Sunday, 12 July 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ముగిసిన డీఎస్సీ క్రీడా కోటా ధ్రువపత్రాల పరిశీలన..

ముగిసిన డీఎస్సీ క్రీడా కోటా ధ్రువపత్రాల పరిశీలన..* విజయవాడ క్రీడలు మెగా డీఎస్సీకి క్రీడా కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన విజయవాడలోని ఇందిరా గాంధీ నగరపాలక సంస్థ (ఐజీఎంసీ) స్టేడియంలో ముగిసింది. ఈ ప్రక్రియ శని, ఆదివారాల్లో సాగింది. 421 పోస్టులకు గాను 1,221 మంది అభ్యర్థులను పిలవగా.. 1,172 మంది హాజరయ్యారని శాప్ పరిపాలనాధికారి ఆర్.వెంకట రమణ నాయక్ తెలిపారు. మరో రెండు రోజుల్లో టెంటేటివ్ జాబితాను ఆన్ లైన్ లో పెడతామన్నారు. దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

ఖమ్మం

10 న శ్రీమతి జెన్నా రెడ్డి విజయరెడ్డి దశదిన కార్యక్రమం

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రం వంగాముత్యాల బంజర్ లో ఉన్న రాజా సాయి మందిర చైర్మన్ శ్రీమతి జెన్నా రెడ్డి విజయ రెడ్డి గారు గత గురువారం గుండెపోటు తో మరణించారు. ప్రముఖ సాయి భక్తురాలు, నిస్వార్ధ సేవకురాలు, ఎంతో మంది పేద ప్రజలకి నిస్వార్థం గా సేవచేశారూ. వారి యొక్క దశదిన కర్మ కార్యక్రమం 10 వతేది న సప్త పది ఫంక్సన్ హాల్ నందు జరుగుతుంది అని అమే భర్త రిటైరడ్ సీఐ జెన్నారెడ్డి నర్సింహా రెడ్డి తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

వైసీపీ నాయకులకు కూటమి నాయకులు సవాల్

బహిరంగ చర్చలకు మేము సిద్ధం…!! మీరు సిద్ధమా..?? అసత్య ప్రచారాలు నమ్మే యోచనలో ప్రజలు లేరు మీ అసలు రూపం తెలిసి 11 సీట్లు ఇచ్చారు ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ము ఎంతో ఆధారాలతో ఉన్నాయి కోనసీమ,ఆగస్టు04,పున్నమి న్యూస్,రిపోర్టర్ కిరణ్:డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో టీడీపీ కార్యాలయం దగ్గర టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే యోచనలో లేరన్నారు.మాజీ ఎమ్మెల్యే మీ నాయకుడు జగ్గిరెడ్డి దళితుల పై పెట్టిన అక్రమ కేసులు దళితుల భూములు లాక్కొని చేసిన అగైత్యాలు మర్చిపోయి ఈరోజు సిగ్గులేకుండా వైసీపీ నాయకులు ఎలా తిరుగుతున్నారో వారి విజ్ఞతకే ఉదిలేస్తున్నామన్నారు.కొన్ని రోజుల క్రితం ఆత్రేయపురం లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నాయకులు మాట్లాడిన అసత్య మాటలకు మేము నిజాలను నిరూపించాల్సిన అవసరం లేదని నిజానిజాలు ప్రజలు చూస్తున్నారన్నారు.మీకు ఏదైనా ఉంటే దైర్యం ఉంటే బహిరంగ చర్చలకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.ముదునూరి వెంకట రాజు గబ్బర్ సింగ్ ఎదుగుదలను చూడలేక ఓర్వలేక ఆయనపై చేస్తున్న అస్త్యప్రచారాలు మానుకోవడం మంచిదన్నారు.శాసనసభ్యులు బండారు సత్యానంద రావు ప్రజలకు ఏమి చేశారో అందరికీ తెలుసు మీకు తెలియక్కర్లేదన్నారు.మద్యం కోసం మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఎంత ఇచ్చారో మీ జేబు లలో ఎంత వేసుకున్నారో చిట్ట మొత్తం మా దగ్గర ఉంది అలాగే మట్టి ఇసుక మాఫియా అంటున్నారు 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వం హయంలో ఎక్కడ ఎక్కడ కొల్లగొట్టి నది పాయలను అడ్డంగా చీల్చి బకాసురుడువలే మేసిన రోజులు మర్చిపోయి నేడు ప్రజలకు అందుబాటు ధరలో తెచ్చిన మా నాయకులను విమర్శించే స్థాయి మీకు లేదన్నారు.అప్పటి ధరలకు ఇప్పటి ధరలకు తేడాలను ప్రజలే చూస్తూ ఉన్నారు మీరు నీతి నిజాయతీ అని హాస్యాస్పద మాటలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవ చేశారు.మీ నాయకుడు అమాయకపు దళిత యువకులపై అక్రమ కేసులు పెట్టీ ఏ పని చేసుకోకుండా చేసినప్పుడు అలాగే దళితుల భూములు లాక్కొని వారిని హింసించినప్పుడు నోరు మెదపని నాయకులు నేడు మీడియా సమావేశాలు పెట్టడం ఏమిటో వారి విజ్ఞతకే ఉదిలేస్తున్నామన్నారు.వికలాంగుల పెన్షన్ లు ఇప్పిస్తామని సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తామని వెల్లకి వేలు దోచేసిన సొమ్ము ఎవరెవరు పంచుకున్నారో పద్దులు మొత్తం మా దగ్గర ఉన్నాయి అలాగే పని పథకంలో ఎంత దోసుకున్నారో కూడా ఉందన్నారు.ఈరోజు అయిన సరే బహిరంగ చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము స్థలం చెప్పండి మేమే వస్తాము అని ప్రతిపక్ష నాయకులకు సవాళ్లు విసిరారు.ఈ కార్యక్రమంలో పాలంగి రవి చంద్ర ,కుసంపూడి రామరాజు ,తోట వెంకట రమణ,గుడెల నాగేంద్ర,మిద్దె గోపాలకృష్ణ,నాగిరెడ్డి సత్యనారాయణ,అంబుల రామకృష్ణ,జోగి ప్రసాద్,మిద్దె పాపారావు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

అనారోగ్యాలతో ప్రజలు.కాలుష్యం కోరల్లో కొత్తకండ్రిగ గ్రామం

ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయతీ పరిధిలో ఉన్న పుష్పత్ కర్మగారం నందు విపరీతమైన కాలుష్యంఫ్యాక్టరీ నుంచి వదిలి వేస్తున్నారు. ఈ కాలుష్య కోరల్లో కొత్త కండ్రిక గ్రామం అలాగే చుట్టు పక్కల చాలా గ్రామాలు పుష్పత్ కర్మాగారం నుంచి వెలువడే దుమ్ముతో కూడినటువంటి పొగతో గ్రామంలోని ఇళ్ళ మొత్తం నిండిపోతుంది. పైగా దీనివలన లో త్రాగునీరు కలుషితం అయ్యి దాని వలన అనేక రకాల తెలియని అనారోగ్య సమస్యలను గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇది ఇలాగే ఉంటే అంతుచిక్కని రోగాలతో ప్రాణం నష్టం కలిగే అవకాశం ఉందని ఇప్పటికైనా సంబంధించిన అధికారులు, నాయకులు స్పందించి సంబంధిత కర్మకారాన్ని పై కాలుష్యాన్ని నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల వారు కోరుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమిరెడ్డి చొరవతో కండలేరు ఎడమ కాలువకు జలకళ

*సోమిరెడ్డి చొరవతో… కండలేరు ఎడమ కాలువకు జలకళ..* *-స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన టిడిపి నాయకులు…* *-సోమిరెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసిన రైతులు..* *పొదలకూరు:* కండలేరు జలాశయంలో నీటిమట్టం తగ్గిపోవడంతో ఎడమ కాలువలో గత కొద కొద్ది రోజులుగా నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో ఎడమ గట్టు కాలువ క్రింద సాగులో ఉన్న వరిపైర్లు, నిమ్మతోటలతో పాటు పశువులకు తాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పొదలకూరు మండల టీడీపీ నాయకులు ద్వారా రైతులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది దృష్టికి తీసుకెళ్లారు. ఎడమ కాలువ లిఫ్ట్ లో విద్యుత్ సరఫరాను అందించే ట్రాన్స్ ఫార్మర్ పిడుగుపాటుకు గురవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యను ఇటీవల డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో కలెక్టర్ ఆనంద్ స్పందించి నిధులు మంజూరు చేశారు. దీంతో సోమిరెడ్డి ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడంతో పాటు మోటార్లకు సర్వీస్ చేయడం తోపాటు ఆదివారం మండల టీడీపీ నాయకులతో కలిసి అధికారులు ఎడమ కాలువకు లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో ఎడమ కాలువకు నీరు విడుదల చేయించి పంటలు కాపాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఈ ప్రాంత రైతులు ధన్యవాదములు తెలిపారు. నీరు విడుదల చేసిన వారిలో ఇరిగేషన్ అధికారుల తోపాటు టీడీపీ పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జునాయుడు, నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, దేవినేని శరత్, పులిపాటి వెంకటేశ్వర్లు, ఎత్తపు వెంకట రెడ్డి, వెన్నపూస శ్రీనివాస్ రెడ్డి, మలిరెడ్డి ఓబుల రెడ్డి, రమణా రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

నాయుడుపేట మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిషోర్ యాదవ్ నూతన గృహ ప్రవేశ పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిలీవేటి సంజీవయ్య

నాయుడుపేట మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓటూరు కిషోర్ యాదవ్, నాయుడుపేట మాజీ ఏఎంసి చైర్మన్ ఓటూరు రాధా కిషోర్ యాదవ్ గార్ల నూతన గృహప్రవేశ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య గారు కిలివేటి సంజీవయ్య గారి వెంట టీఎంఆర్ గ్రూప్ అధినేత తంబిరెడ్డి మోహన్ రెడ్డి గారు, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓజిలి మండల అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెట్టి వేణు యాదవ్ గారు , చిలకా యుగంధర్ గారు తదితరులు ఉన్నారు…….

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లాకె గర్వకారణం – బొమ్మాలి కాగేశ్వరరావు రెండు గోల్డ్ మెడల్స్ విజయం

శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట:స్థానిక గవర్నమెంట్ హైస్కూల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాసన స్పోర్ట్స్ పోటీల్లో బొమ్మాలి కాగేశ్వరరావు అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గొప్ప విజయాన్ని సాధించారు. 45-55 సంవత్సరాల వయోపరిమితిలో బ్యాంక్ బెండ్ మరియు హ్యాండ్ బ్యాలెన్స్ విభాగాల్లో ఆయన రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు.బొమ్మాలి కాగేశ్వరరావు సాధారణ కుటుంబంలో పుట్టి, భారత ఆర్మీలో సేవలందిస్తూ అనేక దేశాల్లో పర్యటించారు. ప్రస్తుతం నరసన్నపేటలో కులమతాలకు అతీతంగా, పేద–ధనిక భేదం లేకుండా, విద్యార్థులకు మరియు యువతకు ఉచితంగా ఫిట్‌నెస్ శిక్షణ అందిస్తున్నారు.ప్రత్యేకంగా పంజాబ్‌కు చెందిన ఘట్కా అనే సంప్రదాయ ఆటకు ఆయన డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 18 సంవత్సరాల పైబడిన విద్యార్థులకు ఎలాంటి పారితోషికం లేకుండా ఉచితంగా శిక్షణ ఇచ్చి వారి జీవితాలను వెలుగులోకి తీసుకువచ్చే మహనీయునిగా ఆయన నిలుస్తున్నారు.ఈ సేవా కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి సురపు సురేష్ కూడా కాగేశ్వరరావుకు తోడుగా సేవలందిస్తున్నారు. ఈ ఇద్దరి సేవలు శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నాయి.ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలను సన్మానించేందుకు నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సమన్వయకర్త బగ్గు అర్చన, పలువురు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు.

హైదరాబాద్

శేరిలింగంపల్లి

జాతీయ రెజ్లింగ్ పోటీలో హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన బాల నటుడు (పుష్ప రాజ్ )దృవన్ సత్య వర్మ ను సన్మానించిన శేరిలింగంపల్లి గౌరవ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ గారు చత్తిస్ ఘడ్ లో నిర్వహించిన అండర్ 11 పోటీల్లో రాణించి రెండు బంగారు పథకాలను అందుకున్నారు ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ మరియు రాజమోహన్ రావు రమేష్ యాదవ్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్

శేరిలింగంపల్లి

జాతీయ రెజ్లింగ్ పోటీలో హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన బాల నటుడు (పుష్ప రాజ్ )దృవన్ సత్య వర్మ ను సన్మానించిన శేరిలింగంపల్లి గౌరవ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ గారు చత్తిస్ ఘడ్ లో నిర్వహించిన అండర్ 11 పోటీల్లో రాణించి రెండు బంగారు పథకాలను అందుకున్నారు ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ మరియు రాజమోహన్ రావు రమేష్ యాదవ్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి

గోపాలమిత్రకు ఆర్థిక సాయం

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( TSLDA)లో పనిచేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలం, బొందుగుల గ్రామానికి చెందిన అమరాజు.పరుషరాములు (గోపాలమిత్ర) వయస్సు 50 సంవత్సరాలు.జూలై 28 సోమవారం రోజున అనారోగ్యంతో చనిపోయాడు.యాదాద్రి భువనగిరి జిల్లాలో పని చేస్తున్న 63 మంది గోపాల మిత్రులు,5 గురు మైత్రిలు అందరు కలిసి తన కుటుంబానికి 68,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ చేదోడు వాదోడుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వంగూరి గోవింద్,జిల్లా అధ్యక్షులు.పులెపాక రాములు,ఉప అధ్యక్షులు కంకల మల్లేశం, జిల్లా సలహాదారు బర్మా.రాంచందర్ ,ప్రధాన కార్యదర్శి రేగు బాలరాజు, రాష్ట్ర ఉప అధ్యక్షులు సట్టు బాలకిషన్, కమిటీ మెంబర్ శికిలం.కుమారస్వామి,గోపాల మిత్రులు సుధాకర్, మైత్రి మెరుగు స్వామి, ముత్తయ్య,కొమురయ్య, శ్రీకాంత్, వేణు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.