Wednesday, 22 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి సబ్ డివిజన్‌కు నూతన డీఎస్పీగా వి.వి. రమణ కుమార్ బాధ్యతలు స్వీకారం

కావలి సబ్ డివిజన్‌కు సోమవారం నూతన డీఎస్పీగా వి.వి. రమణ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కావలి పరిధిలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో నేరాలను అరికట్టి, భయరహిత వాతావరణం సృష్టించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరగేలా పనిచేస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గతంలో కావలిలో పనిచేసిన శ్రీధర్ ఒంగోలు దిశ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఒంగోలులో విధులు నిర్వహించిన రమణ కుమార్ ఇప్పుడు కావలికి బదిలీ కావడంతో స్థానిక పోలీసు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు.

అన్నమయ్య

హైకోర్టు స్టేటస్‌ క్వో ఉల్లంఘన? చిట్వేల్ వీఆర్వోపై ఆరోపణలు

-నోటీసులు లేకుండా రీ-సర్వే నిర్వహణపై రైతుల ఆగ్రహం -జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు – చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి -పారదర్శక దర్యాప్తు, అధికారిపై చర్యలకు డిమాండ్ తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం లో ఈడిగపల్లి గ్రామంలో భూవివాదం మరింత వివాదాస్పదంగా మారింది. సర్వే నంబర్ 1609/9A1కు సంబంధించిన భూమిపై గౌరవ హైకోర్టు స్టేటస్‌ క్వో ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ, సంబంధిత వీఆర్వో భుజంగ రావు ఏప్రిల్ 9, 2026న రీ-సర్వే నిర్వహించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ చర్య కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా భావిస్తూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పొన్నా లక్ష్మీదేవి, ఆమె కుటుంబం ఈ భూమిపై వివాదం నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టేటస్‌ క్వో కొనసాగించాలని ఆదేశించింది. ఈ విషయం అధికారులకు తెలిసి ఉండగానే, ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రీ-సర్వే నిర్వహించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా, ఈ సర్వే పక్క భూమి యజమాని కొల్లపనేని జయప్రకాశ్‌కు అనుకూలంగా జరిగిందని ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు సమర్పించిన బాధితులు, రీ-సర్వేను తక్షణమే రద్దు చేయాలని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా, సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసి పారదర్శకంగా మళ్లీ సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.అంతేకాకుండా, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, వీఆర్వోను బాధ్యతల నుంచి తప్పించి, పారదర్శకంగా పనిచేసే ఇతర అధికారిని నియమించాలని కూడా డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కడప

కడప జిల్లా కాజీపేట లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు శిక్ష.

వై.ఎస్.ఆర్ కడప జిల్లా…. ➡️ మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధించిన కడప జిల్లా POCSO కోర్ట్..కమలాపురంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారు కమలాపురం మండల పరిధిలోని ఒక గ్రామం లో 02.07.2021 వ తేది మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు అయిన పల్లా వెంకట విద్యా కిరణ్ @ P. కిరణ్ కుమార్, వయస్సు: 35 సం., తండ్రి: కొండయ్య, r/o D. No. 5/10, మీరాపురం గ్రామం, కమలాపురం మండలం కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధిస్తూ కడప జిల్లా POCSO కోర్ట్ జడ్జి శ్రీ T. కేశవ గారు తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారు తెలిపారు. కమలాపురం పోలీస్ స్టేషన్ లో సోమవారం సాయంత్రం మీడియాకు జిల్లా ఎస్.పీ గారు వివరాలు వెల్లడించారు. మహిళలపై జరిగే నేరాలపై జిల్లా పోలీస్ శాఖ కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని ఎస్.పీ తెలిపారు. శక్తి టీములు, స్కూళ్ళు, కాలేజీలవద్ద డ్రోన్ల తో నిఘా ఉంచడం జరుగుతోందన్నారు. క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో ముద్దాయికి కఠిన శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి డి.ఎస్.పీ సునీల్, కోర్ట్ మానిటరింగ్ సెల్ సిబ్బంది, సి.ఐ మోహన్ సిబ్బందిని జిల్లా ఎస్.పీ గారు అభినందించారు. *➡️ కేసు వివరాలు:* Kamalapuram PS Cr.no: 118/2021, Vide SPL SC POCSO Number – 156/2022. U/Sec- 376(2)(i) IPC and Sec 5 (m) r/w 6 of POCSO Act. *➡️ ముద్దాయి పేరు, వివరాలు:* పల్లా వెంకట విద్యా కిరణ్ @ P. కిరణ్ కుమార్, వయస్సు: 35 సం., తండ్రి: కొండయ్య, r/o D. No. 5/10, మీరాపురం గ్రామం, కమలాపురం మండలం. *➡️ ముద్దాయి నేరానికి పాల్పడిన తీరు:* 02.07.2021 వ తేది కమలాపురం మండల పరిధిలోని ఒక గ్రామం లో బాధితురాలి ఇంటి దగ్గరకు తన పని నిమిత్తం పోయిన ముద్దాయి, ఆ సమయంలో బాధితురాలి ఇంటిలో ఎవరూ లేని విషయాన్ని గమనించి ఎలాగైనా బాధితురాలిని శారీరకంగా అనుభవించాలనే ఉద్దేశంతో బాధితురాలికి మాయ మాటలు చెప్పి, ఇంటిలోనికి తీసుకొని పోయి తన సెల్ ఫోన్ ను బాధితురాలికి ఇచ్చి చూసుకుంటూ ఉండమని చెప్పి బాధితురాలి పై పడి, బాధితురాలిని అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించగా, బాధితురాలు గట్టిగా అరిచి మా అమ్మానాన్నలకు చెబుతా అని కేకలు వేయడంతో బాధితురాలి ఇంటిలో నుండి పరారైన ముద్దాయి. ఈ సంఘటనపై కమలాపురం పోలీసు స్టేషన్ నందు అప్పటి సబ్- ఇన్స్పెక్టర్ T.తులసీ నాగ ప్రసాద్ గారు కేసు నమోదు చెయ్యగా, అప్పటి Kadapa SDPO B. Suneel గారు పూర్తి ఆధారాలతో ముద్దాయిని అరెస్ట్ చేసి తదుపరి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడమైనది. ➡️ *తీర్పు ముఖ్యాంశాలు:* ఈ కేసులో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యాలను మరియు దర్యాప్తు అధికారుల నివేదికలను నిశితంగా పరిశీలించిన కడప జిల్లా POCSO కోర్ట్ జడ్జి శ్రీ T. కేశవ గారు, నిందితునిపై మోపబడిన నేరం రుజువైనట్లు నిర్ధారించారు.  మరియు బాదితురాలికి ప్రభుత్వం తరుపున Rs.10,50,000/- రూపాయల డబ్బును పరిహారం కింద ఇవ్వవలసిందిగా కడప జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించడం అయినది. *➡️ శిక్ష:* ముద్దాయికి 20 సంవత్సరాల కటిన కారాగార శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. *➡️ సహకరించిన సిబ్బంది:* ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా 17 మంది సాక్షుల సాక్షాలను కోర్ట్ వారికి సమర్థవంతంగా వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (SPL PP) కొమ్మినేని వేణు గోపాల్ గారు. ఈకేసు ను పూర్తి ఆధారాలతో సమగ్ర విచారణ జరిపి ఛార్జ్ షీట్ ను ఫైల్ చేసిన అప్పటి Kadapa SDPO B. Suneel గారిని మరియు సాక్షులను సకాలంలో హాజరు పెట్టేలా పర్యవేక్షించిన కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ R. మోహన్ గారిని, కమలాపురం SI A. విద్యాసాగర్ గారిని, వీరికి సహకరించిన కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది ASI 1773 A. నాగేంద్ర మరియు కమలాపురం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ PC 2591 T. శ్రీధర్, PC 592 N. సింహరాయుడు, PC 2773 U. సుబ్బరాయుడు లను కడప జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.   *జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.* Uploaded Video:

రాజన్న సిరిసిల్ల

మొదటి దశలోనే అసంపూర్తిగా నిర్మాణంలో ఆగిపోయిన అంబేద్కర్ ఆడిటోరియం

ముస్తాబాద్/ ఏప్రిల్ 13 / పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియం భవనం మొదటి దశలోనే నిలిచిపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. భవనం ఎదురుగా కస్తూర్బా బాలికల పాఠశాల, పక్కనే ప్రభుత్వ ఇంటర్ పాఠశాల, గురుకుల పాఠశాలలు మరియు ఈ భవనం ఎడమ పక్కన సమ్మక్క సారక్క దేవాలయం. ఉన్నాయి ఈ ప్రాంతంలో విద్యార్థుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. ఈ భవనం పూర్తికాకపోవడంతో స్థానికులు మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు భవనం నిర్మాణం ప్రారంభించి ఐదు సంవత్సరాలు కావస్తున్న నిర్మాణం పూర్తి కాలేదు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా, అధికారుల పర్యవేక్షణ లోపమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, స్థానిక నాయకులు ప్రభుత్వ సహాయం తీసుకుని. పాలకులు మరియు మేధావులుఈ ఆడిటోరియం. పనులను వెంటనే పునఃప్రారంభించి త్వరగా పూర్తి చేసి ఈ జ్ఞాన బాండగారాన్ని. విద్యార్థులకు మేధావులకు.ప్రజలకు చిరు కానుకగా. ఇవ్వాలని మండల స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Featured

ప్రముఖ గాయని ఆశా భోస్లే ఇకలేరు

భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని ఎన్నో దశాబ్దాల పాటు తన గాత్రంతో మంత్ర ముగ్ధులను చేసిన ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 12న ఆమె తుదిశ్వాస విడిచారు. ఛాతీ ఇన్‌ఫెక్షన్, అలసటతో ఆసుపత్రిలో చేరిన ఆమెకు అనంతరం బహుళ అవయవ వైఫల్యం కారణంగా మరణం సంభవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో వేలాది పాటలు పాడి భారతీయ సినీ సంగీతానికి చిరస్మరణీయ సేవలందించారు. బాలీవుడ్‌తో పాటు పలు భారతీయ భాషల్లో కూడా ఆమె గాత్రం వినిపించింది. ఆమె మరణంతో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. “ఆమె గాత్రం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుంది” అని వ్యాఖ్యానించారు. సంగీత ప్రపంచానికి అపూర్వ సేవలు అందించిన ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ విభూషణ్ వంటి ఎన్నో గౌరవాలు లభించాయి. ఆమె అంత్యక్రియలు ముంబైలో పూర్తి రాష్ట్ర గౌరవాలతో నిర్వహించనున్నారు. భారతీయ సంగీత రంగంలో ఒక యుగానికి ముగింపు పలికిన ఈ సంఘటన అభిమానులను, సినీ ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది.

E-పేపర్

మరోసారి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ నేడు సమ్మె తేదీ ప్రకటించే అవకాశం

మరోసారి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ నేడు సమ్మె తేదీ ప్రకటించే అవకాశం పున్నమి న్యూస్ ప్రతినిధి 12 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ మధ్యాహ్నం లేబర్ కమిషనర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈనెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని యోచిస్తున్న ఆర్టీసీ కార్మికులు గత నెల 13న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై స్పందించని ప్రభుత్వం

E-పేపర్

నక్కర్తలో భక్తుల విరాళాల వెల్లువ… హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి భారీ స్పందన!

నక్కర్తలో భక్తుల విరాళాల వెల్లువ… హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి భారీ స్పందన! *కలకొండ పద్మ – బీరప్ప దంపతులు ఆలయ కమిటీ మాజీ చైర్మన్* , ప్రస్తుత 10 వార్డు సభ్యులు మొదటి విడతగా (1,50,000) *ఒక లక్ష యాభై వేలు రూపాయలు* ఆలయ పునర్నిర్మాణ విరాళం పున్నమి న్యూస్ ప్రతినిధి 12 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: నక్కర్త గ్రామంలో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణం కోసం ముందుకు వచ్చిన దాతలు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా దాతగా ముందుకొచ్చినటువంటి ( *కలకొండ పద్మ – బీరప్ప దంపతులు ఆలయ కమిటీ మాజీ చైర్మన్* , ప్రస్తుత 10 వార్డు సభ్యులు మొదటి విడతగా *ఒక లక్ష యాభై వేలు రూపాయలు* (1,50,000/-) రూపాయలు దేవాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు కలిసి దేవాలయాన్ని మరింత భవ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. దేవాలయం పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తులకు మరింత సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు అందరూ తమవంతు సహాయం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

E-పేపర్

నక్కర్త హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భారీ విరాళం

నక్కర్త హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భారీ విరాళం *11వ వార్డు సభ్యులు వంగూరి మనోహర – జంగయ్య యాదవ్ దంపతులు* యాభై వేలు రూపాయలు (50,000/-) దేవాలయ పునర్నిర్మాణ విరాళం పున్నమి న్యూస్ ప్రతినిధి 12 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : నక్కర్త గ్రామంలో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణం కోసం ముందుకు వచ్చిన దాతలు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా దాతగా ముందుకొచ్చినటువంటి ( *వంగూరి మనోహర – జంగయ్య యాదవ్ దంపతులు ప్రస్తుత 11వ వార్డు సభ్యులు యాభై వేలు* రూపాయలు (50,000/-) దేవాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు కలిసి దేవాలయాన్ని మరింత భవ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. దేవాలయం పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తులకు మరింత సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు అందరూ తమవంతు సహాయం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

E-పేపర్

నక్కర్త హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భారీ విరాళం

నక్కర్త హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భారీ విరాళం యాభై వేలు రూపాయలు (50,000/) సింధం మమత – రవి దంపతులు పున్నమి న్యూస్ ప్రతినిధి 12 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ నక్కర్త గ్రామంలో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణం కోసం ముందుకు వచ్చిన దాతలు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా దాతగా ముందుకొచ్చినటువంటి ( *సింధం మమత – రవి* దంపతులు యాభై వేలు రూపాయలు (50,000/-) ఆలయ కమిటీ వారికి అందజేయడం జరిగింది దేవాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు కలిసి దేవాలయాన్ని మరింత భవ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. దేవాలయం పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తులకు మరింత సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు అందరూ తమవంతు సహాయం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

అనకాపల్లి

బ్రాండిక్స్ కంటి శిబిరం విజయవంతం – దొరస్వామి ప్రశంసలు, 620 మందికి వైద్య సేవలు…

(పున్నమి న్యూస్ – అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 13): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో బ్రాండిక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని దొరస్వామి సందర్శించి వైద్య సేవలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన 620 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. శస్త్రచికిత్స అవసరమైన రోగులను గుర్తించి తదుపరి చికిత్సకు పంపించారు. ఈ శిబిరం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని స్థానికులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.