Thursday, 23 April 2026

Blog

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన KCR కప్ క్రికెట్ టోర్నమెంట్

ముస్తాబాద్ /ఏప్రిల్/పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో KCR కప్-2026 క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న సమ్మక్క-సారలమ్మ ప్రాంగణంలోని క్రికెట్ మైదానంలో ట్రాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నాఫ్స్కోబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. జిల్లా BRS పార్టీ అధ్యక్షులు తోట అగన్న, TSPSC సభ్యులు డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ముస్తాబాద్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి శీలం జానా బాయ్ కుర్ర సావిత్రి. మెంగని మనోహర్ శీలం స్వామి వంగూరి దిలీప్ టిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ పరిధిపేట వెంకటేష్ పాల్గొన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు మరియు యువకులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కడప

కడప జిల్లా ఖాజీపేటలో విద్యార్థిని దారుణ హత్య.

ఖాజీపేట టౌన్ అగ్రహారం లో కీర్తన అనే విద్యార్థిని గొంతు కోసి చంపిన మరొక వ్యక్తి.. చికిత్స నిమిత్తం కడపకు తీసి వెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. హత్య చేయడానికి కారకుడైన ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్(19) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

తిరుపతి

ఏప్రిల్ 14, 15 ,16 వ తేదీల్లో శ్రీ శతచండీ మహా యాగం

40 మంది శ్రీ చండీ ఉపాసకులచే శ్రీ శత చండి మహా యాగ కార్యక్రమం భక్తులందరికీ ఆహ్వానం ఉంగరాల సుబ్రహ్మణ్య శర్మ పున్నమి ప్రతినిధి ,రామచంద్రాపురం రామచంద్రాపురం మండలం రాయల చెరువు పంచాయతీ చాయా పురంలో వెలిసి ఉన్న శ్రీ శనీశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శ్రీ మహా మండలేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా ఈనెల 14 ,15, 16వ తేదీ లలో మూడు రోజులపాటు శ్రీ శతచండీ మహాయాగం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్యంశర్మ తెలియజేశారు. మూడు రోజులపాటు జరిగే శ్రీ శత చండీ మహాయాగంలో భాగంగా మొదటి రోజు గణపతి హోమం, గోపూజ, శ్రీ శనీశ్వర స్వామికి తైలాభిషేకం ప్రత్యేక పూజలు. ముఖ్యంగా ప్రముఖ శివ క్షేత్రాలు కాశి, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల నుంచి 40 మంది శ్రీ చండి మాత ఉపాసకులచే శ్రీ శత చండి మహా యాగం అత్యంత వైభవంగా, ఆగమశాస్త్రం ప్రకారం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారి మహా యాగంలో పాల్గొని, ఆరోగ్యం ,ఐశ్వర్యం ,విజయం వారి కుటుంబాలకు కలిగేలా పూజలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మహా యాగంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రులు కావాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ శత చండీ కరపత్రాలను శిష్య బృందంతో కలిసి ఉంగరాల శ్రీ సుబ్రహ్మణ్య శర్మ దంపతులు ఆవిష్కరించారు. మహా యాగానికి విచ్చేసే భక్తులందరికీ నిరంతర అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు

తిరుపతి

ఆస్తి పన్ను బకాయిదారులకు శుభవార్త 50% వడ్డీ మాఫీ పొడిగింపు, 5% రాయితీ అవకాశం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో ఆస్తి, ఖాళీ స్థల పన్ను బకాయిలు ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను బకాయిలపై విధించిన వడ్డీ మొత్తంలో 50 శాతం మాఫీ సదుపాయాన్ని ఏప్రిల్ 30, 2026 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఒకేసారి చెల్లించే వారికి 5 శాతం రాయితీ కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని బకాయిలను త్వరగా చెల్లించాలని పన్ను చెల్లింపుదారులను కోరారు. పన్నులను పురపాలక కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్లలో, వార్డు సచివాలయాల్లో చెల్లించవచ్చు. అదనంగా, ఆన్‌లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులు, యూపీఐ, వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, అలాగే పురమిత్ర మొబైల్ యాప్ ద్వారా సులభంగా చెల్లించే సౌకర్యం కల్పించారు. ఈ సదవకాశం ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉండటంతో, బకాయిదారులు ఆలస్యం చేయకుండా పన్నులు చెల్లించి వడ్డీ మాఫీతో పాటు రాయితీ ప్రయోజనాలను పొందాలని పురపాలక సంఘం సూచించింది. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక కౌంటర్ల ద్వారా పన్ను చెల్లింపులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

తిరుపతి

కన్నులపండువగా ముత్యాలమ్మ అమ్మవారి జాతర.. మూడవ రోజు ఊరేగింపులో భక్తుల సందడి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన ముత్యాలమ్మ ఆలయ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జాతరలో భాగంగా మూడవ రోజు గురువారం రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి, పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ సాగిన ఈ ఊరేగింపులో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి. కె. వేంకటేశ్వరులు, స్వయంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని అమ్మవారి కృపాకటాక్షాలు పట్టణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షింస్తున్నని అయన తెలిపారు. ఈ గ్రామోత్సవంలో ముక్కంటి ఆలయ పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, ముత్యాలమ్మ ఆలయ కమిటీ ఛైర్మన్ రేణుకాదేవి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి నీరాజనాలు అర్పించారు. జాతర సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

తిరుపతి

రమేష్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడింగ్ యూనియన్ నాయకుడు, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ ఎం. రమేష్ ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకుని రమేష్ పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రమేష్ పార్టీ పట్ల, కార్మిక విభాగం పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత వాయులింగేశ్వర స్వామిని ప్రార్థించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు ధైర్యం చెప్పారు. రమేష్ మృతికి నివాళులర్పించిన వారిలో , శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అంజూరు తారక శ్రీనివాసులు, పఠాన్ ఫరీద్, షేక్ జిలానీ బాషా, సాధన మున్నా రాయల్, పలువురు పార్టీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. వీరంతా రమేష్ కుటుంబానికి తమ సానుభూతిని ప్రకటించారు.

తిరుపతి

కోచ్ లేకున్నా.. హైవేపైనే ప్రాక్టీస్ చేస్తూ.. మూడు పతకాలు కొల్లగొట్టిన కమలేష్!

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): సాధించాలనే తపన ఉంటే వసతులు లేకున్నా విజయం వరిస్తుందని శ్రీకాళహస్తికి చెందిన విద్యార్థి కమలేష్ యాదవ్ నిరూపించాడు. పట్టణంలోని రత్నం స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి, సరైన శిక్షకుడు (కోచ్) లేకపోయినా, ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ అందుబాటులో లేకపోయినా తనకున్న ఆసక్తితో రోలర్ స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న కమలేష్, ఏకంగా మూడు పతకాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 100 మీటర్ల విభాగంలో రజత పతకం, 200 మరియు 500 మీటర్ల విభాగాల్లో రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకున్నాడు. కమలేష్‌కు స్కేటింగ్ అంటే మక్కువ ఉన్నా, శిక్షణ ఇచ్చే వారు లేకపోవడంతో తన తండ్రి సాయం తీసుకున్నాడు. ఎటువంటి సౌకర్యాలు లేని స్థితిలో నిత్యం జాతీయ రహదారి (హైవే) పైనే ప్రాక్టీస్ చేస్తూ మెళకువలు నేర్చుకున్నాడు. ఆ కష్టమే నేడు జిల్లా స్థాయిలో పతకాలు తెచ్చిపెట్టింది. ఈ చిన్నారి ప్రతిభను గుర్తించిన స్కూల్ యాజమాన్యం, పట్టణ ప్రముఖులు కమలేష్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఈ విద్యార్థి మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు.

తిరుపతి

ఏబీఎన్ కార్యక్రమంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం – ఆర్. కె.పై కేసు నమోదు చేయాలని డిమాండ్

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ చానల్‌లో ప్రసారమవుతున్న “కొత్త పలుకు” కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు మరియు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…. మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం సమాజానికి హానికరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని మతాల ప్రజలు సమానంగా ఉన్నప్పటికీ, ఇటువంటి వ్యాఖ్యలు సామాజిక విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, తగిన స్పందన లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదును స్వీకరించి, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తుచేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో తమ పార్టీ కార్యకర్తలకు అడ్డంకులు ఎదురవుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉన్నం వాసుదేవ నాయుడు, షేక్ సిరాజ్ భాష, కొగిలి సుబ్రహ్మణ్యం తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి కన్నప్ప ఆలయంలో నిర్లక్ష్యం? శాస్త్రోక్త పూజలు జరపాలంటూ ప్రభుత్వానికి వినతి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ పరిధిలో ఉన్న భక్త కన్నప్ప దేవాలయంలో నిత్య పూజా కార్యక్రమాల్లో నిర్లక్ష్యం జరుగుతోందని కాకినాడకు చెందిన భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు. దర్శనార్థం శ్రీకాళహస్తికి వచ్చిన రమణరాజు–వరలక్ష్మీ దంపతులు బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో విశ్రాంతి తీసుకుని, గురువారం ఉదయం సుప్రభాత వేళలో పాతాళ గణపతి, వాయులింగేశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ దేవిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్నారు. అనంతరం కొండపై ఉన్న భక్త కన్నప్ప ఆలయానికి వెళ్లగా ఆలయం తలుపులు మూసి ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడి భక్తుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, ఆలయం నిర్ణీత సమయాలు పాటించకుండా యథేచ్ఛగా తెరవడం, మూసివేయడం జరుగుతోందని తెలిపారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించకపోవడం ఆందోళనకరమన్నారు. ప్రతి సంవత్సరం శ్రీకాళహస్తి దర్శనం తమ పీఠం సంప్రదాయమని పేర్కొన్న రమణరాజు, సనాతన ఆచార ప్రకారం ముందుగా కొండపై కన్నప్పకు పూజలు నిర్వహించి అనంతరం వాయులింగేశ్వరునికి అభిషేకాలు చేయాలని అన్నారు. ఈ సంప్రదాయం విస్మరించడం అనర్హమని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వహణలో మార్పులు తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రికి లేఖలు రాసినట్లు తెలిపారు. శాస్త్రోక్త విధానాలు కచ్చితంగా అమలు చేయాలని, అపచారాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆధ్యాత్మిక సంస్థలు, భక్తులు కూడా ఈ అంశంపై స్పందించి ప్రభుత్వానికి వినతులు పంపాలని పిలుపునిచ్చారు.

తిరుపతి

వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

ఏర్పేడు, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలంలోని పాపనాయుడుపేటలో గురువారం నాడు జరిగిన నిశ్చితార్థ వేడుక రాజకీయ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. స్టార్ అంబేద్కర్ కృష్ణ కుమార్తెకు, పూతలపట్టు మాజీ శాసనసభ్యులు ఎం.ఎస్. బాబు కుమారుడికి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వధూవరులను పూలమాలలతో అభినందించి, భవిష్యత్తులో వారు సుఖసంతోషాలతో ఉండాలని ఎంపీ మరియు మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ బాబు కుటుంబ సభ్యులతో వారు కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, మాజీ బోర్డు సభ్యులు మున్నా రాయల్, పైపూరి రంగయ్య, మస్తాన్, డి.జె. సుధీర్, ధనంజయ రెడ్డి, నాగరాజు రెడ్డి, మణి, తిరుపాల్, ఈశ్వర్, గోపి, సునీల్, పఠాన్ ఫరీడ్, పి.ఎం. చంద్ర, కొనతనేరి గురవయ్య, మాజీ కౌన్సిలర్ కిషోర్, ఇతర నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.