Wednesday, 22 April 2026

Blog

తిరుపతి

రాజ్యాంగమే అంబేద్కర్ అందించిన మహావజ్రం- ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి టెంపుల్ న్యూస్) శ్రీకాళహస్తి నియోజికవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపించిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. భారత ప్రజలకు ఆయన అందించిన అమూల్యమైన వరం రాజ్యాంగమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఒక్క వర్గానికే పరిమితం కాలేదని, సమస్త సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని అన్నారు. సమాజంలో ఉన్న అనేక అవరోధాలను అధిగమించి ప్రపంచ స్థాయి మేధావిగా ఎదిగిన అంబేద్కర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి అభివృద్ధి వైపు పయనించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, క్లస్టర్ ఇంచార్జ్ కంటా రమేష్, కూటమి నాయకులు కాసరం రమేష్, పేట బాలాజీ రెడ్డి, గోపీనాథ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్ర, సన్నీ, భాస్కరయ్య, రమేష్, మనీ, రామ్మూర్తి, రాంబాబు, పులి శ్రీకాంత్, చందమామల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు రేపే విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలు 2026 తేదీ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (BIEAP) తరగతి 11 మరియు 12 బోర్డు పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 15న ప్రకటించనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత, విద్యార్థులు BIEAP బోర్డు తరగతి 12 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లైన resultsbie.ap.gov.in లో చూడవచ్చు. అదనంగా, విద్యార్థులు తమ BIEAP 12వ తరగతి ఫలితాలు మరియు ఉత్తీర్ణత స్థితిని IE ఎడ్యుకేషన్ పోర్టల్‌లో కూడా తనిఖీ చేసుకోవచ్చు.

సాహితీ

సమభావ అంకురం అంబేద్కర్ – డా. బద్రి పీర్ కుమార్

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న స్వర్గీయ డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టరేట్లు పొందిన భారతరత్న డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో జన్మించారు. భారత దేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, భారత రాజ్యాంగ రూపశిల్పిగ, రాజ్యాంగ పితామహుడుగ, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా గొప్ప మేధావిగా, మరియు స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా సుప్రసిద్ధులు. ఈయన జన్మదినం సందర్భంగా ఈ కవిత 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *డా.* డాక్టరుగా కుల వివక్షతకు వైద్యం చేయగ *భీం* భీష్మించుకున్న అగ్ర వర్ణాలను ఎదుర్కొనగ *రా* రాజీలేని ప్రయత్నం కొనసాగించగ *వ్* వావ్ అనిపించుకున్న విద్యాధికుడు. *రాం* రాంరాం తీరుగ సమససమాజ ఆరాధకుడై *జీ* జీవించు హక్కుకు సమన్యాయ జీవం పోయగ *అం* అంతర్జాతీయ న్యాయ సూత్రాలను విశ్లేషించి *బే* బేశరతు పాలన నియమాలు రూపొందించి *ద్క* దక్కదగిన సమాజ గౌరవాలు చేకూర్చగ *ర్* రమణీయ జీవన గమనానికి దారి చూపగ *ఒ* ఒకే భావజాలాంబుధిని మధించి *కే* కేవలము నుండి విజయకేతనం వరకు *దే* దేహం నుండి దేవాలయం వరకు *శం* శంఖారావ ప్రజా చైతన్య ప్రదాత *ఒ* ఓపిక లేదిక అనక ప్రజాస్వామ్య దిశగ *కే* కేసరిగ సమసమాజ స్థాపనాచార్యునిగ *రా* రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా *జ్యాం* జన్మెత్తిన ప్రతి ఒక్కరూ ప్రయోజకులు కావాలని *గం* గమనించి మూర్తీభవించిన సామాజిక స్ఫూర్తితో రూపొందించిన భారత రాజ్యాంగ పితామహుడు పరిపాలనాంగ రాజ్యాంగ స్ఫూర్తి ధీరుడు స్వర్గీయ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

అనకాపల్లి

బస్సు కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ శిక్షణ – ఆర్టీసీ బస్సులో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 14 : బస్సు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన అభ్యర్థులకు డ్రైవర్లుగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలమంచిలి కోర్ట్‌ వద్ద అంబేద్కర్ గురుకులాల్లో నిర్వహిస్తున్న వేదికల్లో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆకస్మికంగా పరిశీలించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను బస్సులో జిల్లా కలెక్టర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు స్వయంగా ప్రయాణించి వారి నైపుణ్యాలను పరిశీలించారు. డ్రైవింగ్ విధానం, నియమ నిబంధనలు పాటించడం వంటి అంశాలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమం యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

తూర్పు గోదావరి

జనసేన పార్టీలో మోహిత్ ఆధ్యర్యంలో 200 మంది యువత చేరిక

పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి నాయకుడు, కార్యకర్తలు కృషి చేయాలని జనసేన రాజమహేంద్రవరం సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బేరి మోహిత్ ఆధ్యర్యంలో సుమారు 200 మంది యువత జనసేన పార్టీ లో చేరారు. వీరికి అనుశ్రీ సత్యనారాయణ పార్టీ కండువాలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం  రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ డైరెక్టర్ గంటా స్వరూప, సోమాలమ్మ  గుడి డైరెక్టర్ తొర్ల పాటి శాలిని, మార్కేండేయస్వామి దేవాలయం డైరెక్టర్ బూడిద గౌతమి, బసవ సూర్యకుమారి, బోయిలాపల్లి సుందరయ్య, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ గుత్తులు బుల్లి, తదితరులు పాల్గొన్నారు.

కడప

ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి..!!

ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని ఆసుపత్రి ఔటోపోస్ట్ పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఎర్రగుంట్ల మండలం వెంకటాపురం గ్రామం వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్న గుర్తు తెలియని వ్యక్తిని 108 అంబులెన్స్లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారన్నారు. అతని సంబంధీకులు ఆసుపత్రి వద్దకు రావాలని కోరారు.

తూర్పు గోదావరి

రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బార్ అసోసియేషన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సునీతతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సి.వి. ప్రసాద్ , కార్యదర్శి పి. రమేష్ , సీనియర్ న్యాయవాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి గంధం సునీత మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలు అపూర్వమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ వంటి అంశాల్లో ఆయన చూపిన దారిని నేటి తరాలు అనుసరించాలని సూచించారు. రాజ్యాంగం ప్రతి పౌరునికి ఇచ్చిన హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలు న్యాయవాదులకు మార్గదర్శకమని తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. న్యాయ వ్యవస్థలో న్యాయం అందరికీ చేరేలా కృషి చేయడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, ట్రైనీ లాయర్లు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చివరగా స్వీట్లు పంచుకుని వేడుకలను ఆనందంగా ముగించారు.

E-పేపర్

రంగారెడ్డిలో రగిలిపోతున్న ఎండలు… 40°C దాటిన ఉష్ణోగ్రతలు – హీట్ అలర్ట్ జారీ!”

రంగారెడ్డిలో రగిలిపోతున్న ఎండలు… 40°C దాటిన ఉష్ణోగ్రతలు – హీట్ అలర్ట్ జారీ!” అగ్గి రాజ్యంగా రంగారెడ్డి జిల్లా… 40°C దాటిన ఉష్ణోగ్రతలు బయటకు అడుగు వేస్తే జాగ్రత్త!” పున్నమి న్యూస్ ప్రతినిధి 14 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జ్ : రంగారెడ్డి జిల్లాలో ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లడం కష్టంగా మారింది. రోడ్లపై వేడి గాలులు వీచడంతో జనజీవనం స్థంభించింది. ప్రత్యేకంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని, బయటకు వెళ్లేటప్పుడు తలకు రక్షణ తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇక రైతులు, కార్మికులు ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు. పనులు మధ్యలోనే ఆపివేసే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులు కూడా హీట్ వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. *ప్రజలకు సూచనలు* : మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లకండి తగినంత నీరు, పానీయాలు తీసుకోండి తలకు టోపీ లేదా గుడ్డ కప్పుకోండి పిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోండి హీట్ అలర్ట్… జాగ్రత్తగా ఉండండి – ప్రాణాలను కాపాడుకోండి!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బద్దెవోలు క్రాస్ రోడ్డులో సంగమేశ్వర స్వామి రథోత్సవం భక్తి వైభవంగా నిర్వహణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 14 (మల్లికార్జున రావు పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డులో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఆలయంలో శివపార్వతులను తేరు మీద ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించారు. సుమారు 25 టన్నుల తేరును భక్తులు భుజాలపై మోసుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి తీసుకెళ్లారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు. శివనామస్మరణతో ప్రాంతం మార్మోగింది. భద్రత కోసం ఎస్ఐ శివ రాకేష్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్

జగన్ సభ జయప్రదం చేయండి – మాజీ యమ్ యల్ ఎ విష్ణు

మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మెహన్ రెడ్డి ఏప్రిల్ 15వ తేదీన కావలి నియోజకవర్గం లోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటనను జయప్రదం చేయాలని మాజీ యమ్ యల్ ఎ కాటం రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి కోరారు. మత్స్యకారుల సౌకర్యార్థం వాళ్ళ మత్స్య సంపదను మార్కెట్ చేసుకొనుటకు అనువుగా ఫిషింగ్ హార్బర్ ను ఏర్పాటు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చుట పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి జగన్ వస్తున్నట్లు తెలిపారు. నారా లోకేష్ బాబు శంకుస్థాపన గురించి మత్స్యకారులతో గాని ఆ గ్రామ నాయకులతో గానీ ఎవరితో సంప్రదించకుండా శంకుస్థాపన చేయడం మత్స్యకారులందరూ తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు అనే విషయం లో జగన్ మోహన్ రెడ్డి మత్స్యకారుల తోటి సంప్రదించి మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంతో పోరాడేందుకు ఈ సభ నిర్వహిస్థున్నట్లు విష్ణు తెలిపారు. వారికి అన్యాయం జరగకుండా చేయడానికి జగన్ వస్తున్నారు అని కార్యక్రమానికి వైయస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగ విష్ణు వర్ధన్ రెడ్డి కోరారు. మంగళవారం విష్ణు హెలిపాడ్ ఏర్పాటు పరిశీలించి, తీరం లోని మత్స్య కారుల తో చర్చించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.