Thursday, 23 April 2026

Blog

తూర్పు గోదావరి

టెక్నికల్ ప్రమాణాలతో రివర్ ఫ్రంట్ నిర్మాణం: ఆదిరెడ్డి

గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణంలో ఎటువంటి రాజీ లేకుండా టెక్నికల్ ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఫిల్లర్లు నాలుగు మీటర్ల లోతులో వేసి, ఫౌండేషన్‌ను లేయర్ బై లేయర్ సాండ్, గ్రావెల్‌తో బలంగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పనులు నాణ్యతతో కొనసాగుతున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభాగాల సమన్వయంతో విస్తృత స్థాయి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రివర్ ఫ్రంట్ పనుల బలాన్ని మరింత నిర్ధారించేందుకు ఇరిగేషన్ శాఖ ద్వారా సర్టిఫికేషన్ తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. గత వరదలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ నియంత్రణకు రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేస్తామని, ప్రతి ఘాట్‌కు సామర్థ్య పరిమితి నిర్ణయించి అవసరమైతే భక్తులను ఇతర ఘాట్లకు మళ్లించే విధానం అమలు చేస్తామని తెలిపారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా పుష్కరాల రేవులో జారిపడకుండా టైల్‌లపై గ్రూవ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత ఘటనలను పరిగణనలోకి తీసుకుని భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. వర్షాకాలానికి ముందు నగరంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మేజర్ డ్రైన్స్ డీ-సిల్టింగ్‌తో పాటు బాటిల్‌నెక్స్ తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. హైటెక్ బస్ స్టాండ్ వద్ద రూ.3.7 కోట్లతో మేజర్ డ్రైన్ పనులు ప్రారంభిస్తున్నామని, వీటితో ఆ ప్రాంతంలో నీట మునిగే సమస్య పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు. అలాగే విఎల్పురం, తిలక్ రోడ్, డీమార్ట్ వెనుక ప్రాంతాల్లో డ్రైనేజీ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు తీసుకుంటున్నామని, పుష్కరాల కంటే ముందే అన్ని పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. అధికారులతో కలిసి ఫీల్డ్ విజిట్స్ నిర్వహిస్తూ పనులపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, మేజర్, మైనర్ డ్రైనేజీలలో డీ-సిల్టింగ్ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో ఇంజనీరింగ్ మార్పులు, అవసరమైన చోట వెంట్ల విస్తరణ చేపడతామని చెప్పారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే, మే 31లోగా అన్ని పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి డ్రాగన్ బోట్ రేస్ నేపథ్యంలో నగరానికి భారీగా ప్రజలు వచ్చే అవకాశముండటంతో శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం అత్యవసరమన్నారు. నల్లా ఛానల్ వద్ద డబుల్ లైన్ సిస్టమ్ ప్రతిపాదనపై చర్చించి, ప్రస్తుత స్థితి, పనుల పురోగతి ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాటర్ పంపులు సిద్ధం చేయడం, మోటార్ క్లీనింగ్ కోసం అదనపు యంత్రాల కొనుగోలు, ఫీల్డ్ సిబ్బందికి ప్రత్యేక బాధ్యతల కేటాయింపు వంటి చర్యలు చేపడుతున్నామని కమిషనర్ వెల్లడించారు.

తూర్పు గోదావరి

న్యాయవాదుల భద్రతపై ఆందోళన

అన్నమయ్య జిల్లాకు చెందిన యువ న్యాయవాది పూజారి ఎల్లయ్య తన న్యాయవాది విధులను నిర్వర్తిస్తుండగా దుండగులు దారుణంగా హత్య చేయడం న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ అమానుష ఘటనను రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ, న్యాయవాదుల భద్రతపై గంభీర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు నిరసనగా బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం కోర్టు విధులను బహిష్కరించి, తమ నిరసనను వ్యక్తం చేశారు. న్యాయవాది ఎల్లయ్య హత్యను నిరసిస్తూ జిల్లా కోర్టు ప్రాంగణం వెలుపల పెద్ద ఎత్తున మానవహారం ఏర్పాటు చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.వి. ప్రసాద్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు సురక్షితంగా పనిచేసే పరిస్థితులు లేకపోవడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. పూజారి ఎల్లయ్య హత్య ఘటన న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిదర్శనమని పేర్కొన్నారు. న్యాయవాదుల భద్రతను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక “న్యాయవాదుల రక్షణ చట్టం”ను అమలు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులపై దాడి చేసిన వారికి నిర్దాక్షిణ్యంగా శిక్షలు విధించాలని కోరారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి పెళ్ళూరి రమేష్ మాట్లాడుతూ, న్యాయవాదులు న్యాయవ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. కోశాధికారి దాసరి అమ్ములు మాట్లాడుతూ, న్యాయవాదులపై దాడులు పెరుగుతుండటం వల్ల వృత్తి పట్ల భయం నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి గేడి రాజేశ్వరి మాట్లాడుతూ, మహిళా న్యాయవాదుల పరిస్థితి మరింత సంక్షోభంగా మారుతోందని పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావడం ద్వారా మాత్రమే ఈ దాడులను అరికట్టవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక ఇతర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కూడా న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తంగా, పూజారి ఎల్లయ్య హత్య ఘటన న్యాయవాదుల భద్రతపై పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ చట్టంపై చర్చ మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. న్యాయవాదులు భయాందోళనలు లేకుండా తమ విధులను నిర్వర్తించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా కోరుతున్నట్లు తెలియజేశారు.

తూర్పు గోదావరి

ABN రాధాకృష్ణ మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి.

ABN రాధాకృష్ణ మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల తిరుపతిరావు (అను) మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి గౌరవప్రదమైన జర్నలిజం లో ఉంటూ సభ్య సమాజం తొలగించుకునేలా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల భార్యలపై సిగ్గులేని వ్యాఖ్యలు చేశారని అందుకు రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే మావిగన్ రాజధాని వైయస్ జగన్ ప్రతిపాదించాలని దీనిని అందరూ సహకరిస్తున్నారని అన్నారు దీనిపై ప్రభుత్వ తన అనుకూల మీడియాతో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయిస్తుందని రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలకు పార్టీ నేతలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై దాడి చేయడం సిగ్గు సిగ్గు అని మహిళలను దేవతలగా పూజించే తరుణంలో రాధాకృష్ణ వ్యాఖ్యలు దురదృష్టకరమైన సంఘటన అని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి తద్యమని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఒకరే అని అన్నారు.

విశాఖపట్నం

స్టీల్ ఐఎన్టియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మోహన్

ఉక్కు కర్మాగారం సి.ఎమ్.ఇ. డిపార్ట్మెంట్ లో సీనియర్ జనరల్ ఫోర్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న.. ఉక్కు ఐఎన్టియుసి లో సీనియర్ నాయకులు అయిన *దిండు మోహన్* నీ.. ఉక్కు ఐఎన్టియుసి *వర్కింగ్ ప్రెసిడెంట్* గా నియమిస్తున్నట్లు… ఐఎన్టియుసి జాతీయ నాయకులు, ఉక్కు ఐఎన్టియుసి ఛీఫ్ ప్యాట్రన్ శ్రీ మంత్రి రాజశేఖర్ గారు ప్రకటించారు. ఉక్కు ఐఎన్టియుసి కార్యాలయం లో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశం మంత్రి రాజశేఖర్ గారు పాల్గొని మాట్లాడుతూ… దిండు మోహన్ యూనియన్ లో క్రమశిక్షణ కలిగిన నాయకుడనీ, త్వరలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కార్యకర్తలను సన్నద్ధం చేయాలనీ సూచించారు. నూతన వర్క్ంగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మోహన్ గారు మాట్లాడుతూ… తన పనితీరును గుర్తించి ఈ పదవి ని కట్టబెట్టిన అధినాయకులు మంత్రి రాజశేఖర్ గారికి, ప్రెసిడెంట్ రమణమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఉక్కు ఐఎన్టియుసి ప్రెసిడెంట్ పి.వి. రమణమూర్తి, జనరల్ సెక్రటరీ రాజు, ఎస్.ఎ. నాయుడు, కారు. రమణ, ఈశ్వరరావు, కుమార్, శ్రీనివాస్, అప్పారావు, సింహాచలం, సాహు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ఐదు ఎకరాల వరికి అష్టదిగ్బంధనం – పంటకు దారి మూసివేత

-ప్రభుత్వ భూమిపైనా అడ్డంకులు – రైతుకు రాకపోకల నిషేధం -విన్నపాలు వినిపించని రెవెన్యూ యంత్రాంగం – కాలయాపనతో నష్టం -“పైరు వదిలేయాలా..? ప్రాణం తీసుకోవాలా..?” రైతు కన్నీటి గాథ వ్యవసాయం చేసి పంట పండించడం ఒక పెద్ద కష్టమైతే… పండించిన పంటను ఇంటికి తీసుకెళ్లడం మరింత కష్టంగా మారిన ఘటన చిట్వేలి మండలంలో వెలుగుచూసింది. ఈడిగపల్లె గ్రామానికి చెందిన రైతు మీసాల శ్రీనివాసులు ఐదు ఎకరాల్లో వరి పంట పండించినా, దానిని ఇంటికి తరలించే దారిని అడ్డుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సుమారు రూ.1.50 లక్షల వ్యయంతో మాలే మార్పురం చెరువు కింద ఉన్న తన మాగాణిలో వరి సాగు చేసిన ఈ రైతు, మంచి దిగుబడి రావడంతో కొంత ఊరట పొందాడు. కానీ కోత ప్రారంభించిన సమయంలోనే అనూహ్యంగా సమస్యలు ఎదురయ్యాయి. పంటను నూర్పించి ఇంటికి తరలించేందుకు యంత్రాన్ని తీసుకురాగానే, అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారిని అడ్డుకుని ‘ఈ దారిలో రాకపోకలు చేయరాదు’ అంటూ అడ్డుకోవడం పరిస్థితిని క్లిష్టతరం చేసింది. -విన్నపాలు వినిపించని అధికార యంత్రాంగం సమస్య పరిష్కారం కోసం రైతు స్థానిక తహసీల్దార్‌ను ఆశ్రయించినప్పటికీ, స్పందన లేకపోవడం బాధాకరం. ఫిర్యాదు చేసినా, అది కేవలం విఆర్ఓకి బదిలీ చేయడానికే పరిమితమైందని రైతు ఆరోపిస్తున్నాడు. విఆర్ఓ ఒకసారి సర్వే చేస్తానని, మరోసారి వేరే సూచనలు ఇస్తూ కాలయాపన చేస్తున్నాడని వాపోతున్నాడు.ఇంతలో, పొలంలో ఉన్న వరి పంట క్రమంగా నేలకూలిపోతోంది. వర్షం పడితే పూర్తిగా నష్టం కలిగే ప్రమాదం ఉంది. రైతు కళ్లముందే తన శ్రమ వృథా అవుతుండగా, అధికారుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -ప్రభుత్వ భూమిపైనా ‘అడ్డంకుల రాజ్యం’ పొలానికి వెళ్లే దారి రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత హక్కుల పేరుతో అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. చెరువు ఆయకట్టు పరిధిలోని ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణలు పెరిగి, ఇతర రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.శ్రీనివాసులు తన పంటను తరలించేందుకు ప్రయత్నించగా, అదే దారిలో రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం గమనార్హం. ఇది కేవలం ఒక రైతు సమస్య మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న భూవివాదాలకు ప్రతీకగా మారింది. -“పైరు వదిలేయాలా..? ప్రాణం తీసుకోవాలా..?” ఈ ఘటనపై రైతు మీసాల శ్రీనివాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ,“నేను చిన్న రైతును. వ్యవసాయం తప్ప మరో జీవన మార్గం లేదు. అప్పులు చేసి వరి సాగు చేశాను. పంట పండింది. కానీ దాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కూడా అడ్డంకులు వస్తున్నాయి. ప్రభుత్వ భూమిలో కూడా వెళ్లొద్దంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో నేను పంట వదిలేయాలా..? లేక ప్రాణం తీసుకోవాలా..?” అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.అతను ఇంకా మాట్లాడుతూ, “తహసీల్దార్ స్పందించడం లేదు. విఆర్ఓ గ్రామంలో రాజకీయాలు చేస్తున్నాడు. పై అధికారులు వెంటనే జోక్యం చేసుకోకపోతే రైతుగా నేను బతకలేను” అని వేదన వ్యక్తం చేశాడు. -వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం పదేపదే సూచనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. పండించిన పంటను ఇంటికి తెచ్చుకునే హక్కు కూడా లేకుండా రైతు ఇబ్బందులు పడటం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా మారింది.ఈ సమస్యపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రైతుకు న్యాయం చేయాలని స్థానికులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఇలాంటి సంఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీలో కొత్త నియామకాలు – నేతలకు హార్ధిక అభినందనలు

రాజన్న సిరిసిల్ల జిల్లా/ఏప్రిల్/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలో కీలక పదవులకు నియామకాలు చోటుచేసుకున్నాయి. జిల్లా ఉపాధ్యక్షులుగా కొండం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏళ్ల బాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శిగా లింగంపల్లి ఎల్ల గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు వారికి పేరుపేరునా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులు ప్రజలకు చేరువగా ఉండి, పార్టీ అభివృద్ధికి తమ వంతు సేవలు అందిస్తామని తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీలో కొత్త నియామకాలు – నేతలకు హార్ధిక అభినందనలు

రాజన్న సిరిసిల్ల జిల్లా/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలో కీలక పదవులకు నియామకాలు చోటుచేసుకున్నాయి. జిల్లా ఉపాధ్యక్షులుగా కొండం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏళ్ల బాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శిగా లింగంపల్లి ఎల్ల గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు వారికి పేరుపేరునా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులు ప్రజలకు చేరువగా ఉండి, పార్టీ అభివృద్ధికి తమ వంతు సేవలు అందిస్తామని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేవూరు కృష్ణయ్య అంత్యక్రియలకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరు – కుటుంబానికి పరామర్శ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 9 (మల్లికార్జున రావు పున్నమి ప్రతినిధి) .మడమనూరు నీటి సంఘం డైరెక్టర్ చేవూరు శేషయ్య తండ్రి, టిడిపి నాయకులు చేవూరు కృష్ణయ్య మరణం ప్రాంతంలో విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన ఉత్తర క్రియలకు హాజరై కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు శివుడు రాజా గౌడ్, సాని వెంకట రమణయ్య, వెందోటి భాస్కర్ రెడ్డి నూనె లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

యూఎస్–ఇరాన్ కాల్పుల విరమణ: శాంతి సంకేతమా? లేక యుద్ధానికి విరామమా?

Donald Trump ఆకస్మిక హెచ్చరికల నుంచి రెండు వారాల సైనిక విరామాన్ని ప్రకటించడంతో అమెరికా–ఇరాన్ మధ్య సున్నితమైన కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇరాన్ దీన్ని విజయం అని పేర్కొనగా, అమెరికా ‘మిషన్ పూర్తి’గా చూపుతోంది. ఈ పరిణామంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా ఎదగడం గమనార్హం. Stanly Johny – Smriti Sudesh చర్చలో ఇది స్థిర శాంతికి సంకేతమా లేదా తాత్కాలిక విరామమా అన్న సందేహం వ్యక్తమైంది. కీలక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పరిస్థితి ఇంకా అనిశ్చితంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

జాతీయ అంతర్జాతీయ

హార్ముజ్ స్రైట్ దాటి భారత్‌కు LPG నౌక రాక

Jawaharlal Nehru Port Authority తెలిపిన ప్రకారం, భారత్ జెండా కలిగిన ఓ నౌక 15,400 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో విజయవంతంగా భారత్‌కు చేరుకుంది. ఈ నౌక Strait of Hormuz మార్గం గుండా ప్రయాణించడం విశేషం. ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రయాణం సురక్షితంగా పూర్తవడం కీలకంగా భావిస్తున్నారు. దేశంలో ఇంధన సరఫరా స్థిరత్వానికి ఇది ఊతమివ్వనుందని అధికారులు తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.