Sunday, 12 July 2026

Blog

యాదాద్రి భువనగిరి

తెలంగాణలో స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ విడుదలకు నోచుకొని ప్రజాపాలన ప్రభుత్వం

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాలయాపనతో ప్రజాపాలన ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎస్ఎఫ్ఐ భువనగిరి పట్టణ కార్యదర్శి ఈర్ల రాహుల్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని సుందరయ్య భవన్లో పట్టణ సహాయ కార్యదర్శి కరెట్లపల్లి భవాని శంకర్ అధ్యక్షతన భువనగిరి పట్టణ కమిటీ సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఎలా కాలయాపన చేసిందో ఈ ప్రజా పాలన ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందనిన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల కోట్ల 3 వందల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ప్రతిపక్షంలో ఉండి అనేక వాగ్దానాలు చేసే అధికారంలోకి వచ్చినంక విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా కేవలం మాటలకు పరిమితం అవుతూ ముందుకెళుతుందని అన్నారు. తెలంగాణలో విద్యార్థులు స్కాలర్షిప్లు రాక తీవ్ర ఇక్కట్లు గురి అవుతూ చదువుకు పేద విద్యార్థులు దూరమవుతున్నారని అన్నారు. నెలలో అనేకసార్లు క్యాబినెట్ మీటింగ్లు పెట్టి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోవడం అంటే దేనికి సంకేతం అని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణలో విద్యారంగం అనేక సమస్యలతో ఉన్నదని పరిష్కరించే నాధుడే లేరని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం అంటే కేవలం మాటలు చెప్పే ప్రభుత్వం లాగానే మిగిలిపోయిందని వారు అన్నారు. పేద విద్యార్థుల బాధలను పట్టించుకోని తక్షణమే స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరినీ సమీకరించి పోరాటాలను ఉదృతం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ ఉపాధ్యక్షులు ఏడుమేకల మహేష్, సుష్మ, దీప్తి పట్టణ నాయకులు వెన్నెల,ప్రేమజ, మౌనిక, పాల్గొన్నారు…

యాదాద్రి భువనగిరి

బహుజన స్మశాన వాటికలను పరిరక్షించాలి పెంట నర్సింహ్మ

ముదిరాజ్ కులస్థులకు (ముదిరాజ్ సంఘo ) చెందిన స్మశాన వాటికను “1064” సర్వేనెంబర్ కలిగిన భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా *”బహుజన స్మశాన వాటికల పరిరక్షణ కమిటీ యాదాద్రి భువనగిరి”* జిల్లా కమిటీ అధ్యక్షులు “*పెంట నర్సింహ్మ ముదిరాజ్*” గారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి ఎదురుగా ఉన్న మా ముదిరాజ్ కులస్థుల సమాధులను కొంతమంది గుర్తు తెలియని దుండగులు భూమిని చదును చేస్తున్నారు ,ఇట్టి భూమిలో సుమారు 60 కి పైగా సమాధులు తీసివేశారు అని వీరిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు గారు,మాజీ కౌన్సిలర్ ఎనబోయిన జహంగీర్, సాధు విజయ్, గొర్రెంకల శివశంకర్, ఇట్టబోయిన గోపాల్, ఉడత భాస్కర్, దుగ్యల రవి,షాగంటి నర్సింహా, గడిల ప్రభాకర్,గుర్రాల మల్లేష్, పెంట నితీష్, తుమ్మల నగేష్,పెంటబోయిన నాగరాజు,బాలరాజు,కొల్పుల హరినాథ్, ఇండ్ల శ్రీను, ప్రవీణ్ ,ముదిరాజు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు….

యాదాద్రి భువనగిరి

13వ వార్డు ప్రజలశ్రేయస్సే నాకర్తవ్యం గుర్రాల శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి 13వ వార్డు ప్రజలు గత నాలుగు సంవత్సరాలుగా లో వోల్టేజ్ కారణంగా నానా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి దృష్టికి ఇట్టి సమస్యను 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల శ్రీనివాస్ గారు తీసుకెళ్లగా తక్షణమే స్పందించి గౌరవ విద్యుత్ అధికారులు డి ఈ ఏ డి ఏ. ఈ గార్లకు ఎమ్మెల్యే గారు సమస్యను వివరించి అట్టి సమస్య పరిష్కారం కోసం కృషిచేసి ప్రజల సమస్యను తీర్చడం ముఖ్యంగా భావించి అక్కడ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినందుకు ముందుగా గౌరవ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి వార్డు ప్రజల తో కలిసి గుర్రాల శ్రీనివాస్ గారు నేడు ధన్యవాదాలు తెలుపుతూ అట్టి ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించడం జరిగింది ఇట్టి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రగతి నగర్ 13వ వార్డు ప్రజలు లో వోల్టేజ్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ టీవీలు ఫ్రిజ్లు ఇంట్లో ఉన్నటువంటి వాటర్ మోటర్లు పిల్లలకు చదువుకోవడం కూడా సమస్యగా ఏర్పడిన సందర్భంలో ఇట్టి విషయాన్ని గ్రహించి ప్రజలందరి సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లామని తదనంతరం జరుగుతున్నటువంటి పనులను పలు దఫాలుగా అక్కడికి వెళ్లి పరిశీలించి ప్రజలకి అతి త్వరలో అందుబాటులోకి ట్రాన్స్ఫార్మర్ను తీసుకురావాలని విద్యుత్ అధికారులను పలుమార్లు కలిసి సమస్యను వివరించడం జరిగిందన్నారు తక్షణమే ఎమ్మెల్యే గారి సహకారంతో 13వ వార్డు ప్రజల సమస్యలను తీర్చుట కొరకు నేడు నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటుచేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జనగాం కవిత నరసింహ చారి, పూదరి లక్ష్మీ సతీష్, విశ్రాంత ఉద్యోగస్తులు బాల్ రెడ్డి గారు కృష్ణమూర్తి గారు, వార్డు ప్రజలు గోమారి మహిపాల్ రెడ్డి, సురేష్, సంతోష్ సిరికొండ కిరణ్,ప్రసాద్, నరాల మహేష్, సత్యం వెంకటేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

5వ తేదీ ఏపీజీఈఏ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల కొరకు వినూత్నంగా “రండి – టి…తాగుతూ మాట్లాడుకుందాం” అనే కార్యక్రమం..!* *-నంద్యాల జిల్లా అధ్యక్షులు కె.నాగేంద్రప్ప.*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (ఏపీజీఈఏ ) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిరంతరం పోరాట పటిమతో ఉద్యోగుల డిమాండ్స్ కొరకు రాజీలేని పోరాటం చేస్తూ ఉద్యోగుల హక్కులై లక్ష్యంగా అనగా ఉద్యోగులకు బకాయిగా ఉన్న 30 వేల కోట్ల రూపాయలు, పి ఆర్ సి, ఐఆర్, డిఏ, సరెండర్ లీవ్స్ మరియు ప్రధానమైన డిమాండ్స్ కొరకు ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షులు కె. ఆర్.సూర్య నారాయణ ఉద్యోగుల కోసం ప్రభుత్వంతో సమస్యల పై పోరాటం చేస్తూ… ఒక విన్నూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగుల కొరకు చేపట్టారు. ఆ కార్యక్రమమే …”రండి – టి…తాగుతూ మాట్లాడుకుందాం” అనే కార్యక్రమాన్ని రేపు అనగా 05.08.2025 వ తేది ఉదయం 11.00 గంటలకు స్థానిక కె .సి.కెనాల్ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సమస్య పైన ఒక వీడియో రూపంలో ఉద్యోగుల ముందుకు తీసుకురానున్నాము. అందువలన ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో నిర్వహించాలని ఏపీజీఈఏ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఉద్యోగుల హక్కులపై అందరిని చైతన్య పరిచి, ప్రభుత్వం సమస్య కొరకు స్పష్టమైన పరిష్కారం చేసేవిధంగా సూచనను చేస్తూ ఉద్యోగుల ఆమోదం కొరకు చేద్దామని రాష్ట్ర సంఘం మేరకు పిలుపు నివ్వడమైనదని నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప తెలిపారు.

తిరుపతి

పిల్లారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణి*

శ్రీకాళహస్తి మండలం అబ్బా బట్లపల్లి పాఠశాల విద్యార్థులకు పిల్లారి ఫౌండేషన్ విద్యా సామాగ్రి పంపిణీ.శ్రీకాళహస్తి పట్టణం పిల్లారి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లారి దుర్గాప్రసాద్ కుమార్తె పిల్లారి అమరావతి శ్రీకాళహస్తి మండలం రామాపురం పంచాయతీ అబ్బా బట్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పలకలు, బలపాలు, పెన్సిళ్లు, పెన్నులు 80 మంది విద్యార్థులకు సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఎంసి మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఎలూరు

శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం

ఈ వార్తకు ఫోటో కలదు రైటప్ : శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారు. శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం ఆగిరిపల్లి, ఆగస్టు 4 స్థానిక శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయ పవిత్రోత్సవాలు ఆలయ కార్య నిర్వాహణాధికారి సిహెచ్ సాయి పర్యవేక్షణలో సోమవారం ఘనంగా ప్రారంభయ్యాయి. శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర శ్రావణ శుద్ధ దశమి (నాలుగో తేదీ నుండి ఏడవ తేదీ వరకు) నుండి త్రయోదశి వరకు శోభనాద్రిపై స్వయం వ్యక్తంగా వేంచేసి యున్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయ సన్నిధిలో శ్రీ వైఖాన సాగమ శాస్త్రానుసారంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ. ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ నిత్య కార్యక్రమము లు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పవిత్రోత్సవ విశేష కార్యక్రమములు. నీరాజన మంత్ర పుష్ప తీర్థ ప్రసాద వినియోగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు తెలిపారు. సోమవారం ఉదయం శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్లకు పరివార దేవతలకు స్నపన, విశేషాలంకరణ, నిరాజన మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచన, అజస్త్ర దీపారాధన, ఆచార్య అర్చక రుత్విక్ యజమాన దీక్షాధారణ, మృత్సం గ్రహణము, అంకురారోపణ, నిరాజనం మంత్ర పుష్ప తీర్థప్రసాద్వినియోగం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించి స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేశారు.

ఖమ్మం

మహా సంపర్క్ అభియాన్ ప్రెస్ మీట్

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఆగష్టు 4 ఖమ్మం జిల్లా మహా సంపర్క్ అభియాన్ ప్రెస్ మీట్ ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షత న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి స్థానిక సంస్థల ఎన్నికల ఖమ్మం జిల్లా ఇంచార్జి గా నియమితులు అయిన మాజీ మంత్రివర్యులు ఇనుగాల పెద్దిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక పోస్టర్ ను విడుదల చేసి,ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గల పరిధిలో గల సర్పంచ్ స్థానాలు,అత్యధికంగా ఎంపీటీసీ మరియు జడ్పిటిసి స్థానాలు గెలుచుకొనే విధంగా విజ్ఞులైన ఖమ్మం జిల్లా ప్రజానికం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఇదే సందర్భంలో క్షేత్రస్థాయిలో ప్రతి బూత్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మొదలుకొని మండల నాయకత్వం వరకు నిర్విరామము గా కృషి చేసి భారతీయ జనతా పార్టీ కాషాయ భావుట ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు దనియకుల వెంకట్ నారాయణ, గడీల నరేష్, రామకృష్ణ, అల్లిక అంజయ్య,నున్న రవి, దేవకీ వాసు దేవరావ్, ఈవి రమేష్, దొంగల సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరావ్, విజయ్ రాజు, తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

*శ్రీ సరస్వతీ శిశు మందిర్ కి రూ.50000 విరాళం*

శ్రీకాళహస్తి పట్టణం ముత్యాలమ్మ గుడివీధి లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల నందు పాఠశాల ప్రబంధకారిణి సమావేశం పాఠశాల అధ్యక్షులు చాగణం భక్తవత్సలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశంలో పాఠశాల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను చర్చించడం జరిగింది.ప్రబంధకారిణి సభ్యుల ఆధ్వర్యంలో పెద్దపంజాని మండలం పెద్దకప్పాలి ఇండియన్ బ్యాంకు మేనేజర్ AVSK సురేష్ గారు పాఠశాల అభివృద్ది కొరకు రూ .50000 విరాళంగా అందించారు.అందుకు గాను కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డా. లక్ష్మీ నారాయణ, కాలంకారి పద్మావతి, మంగి రెడ్డి, బచ్చు ఆనంద రావు,రాజేష్ వర్మ,ప్రకాష్ ,ఉమాశంకర్ సుబ్రమణ్యం రెడ్డి పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

హేరే కార్ శ్రీను గారి జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనగిరి ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు హేరే కార్ శ్రీను గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వివేరా హోటల్ లో పుట్టినరోజు సందర్భంగా హేరే కార్ శ్రీను గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వాకిటి శ్రీహరి గారు ఆలేరు ఎమ్మెల్య ప్రభుత్వ విప్ బిర్లా ఐలన్న గారు వారు మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్ గారు సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ గారు ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరిగుట్ట మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఖమ్మం

బిజెపి మహా సంపర్క్ అభియాన్. ముఖ్య అతిధి గా హాజరైన తాండ్రా వినోద్ రావు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఆగష్టు 4 ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం లోని నేలకొండపల్లి మండలము లో బిజెపి మండలఅధ్యక్షుడు పాగర్తి సుధాకర్ అధ్యక్షతన పైనంపల్లి గ్రామంలో బూత్ నంబర్ 271,272, లలో బూత్ అధ్యక్షులు కొండా రవి బాబు,కారంగుల వీరయ్య ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ *ఇంటింటికి బిజెపి, ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు* కార్యక్రమం జగింది. ఈ కార్యక్రమం కి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పాల్గొన్నారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మండల, జిల్లా నాయకులతో కలిసి ప్రతి గడపకు వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పనులను ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపిని ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ , సీనియర్ నాయకులు మన్నే కృష్ణా రావు,భవనాసి దుర్గారావు,సూరేపల్లి జ్ఞానరత్నం,మహ్మద్ షరీఫుద్దీన్,తంగెళ్ల సతీష్ కందరబోయిన వెంకటరమణ మన్నే రాధా కృష్ణ, బాజా రామకృష్ణ రావు, గెల్లా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.