Wednesday, 22 April 2026

Blog

ఖమ్మం

ఇంటర్ ఫలితాల్లో డాక్టర్స్ మెడికల్ అకాడమీ ప్రభంజనం

ఖమ్మం ఏప్రిల్ (పున్నమి జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్ర కుమార్) తెలంగాణలో ఆదివారం విడుదలైన ఇంటర్‌మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఖమ్మం నగరం లోని డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు. అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. సుజాల సాయి శ్రీ – 438 మాన్వి భూదాత – 437 ఎన్. స్వాతి – 437 ఎం. దీప్తి – 436 కే. సాత్విక – 433 కే. అశ్విత – 433 బి. కీర్తి స్నేహ – 432 పి. విద్యాభారతి – 432 ఈ. పూజ – 431 బి. జెస్విత – 431 సి.హెచ్. సింధుజ – 430 ఇవే కాకుండా, 400కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 50 మంది ఉన్నట్లు అకాడమీ sibbaతెలిపింది. నీట్ కోచింగ్‌తో పాటు ఇంటర్ సిలబస్‌ను తక్కువ కాలంలోనే సమర్థవంతంగా బోధించి అద్భుత ఫలితాలు సాధించడం డాక్టర్స్ మెడికల్ అకాడమీ ప్రత్యేకతగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నీట్ పరీక్షలో 3వ ర్యాంక్ సాధించిన టి. వెన్నెల తమ విద్యార్థినేనని నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం 100కి పైగా ఉచిత ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్న ఏకైక విద్యాసంస్థగా అకాడమీ గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అకాడమీ నిర్వాహకులు అభినందనలు తెలిపారు. అకాడమీ యాజమాన్యం ఈగ భరణి కుమార్, ఈగ లక్ష్మి, రాయల సతీష్ కుమార్, ఈశ్వరీలు ఈ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు.

తిరుపతి

బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డికి ఘన నివాళి

తొట్టంబేడు, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) తొట్టంబేడు మండలం, కంచనపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు శ్రీరాములు రెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం కంచనపల్లి చేరుకున్న ఆయన, సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను కలిసి, వారిని ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీకి మరియు గ్రామానికి సుధాకర్ రెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా బియ్యపు గుర్తుచేసుకున్నారు. సుధాకర్ రెడ్డికి నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ కోవి చంద్రయ్య నాయుడు, నాయకులు రవీందర్ నాయుడు, గంగాధరం, భాస్కర్, దాము, కుమారస్వామి నాయుడు, పఠాన్ ఫరీద్, శ్రీవారి సురేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని సుధాకర్ రెడ్డికి కన్నీటి నివాళులు అర్పించారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో రక్తదానోత్సవం… సేవాభావంతో ముందుకు వచ్చిన యువత

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో ఆదివారం నాడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, MGM హాస్పిటల్స్ సంయుక్తంగా, రాజస్థాన్ నవ యువక్ మండల్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జెట్టి పాలెం ప్రాంతంలోని జైన్స్ ప్రేయర్ హాల్‌లో జరిగిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 110 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ…రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాజస్థాన్ నవ యువక్ మండలి సభ్యుల సేవాభావాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి రక్తదాన శిబిరాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

తిరుపతి

నిరుద్యోగ యువతకు లక్ష్యం ఉపాధి: 15న శ్రీకాళహస్తి ‘స్కిట్’లో మెగా జాబ్ మేళా

శ్రీకాళహస్తిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SKIT) కాలేజీలో ఈనెల 15వ తేదీన భారీ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ నాయుడు , ఇతర ముఖ్య నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిరుద్యోగులకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ బహుళజాతి సంస్థలు (MNCs) పాల్గొని, అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని పేర్కొన్నారు. వేదిక: శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SKIT) కాలేజీ, శ్రీకాళహస్తి. తేదీ & సమయం: ఏప్రిల్ 15, ఉదయం 9:00 గంటల నుండి. అర్హతలు: 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ మరియు బి.టెక్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ మేళాకు హాజరుకావచ్చు. అవసరమైన పత్రాలు: అభ్యర్థులు తమ వెంట రెజ్యూమె (Resume) కాపీలు, విద్యాార్హత ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కాలేజీ యాజమాన్యంతో చర్చించి, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించాలని ఆదేశించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని విజయ్ కుమార్ నాయుడు పిలుపునిచ్చారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ‘స్కందా కాఫీ కేఫ్’ ప్రారంభం… స్వచ్ఛతకు ప్రాధాన్యం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని వీఎంసీ థియేటర్ ఎదుట స్కందా కాఫీ కేఫ్ ఘనంగా ప్రారంభమైంది. హోటల్ నిర్వహణలో శిక్షణ పొందిన ఫణి కుమార్ స్వచ్ఛతతో పాటు ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఈ కేఫ్‌ను ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి హాజరైన మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి ఫణి కుమార్‌ను అభినందించి, ఆయన వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరా స్వామీవారి దేవస్థానం శేష వస్త్రంతో సత్కరించారు.

తిరుపతి

గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉచిత వైద్య శిబిరం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) పవన్నవారి కండ్రిగ గ్రామంలో ప్రజల సంక్షేమ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, తిరుపతిలోని రష్ బహుళ వైద్య నిపుణుల ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కేవీబీ పురం మండలంలోని పవన్నవారి కండ్రిగ గ్రామ పాఠశాలలో ఆదివారం నాడు ప్రారంభమైన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో వైద్యుల బృందం పాల్గొని కిడ్నీలో రాళ్లు, కడుపు నొప్పి, నడుము నొప్పి, హెర్నియా, మూలవ్యాధి, మూత్ర సంబంధిత వ్యాధులు, మహిళలకు సంబంధించిన సమస్యలు, ఎముకల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అదనంగా రక్తపోటు, మధుమేహం పరీక్షలు కూడా నిర్వహించారు. తిరుపతి రష్ ఆసుపత్రి ఆధ్వర్యంలోని వైద్య బృందంతో పాటు శ్రీకాళహస్తిలోని ఎస్వీ దంత ఆసుపత్రి వైద్యులు కూడా సేవలు అందించారు. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.

తిరుపతి

ప్రత్యేక ప్రతిభావంతులకు అండగా ‘హెల్పింగ్ హాండ్స్’… నిత్యావసరాల పంపిణీ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని నగరవీధిలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న హెల్పింగ్ హాండ్స్’ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ అధినేత మునీర్ బాష నేతృత్వంలో ప్రతి నెల నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమం ద్వారా పలువురు లబ్ధిదారులు అవసరమైన సరుకులు అందుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ..తాము ఇతరులపై భారం కాకుండా జీవించేందుకు ప్రతి నెల నిత్యావసరాలు అందిస్తూ సహకరిస్తున్న సంస్థకు, మునీర్ భాషకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్, బాబా ఫరీద్, హబీబ్, గాంధీ, సతీష్ చంద్ర, రేవతి, బుజ్జి, నూరి, నాగుర్బి, మోబినా తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

బొజ్జల జయంతి కానుక-15న ఉచిత మెగా వైద్య శిబిరం – ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ మంత్రి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల కోసం భారీ ఉచిత నొప్పి నివారణ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ (బుధవారం) స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈ శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని, అన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులకు (Chronic Pains) ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించనున్నారు. శిబిరంలో పాల్గొనే ప్రముఖ వైద్యులు డాక్టర్ రవి కృష్ణ కలతూర్: పెయిన్ మేనేజ్‌మెంట్ నిపుణులు, అపోలో హాస్పిటల్స్, చెన్నై. డాక్టర్ శ్రీనివాస్ చిరవూరి: ప్రముఖ వైద్య నిపుణులు, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, అమెరికా (USA). ఏప్రిల్ 15, 2026 (బుధవారం) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, శ్రీకాళహస్తి. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, ఇతర శారీరక నొప్పులతో బాధపడేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. “నొప్పి లేని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడమే ఈ శిబిర ప్రధాన ఉద్దేశ్యం” అని నిర్వాహక ప్రతినిధులు పేర్కొన్నారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ ఉచిత వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తూర్పు గోదావరి

ఆపదలో ఆదుకున్న మానవత – బాధితుడికి రూ.7 వేల ఆర్థిక సహాయం

తాళ్లపూడి, తూర్పుగోదావరి జిల్లా, ఏప్రిల్ 12 (పున్నమి ప్రతినిధి): తాళ్లపూడి మండలంలోని రాగోలపల్లి గ్రామానికి చెందిన కస్సే శ్రీను ఫిట్స్, తల గాయాలు, భుజం నొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్య ఖర్చులు మరియు కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించింది. సంస్థ ఆధ్వర్యంలో రూ.6,000, అలాగే కాలినేని ప్రదీప్ వ్యక్తిగతంగా రూ.1,000 అందించడంతో మొత్తం రూ.7,000ను బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారి కన్నీటి బొట్టును తుడవడమే మానవత ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సహాయ కార్యక్రమాలకు సంస్థ పెద్దపీట వేస్తోందని చెప్పారు. తలారి రామ్మోహన్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవతను ఆశ్రయిస్తే తప్పకుండా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడం సంస్థ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, గెడ్డం సాయిబాబా, తలారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి అంబేద్కర్ భవన్‌లో జయంతి సంబరాలు… ప్రజలకు ఆహ్వానం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి, ఏప్రిల్: డాక్టర్ B. R. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ కమిటీ మరియు SC, ST ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ భవన్‌లో జరగబోయే జయంతి కార్యక్రమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహా ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన అంబేద్కర్ సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగాలకు కృతజ్ఞతగా జయంతి వేడుకల్లో పాల్గొనడం ద్వారా నివాళి అర్పించాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జి. శ్రీనివాసులు, వై. శ్రీహరి, ఎన్. రామకృష్ణయ్య, జి. రామ్మూర్తి, గోపి, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.