుకున్న వైద్యానికి బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు రోగి మనసులో ‘‘అవసరము- అయిష్టత’’ పునాదిగా ఆలోచిస్తారు. మారిన సామాజిక నేపథ్యంలో వైద్యం చేసే డాక్టరు ‘‘సేవ-ప్రతిఫలం’’ అనే ఆలోచనల పునాదిగా ఫీజును ఆశిస్తాడు. ఈ రెండింటి మధ్య పొంతన ఎంత చెడిపోతే డాక్టరు-రోగి మధ్య సంబంధం కూడా అంతగా దెబ్బ తింటుంది. రోగి-డాక్టరు మధ్య సంబంధాలను వ్యా పార సంబంధాలుగా పరిగణించి ‘‘వినియోగ దారుల చట్టం’’ పరిధిలోకి తెచ్చాక కూడా ‘‘సేవ- దయ’’ అనే పాత పునాదుల పై నుండి వైద్యాన్ని చూడటం సరికాదు. ‘‘సేవకు తగ్గ చెల్లింపు’’ రోగికి ఉండాలి. అలాగే ‘‘చెల్లించిన దానికి నాణ్యమైన సేవ’’ను డాక్టర్లు అలవరుచు కోవాలి. అంటే రోగి మంచి వినియోగదారుడై ఉండాలి. నాణ్యత ‘‘సర్వీసు ప్రొవైడరు’’ అయి ఉండాలి. సేవకు తగ్గట్టు చెల్లించని మనస్తత్వం రోగికి ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో దాన్ని రాబట్టుకొనే విధంగా వైద్యులు ఉంటారు. వైద్యం అనే రైలు నడవాలంటే దానికి రోగి- వైద్యుడు రెండు పట్టాల్లాంటి వారు. ఒక పట్టా అదుపు తప్పి, రెండో దాన్ని అదుపు తప్ప కుండా బాగుండమని ఆశించటం సాధ్యం కాదు. ఈ ‌నేపథ్యంలో వినియోగదారుడు వైద్యుల పట్ల తమ దృక్పధం మార్చుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి., 1. వైద్య వృత్తి పవిత్రమయినది కాదు. కట్టిన డబ్బుకు అందించే వినిమయ సేవ మాత్రమే. 2. డాక్టరు గొప్పవాడేం కాదు. అన్నీ పనుల్లో నిపుణులు ఉన్నట్టే డాక్టరు కూడా కేవలం వృత్తి నిపుణుడు మాత్రమే. 3. డాక్టర్లంతా మేధావులు కాదు. అందరిలో ఉన్నట్టే డాక్టర్లలో కూడా మేథావులు వుంటారు. 4. డాక్టరు చదువును దృష్టిలో ఉంచుకొని వైద్యం నాణ్యతను ఆశించాలి. ప్రతి డాక్టరుకు అన్నీ తెలిసి ఉండవు. 5. ఒకే డిగ్రీ చదివిన స్పెషలిస్టులకు మధ్య కూడా నక్కకూ, నాగలోకానికి మధ్య వున్నంత తేడా వుంటుంది. 6. సమాజంలో ఉండే అన్నీ రుగ్మతలు వైద్య వ్యవస్థలోనూ, వైద్యుల్లోనూ ఉంటాయి. 7. ప్రభుత్వ డాక్టర్లు ధర్మంగానో, దయతోనో వైద్యం చేయటం లేదు. వారికి ప్రజల తరుఫున ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది. డాక్టర్‌ ‌పి. శ్రీనివాసతేజ  

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

చరిత్రలో ‘పంట్రంగం’

రెండు గర్భగుడులున్న ప్రత్యేకాలయం రాముడు పూజలు చేసి ప్రతిష్టించిన శివలింగం పాలకులు పట్టించుకోని గ్రామం నెల్లూరు జిల్లాలో గొప్ప చారిత్రక ప్రాశ స్త్యం వున్న గ్రామం పంట్రంగం. తూర్పు చాళుక్య ప్రభువు గుణగ విజయాదిత్యుని (క్రీ.శ.893) సేనాని పండరంగడు తన విజయ యాత్రకు సంకేతంగా ఈ వూరిని అందులోని శివాలయాన్ని నిర్మించాడు. చాలా వరకు సముద్ర గర్భంలో కలిసి పోయిన ఈ చారిత్రక పట్టణంలో శివాలయం, దాని పరిసరాలలో ఐదారు కుటుంబాలు మాత్రం ప్రస్తుతానికి కన్పిస్తాయి. పురావస్తుశాఖ వారు శ్రద్ద చూపి తవ్వకాలు జరిపితే… ఎన్నో ఆసక్తికర చారిత్రక విషయాలు వెలుగు చూసే అవకాశం వుంది. పౌరాణిక ప్రాశస్త్యం : పులికాడు సముద్ర తీరప్రాంతంలో అర కోటి లింగాలకు రావణాసురుడు నిత్యమూ పూజలు చేసేవాడట. రావణుని చంపి, అయోధ్యకు తిరిగి వెళ్ళే సమయంలో రాములవారు బ్రహ్మహత్యా దోష నివారణ కోసం ఒక శివ లింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారట. ఆంజనేయుని కైలాసం పంపి, శివలింగం తెమ్మన్నారు. అక్కడ గణేశునితో వాదనకు దిగిన హనుమంతుడు లింగం తేవడం ఆలస్యమయింది. ఈలోగా ముహుర్తం మించిపోతుందని గ్రహించిన సీతమ్మ ఇసుకతోనే లింగా కారం చేసింది. దానినే రాముల వారు ప్రతిష్టించారు. కైలాసం నుండి శివలింగాన్ని తెచ్చిన హనుమ కోపంతో ఇసుక లింగాన్ని పెకిలించాలని చూశాడు. వీలు కాలేదు. రాముడు హనుమంతుడ్ని ఓదార్చి, తన భక్తుడు తెచ్చిన లింగాన్ని కూడా పక్కనే ప్రతిష్టించాడు. అందుకే పంట్రంగంలో రెండు గర్భగుడులున్నాయి. రామలింగేశ్వరుడు, పండ రంగేశ్వరుడూ అనే పేర్లతో రెండు శివలింగాలున్నాయి. ఈనాటికీ సూర్యోదయం వేళలో ఈ లింగాల పై సూర్య కిరణాలు పడతాయి. ఈ ఆలయం నుండి కాశీలోని విశ్వేశ్వరాలయం వరకు సొరంగం వుండేదని అంటారు. చారిత్రక ప్రాశస్త్యం : తూర్పు చాళుక్య రాజయిన గణగ విజయా దిత్యుడు (క్రీ.శ.843) ఉత్తరాదిన కళింగ వర కు జయించాడు. ఇతడు రాష్ట్రకూట రాజయిన రెండవ కృష్ణునితో అనేక సార్లు యుద్ధాలు చేశాడు. ఈ రాష్ట్రకూట రాజుకు గాంగులు సహాయపడ్డారు. విజయాదిత్యుడు గాంగులను ఓడించాడు. నెల్లూరు జిల్లాలో దొరికన ఒక శాసనంలో ఇతడి గొప్పతనానికి కారణం ఇతని సేనాని అయిన పండరంగడని చెప్పబడింది. ఒంగోలు సమీపాన ధర్మపురం వద్ద దొరికిన శాసనంలో కూడా పండరంగని గొప్పతనం చెప్పబడింది. అద్దంకి వద్ద దొరికన శాసనంలో ఇతని పేరు ‘పాండురంగ’డనే అని వుంది. ఉదయగిరి సమీపాన వున్న పాండురంగం అనే గ్రామం కూడా ఇతని పేరుమీద వెలి సిందే. అక్కడి ఆలయమూ ఇతరు కట్టించిందే. మచిలీపట్నం వద్ద దొరికిన ఒక శాస నంలో గుణగ విజయాదిత్యుడు కిరణపురాన్ని అచలపురాన్ని (కొండపల్లి) నెల్లూరు పురాన్ని జయించినట్లు అందువల్ల అతనికి ‘త్రిపుర మర్త్య మహేశ్వర’ బిరుదు లభించినట్లు వుంది. దీన్ని బట్టి తూర్పు చాళుక్య రాజ్యం నెల్లూరు వరకు విస్తరించి వుండిందని తెలుస్తోంది. వీరి కాలంలో నెల్లూరుకు పడమర ప్రాంతాల్లో బోయలనే కాకల తీరిన యోధులుండేవారు. వీరు పాలించే ప్రాంతాలకు ‘బోయకొట్టాలు’ అనే వారు. ఇలాంటివి అప్ప ట్లో పన్నెండు వుండేవి. అందులో ముఖ్య మైనవి కందుకూరు, నెల్లూరు. గుణగ విజయాదిత్యుడు అధికారంలోకి రాకముందు చాళుక్యులకు బోయలు సామం తులు. విజయాదిత్యుడు రాజ్యాధికారం చేప ట్టగానే వీరు స్వతంత్రం ప్రకటించుకున్నారు. కడెయరాజు కొడుకైన పండరంగడు విజయా దిత్యుని సేనాని. గొప్ప శక్తి మంతుడు. విజయాదిత్యుడు బోయల్ని అణచడానికి పండరంగని సైన్యంతో పంపాడు. బోయలు కట్టెందుర్గం, నెల్లూరు వద్ద సైన్యాన్ని మోహ రించారు పండరంగడ్ని నిలవరించడానికి. పండరంగడు కట్టెం దుర్గాన్ని నేలమట్టం చేశాడు. నెల్లూరు పట్టణాన్ని తగలబెట్టాడు. పన్నెండు బోయ కొట్టాలను తిరిగి చాళుక్య రాజ్యంలో కలిపాడు. నెల్లూరు నుండి తొండ మండలం సరిహద్దుల్లో వున్న పులికాట్టు దాకా తన సైన్యంతో వెళ్ళి, అక్కడ తన విజయాలకు సంకేతంగా పండ్రంగం అనే వూరు కట్టాడు. పాండురంగేశ్వరస్వామిని ప్రతిష్టించాడు. అదే ఇప్పటి పంట్రంగం. చాళుక్యుల తర్వాత చోళుల ఆధీనంలోకి ఈ ప్రాంతం వచ్చింది. తిరయన్‌ అనే రాజు ఈ పట్రంగాన్ని పాలించినట్లు తెలుస్తోంది. మొదటి కుళోత్తుంగుని శాసనాలు ఈ ఆలయంలో కన్పిస్తాయి. ఈ శాసనాల్లో ఈ వూరిని భవాద్రికోట అన్నారు. రాజరాజ చోళుడు ఈ ఆలయానికి దానాలు చేశాడు. రాజరాజ చోళ పరాంతకుడు ఈ ఆలయానికి మాన్యాలిచ్చాడు. ముమ్మడి వైదంబ మహారాజు దీపపు సమ్మెలిచ్చాడు. నెల్లూరును ఏలిన విజయ గండ గోపాలుడు కామాక్షి అమ్మవారిని ఆలయంలో ప్రతిష్టించాడు. శాసనాల్లో అమ్మ వారిని ‘కామకోటి’ అన్నారు. ఈ ఆలయంలో పావన వినాయకుని గుడి కూడా వుంది. శ్రీకృష్ణదేవరాయలు వేసవిలో చల్లదనం కోసం ఈ దీవులకు వచ్చేవారని ఇక్కడివారంటారు. ఇక్కడి దగ్గర్లో ‘రాయదొరువు’ అనే గ్రామం వుంది. ఇక్కడ నివసించే పాకనాటి రెడ్లు మాట్లాడే తెలుగు రాయలసీమ మాండలికమే. ఒకప్పుడు రాయల వారికి తాము సామంతులమని వారు చెప్తుంటారు. ఇంతటి ప్రాశస్త్యం గల గ్రామానికి ఇప్పటికీ సరయిన దారి లేదు. సూళ్ళూరుపేట నుండి శ్రీహరికోటకు వెళ్ళేదారిలో అటకాని తిప్ప వద్ద దిగి ఉప్పు కయ్యల్లో, నీళ్ళలో, బండ్ల మీద కాని, ట్రాక్టర్ల మీద గాని పంట్రంగం చేరవచ్చు. మల్లాం నుండి ఆటోలు వెళుతుంటాయి. వెయ్యి ఎకరాల మాన్యం గల ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోలేక పోవడం ఆవేదన కల్గిస్తుంది. డాక్టర్‌ ‌గంగిశెట్టి శివకుమార్‌, ‌బాలసాహితీవేత్త మరియు పున్నమి దినపత్రిక గౌరవ సంపాదకులు. సెల్‌ : 9441895343

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

అద్దాలమేడ

(బాలపున్నమి) శీనయ్య కష్టజీవి పొద్దస్త మానం పనిచేసి చేతికి వచ్చిన డబ్బులలో మూడొంతులు త్రాగి ఒక వంతు ఇంట్లో ఇచ్చే వాడు. పాపం భార్య సుమతి చాలీచాలని డబ్బుతో ఇల్లు గడపలేక పిల్లలకు సరియైన బట్టలు కుట్టించ లేక, మంచి ఆహరం పెట్టలేక చదువులు చెప్పించ లేక సతమతమౌ తుండేది. అనేక విధాల ఆమె భర్తకు చెప్పిచెప్పి అలసి పోయింది. వారు పడే ఇబ్బందులు గమనించి చుట్టు ప్రక్కలవారు అతనిని, సన్మార్గాన పెట్టాలని విశ్వ ప్రయత్నం చేసి విసిగి వేసారి పోయారు. సంసా రంలో సుఖాలు చిమ్మే పన్నీరు వదలి వళ్ళుమరిచి అనారోగ్యానికిలోనయ్యే బురదలో వరాహం పొర్లాడుతానంటే ఎవరు కాదనగలరు? ఎంత మంది ఎన్ని రకాలుగా పోరాడినా అతనిలో మార్పు కనిపించక సంసారం గుడ్డెద్దు బండి లాగి నట్టుగా తయారైంది ఒకరోజు అతని ఇంటి ముందుకు ఒక సాధువు బిక్షకు వచ్చాడు ఆయన ప్రత్యేకత ఏమిటంటే మనం దోసిట నిండా బియ్యం తీసుకుపోయినా రెండేళ్ళతో వచ్చినన్ని బియ్యం తీసుకుని నవ్వుతూ దీవించి వెళ్ళిపోతాడు. అలాగే సుమతి తెచ్చిన బియ్యాన్ని తీసుకుని శీనయ్యను ఆయన సంసారాన్ని పరిశీలనగా చూసి ‘‘అయ్యా! తమరు తొందరలో అద్దాలమేడ కడ తారు. ఈ మాటలు నావి కావు అమ్మవారు నానోట పలికిస్తుంది అని శీనయ్యకు చెప్పి తన దారిన వెళ్ళి పోయాడు సాధువు. మద్యాన్నం తింటే మాపిటకు ఎలా చేద్దామా అనే దశలో మేముంటే, అద్దాల మేడ కడతామంట ఇలాంటి పిచ్చోళ్ళు వుండ బట్టే మన దేశం ఇలా తగలెడెతోంది అని తనలో తాను నవ్వుకున్నాడు శీనయ్య. సాధువు మాటలు విన్న సుమతి ఒక కాగితంపై త్వరలో అద్దాల మేడ కడతాము అని వ్రాసి గొడకు అతికించింది. రోజు ఆ అక్షరాలను చదువుతున్నాడు మన శీనయ్య తినగ తినగ వేము తియ్య నైనట్టుగా మరల మరల నెమరు వేసు కోవ టంతో సాధువు మాటలు మనసులో నాటుకు పోయాయి శీనయ్యకు ‘‘ఏమి వ్యాపా రం చేయాలన్నా మనకు పెట్టుబడి ఎవడి స్తాడు? అన్నాడు ఒకరోజు సుమతితో తలగీరు కుంటూ శీనయ్య. శీనయ్య త్రాగి గుట్టవేసిన శీసాలను అమ్మి కొంత డబ్బు ఇచ్చింది సుమతి. ఆ డబ్బుతో ఎర్రగడ్డల వ్యాపారం పెట్టాడు. అందులో వచ్చిన డబ్బుతో బొరుగుల మిక్చరు బండి వేశాడు. అలా అలా నాలుగు రకాలు కనపడటంతో త్రాగుడు పూర్తిగా మాని వేశాడు. ఇదే సమయమని భర్త తెచ్చిన డబ్బును జాగ్రత్తగా దాచింది సుమతి. మనిషి తలచుకుంటే చేయలేనిదేదీ వుండ దని ఉడుంపట్టు పట్టాడు శీనయ్య. చాలా డబ్బు పోగేశారు కూడా. కొద్దికాలం తర్వాత మేడకు పునాదులు త్రవ్వి అనతికాలంలోనే అద్దాలమేడ నిర్మించి అన్నంత పని చేసి చూపించారు. బంధువు లందరినీ పిలిచి గర్వంగా గృహప్రవేశం చేశారు. వారు పిల్లాపాపలు ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు సాధువు వచ్చాడు. శీనయ్య ఇల్లును చూచి ముక్కున వేలుంచుకున్నాడు. అంతలో దంపతులు ఆయన కాళ్ళపై బడి నమస్కరించి తమ దయవల్ల, అమ్మ ఆశ్వీర్వాదం వల్ల అద్దాల మేడను కట్టుకున్నాము. ఏమిచ్చి మీరుణం తీర్చు కోగలము? అన్నారు. సాధువు ముసిముసిగా నవ్వుతూ ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అంతా నీ భార్య గొప్పతనమే. ఒక రోజు నాదగ్గరకు వచ్చి నీ సంగతంతా చెప్పి ఏడ్చింది. మార్పురావాలని నీలో ప్రేరణ కలగాలని, చూచాయగా అలా అన్నాను. అది మనసులో వుంచుకుని నిజంగానే అద్దాల మేడను నిర్మించుకున్నావు. క్రమశిక్షణ, పట్టుదల అలవరుచుకుంటే ఎంతటి కార్యమైన అవలీలగా సాధించవచ్చు అని నిరూపించావు. నీ సంసారం సుఖంగా వుంది. అంతకు మించి నాకేం కావాలి. నిన్నుచూచి నీలో వచ్చిన మార్పు ను గమనించి మిగిలిన త్రాగు బోతులు మారితే, మన సమాజమే నందనవనమౌతుంది. మంచి మానవత్వం అను పూలుపూచి ప్రేమ దయ, కరుణ అనే సువాసనలు ఇచ్చిన వాడు నాకు నిజమైన ఆనందం కలుగుతుంది, అంటూ నాలు గు గింజలు తీసుకుని తన దారిన వెళ్ళి పోయాడు సాధువు. కృతజ్ఞతతో సాధువు నడచి పోయిన పాద ముద్రలకు నమస్కరించారు దంపతులు.   జంజం కోదండరామయ్య, జమ్మిపాళెము

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

సహజ సామర్ధ్యం

గొప్ప గొప్ప సాఫ్ట్‌వేర్‌ ‌నిపుణులు, మామూలు ఉద్యోగులకంటే ఏ 10 రెట్లో, 100 రెట్లో కాదు… ఏకంగా 10,000 రెట్లు ఎక్కువ ఉత్పాదకత కలిగిన వారు అంటారు నాధన్‌ ‌మైరో వోల్ట్ , ‌మాజీ మైక్రోసాప్ట్ ‌ముఖ్య శాస్త్రవేత్త.మనలను ఒక రంగంలో జీనియస్‌గా ఉధ్భవింపచేసే ఒక అరుదైన ప్రతిభ ‘ఆపన’ అనే రూపంలో నిగూఢంగా మనందరిలో నిర్రావస్థలో ఉంటుంది.అది చేయడాన్ని మీరు ప్రేమిస్తారు.ఆ పనిని అలవోకగా చేస్తారు.అది తప్ప ఇంకే పని చేయడమైనా మీకు కష్టంగా ఉంటుంది.ఆ ప్రవృత్తినే, మీ వృత్తిగా మలచుకొంటే మీరు ఆనందాన్ని పొందుతూ డబ్బు సంపాదిస్తారు.మనలో ఉన్న టాలెంట్‌ను గుర్తించడం, అది ఇతరులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకోవడం, అదే ఒక జీవిత లక్ష్యంగా మలచుకోవడం – ప్రశాంతత, సంపద రెండూ పొందే సులభ మార్గం. ఒకప్పుడు మనిషి వేటకెళ్ళి బ్రతుకుతెరువు సాగించే వాడు. నాగరికత పెరిగిన తరువాత. కర్మాగారాలు పెట్టి యంత్రాలతో ఉత్పత్తి చేసి జీవించాడు.గత రెండు దశాబ్దాలనుండి సమాచార విప్లవంతో వచ్చిన మార్పుల వల్ల , ఇన్‌ ‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ సాయంతో ప్రగతి సాధించాడు.కానీ భవిష్యత్‌లో మేధస్సులే కాక కళాత్మక హృదయం, సృజనాత్మకత, మానవత్వంతో కూడిన నాయకత్వం ఉన్నవారే ఏ రంగంలో అయినా నాయకులుగా ఎదిగే అవకాశముంది.మీరింత గొప్ప జీనియస్‌ ఎలా అయ్యారు అని ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్‌ అనే శాస్త్రవేత్తను అడిగినప్పుడు. ఆయన ఇలా సమాధానం చెప్పారు.‘‘ నేను జీనియస్‌ ‌కాదు కానీ క్యూరియస్‌ అం‌టే కుతూహలంకలవాడిని అలా జీనియస్‌గా రూపొందాను.మీకు ఏరంగంలో అటువంటి క్యూరియాసిటీ ఉందో, ఏ రంగంలో అయితే మీరు పూర్తిగా మమేకమైపోయి కృషి చేయగలరా ఆ రంగాన్ని గుర్తించాలి. ఉన్న సహజ ప్రతిభ మనం ఆయా పనులకు ఎక్స్‌పోజ్‌ అయినప్పుడు బయటపడుతుంది.ఉదాహరణకు, సానియా మీర్జా గారిని 7 సం।।ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి తనతో పాటు టెన్నిస్‌ ఆడడానికి తీసుకువెళ్ళడట అక్కడ ఒక ఆటగాడు రాకపోయేసరికి ఈ అమ్మాయికి ఆడే అవకాశం వచ్చిందట. ఆ అమ్మాయిలో ఉన్న సహజ ప్రతిభను అక్కడ ఉన్నవారు గుర్తించడం జరిగింది.ఆ అమ్మాయి ఛాంపియన్‌ ‌కావడానికి ఆ తండ్రి అండగా నిలవడంతో ఆ అమ్మాయి తారాపథాన్ని చేరుకోకలిగింది. అలా మనం కూడా ఒక తారాపథాన్ని చేరుకోగల అవకాశం ఒక అరుదైన ప్రతిభ రూపంలో ప్రతి ఒక్కరిలో వేచి చూస్తూ ఉంటుంది.అది బయట వెతికితే దొరకని గని, ఆయిల్‌ ‌కావాలంటే, డ్రిల్‌ ‌చేయాలి. భూ గర్భాల్లో , సముద్ర గర్భాల్లో ఎడారులలో ఎక్కడైన దొరకవచ్చు. కానీ మానవ ప్రతిభ కళాశాలల్లో యూనివర్సిటీలలో దొరకని గని భగవంతుడు ఆ గనిని మానవ హృదయాంతరాలలో నిక్షిప్తం చేసాడు.కానీ మనిషి అన్ని చోట్లకీ పయనిస్తాడు తన అంతరంగంలోకి తప్ప మనందరిలోనూ చాలా టాలెంట్స్ ఉం‌టాయి. కానీ ఒక అసమాన ప్రతిభ , ప్రపంచం ఎదురుచూపే ఒక ప్రత్యేక ప్రతిభ, మీకు సంపదనిచ్చి, ఎల్లకాలం మీకు గౌరవాన్నిచ్చే ప్రతిభ ఒకటి ఉంటుంది. ఆ పని చేయమని మీ మనసు ఎప్పుడూ కోరుతుంటుంది. మన మందరం కావాల నుకుంటే మనం ఊహించలేని మరొక అద్భాత సౌందర్య స్థాయిలో జీవించవచ్చు. అది మన సహజ సిర్ధమైన జీవితం. చిన్న పిల్లలలగా లీనమై ఉండే స్థితి. ఆ స్థితే సత్యమైనది, స్వచ్ఛమైనది. నేనవరు ? అనేదాని మొక్క సంపూర్ణ సారం దానినే యధార్ధమైన స్వీయతత్త్వం ( అధ్లెంటిక్స్ ‌సెల్ఫ్) ‌గా పిలుస్తారు. మీ అంతరంగ లోతుల్లో మాత్రమ కనుగొనబడే మీరైన తత్త్వం అది.మీ వృత్తి , పాత్రను బట్టి నిర్వచింపబడని మీలో భాగం మీ నైపుణ్యాలు, టాలెంట్స్, ‌జ్ఞానం అన్నింటి యొక్క సమాహార రూపం అది. మీరైన సమస్తవలా అదే ! అది వ్యక్తీకరింపబడవలసి, బయటకు వెల్లువై రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బద్దిపూడి శీనయ్య, నెల్లూరు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.