మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు
*బహుజన టీచర్స్ ఫెడరేషన్ (BTF) తెలంగాణ, మహబూబ్నగర్ జిల్లా శాఖ పక్షాన ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ ::11/04/2026* *ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలతో నివాళులర్పిస్తూ 199వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మ జ్యోతిరావు గారి సంఘ సంస్కరణ విద్యపై తన చేసిన పోరాటాన్ని, మరియు పుక్కిడి పురాణాల కథంతా మహాత్మ పూలే గారు తన గులాంగిరి పుస్తకంలో పూర్తిగా తెలియజేస్తూ బ్రామణిజంపై తను ఉక్కు పాదం మోపి బడుగు బలహీన వర్గాలకు శుద్రజాతులకు, అనగారిన వర్గాలకు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి సావిత్రి బాయ్ పూలేను భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది దాదాపు 56 కు పైగా బాలికల విద్యాలయాలను స్థాపించి విద్యను అందించిన గొప్ప సంస్కరణ వాది ప్రజల చేత మహాత్మా అని అనిపించుకున్న వాడు అని బి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు పట్నం చెన్నయ్య, తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కడం బాల శంకర్ రస కార్యదర్శులు జై పవన్ కుమార్, మేడం విజయకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు డి విజయ్ కుమార్ సత్తయ్య అలాగే సోదర సంఘం నాయకులు టి ఆర్ టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు రమకాంత్ పాల్గొని పుష్పాంజలి ఘటించి శుభాకాంక్షలు తెలియజేసినారు*









