ఆలమూరు జనవరి 31 (పున్నమి విలేఖరి): పోలియో మహమ్మారిని పార దోలేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని పెద్దపల్ల, చొప్పెల్ల పీహెచ్సీ వైద్యులు ఆర్ సుదర్శన్ బాబు, ఎం సుమలత పేర్కొన్నారు. ఆలమూరు మండలం గ్రామ పంచాయతీల పరిధిలో చిన్నారులకు పోలియో చుక్కల కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు రెండు చుక్కలు వేయిస్తే పోలియో మహమ్మారి దరి చేరదని, ప్రభుత్వం ప్రతి సంవత్సరమూ జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయిస్తుంది. ప్రభుత్వం వేసే పోలియో చుక్కలే కాకుండా తల్లిదండ్రులు తమ వీలును బట్టి పోలియో చుక్కలు సమీప ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వేయించాలన్నారు. దగ్గు, జ్వరం, జలుబు, విరేచనాలు, ఏ ఇతర జబ్బులు వచ్చినా పోలియో చుక్కలు తప్పని సరిగా వేయించాలని తెలియజేశారు. 19వ శతాబ్దంలో మొదటి సారిగా పోలియో వ్యాధిన పడ్డ చిన్నారులను వైద్యులు గుర్తించి ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందనారు. ఈ వ్యాధి సొకితే చిన్నారుల కాళ్లు, చేతులపై ప్రభావం చూపి అవి పనిచేయకుండా పోతాయని, ఈ వ్యాధి వైరస్ టైప్-1, టైప్-2, టైప్-3 వల్ల వస్తుంది. ఈ వైరస్ చిన్నారుల శరీరంలో ఉండి పోలియో వ్యాధి రావడానికి కారణమవుతుందని, పోలియో చుక్కలు సంవత్సరంలో రెండు సార్లు వేయించాలని. ఈ చుక్కలు పోలియో వైరస్ మీద సైనికుల్లా పోరాటం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో జాతిపిత “మహాత్మాగాంధీ” వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి..పూలమాలవేసి రెక్టర్ ఆచార్య. ఎం చంద్రయ్య గారు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ క్రిష్ణ రెడ్డి గారు, నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ..అందరూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు,రిజిస్ట్రార్ ఎల్ విజయక్రిష్ణ రెడ్డి గారు,కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. సుజ ఎస్ నాయర్ గారు, మరియు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి గారు అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజాయ్ గారు, పి ఆర్ ఓ నీలమణీ కంట గారు, మరియు బోధ, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు._
బుచ్చిరెడ్డిపాలెము మండలం జొన్నవాడ రైతు బరోసా కేంద్రం ద్వారా పెనుబల్లి గ్రామీణ పశువైద్య అధికారి ఆర్ శ్రీనివాసులుచే ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమములో డాక్టర్ మురళికృష్ణ సహాయ సంచాలకులు బుచ్చిరెడ్డిపాలెం వారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వపాడి పథకాలు గురించి రైతుల కు అవగాహన కల్పించారు ముఖ్యంగా ఏడాదికి దూడ మరియు పాడి పశువులకు అధిక పాలదిగుబడికి మిశ్రమ లవణం యొక్క ఆవస్యకత తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పశువులకు చూడు నిర్దారణ పరీక్షలు నిర్వహించి గర్ణకోశవ్యా ధులు ఉన్న పశువులకు వైద్యం చేయడం జరిగింది దాదాపు 140 పశువులకు వైద్య సేవలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ మురళీకృష్ణ గారు రేబాల పశు వైద్య అధికారి డాక్టర్ జె. సురేష్ బాబు మరియు దామరమడుగు పశువైద్య అధికారి డాక్టర్ కె శివతేజరెడ్డి, పెనుబల్లి గ్రామీణ పశువైద్య అధికారి ఆర్ శ్రీనివాసులు, పశుసంవర్ధక సహాయకులు సునీల్, మనోహర్, విస్కా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ హెర్బ్స్ మరియు స్కైఏక్ కంపెనీవారు మందులను వితరణ చేశారు
నాయకులు, కార్యకర్తలతో నేడు కాకాని సమావేశం వెంకటాచలం జనవరి 30 పున్నమి విలేకరి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఆదివారం వెంకటాచలం రానున్నారు. మండల కేంద్రంలోని వైసిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా నేడు జరిగే ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకోనుంది.
*క్రమశిక్షణ తో ఉన్నత శిఖరాలను చేరుకొవొచ్చు* ఆలమూరు జనవరి 30 (పున్నమి విలేఖరి):కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో ఈ రోజు ప్రభుత్వ పాఠశాల లో ఎన్ సీసీ విద్యార్థులను అభినందించి వారికి ఎన్ సీసీ ‘ఏ’ సర్టిఫికెట్ లు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఎన్. రాజు , ఏ ఎన్ ఒ పి.వెంకటరావు మరియు నావెల్ ఎన్ సీసీ యూనిట్ నుండి వచ్చిన పి. ఐ స్టాఫ్ పి.వెంకటరావు ఠాకూర్,ఉఫాధ్యాయులు,ఎమ్. శ్రీనివాసరావు , వి.శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…
కొత్తపేట జనవరి 30 (పున్నమి విలేఖరి): తూర్పుగోదావరిజిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆవిడి గ్రామ పంచాయతీ పరిధిలోని డాం సెంటర్ వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న అవిడి గ్రామానికి చెందిన చప్పిడి గోపి వయస్సు సుమారు 50 సంవత్సరాలు వెనుక నుండి వస్తున్న ట్రాక్టర్ (ఏపీ 05 డి ఎం1306) నెంబరు గల వాహనము ఢీ కొనడంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి మృతి చెందడం జరిగింది. పోలీసు వారు కేసు దర్యాప్తు చేసి అంబులెన్స్ సహాయంతో ఆ మృతదేహాన్ని పోస్టు మార్టన్ నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
వివాహేతర సంబంధం వీడలేకే బలవన్మరణం నెల్లూరు జనవరి (పున్నమి- విలేఖరి ): వివాహేతర సంబంధం పెళ్ళైనఇద్దరు దంపతుల బలవన్మరణానికి దారి తీసింది.ఇద్దరు సచివాలయ ఉద్యోగుల ప్రాణాలు గాలిలోకలిశాయి..రెండుకుటుంబాల్లో విషాదాన్ని నింపింది..ప్రభుత్వ ఉద్యోగంలోఉంటూ ఉన్నతస్థితికి ఎదగాల్సిన వారిజీవితాలు విషాదంతోముగిశాయి…వివాహేతరబంధాలు ఎలాంటి పరిణామాలు..ఎంతటి దారుణదారుణానికి దారి తీస్తుందో ఇవాళ నెల్లూరు జిల్లాలోజరిగిన ఘటన ప్రత్యక్షతార్కాణంగా ఉంది.. నెల్లూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర బంధం వీడమన్నందుకు…జీర్ణించుకోలేని ఆజంట ప్రాణాలు తీసుకుంది.. పెళ్ళై భార్యా, భర్తలు ఉన్న వారు తాము విడిపోము… మమ్మల్ని క్షమించండి ..అంటూ ఓలేఖరాసి..బలవన్మరానికి పాల్పడ్డారు. ప్రేమించుకున్నట్లు చెబుతున్న ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు నగర శివారులోని ఓ నందా ఓయో లాడ్జిలో ఈ దుర్ఘటన జరిగింది. ఓకే చున్నికీ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. నెల్లూరు నగర శివారులోని ఓ లాడ్జిలో సచివాలయ ఉద్యోగులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది..నెల్లూరు రూరల్ మండలానికి చెందిన హరీష్, చిట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అదే సచివాలంలో నాయుడుపేటకు చెందిన లావణ్య వీఆర్వో గా పని చేస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం విధులకు హాజరుకాలేదు. వివాహితులైన వీరిద్దరూ కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కలిగిఉన్నారు..ఈవిషయం కుటుంబ సభ్యులకు తెలిసింది.. వారు ఇద్దరినీ మందలించారు. అయినా వారిలో మార్పు రాకపోగా.. వీళ్ళిద్దరూ అనధికారికంగా వివాహం చేసుకున్నారు.ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు నగర శివారు ప్రాంతమైన పడారుపల్లి సమీపంలోని నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు వెళ్తున్నాం.. అన్న హరీష్,లావణ్య ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత అర్ధరాత్రి దాటాక ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు ముందు హరీష్ రావ్ అన్న రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పని చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి.. అంటూ రెండు లైన్లలో ఆ లేఖను ముగించారు…బలవన్మరణానికి పాల్పడిన హరీష్, లావణ్య లు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లావణ్యకు గతంలో సైదాపురం మండలం లోని సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి వివాహం కాగా.. హరీష్ కు తమ సమీప బంధువుల అమ్మాయితో వివాహమైనట్లు పోలీసులు తెలిపారు. వివాహేతరబంధం వీడలేక వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రాన గాంధీ స్మారక నిధి వారి నేతృత్వంలో నిర్వహించిన గాంధీవర్ధంతి సభలో రాజాం రచయితల వేదిక సభ్యులు కుదమ తిరుమలరావుకు సత్కారం జరిగింది. గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం శాంతినికేతన్ లో గాంధీ స్మారకనిధి అధ్యక్షులు సురంగి మోహనరావు అధ్యక్షతన జరిగిన ‘గాంధేయం- భారతీయ జీవనవేదం’ అను పుస్తకాన్ని రాష్ట్ర కవిటీ సభ్యులు, జిల్లా కన్వీనర్ మేడూరి ప్రసాదరావు, కార్యనిర్వాహక సభ్యులు ఎం వి ఎస్ ఎస్ శాస్త్రి ఆవిష్కరించీ, అనంతపురం తిరుమలరావును సత్కరించారు. తిరుమలరావు రచించిన ‘సమతాదీప్తి – శాంతికి స్ఫూర్తి’ అను కవిత ఎంపికై, ఈ పుస్తకంలో స్థానం పొందింది. ఈ సందర్భంగా తిరుమలరావు గాంధీపుట్టినదేశం గీతాన్ని, వేదికపై వినిపించీ సభికుల ప్రశంసలు పొందారు. గాంధీ స్మారకనిధి సభ్యులు బి లక్ష్మణరావు, జామి భీమశంకర్, గాంధేయవాది బరాటం కామేశ్వరరావు, సాహితీవేత్తలు పులఖండం శ్రీనివాసరావు, పివిఎస్ రామమోహన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పి.రామమోహనరావు, తెలుగు రచయితల వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉత్తరావిల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకట రమణమూర్తి, తెరవే సభ్యులు వావిలపల్లి రాజారావు, ఐ ఎన్ డి ప్రసాదరావు, మంగిపూడి శ్రీనివాసరావు తదితరులు తిరుమలరావును సత్కరించారు. అహింసనే పవిత్రతను లోకానికి అందించి, శతాబ్ధి వ్యక్తిగా నిలిచి, పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసమే స్వాతంత్ర్యమని పిలుపునిచ్చి, భారతదేశానికి జాతిపితగా, సమతాదీప్తిగా, శాంతికి స్ఫూర్తిగా మహాత్ముడైనారని తిరుమలరావు తన రచనలో గాంధీజీ గూర్చి పలు భావాలను వెలిబుచ్చిరి. గాంధేయం- భారతీయ జీవనవేదం పుస్తకంలో తిరుమలరావు కవిత చోటు దక్కించుకొని, గాంధీ స్మారక నిధి వారిచే సత్కారాన్ని పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
ఈరోజు నెల్లూరు ITDA (YANADIS) కార్యాలయం ప్రాంగణంలో ఎప్పటినుండో పేరుకుపోయిన చెత్త మరియు అపరిశుభ్రంగా వున్న కలుపు పిచ్చి మొక్కలను ఉదయం 7.00 గంటల నుండి 10.30 వరకు శుభ్రం చేయడం జరిగింది. పలుగు,పారా పట్టీ వ్యవసాయ కూలి గా మారిన ప్రాజెక్టు అదికారి C.A మణికుమార్ గారు, తాము పనిచేస్తు సిబ్బంది లో స్పూర్తి నింపిన ITDA development officer వై. రోశిరెడ్డి గారు మరియు APO (monitoring and evaluation) పులి చెంచయ్య.మేము సైతం అంటు ముందు కొచ్చి శ్రమించిన మహిళ అధికారులు APO (lands ) రాజ్యలక్షి, APO ( agriculture) అనురాధ ,APO (horticulture) L. శ్రీనివాసులు మేనేజర్ కోటేశ్వరరావు , సూపండేంట్ నవీన్ ,FO రమేష్ గారు పర్యవేక్షించడం జరిగింది.