Wednesday, 22 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జడ్పీలో పదోన్నతులు, కారుణ్య నియామకాలు

నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు, అలాగే కారుణ్య నియామకాలు చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాటిపర్తిలో జూనియర్ సహాయకురాలిగా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి ఎమ్ రాజ్యలక్ష్మిని సీనియర్ సహాయకురాలిగా పదోన్నతి కల్పించి, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వాకాడుకు బదిలీ చేసి నియమించారు. అదేవిధంగా, విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఇద్దరికి కారుణ్య నియామకాలు ఇచ్చారు. అందులో భాగంగా ఆర్ శశిలాలాసను మండల ప్రజా పరిషత్ పెళ్లకూరు కార్యాలయానికి, వై లోకేష్ కుమార్‌ను మండల ప్రజా పరిషత్ కావలి కార్యాలయానికి ఆఫీస్ సబార్డినేట్‌లుగా నియమించారు. ఈ పదోన్నతులు, నియామకాలు సజావుగా జరిగేందుకు సహకరించిన జడ్పీ చైర్‌పర్సన్ గౌరవనీయులు శ్రీమతి ఆనం అరుణమ్మ, జడ్పీ సీఈవో గౌరవనీయులు శ్రీ ఎల్ శ్రీధర్ రెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో గౌరవనీయులు శ్రీ జే మోహన్ రావు గారులకు పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీ లక్కాకుల పెంచలయ్య, కార్యదర్శి శ్రీ విదేవ ప్రశ్న కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

తిరుపతి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి

పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం ఈ సందర్భంగా రామచంద్రపురం కూడలి నందు రామచంద్రాపురం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం ముఖ్య అతిథులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వల్లేటి భాను కుమార్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అలాగే గిరిధర్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కలిసి కేక్ కటింగ్ చేసిన తర్వాత జై భీమ్ జై భీమ్ అని నినాదం చేశారు

E-పేపర్

బండగానిపల్లిలో అభివృద్ధి పనుల ప్రారంభం మరియు ఇళ్ల పట్టాల పంపిణీ

​ఉదయగిరి, ఏప్రిల్ 14: (ఉస్మాన్ పున్నమి ప్రతినిధి ( అంబేడ్కర్ జయంతి సందర్భంగా బండగానిపల్లిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన సతీమణి ప్రవీణ మరియు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ​రూ 46.80 లక్షల నిధులతో నిర్మించిన సి.సి రోడ్లు మరియు ‘స్వచ్ఛ రథాన్ని’ ప్రారంభించారు, 40 ఏళ్లుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న కొత్తపల్లి ఎస్టీ కాలనీకి చెందిన 32 మందికి ఇళ్ల పట్టాలతో పాటు చీర సారెలను అందజేశారు. ​అలానే కూటమి ప్రభుత్వ సహకారంతో ఎస్టీ కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు, కార్యక్రమం అనంతరం ఎస్టీ సోదర సోదరీమణులతో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్దం గారి ధంపతులు మరియు మాజి శాసన సభ్యులు విజయరామి రెడ్డి గారు మరియు నేతలు బంతి భోజనం చేశారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా – యువతలో నూతన స్ఫూర్తి….

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న యువత, గ్రామ పెద్దలు అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాధాన్యతపై ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు తెలిపారు. గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో ర్యాలీ నిర్వహించి నినాదాలతో కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. అనంతరం భారీగా భోజనాల కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులకు అన్నదానం చేశారు. ఈ వేడుకలు యువతలో చైతన్యం పెంచేలా జరిగాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

సత్యసాయి

బీఎస్పీతోనే బహుజన విముక్తి సాధ్యం

పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడలో డా. బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కమ్మ, రెడ్డి పార్టీల అరాచక పాలనల నుండి బయటపడాలంటే బీఎస్పీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, పోలీసు చర్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బందెల గౌతమ్ కుమార్ స్పందనను ప్రస్తావిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హరిప్రసాద్, వేణు, ఓబులేసు, పక్కిరప్ప, గంగన్న, గంగరాజు, ప్రసాద్, శ్రీరాములు నాయక్, హాసన్ భాష, బెస్త రవి, రమణ, ఆదినారాయణనాయుడు, అక్కుల్లప్ప, కిష్టప్ప, రాజు, నరసింహులు, ఎరికిల గంగరాజు, బద్దెనాయిక్, వెంకటేష్, సోమశేఖర్, దస్తగిరి, నారాయణ పాల్గొన్నారు.

మహబూబ్ నగర్

అంబేద్కర్ జయంతి వేడుకలు

బహుజన టీచర్స్ ఫెడరేషన్(BTF) తెలంగాణ ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవం *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 14/04/2026* ఈ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బహుజన టీచర్స్ ఫెడరేషన్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు పట్నం చెన్నయ్య మరియు ప్రధాన కార్యదర్శి కడం బాల శంకర ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వడ్డేమాన్ బాల పేరు, జై పవన్ కుమార్, మేడం విజయ్ కుమార్, సత్తయ్య, ఉపాధ్యక్షులు కాజన్నా, ఈశ్వరయ్య, మహిళా సెక్రటరీ శ్రీదేవి నీలియ నాయక్, నర్సింలు మొదలగు జిల్లా సభ్యులు రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు

మహబూబ్ నగర్

అంబేద్కర్ జయంతి వేడుకలు

బహుజన టీచర్స్ ఫెడరేషన్(BTF) తెలంగాణ ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవం *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 14/04/2026* ఈ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బహుజన టీచర్స్ ఫెడరేషన్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు పట్నం చెన్నయ్య మరియు ప్రధాన కార్యదర్శి కడం బాల శంకర ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వడ్డేమాన్ బాల పేరు, జై పవన్ కుమార్, మేడం విజయ్ కుమార్, సత్తయ్య, ఉపాధ్యక్షులు కాజన్నా, ఈశ్వరయ్య, మహిళా సెక్రటరీ శ్రీదేవి నీలియ నాయక్, నర్సింలు మొదలగు జిల్లా సభ్యులు రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యుత్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు .

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 14 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలోని విద్యుత్ కార్యాలయంలో 135వ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకొని అంబేద్కర్ మార్గాన్ని అనుసరించాలని సంకల్పించారు.

ఖమ్మం

డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ విగ్రహం ని శుద్ధి చేసిన ఖమ్మం టూ టౌన్ బీజేపీ నాయకులు

ఖమ్మం ఏప్రిల్ (పున్నమి జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్రకుమార్ ) డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు భాగంగా ఖమ్మం టూ టౌన్ బిజెపి అధ్యక్షులుధనియాకులవెంకటనారాయణ ఆధ్వర్యంలో మేకలనాగేందర్ సమక్షంలో ఖమ్మం 58వ డివిజన్లో అంబేద్కర్ గారి విగ్రహాలని శుభ్రం చేసి దీపాలంకరణ చేయడం జరిగింది ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరికోటీశ్వరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రుద్ర గాని మాధవ్, దాసరి వీరభద్రం, వేముల వెంకట్, మందడప్పు సుబ్బారావు, నక్క రవి గౌడ్, సురేష్ గౌడ్, జిల్లెల్ల నాగరాజు, శ్రీకృష్ణ, మాల మహానాడు సంఘం నాయకులు సురేష్ గౌడ్ పాల్గొన్నారు

ఖమ్మం

విద్యుత్ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు: బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు

ఖమ్మం ఏప్రిల్ (పున్నమి జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్ర కుమార్ ) విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి సంఘీభావం ప్రకటించింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు సోమవారం ఖమ్మం నగరంలోని సమ్మె శిబిరాన్ని సందర్శించి కార్మికులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు సమాజానికి వెలుగులు పంచేందుకు ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. అర్ధరాత్రుల్లోనూ, భారీ వర్షాలు, ఉరుములు మెరుపుల మధ్య విద్యుత్ స్తంభాలు ఎక్కి సేవలు అందిస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరికొందరు శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాపాయం ఉన్నా వెనకాడకుండా విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికీ పాత నిబంధనలతో కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమని పేర్కొంటూ, తక్షణమే ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ వారి పోరాటానికి అండగా ఉంటుందని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వాకదాని రామకృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.