“బోర్డులు మాత్రమే… అమలు ఎక్కడ? చెత్తతో ముంచెత్తిన బంజర కాలనీ రోడ్
“అధికారుల హెచ్చరికలకు గౌరవం లేదు… చెత్తలో మునిగిపోయిన ప్రాంతం!” “తెలంగాణ రైజింగ్ మాటల్లోనే… నేలపై చెత్తే నిజం!” పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బంజర కాలనీ లోని GHMC పరిధి లో పరిశుభ్రత కోసం చెత్త వేయొద్దని అధికారులు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, అవి కేవలం నవమాత్రంగా మారిపోయాయి. బోర్డు ఉన్న ప్రదేశంలోనే పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోవడం స్థానిక ప్రజల నిర్లక్ష్యాన్ని, అధికారుల వైఫల్యాన్ని బయటపెడుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, గృహ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసనతో పాటు అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. పర్యావరణానికి హాని కలిగించే ఈ పరిస్థితిని తక్షణమే నియంత్రించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, చెత్త సేకరణకు సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










