Thursday, 23 April 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తిలో నేడు విద్యుత్ సరఫరా బంద్

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి స్థానిక 132 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ లైన్ల నెలవారీ నిర్వహణ పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ చిన్న రెడ్డెప్ప తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీకాళహస్తి టౌన్, రూరల్, ఏర్పేడు, కెవిబి పురం, తొట్టంబేడు మరియు బి.ఎన్. కండ్రిగ మండలాల్లో విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

తిరుపతి

కార్యకర్తల కష్టాలలో పాలు పంచుకుంటా…. సంక్షేమానికి కృషి చేస్తా.

కలసికట్టుగా పని చేద్దాం…. గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం కార్యకర్తలే టిడిపికి మూల స్తంభాలు….సంక్షేమానికి టిడిపి పెద్ద పీట… కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పులివర్తి నాని. పున్నమి ప్రతినిధి. రామచంద్రాపురం కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త కష్టాలలో పాలుపంచుకుంటానని, వారి సంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపుతానని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శుక్రవారం మండలంలోని నెత్త కుప్పం గ్రామంలో రాయలచెరువు కట్టపై ఉన్న గ్రామ పంచాయతీల క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు, నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని కి టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికలలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి మూడు దశాబ్దాల అనంతరం చంద్రగిరిలో టిడిపి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం….. గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేతలు….. పార్టీకి మూల స్తంభాలని, వారి సంక్షేమానికి పార్టీ పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. టిడిపిలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులతో గుర్తింపు లభిస్తుందన్నారు. టిడిపిలో ఉండి… ప్రతిపక్ష పార్టీ వాళ్లకి సహకరించేవారు పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అనంతరం పంచాయతీల వారీగా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల సమస్యలు, గ్రామాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎమ్మెల్యేగా రాయల చెరువు- అనుపల్లి రోడ్డు, గుండోడు కణం నూతన రోడ్డు ఏర్పాటు. గ్రామాలలో సిమెంట్ రోడ్ల నిర్మించి అభివృద్ధి చేశామన్నారు. నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ….. ప్రజాసేవే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. గతంలో వైసీపీ అరాచక పాలన సాగించి వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా పాలకులు పనిచేస్తున్నారని తెలిపారు. గత పదేళ్లగా చంద్రగిరిలో చెవిరెడ్డి కుటుంబ పాలన సాగించారని, నేడు కూటమి ప్రభుత్వంలో ప్రజా పాలన సాగుతున్నదన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసే స్థానిక ఎన్నికలలో విజయకేతనం ఎగిరివేదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆత్మీయ సమావేశాలు టిడిపి కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపుతున్నాయి. ఈ ఆత్మీయ సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎం తిరుమలరెడ్డి, ఎం ఎస్ ఎం ఈ రాష్ట్ర డైరెక్టర్ ఎన్ చిన్న బాబు, ఆరి లీలా మోహన్ నాయుడు, ఈతమాకుల ఉమాపతి నాయుడు, సింగల్ విండో చైర్మన్ సి జనార్దన్ చౌదరి, మాజీ ఎంపీపీ టీ కేశవులనాయుడు, బి ధనుంజయలు, జెడి జగన్, బాధూరు కోటేశ్వర్ రెడ్డి,, కోరా హరిప్రసాద్, గిరి నాయుడు, రెడ్డప్ప నాయుడు, మురళి నాయుడు, బండి విజయ్ కుమార్ రెడ్డి, ఆకా దేవరాజులు, శేఖర్ నాయుడు, యూనిట్, క్లస్టర్ ఇన్చార్జులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటో రైట్ అప్. 1. టిడిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పులివర్తి నాని. 2. సమావేశానికి హాజరైన టిడిపి నాయకులు. 3. ఎమ్మెల్యే పులివర్తినానికి ఘన స్వాగతం పలుకుతున్న టిడిపి నాయకులు.

అనకాపల్లి

యలమంచిలిలో న్యాయవాదుల ఆందోళన… న్యాయ వ్యవస్థ పరిరక్షణకు గళమెత్తిన లాయర్లు!

పున్నమి న్యూస్, అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 10: యలమంచిలిలో న్యాయవాదులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడులు, న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోరుతూ కోర్టు ప్రాంగణంలో గళమెత్తారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, న్యాయం సాధనలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక లాయర్లు భారీగా పాల్గొన్నారు.

తిరుపతి

కల్పించండి మహాప్రభు రెవెన్యూ అధికారులు ఎదుట దళితులు వేడుకోలు

పున్నమి ప్రతినిధి తిరుపతి రూరల్ తరతరాలుగా ఇల్లు లేక అద్దె ఇంట్లో తల దాచుకుంటూ అనేక అవస్థలు పడుతున్నాం.. ఇంకెన్నాళ్లు అద్దె గృహాల్లో నివాసం ఉండాలి .. మాకు సొంతింటి కల నెరవేరదా? ఇంటి స్థలం ఇచ్చి పుణ్యం కట్టుకోండి మహాప్రభువు అంటూ తిరుపతి గ్రామీణ మండలం మల్లంగుంటలోని దళితులు రెవెన్యూ అధికారులను వేడుకున్నారు శుక్రవారం మల్లంగుంట పంచాయతీలోని సర్వేనెంబర్ 144 లోని 2-66 సెంట్లు ప్రభుత్వ భూమిలో పూరి గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు విషయం రెవెన్యూ అధికారులకు తెలియడంతో దళితులను అడ్డుకున్నారు ఈ సందర్భంగా సుమారు 500 కుటుంబాలు చెందిన దళితులు తమ బాధలను రెవెన్యూ అధికారులు ఎదుట వెళ్లిపుచ్చుకున్నారు ఎన్నో ఏళ్లుగా తమకు ఇంటి స్థలాలు లేక అద్దెఇంట్లో ఉంటూ బాడుగులు కట్టలేక అవస్థలు పడుతున్నామని అధికారులు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు కూలీ నాలీ చేసుకునే మాకు గూడు లేక అనేక అవస్థలు పడుతున్నామని తెలిపారు ప్రభుత్వ భూములను రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆక్రమించుకుంటుంటే పేదలకు నిలువు నీడ కోసం ఇంకెన్ని సంవత్సరాలు వేచి చూడాలని వాపోయారు మా జీవనమంత అద్దె భవనాల్లో మగ్గిపోవాలని అధికారులను వేడుకున్నారు ప్రభుత్వ భూములు ఇల్లు లేని దళితులకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని మాజీ సర్పంచ్ భర్త రామచంద్రయ్య, ఉప సర్పంచ్ జయచంద్ర రెడ్డి, ఎంపీటీసీ భర్త హేమాద్రి లు డిమాండ్ చేశారు మాకు న్యాయం జరిగేంత వరకు కదలబోమని పట్టుబట్టారు *అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఎమ్మార్వో* దళితులు ప్రభుత్వ భూమిలో ప్రవేశించిన నేపథ్యంలో ఎమ్మార్వో తమ సిబ్బందితో నా స్థలానికి చేరుకున్నారు అనంతరం దళితుల బాధలను విన్న ఎమ్మార్వో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు రేషన్ కార్డులు తీసుకొని అర్జీ సమర్పించాలని సూచించారు అర్జీలను పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు దీంతో దళితులు వెనుతిరి గారు

తిరుపతి

కల్పించండి మహాప్రభు రెవెన్యూ అధికారులు ఎదుట దళితులు వేడుకోలు

పున్నమి ప్రతినిధి తిరుపతి రూరల్ తరతరాలుగా ఇల్లు లేక అద్దె ఇంట్లో తల దాచుకుంటూ అనేక అవస్థలు పడుతున్నాం.. ఇంకెన్నాళ్లు అద్దె గృహాల్లో నివాసం ఉండాలి .. మాకు సొంతింటి కల నెరవేరదా? ఇంటి స్థలం ఇచ్చి పుణ్యం కట్టుకోండి మహాప్రభువు అంటూ తిరుపతి గ్రామీణ మండలం మల్లంగుంటలోని దళితులు రెవెన్యూ అధికారులను వేడుకున్నారు శుక్రవారం మల్లంగుంట పంచాయతీలోని సర్వేనెంబర్ 144 లోని 2-66 సెంట్లు ప్రభుత్వ భూమిలో పూరి గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు విషయం రెవెన్యూ అధికారులకు తెలియడంతో దళితులను అడ్డుకున్నారు ఈ సందర్భంగా సుమారు 500 కుటుంబాలు చెందిన దళితులు తమ బాధలను రెవెన్యూ అధికారులు ఎదుట వెళ్లిపుచ్చుకున్నారు ఎన్నో ఏళ్లుగా తమకు ఇంటి స్థలాలు లేక అద్దెఇంట్లో ఉంటూ బాడుగులు కట్టలేక అవస్థలు పడుతున్నామని అధికారులు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు కూలీ నాలీ చేసుకునే మాకు గూడు లేక అనేక అవస్థలు పడుతున్నామని తెలిపారు ప్రభుత్వ భూములను రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆక్రమించుకుంటుంటే పేదలకు నిలువు నీడ కోసం ఇంకెన్ని సంవత్సరాలు వేచి చూడాలని వాపోయారు మా జీవనమంత అద్దె భవనాల్లో మగ్గిపోవాలని అధికారులను వేడుకున్నారు ప్రభుత్వ భూములు ఇల్లు లేని దళితులకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని మాజీ సర్పంచ్ భర్త రామచంద్రయ్య, ఉప సర్పంచ్ జయచంద్ర రెడ్డి, ఎంపీటీసీ భర్త హేమాద్రి లు డిమాండ్ చేశారు మాకు న్యాయం జరిగేంత వరకు కదలబోమని పట్టుబట్టారు *అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఎమ్మార్వో* దళితులు ప్రభుత్వ భూమిలో ప్రవేశించిన నేపథ్యంలో ఎమ్మార్వో తమ సిబ్బందితో నా స్థలానికి చేరుకున్నారు అనంతరం దళితుల బాధలను విన్న ఎమ్మార్వో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు రేషన్ కార్డులు తీసుకొని అర్జీ సమర్పించాలని సూచించారు అర్జీలను పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు దీంతో దళితులు వెనుతిరి గారు

తూర్పు గోదావరి

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి : ఎమ్మెల్యే ఆదిరెడ్డి

నగరంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 30వ డివిజన్‌లోని బెస్తా వీధి, గొల్ల వీధి, రజక వీధిలో రూ. 50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంఖుస్థాపన చేశారు. పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. గత ఐదేళ్లలో ఈ మూడు ముఖ్యమైన వీధుల్లో నివసిస్తున్న ప్రజలకు వైకాపా వారు కనీస సౌకర్యాలు కూడా అందించలేదని విమర్శించారు. రాజకీయ పరమైన కారణాలతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన పరిస్థితిని గుర్తు చేశారు. “తమకు ఓటు వేసినవారికే కాదు, ఓటు వేయని వారికీ కూడా సమానంగా అభివృద్ధి చేయడం తమ బాధ్యతన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత ప్రజల సేవే ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా 510 మీటర్ల సీసీ రోడ్లు, 1020 మీటర్ల డ్రైనేజీలు నిర్మించనున్నారని… పనులను ఒక నెలలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీల సందర్భంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ప్రజలు ఆశీర్వదించిన కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వేగవంతం చేస్తోందన్నారు. చర్చిపేట, మేదర్పేట వంటి ప్రాంతాల్లో కూడా గతంలో నిర్లక్ష్యం చేసిన డ్రైనేజీ సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఇంకా మిగిలిన పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. “అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల మధ్యే ఉంటాం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా వినియోగించుకుంటూ అందరికీ సేవ చేస్తాం” అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం పలువురున్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, కర్రి కాశీ, స్థానిక నాయకులు దొండపాటి కృష్టఫర్, ముసిలి రామకృష్ణ, ఎరకా కొండబాబు, బుడంపర్తి నాగేశ్వరరావు, పట్నాల సుబ్బారావు, కాంట్రాక్టర్ చౌదరి, అధిక సంఖ్యలో స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

CSR ద్వారా మహిళల అభివృద్ధికి దిశానిర్దేశం

మహిళల సాధికారతపై పార్లమెంటరీ కమిటీ ఛైర్‌పర్సన్ అధ్యక్షతన కీలక సమావేశం లో  రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి హాజరు, గ్రామీణ మహిళల అభివృద్ధిపై కీలక చర్చ. మహిళల సాధికారతకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా BPCL, HPCL, GAIL, NFL, RCFL, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రముఖ పబ్లిక్ సెక్టార్ సంస్థలు, బ్యాంకుల ప్రతినిధులతో “CSR కార్యక్రమాల ద్వారా మహిళల సాధికారత”పై విస్తృతంగా సమీక్షించారు. సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను మహిళల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుకు వినియోగిస్తున్న విధానాన్ని వివరించాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేసే కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.

తూర్పు గోదావరి

నన్నయ్య విశ్వవిద్యాలయం 16వ & 17వ స్నాతకోత్సవ వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు

నన్నయ్య విశ్వవిద్యాలయం 16వ, – 17వ స్నాతకోత్సవాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరునన్నయ్య విశ్వవిద్యాలయం 16వ మరియు 17వ స్నాతకోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్  అబ్దుల్ నజీర్ శుక్రవారం హాజరయ్యారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో రాజానగరం సమీపంలోని గైట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న గవర్నర్‌కు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి. నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ కుమార్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జీజీయూ చాన్సలర్ కె.వి.వి. సత్యనారాయణ రాజు, నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వి. స్వామి తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు.అనంతరం హెలిప్యాడ్ నుంచి నన్నయ్య విశ్వవిద్యాలయానికి గవర్నర్ బయలుదేరారు. స్నాతకోత్సవ వేదిక వద్ద వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. ప్రసన్న శ్రీ, ముఖ్య అతిథి ప్రొఫెసర్ మహేంద్ర పి. లామా, ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ కొత్త మధు మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వి. స్వామి, యూనివర్సిటీ అధ్యాపకులు తదితరులు గవర్నర్‌ను ఆహ్వానించారు. స్నాతకోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం గవర్నర్ తిరిగి గైట్ ఇంజినీరింగ్ కాలేజ్‌కు చేరుకుని స్వల్ప విరామం తీసుకున్న తర్వాత విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి. నరసింహ కిషోర్, జేసి వై మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా, జీజీయూ చాన్సలర్ కె.వి.వి. సత్యనారాయణ రాజు, తదితరులు గవర్నర్‌కు ఘన వీడ్కోలు పలికారు.

E-పేపర్

GHMC పరిధిలోని 52వ డివిజన్ పెద్ద అంబర్ పేటలో నూతన రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన..

*”మంచి రోడ్లు – మెరుగైన భవిష్యత్‌కు బాటలు”* ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా *GHMC పరిధిలోని 52వ డివిజన్ పెద్ద అంబర్ పేటలో నూతన రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన..* *R&B నుండి 13 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం…* ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో అభివృద్ధి పరుగులు పెడుతుంది..R&B శాఖ నుండి ₹13 కోట్ల భారీ నిధులతో పెద్ద అంబర్ పేటలో నూతన రోడ్ల నిర్మాణ పనులకు నేడు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే *శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి* గారు , RDC చైర్మన్ *శ్రీ మల్ రెడ్డి రామ్ రెడ్డి* శంకుస్థాపన చేయడం జరిగింది. పెద్ద అంబర్ పేటలో ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో చేపట్టిన ఈ పనులు నియోజకవర్గ ప్రగతికి మరో బలమైన నిదర్శనం గా నిలుస్తుంది. ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు గా మన రంగన్న గెలుపు తరువాత నియోజకవర్గం లొ చాలా గ్రామాలలొ , కాలనీలకు రోడ్లు, అండర్ డ్రైనేజీ వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.. 15 సంవత్సరాలలో నియోజకవర్గం లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది మన రంగన్న రాకతో నేడు ప్రతీ గ్రామం, పట్టణం అభివృద్ధి చెదుతున్నాయి..

E-పేపర్

“బోర్డులు మాత్రమే… అమలు ఎక్కడ? చెత్తతో ముంచెత్తిన బంజర కాలనీ రోడ్

“అధికారుల హెచ్చరికలకు గౌరవం లేదు… చెత్తలో మునిగిపోయిన ప్రాంతం!” “తెలంగాణ రైజింగ్ మాటల్లోనే… నేలపై చెత్తే నిజం!” పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బంజర కాలనీ లోని GHMC పరిధి లో పరిశుభ్రత కోసం చెత్త వేయొద్దని అధికారులు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, అవి కేవలం నవమాత్రంగా మారిపోయాయి. బోర్డు ఉన్న ప్రదేశంలోనే పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోవడం స్థానిక ప్రజల నిర్లక్ష్యాన్ని, అధికారుల వైఫల్యాన్ని బయటపెడుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, గృహ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసనతో పాటు అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. పర్యావరణానికి హాని కలిగించే ఈ పరిస్థితిని తక్షణమే నియంత్రించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, చెత్త సేకరణకు సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.