Wednesday, 22 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బద్దెవోలు క్రాస్ రోడ్డులో సంగమేశ్వర స్వామి రథోత్సవం భక్తి వైభవంగా నిర్వహణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 14 (మల్లికార్జున రావు పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డులో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఆలయంలో శివపార్వతులను తేరు మీద ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించారు. సుమారు 25 టన్నుల తేరును భక్తులు భుజాలపై మోసుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి తీసుకెళ్లారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు. శివనామస్మరణతో ప్రాంతం మార్మోగింది. భద్రత కోసం ఎస్ఐ శివ రాకేష్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్

జగన్ సభ జయప్రదం చేయండి – మాజీ యమ్ యల్ ఎ విష్ణు

మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మెహన్ రెడ్డి ఏప్రిల్ 15వ తేదీన కావలి నియోజకవర్గం లోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటనను జయప్రదం చేయాలని మాజీ యమ్ యల్ ఎ కాటం రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి కోరారు. మత్స్యకారుల సౌకర్యార్థం వాళ్ళ మత్స్య సంపదను మార్కెట్ చేసుకొనుటకు అనువుగా ఫిషింగ్ హార్బర్ ను ఏర్పాటు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చుట పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి జగన్ వస్తున్నట్లు తెలిపారు. నారా లోకేష్ బాబు శంకుస్థాపన గురించి మత్స్యకారులతో గాని ఆ గ్రామ నాయకులతో గానీ ఎవరితో సంప్రదించకుండా శంకుస్థాపన చేయడం మత్స్యకారులందరూ తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు అనే విషయం లో జగన్ మోహన్ రెడ్డి మత్స్యకారుల తోటి సంప్రదించి మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంతో పోరాడేందుకు ఈ సభ నిర్వహిస్థున్నట్లు విష్ణు తెలిపారు. వారికి అన్యాయం జరగకుండా చేయడానికి జగన్ వస్తున్నారు అని కార్యక్రమానికి వైయస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగ విష్ణు వర్ధన్ రెడ్డి కోరారు. మంగళవారం విష్ణు హెలిపాడ్ ఏర్పాటు పరిశీలించి, తీరం లోని మత్స్య కారుల తో చర్చించారు.

ఆంధ్రప్రదేశ్

Arrive..Alive కార్యక్రమం నిర్వహించిన శిరోల్ ఎస్సై గండ్ర సతీష్ గారు

మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చింతపల్లి గ్రామంలో “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SP శబరిష్ ఆదేశాలతో SI గండ్ర సతీష్ ఆధ్వర్యంలో గ్రామ సభలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి సర్పంచ్ ధీరావత్ వీరన్న 30 హెల్మెట్లు పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, యువత రోడ్డు ప్రమాదాల నుంచి జాగ్రత్త పడాలని సూచించారు.

కడప

ప్రొద్దుటూరు అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం..!

ప్రొద్దుటూరు అమృతనగర్కు చెందిన బొమ్మిశెట్టి భవానీ మంగళవారం పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకొని మహిళలను అక్కడ నుంచి తీసుకువెళ్లారు. అమృతనగర్లో కొత్తపల్లె మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యాయన్నారు. తన కుమారునిపై ఎమ్మార్వో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.

ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు

మహబూబాబాద్ జిల్లా, క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న: మాజీ మంత్రి,శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*🔶 *అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*సంబంధం లేకున్నా డైవర్షన్ కోసం కెసిఆర్ గారికి లీగల్ నోటీసులు★ *మాజీ సీఎం కెసిఆర్ గారికి లీగల్ నోటీసులు మంత్రి సీతక్క పంపడం చాల సిగ్గు చేటు*● *అవినీతి చేసిన సీతక్క కెసిఆర్ ,కేటీఆర్ పై ఆనేక ఆరోపణలు చేస్తే అవినీతి పోతుందా❓*● *సెల్ ఫోన్ కుంభకోణం చేసిన మంత్రి సీతక్క నోరు ఆదుపులో పెట్టుకోవాలి*★ *అవినీతి తప్ప, అభివృద్ధి చేతకాదు మీకు*● *ఆంధ్రా లో 5జి ఫోటోలు తెలంగాణలో ఇచ్చినట్లు ఫోటోలలో ప్రచారం చేసుకోవడం దారుణం*● *38 వెల ఫోన్లు అంగన్ వాడీలకు ఇచ్చి 6వెల ధర ఉన్న ఫోనుకు 14 వెలు పెట్టి కొన్నట్లు చూపడం అవినీతి కదా❓ *సీతక్క అవినీతి చేయలేదంటే ఫోన్ల కొనుగోలుపై విచారణ చేపించాలి* ● *మహిళ మంత్రిగా ఉండి మాట్లాడే మాటలూ ఇవ్వేనా సీతక్క* ★ *బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తల దగ్గర చాల చెప్పులు ఉన్నాయి .మేము మీ కంటే ఎక్కువగా మాట్లాడగలం**ఒకవైపు తెలంగాణలో 4G ఫోన్లు అంగన్వాడీ టీచర్లకు పంచుతూ, మీ కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఆంధ్ర 5G ఫోటోలను ఇక్కడ తెలంగాణలో ప్రచారం చేయడం దారుణం కాదా❓ *● *4జి ఫోన్ ఇచ్చి 5జి ఫోన్ ప్రచారం ఎంతవరకు సబబో మంత్రి సీతక్క చెప్పాలి *● *అదివాసి బిడ్డ ఐతే ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతావా సీతక్క* ● *ఓక్క మహిళను ఐన కోటీశ్వరురాలిగా మార్చావా సీతక్క**ఖబర్దార్ సీతక్క…*🔥🔥● *మాజీ సీఎం కెసిఆర్ కి సీతక్క క్షమాపణ చెప్పాలి. *● *కాంగ్రెస్ పాలన మొత్తము స్కాం ల మయం* ● *నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అనేలా ఉంది ప్రభుత్వ తీరు. *● *సీతక్క చేతలకు, మాటలకు సంభందం లేదు* ● *కేసీఆర్ హయాంలో శిశు సంక్షేమ శాఖ దేశంలో ముందు వరుసలో ఉంటే..మీ ప్రభుత్వం లో కుళ్ళిన గుడ్లు ఇస్తుంది మీరు కదా..*❓*మహిళ శిశు సంక్షేమ శాఖ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే మాట నిరూపించుకో సీతక్క*💥 *ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా ప్రతి ప్రభుత్వ పథకంలో, ప్రతి స్కీములో స్కాములు చేసుకుంటూ రాష్ట్రాన్ని భ్రష్టబట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తొందర్లోనే సాగనంపడం ఖాయం.

ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో మంత్రుల రాక – అభివృద్ధి అంశాలపై భేటీ

ఆత్మకూరు ఆర్ అండ్ బి అతిథి గృహానికి రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. మంత్రులు మరికాసేపట్లో ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలు, కీలక అంశాలపై భేటీ కానున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రాజెక్టుల పురోగతి, అమలు పరిస్థితులపై చర్చించనున్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, అధికారులు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్

వింజమూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వింజమూరు బంగ్లా సెంటర్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. కులవివక్ష, అస్పృశ్యత నిర్మూలనకు ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్టీఆర్ ఇచ్చిన “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” నినాదం అంబేద్కర్ ఆశయాల ప్రతిబింబమని వివరించారు. అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, వారికి రాజకీయ అధికారం కల్పించడంలో అంకితభావంతో పనిచేస్తోందని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే నిజమైన నివాళి అని పేర్కొంటూ, అందరూ ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్

బండగానిపల్లిలో అభివృద్ధి–సంక్షేమ వేడుకలు ఘనంగా

ఉదయగిరి మండలం బండగానిపల్లి గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో రూ.46.80 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ప్రారంభించారు. అదే సమయంలో కొత్తపల్లి ఎస్టీ కాలనీలో 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాలను 32 మంది లబ్ధిదారులకు చీర సారెలతో కలిసి అందజేశారు. వరదల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ, సీఎం నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఎస్టీ కుటుంబాలకు మౌలిక వసతులు, పక్కా ఇళ్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తరువాత ఎస్టీ సోదర సోదరీమణులతో కలిసి ఎమ్మెల్యే దంపతులు, కంభం విజయరామిరెడ్డి బంతి భోజనం చేశారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గొప్ప తనం వర్ణించలేనివని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ చీదరాల చెన్నయ్య పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు హరనాధపురం లోని ఎస్.వి.ఎస్. స్కూలు నందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా వకృత్వ పోటీలు నిర్వహించి, పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్కూలు కరెస్పాండెంట్ పి.వి.రెడ్డి. మాట్లాడుతూ దేశ స్వాతంత్రనంతరం రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడై 11 నెలకకు పైగా శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించారని వివరించారు. ఈకార్యక్రమంలో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ శతచండీ పారాయణ సహిత చండీ మహాయజ్ఞము అంకురార్పణ

వైభవంగా శ్రీ శనీశ్వర స్వామి, శ్రీ అభయ హస్తా ఆంజనేయ స్వామి వారి ప్రాకారోత్సవం పున్నమి ప్రతినిధి ప్రతినిధి రామచంద్రాపురం రామచంద్రాపురం మండలం రాయల చెరువు పంచాయతీ చాయా పురంలో వెలిసి ఉన్న శ్రీ శనీశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శ్రీ మహా మండలేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా మంగళవారం ఉదయం మహాగణపతి హోమం, గోపూజతో 40 మంది శ్రీ చండీ ఉపాసకులచే శ్రీ శత చండీ పారాయణ సహిత చండీ మహా యజ్ఞము అంకురార్పణ జరిగింది. అనంతరం క్షేత్ర మూల దైవం శ్రీ శనీశ్వర స్వామివారికి, క్షేత్ర పాలకులు శ్రీ అభయస్థ ఆంజనేయ స్వామి వారికి ప్రాకారోత్సవాన్ని ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్యం శర్మ భక్తులతో కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీరామ జపం ఆంజనేయ స్వామి జపంతో భక్తిశ్రద్ధలతో ప్రాకారోత్సవంలో పాల్గొన్నారు. ఉభయ దాతలకు అర్చకులు శని దోష నివారణ హోమం, నవగ్రహ దోష నివారణ, గణపతి హోమాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి మాట్లాడుతూ మూడు రోజులపాటు శ్రీ శతచండీ పారాయణ సహిత చండీ మహా యజ్ఞం సంకల్పించడానికి కారణం లోక కళ్యాణార్థం, ప్రజల కుటుంబాల సౌఖ్యం, సమృద్ధి సుఖం సకల జీవుల సౌలభ్యం కొరకు చేస్తున్న మహా యజ్ఞం అని తెలిపారు. ఆలయ చిత్ర దైవమైన శ్రీ శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం, నవగ్రహ పూజలు, నవగ్రహ నివారణ హోమాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి శాంతి, సుఖం, మంచి జీవితం ప్రాప్తిస్తుందని తెలిపారు. ఈ మూడు రోజులు మహా శివ క్షేత్రాల నుంచి వచ్చిన 40 మంది చండీ ఉపాసకులచే శత చండి పారాయణ సహిత మహాయుగంలో భక్తులందరూ పాల్గొని పూర్వజన్మ పాపాలను, దోషాల నుంచి విముక్తి పొందాలని తెలిపారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను అలరించాయి. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. మహా యాగానికి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు అన్నదాన వితరణ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.