Thursday, 23 April 2026

Blog

అనకాపల్లి

ఏటికొప్పాకలో 104 వైద్య శిబిరం – వృద్ధులకు ఉచిత పరీక్షలు, అవగాహన…

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 11 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో 104 వైద్య కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గ్రామంలోని వృద్ధులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి తగిన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు, ANM సిబ్బంది, ఆశా వర్కర్స్ పాల్గొని రోగులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే వైద్యుల సూచనల మేరకు మందులు క్రమంగా తీసుకోవాలని అవగాహన కల్పించారు. పేషెంట్లు అధిక సంఖ్యలో హాజరై సేవలు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో ఈ శిబిరం కీలకంగా నిలిచింది. ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో 104 వైద్య శిబిరం – వృద్ధులకు ఉచిత పరీక్షలు, అవగాహన…

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 11 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో 104 వైద్య కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గ్రామంలోని వృద్ధులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి తగిన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు, ANM సిబ్బంది, ఆశా వర్కర్స్ పాల్గొని రోగులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే వైద్యుల సూచనల మేరకు మందులు క్రమంగా తీసుకోవాలని అవగాహన కల్పించారు. పేషెంట్లు అధిక సంఖ్యలో హాజరై సేవలు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో ఈ శిబిరం కీలకంగా నిలిచింది. ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సాహితీ

యుద్ధం వద్దు శాంతి ముద్దు – డా. బద్రి పీర్ కుమార్

పశ్చిమాసియాలో గత ఆరు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ ప్రతినిధులబ‌ృందం మధ్య ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు ప్రారంభమైన సందర్భంగా యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే భావనతో ఈ కవిత యుద్ధం మానవాళికి వినాశనం విషాదం మిగిల్చే భయానక దృశ్యం దేనికైనా సిద్ధమంటే నేటి కాలంలో యుద్ధమే ఆధునిక మానవత్వ మనుగడకు విరుద్ధమే యుద్ధం కేవలం కాదు భూమిపై పోరాటం జీవకళను బలికోరే అమానవీయ ఆరాటం నెత్తుటినేలలు.. ఆర్తనాదాలు… కాలుష్యరోగాలు యుద్ధఫలితాలు యుద్ధం గెలవడం కంటే యుద్ధాన్ని ఆపడం గొప్ప జరిగే నష్టాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేమని చెప్ప యుద్ధం వద్దంటే అది రాజకీయ ఆర్థిక శుద్ధం మానవాళి భవిష్యత్తును కాంక్షించే సమృద్ధం కోర్కెల అదుపు క్రమబద్ధ జీవన బుద్ధం సాంకేతిక యుగంలో బల నిరూపణలు నిషేధం సామరస్య భావనతో మెలగడం ప్రబద్ధం ఆయుధం వీడితే శాంతిచర్చలు ఫలప్రదం ప్రపంచ వాసుల శాంతి వచనాలు ప్రసిద్ధం పునర్నిర్మాణ అభివృద్దే మన ఆశయ ప్రతిబద్ధం సైనికుల రక్షణసేవలు సంసిద్ధం నిబద్దం యుద్ధం వద్దు ఇది జీవన నిరాయుధం ప్రశ్నార్థకం కాకూడదు మానవత్వం యుద్ధం వద్దు శాంతి ముద్దు అభివృద్దే హద్దు శాంతియే నేటి ప్రపంచ జీవన గమ్యం. ఇది చరిత్ర చెప్పే విశ్వజనీన సత్యం

తిరుపతి

ఉపాధి హామీ పేదల సంజీవని-షర్మిల రెడ్డి పాదయాత్రలో తలపా దామోదరం రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం హోరెత్తింది. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి పాల్గొనగా, ఆమెతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి అడుగువేశారు. ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఒక ‘సంజీవని’ వంటిదని అభివర్ణించారు. కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన ఈ పథకం వల్లనే పల్లెల్లో పేదల వలసలు ఆగిపోయాయని, అట్టడుగు వర్గాలకు ఆర్థిక భరోసా కలిగిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, పథకం కొనసాగింపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడబోదని ఆయన హెచ్చరించారు. పేద ప్రజల ప్రయోజనాలే పరమావధిగా షర్మిల రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు, వివిధ నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.

తిరుపతి

బొజ్జల జయంతి కానుకగా 1,648 టిడ్కో ఇళ్ల పంపిణీ-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తోందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు పేర్కొన్నారు. మాజీ మంత్రి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 15న నియోజకవర్గంలో భారీ ఎత్తున గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ వద్ద నిర్మించిన 1,648 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. “నాన్నగారు వేసిన పునాదిని నేడు శాసనసభ్యుడిగా తన చేతుల మీదుగా పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేయడం తన యొక్క పూర్వజన్మ సుకృతమనీ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను ముందే వెల్లడిస్తామని, పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు, లబ్ధిదారులు ఈ శుభకార్యానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే ఆత్మీయ ఆహ్వానం పలికారు. పేదలకు ఆత్మగౌరవాన్ని కల్పించే ఈ కార్యక్రమాన్ని పండగలా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమ వివరాలు: ఏప్రిల్ 15, 2026 సమయం: ఉదయం 11:15 గంటలకు వేదిక: టిడ్కో హౌసింగ్ సముదాయం, రాజీవ్ నగర్, శ్రీకాళహస్తి.

తిరుపతి

తుమ్మ వేదవతమ్మ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంతాపం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని బజార్ వీధికి చెందిన ప్రముఖులు, కీర్తిశేషులు తుమ్మ రమణయ్య సతీమణి తుమ్మ వేదవతమ్మ ఆకస్మికంగా మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని, వేదవతమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బియ్యపు మధుసూదన్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “వేదవతమ్మ మరణం బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, శ్రీవారి సురేష్, పటాన్ ఫరీద్, కొండు కృష్ణమూర్తి, చిన్నబ్బా తదితరులు ఉన్నారు. వారు కూడా వేదవతమ్మ మృతి పట్ల తమ సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.

తిరుపతి

ఒకే వేదికపై 50 కంపెనీలు.. నిరుద్యోగులకు సువర్ణవకాశం-ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు అండగా నిలిచి, వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా భారీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. మాజీ మంత్రి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఈ ఉపాధి అవకాశాల జాతరను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో అగ్రతాంబూలం ఇస్తోందని కొనియాడారు. “మా నియోజకవర్గ యువత ఆర్థికంగా ఎదిగి, ఉన్నత స్థానాల్లో స్థిరపడాలన్నదే నా ఆశయం. అందుకే బొజ్జల జయంతి సందర్భంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నాము” అని ఆయన వెల్లడించారు. ఈ మేళాలో సుమారు 50కి పైగా ప్రముఖ బహుళజాతి కంపెనీలు (MNCs) పాల్గొంటున్నాయి. ఒకే వేదికపై 2000కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, తమ కుటుంబాల్లో వెలుగులు నింపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, పార్టీ శ్రేణులు పర్యవేక్షిస్తున్నాయని ఆయన తెలిపారు.

తిరుపతి

ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగరాలి-బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా పిలుపు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో భారతీయ జనతా పార్టీ బలోపేతమే లక్ష్యంగా విఎంసి సర్కిల్ వద్ద ‘మన ఊరు మన జెండా’ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. బిజెపి నాయకులు లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో, రాష్ట్ర ప్రగతిలో బిజెపి కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ‘మన ఊరు మన జెండా’ కార్యక్రమం కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే కాదని, పార్టీ సిద్ధాంతాలను సామాన్యుడికి చేరవేసే ఒక గొప్ప యజ్ఞమని ఆయన అభివర్ణించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిపై కాషాయ జెండా రెపరెపలాడాలని, గ్రామస్థాయి నుండి పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నేతలు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల బిజెపి నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు, యువకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో మాజీ మంత్రి పరిటాల సునీత

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తీశ్వరస్వామి, అమ్మవార్ల దర్శనార్ధం ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి పరిటాల సునీత శుక్రవారం నాడు ఆలయానికి విచ్చేసి లోకపావని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు, స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. పరిటాల సునీత స్వామివారిని దర్శించుకుని, రాహు-కేతు సర్పదోష నివారణ పూజలతో పాటు అభిషేకాల్లో పాల్గొన్నారు. అనంతరం జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. దర్శనానంతరం ఆలయ వెలుపల పరిటాల సునీత మాట్లాడుతూ…రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు లభించాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. ఈ పర్యటనలో పరిటాల సునీత వెంట శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి సభ్యులు వాకుచర్ల గుర్రప్ప శెట్టి, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీ బాబు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

48 గంటల గడువు ఇచ్చినా బదులు లేదు.. చట్టపరంగా ఆయిల్ గోడౌన్ క్లోజ్

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని ఏ.ఎమ్. పుత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆర్.డి. యోగానంద్ ఆయిల్ మిల్లును మున్సిపల్ కమిషనర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం నాడు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7వ తేదీన అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. మిల్లుకు సంబంధించి మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్ను రశీదులు, భవన నిర్మాణ అనుమతులు ఏవీ లేవని గుర్తించారు. వీటికి తోడు గోడౌన్ లోపల పరిసరాలు బూజు పట్టి, అపరిశుభ్రంగా ఉండి ప్రజారోగ్యానికి ముప్పు కలిగించేలా ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. అవసరమైన పత్రాలను సమర్పించాలని యజమానికి 48 గంటల సమయం ఇచ్చినప్పటికీ, ఎలాంటి డాక్యుమెంట్లు కార్యాలయంలో సమర్పించలేదు. దీంతో 1965 మున్సిపల్ చట్టంలోని సెక్షన్లు 293, 294, 295, 296 ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నారు. కమిషనర్ ఆధ్వర్యంలో వీఆర్వోల సమక్షంలో పంచనామా నిర్వహించి, ఆయిల్ మిల్లును మరియు స్టాక్ రవాణా కాకుండా పరిసర ప్రాంతాలను సీజ్ చేశారు. కేవలం వ్యాపార నిమిత్తం వాడే గోడౌన్ ప్రాంతాన్ని మాత్రమే సీజ్ చేశామని, వారి గృహానికి ఎలాంటి సీజ్ చేయలేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.