Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడప జిల్లా కాజీపేట లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు శిక్ష.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కడప జిల్లా కాజీపేట లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు శిక్ష.

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

వై.ఎస్.ఆర్ కడప జిల్లా….

➡️ మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధించిన కడప జిల్లా POCSO కోర్ట్..కమలాపురంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారు

కమలాపురం మండల పరిధిలోని ఒక గ్రామం లో 02.07.2021 వ తేది మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు అయిన పల్లా వెంకట విద్యా కిరణ్ @ P. కిరణ్ కుమార్, వయస్సు: 35 సం., తండ్రి: కొండయ్య, r/o D. No. 5/10, మీరాపురం గ్రామం, కమలాపురం మండలం కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధిస్తూ కడప జిల్లా POCSO కోర్ట్ జడ్జి శ్రీ T. కేశవ గారు తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారు తెలిపారు. కమలాపురం పోలీస్ స్టేషన్ లో సోమవారం సాయంత్రం మీడియాకు జిల్లా ఎస్.పీ గారు వివరాలు వెల్లడించారు. మహిళలపై జరిగే నేరాలపై జిల్లా పోలీస్ శాఖ కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని ఎస్.పీ తెలిపారు. శక్తి టీములు, స్కూళ్ళు, కాలేజీలవద్ద డ్రోన్ల తో నిఘా ఉంచడం జరుగుతోందన్నారు. క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో ముద్దాయికి కఠిన శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి డి.ఎస్.పీ సునీల్, కోర్ట్ మానిటరింగ్ సెల్ సిబ్బంది, సి.ఐ మోహన్ సిబ్బందిని జిల్లా ఎస్.పీ గారు అభినందించారు.

*➡️ కేసు వివరాలు:*

Kamalapuram PS Cr.no: 118/2021, Vide SPL SC POCSO Number – 156/2022.
U/Sec- 376(2)(i) IPC and Sec 5 (m) r/w 6 of POCSO Act.

*➡️ ముద్దాయి పేరు, వివరాలు:*

పల్లా వెంకట విద్యా కిరణ్ @ P. కిరణ్ కుమార్, వయస్సు: 35 సం., తండ్రి: కొండయ్య, r/o D. No. 5/10, మీరాపురం గ్రామం, కమలాపురం మండలం.

*➡️ ముద్దాయి నేరానికి పాల్పడిన తీరు:*

02.07.2021 వ తేది కమలాపురం మండల పరిధిలోని ఒక గ్రామం లో బాధితురాలి ఇంటి దగ్గరకు తన పని నిమిత్తం పోయిన ముద్దాయి, ఆ సమయంలో బాధితురాలి ఇంటిలో ఎవరూ లేని విషయాన్ని గమనించి ఎలాగైనా బాధితురాలిని శారీరకంగా అనుభవించాలనే ఉద్దేశంతో బాధితురాలికి మాయ మాటలు చెప్పి, ఇంటిలోనికి తీసుకొని పోయి తన సెల్ ఫోన్ ను బాధితురాలికి ఇచ్చి చూసుకుంటూ ఉండమని చెప్పి బాధితురాలి పై పడి, బాధితురాలిని అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించగా, బాధితురాలు గట్టిగా అరిచి మా అమ్మానాన్నలకు చెబుతా అని కేకలు వేయడంతో బాధితురాలి ఇంటిలో నుండి పరారైన ముద్దాయి. ఈ సంఘటనపై కమలాపురం పోలీసు స్టేషన్ నందు అప్పటి సబ్- ఇన్స్పెక్టర్ T.తులసీ నాగ ప్రసాద్ గారు కేసు నమోదు చెయ్యగా, అప్పటి Kadapa SDPO B. Suneel గారు పూర్తి ఆధారాలతో ముద్దాయిని అరెస్ట్ చేసి తదుపరి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడమైనది.

➡️ *తీర్పు ముఖ్యాంశాలు:*

ఈ కేసులో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యాలను మరియు దర్యాప్తు అధికారుల నివేదికలను నిశితంగా పరిశీలించిన కడప జిల్లా POCSO కోర్ట్ జడ్జి శ్రీ T. కేశవ గారు, నిందితునిపై మోపబడిన నేరం రుజువైనట్లు నిర్ధారించారు.
 మరియు బాదితురాలికి ప్రభుత్వం తరుపున Rs.10,50,000/- రూపాయల డబ్బును పరిహారం కింద ఇవ్వవలసిందిగా కడప జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించడం అయినది.

*➡️ శిక్ష:*
ముద్దాయికి 20 సంవత్సరాల కటిన కారాగార శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

*➡️ సహకరించిన సిబ్బంది:*

ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా 17 మంది సాక్షుల సాక్షాలను కోర్ట్ వారికి సమర్థవంతంగా వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (SPL PP) కొమ్మినేని వేణు గోపాల్ గారు. ఈకేసు ను పూర్తి ఆధారాలతో సమగ్ర విచారణ జరిపి ఛార్జ్ షీట్ ను ఫైల్ చేసిన అప్పటి Kadapa SDPO B. Suneel గారిని మరియు సాక్షులను సకాలంలో హాజరు పెట్టేలా పర్యవేక్షించిన కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ R. మోహన్ గారిని, కమలాపురం SI A. విద్యాసాగర్ గారిని, వీరికి సహకరించిన కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది ASI 1773 A. నాగేంద్ర మరియు కమలాపురం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ PC 2591 T. శ్రీధర్, PC 592 N. సింహరాయుడు, PC 2773 U. సుబ్బరాయుడు లను కడప జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
 
*జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.*

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *