Thursday, 23 April 2026

Blog

తిరుపతి

కన్నప్ప ఆలయ ఆచారాలపై వివాదం.. సంప్రదాయాల పునరుద్ధరణకు డిమాండ్

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి కైలాసగిరి పర్వతంపై ఉన్న కన్నప్పస్వామికి ప్రథమ అభిషేకం నిర్వహించే ఆనవాయితీని విస్మరించి, గర్భాలయంలోనే నిర్వహిస్తున్న విధానంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఇచ్చిన వివరణ సముచితంగా లేదని స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు ఒక ప్రకటనలో ఖండించారు. సంప్రదాయ ప్రకారం ముందుగా కొండపై కన్నప్పకు అభిషేకం జరిపి, అనంతరం గర్భాలయంలో వాయులింగేశ్వరునికి పూజలు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుత విధానం ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. కన్నప్ప ఆలయాన్ని ఉప ఆలయంగా చూపిస్తూ ద్వితీయ స్థానంలో ఉంచడం తగదని, ఇది చారిత్రక పరంపరను వక్రీకరించడం అవుతుందని విమర్శించారు. కొండపై ఆలయానికి వెళ్లే భక్తులకు సౌకర్యాలు కల్పించకుండా, గర్భాలయంలోనే కార్యక్రమాలు నిర్వహించడం అనుచితమని అన్నారు. ప్రతిరోజూ కొండపై ఆలయం తెరిచి ఉంచడం, శుభ్రత, యాత్రికులకు సదుపాయాలు, అర్చకుల పర్యవేక్షణ వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయంలో భక్తులతో కొందరు సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి సేవలను మెరుగుపరచాలని కోరారు. కన్నప్పకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వెనుక సామాజిక వివక్ష కూడా కారణమని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం, దేవాదాయ శాఖ తక్షణమే స్పందించి సంప్రదాయాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అసెంబ్లీ, న్యాయస్థాన స్థాయిలో పోరాటం చేపడతామని, రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

తిరుపతి

91వ సంవత్సరంలోకి కిసాన్ కాంగ్రెస్.. 9 మంది రైతులకు సన్మానం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) కిసాన్ కాంగ్రెస్ పార్టీ 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తిరుపతి జిల్లాలో రైతులకు ఘన సత్కారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. బతైయ్య నాయుడు సమక్షంలో, తిరుపతి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కే. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తొమ్మిది మంది రైతులను శాలువాలతో సత్కరించి వారి సేవలను గుర్తించారు. సత్కారం పొందిన వారిలో పి. ముని కృష్ణయ్య, ఎం. దొరవేలు, దయానందయ్య, పీ. పొల్లయ్య, సీ. మంగయ్య, వి. మునిస్వామి, ఎం. వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కే. జనార్దన్ రెడ్డి, కూలి రవికుమార్, ఎం. వెంకట ముని, ఎం. వడివేలు మొదలియార్, ఇర్ల గోపి, శెట్టిపల్లి శివ, ఎస్. నాగూర్ అయ్యా, బి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

పెద్దకనపర్తిలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

తొట్టంబేడు, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) తొట్టంబేడుమండల పరిధిలోని పెద్దకనపర్తి గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న ‘పూలే – అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పాల’ చెంత ఈ కార్యక్రమం జరిగింది. పూలే – అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపక కార్యదర్శి ఎన్. చలపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, అక్షరాస్యత కోసం పూలే చేసిన సామాజిక పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూలే – అంబేడ్కర్ అధ్యయన కేంద్రం కార్యదర్శి పల్లమాల సురేష్, బుడ్డా వెంకటస్వామి, పోతురాజు, కృష్ణయ్య, పల్లమాల వెంకటేశ్వరరావు, బుడ్డా గురవయ్య, పల్లమాల శ్రీనివాస్, చెమూరు రత్నయ్య, వర్మ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

పూలే ఆశయ సాధనే కూటమి ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుల వివక్షకు వ్యతిరేకంగా, మహిళా విద్య కోసం, సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాల అభ్యున్నతి కోసం పూలే గారు చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విద్యే అన్ని సమస్యలకు పరిష్కారమని నమ్మిన ఆయన ఆశయాలను మన కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్తోందని స్పష్టం చేశారు. సమాజంలో మార్పు కోసం నిరంతరం శ్రమించిన ఆ స్ఫూర్తిప్రదాత చూపిన బాటలో నడుస్తూ, సామాజిక సమానత్వం కోసం మనమందరం సమిష్టిగా కృషి చేద్దామని బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో పూలే విగ్రహానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టకు అనువైన స్థలం కేటాయించాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంపటి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. రామసేతు వంతెన, క్రొత్త బ్రిడ్జ్ లేదా పట్టణంలోని ప్రధాన సర్కిళ్లలో ఎక్కడైనా స్థలం కేటాయిస్తే, స్వంత నిధులతో పూలే సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ప్రతిష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న దళిత, బహుజన వర్గాల ఆత్మగౌరవం పెంపొందించేందుకు ఈ విగ్రహం అవసరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పూలే విగ్రహాలు ఉన్నప్పటికీ, శ్రీకాళహస్తిలో మాత్రం లేకపోవడం విచారకరమని తెలిపారు. కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్యాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం పూలే చేసిన సేవలు అపారమని గుర్తుచేశారు. పట్టణంలో విగ్రహ ప్రతిష్టకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో దళిత, బహుజన వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు.

తిరుపతి

తిరుపతి IISER నోటిఫికేషన్-ఏప్రిల్ 30లోగా దరఖాస్తు చేసుకోండి

ఏర్పేడు, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ (IISER – Tirupati) లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ పోస్టుల ద్వారా బోధనారంగంలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం 06 అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-2) పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఎకనామిక్స్ (Economics), స్టాటిస్టిక్స్ (Statistics), మరియు కంప్యూటర్ సైన్స్ (Computer Science) విభాగాలలో ఈ నియామకాలు జరగనున్నాయి. సంబంధిత సబ్జెక్టులలో PhD పూర్తి చేసి, పరిశోధన లేదా బోధనా రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026. మరిన్ని వివరాలకు: అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్, జీతభత్యాలు, నిబంధనల కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.iisertirupati.ac.in/jobs/advt_272026/ ను సందర్శించవచ్చు. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 11 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి).నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా వ్యాప్తంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం కొనసాగింపు

నెల్లూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీస్ఆ దేశాల మేరకు, అడిషనల్ యస్.పి. (అడ్మిన్) సూచనలతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దీర్ఘకాలం వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు అలసటకు గురికాకుండా ఉండేందుకు, చెక్‌పోస్టుల వద్ద వారిని ఆపి ముఖం కడుక్కోవడం, విశ్రాంతి తీసుకోవడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లాలో “పల్లె నిద్ర” కార్యక్రమం – గ్రామాల్లో పోలీసుల రాత్రి బస

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయం ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీస్ ఆదేశాల మేరకు “పల్లె నిద్ర” కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు గ్రామాల్లో రాత్రి బస చేస్తూ, ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో భద్రతా పరిస్థితులు, సమస్యలు తెలుసుకుంటూ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మద్యం దుర్వినియోగంపై సూచనలు ఇస్తున్నారు. ప్రజలతో పోలీసుల సాన్నిహిత్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్యాభివృద్ధికి ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.