Wednesday, 22 April 2026

Blog

తూర్పు గోదావరి

రాజమండ్రి ‘స్టార్ ఐకాన్’ కోసం త్వరలో ఆడిషన్స్

-ఎం. ఈవెంట్స్ మరియు న్యూజెన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా -ఉచిత క్యాస్టింగ్ కాల్ కొరకు సంప్రదించండి స్థానిక ప్రసాద్ ఆదిత్య మాల్‌ వేదికగా ఆదివారం ‘స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి’ ఫ్యాషన్ షో పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఎం. ఈవెంట్స్ మరియు న్యూజెన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఫ్యాషన్ షో పోస్టర్‌ను రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ, రాజమండ్రిలోని యువతీ యువకుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ భారీ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడలింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన వేదిక అని, గతంలో ఏలూరులో విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో ఇప్పుడు రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని, ఆసక్తి గల వారు  తమ పేర్లను 9949 04 0707  నెంబర్ కు ఫోన్ చేసి ఉచితంగా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు స్పష్టం చేశారు. త్వరలోనే క్యాస్టింగ్ కాల్ కొరకు సంప్రదించండి (ఆడిషన్స్) నిర్వహించి, ఫైనల్ షోకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రసాద్ ఆదిత్య మాల్ మేనేజ్‌మెంట్ శరత్,  హర్షలకు  నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని మోడలింగ్ ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ టీమ్ సభ్యులు, మోడల్స్ మరియు మాల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అనకాపల్లి

మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 12 : యలమంచిలి మండలం లో ములకలపల్లి గ్రామంలోని మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా కళ్యాణం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు, ఫ్యాక్టరీ సిబ్బంది కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు సెంటర్‌లో రోడ్డు సేఫ్టీ, హెల్మెట్ మరియు గంజాయి అవగాహన కార్యక్రమం

Date 12-4-2026 ఉస్మాన్ (పున్నమి నందిపాడు రిపోర్టర్ ) నందిపాడు: స్థానిక నందిపాడు సెంటర్‌లో రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం మరియు గంజాయి నివారణపై అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి సీఐ వెంకటరావు గారు, దుత్తలూరు ఎస్‌ఐ ఆదిలక్ష్మి గారు హాజరై ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రాణ రక్షణకు ఎంతో కీలకమని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయాలు, మరణాలు తగ్గించడానికి హెల్మెట్ వినియోగం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కూడా పోలీసులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో సురక్షిత డ్రైవింగ్‌పై చైతన్యం కల్పిస్తున్నారు దుత్తలూరు ఎస్‌ఐ ఆదిలక్ష్మి గారు మాట్లాడుతూ, గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. గంజాయి వినియోగం మరియు రవాణా చట్టపరంగా నేరమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు రోడ్డు పక్కన వాహనదారులను ఆపి హెల్మెట్ ప్రాముఖ్యతపై వివరించారు. స్థానిక ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసుల సూచనలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు రోడ్డు నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

రాజన్న సిరిసిల్ల

గూడూరు సర్పంచ్ చీటి సునీత వెంకట నర్సింగరావు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎద్దండి నరసింహ రెడ్డి

ముస్తాబాద్ ఏప్రిల్/ పున్నమి /ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న KCR కప్-2026 క్రికెట్ టోర్నమెంట్ సందర్బంగా క్రీడా వాతావరణం ఉత్సాహంగా నెలకొంది. ఈ సందర్భంగా గూడూరు గ్రామ సర్పంచ్ చీటి సునీత – వెంకట నర్సింగ రావు పుణ్య దంపతుల పెళ్లిరోజును పురస్కరించుకుని వారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి మాట్లాడుతూ, దంపతులు ఇలాగే సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో అవగాహన కార్యక్రమాలు

జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దుత్తలూరు ఎస్ ఐ ఆదిలక్ష్మి జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ . ఆదేశాల మేరకు ముఖ్య కూడళ్ళు, జాతీయ రహదారులు, ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచారాలు చేపడుతున్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని అధికారులు సూచించారు. పోలీసులు, ప్రజలు కలిసికట్టుగా పని చేస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రయాణికుల భద్రత కోసం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత తనిఖీలు

ప్రయాణికుల భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై పోలీసులు, రవాణా శాఖ మరియు అగ్నిమాపక శాఖల సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. ఈ తనిఖీలలో వాహనాల ఫిట్‌నెస్, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు, డ్రైవర్ల లైసెన్సులు, బీమా పత్రాలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి బస్సు నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

తెలంగాణ మహబూబాబాద్

రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాల కు భూక్య తన్విక ఎంపిక

మహబూబాబాద్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల పోటీకి సిరోలు మండలం పెద్ద లాల్ తండా గ్రామపంచాయతీ శివారు భూక్య రాము-ప్రమీల దంపతుల పెద్ద కుమార్తె భూక్య తన్విక, మండల స్థాయి, జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎంపికైనట్లు (DYSO )ఏలేటి జ్యోతి గారు తెలిపారు, మహబూబాబాద్ జిల్లా నుండి పదిమంది బాలురు, పదిమంది బాలికలు ఎంపిక అయ్యారు. శిరోల్ మండలం నుండి భూక్య తన్విక ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో జరిగే హకీంపేట్ క్రీడా మైదానంలో ఈనెల 27 నుండి అన్ని జిల్లాల నుండి విద్యార్థులు పాల్గొంటారు. ఎంపికైన సందర్భంగా తన్వికకు పాఠశాల యాజమాన్యం, పాఠశాల స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపినారు

అనకాపల్లి

ఏటికొప్పాక గ్రామంలో సన్‌షైన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజలకు నాణ్యమైన సేవలు…

(అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 12 పున్నమి న్యూస్, ప్రతినిధి ఆనంద్ ): అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక గ్రామ సచివాలయంలో ఆదివారం సన్‌షైన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో డా. ఆర్. గంగాధర్ (MBBS), డా. ఆర్. లక్ష్మి ప్రీతి (MBBS) సహా అనుభవజ్ఞులైన వైద్యులు గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందించారు. ముఖ్యంగా ఎముకల సమస్యలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, చిన్నపిల్లల వైద్యం, సాధారణ రోగాల చికిత్స వంటి సేవలు అందించారు. వైద్యులు మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మీ రాము, కాండ్రకోట చిరంజీవి, అన్నం బాబూజీ, నగిరెడ్డి అచ్చయనాయుడు, రాయి చలపతి, సరోజిరావు, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను, బత్తుల వెంకటరమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కూటమి నాయకుల ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది.

తూర్పు గోదావరి

ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు రాజమండ్రి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి విస్తృత చర్యలు చేపట్టబడుతున్నాయి. ట్రాఫిక్ డీఎస్పీ వై. శ్రీకాంత్ మరియు రాజమండ్రి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నగరంలోని ముఖ్యమైన జంక్షన్ల వద్ద సమగ్ర పరిశీలన నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులను మెరుగుపరచడానికి డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలనలు నిర్వహించి, జిబ్రా లైన్లు, సిగ్నల్ వ్యవస్థ, ఫ్రీ లెఫ్ట్ వంటి అవసరమైన సౌకర్యాలను గుర్తించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన మార్పులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజమండ్రి జైల్ రోడ్, ఏవి అప్పారావు రోడ్, జెఎన్ రోడ్ వంటి ప్రధాన రహదారులపై మొత్తం 60 ట్రాఫిక్ అవగాహన బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దేవి చౌక్, తాడితోట వంటి రద్దీగా ఉండే ముఖ్యమైన జంక్షన్ల వద్ద రోడ్డు మరియు ఫుట్‌పాత్ ఆక్రమణలను గుర్తించి, వాటిని మున్సిపల్ కార్పొరేషన్‌తో సమన్వయం చేసుకొని తొలగించే చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా, పట్టణంలోని ముఖ్యమైన జంక్షన్ల వద్ద మైక్ సిస్టంలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా డీటీసీ జంక్షన్ వద్ద మైక్ సిస్టంను ఏర్పాటు చేసి పరిశీలన అనంతరం మిగతా జంక్షన్లకు విస్తరించే ప్రణాళిక రూపొందించారు. ఇటీవల రూపొందించిన ట్రాఫిక్ మరియు హెల్మెట్ అవగాహనపై షార్ట్ ఫిలిమ్స్‌ను నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి ఉల్లంఘనలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000/- జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. రాజమండ్రి పట్టణ ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను పాటించి, ట్రాఫిక్ పోలీసులకు సహకరించి నగరంలో రవాణా సౌకర్యాలను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల పోటీలకు 20 మంది ఎంపిక

క్రీడా పాఠశాలలో ప్రవేశానికి 9 క్రీడ అంశాలపై నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న వారిలో మహబూబాబాద్ జిల్లా నుండి మొత్తం 20 మంది ఎంపిక అయ్యారు.వారిలో పది మంది బాలురు 10 మంది బాలికలు ఎంపిక అవ్వడం జరిగింది.రాష్ట్రస్థాయి ఎంపిక అయినట్లు డి వై ఎస్ ఓ అధికారిని ఓలేటి జ్యోతి గారు తెలిపారు. ఎంపిక అయిన బాలబాలికలు ఈనెల ఏప్రిల్ 27 నుండి హకీంపేట క్రీడా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రం నుండి అన్ని జిల్లాల విద్యార్థులు హకీంపేట క్రీడా వేదికగా పాల్గొంటారు అని తెలిపారు అలాగే జిల్లా నుండి ఎంపికైన బాల బాలికలకు వారిని శుభాకాంక్షలు తెలిపారు. ఎంపికైన బాలుర వివరాలు: హేమంత్, వరుణ్ ,అరుష్ ,వివేక్ ,ఎండి అతిక్ హుస్సేన్, కుశాల్ లక్ష్మి సాగర్, అతిరథ తారక రామ్, శౌర్యానంద, వేమన ఆదిత్య ఉన్నారు . అలాగే బాలికల విభాగంలో: జశ్విత కృష్ణ, అనన్య, తహస్య, రిషిత ప్రియ, తేజస్విని ,మేఘన ,భూక్య తన్విక, వీక్షశ్రీ ,లాస్య, శాన్వి శ్రీలు ఉన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.