Thursday, 23 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం

పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం (08.04.2026) పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 42 సంవత్సరాల పాటు సేవలందించిన బి. జయంత్ కుమార్ (PC-1264) మరియు 43 సంవత్సరాల పాటు సేవ చేసిన కె. హజరత్ (హెడ్ కానిస్టేబుల్-1038)లను జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ మరియు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి CH. సౌజన్యలు ఆత్మీయంగా సత్కరించారు. పోలీస్ విభాగానికి వారు అందించిన సేవలను ఈ సందర్భంగా అధికారులు ప్రశంసించారు. క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ విభాగానికి మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. వారి సేవలు పోలీస్ శాఖకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సహచర సిబ్బంది రిటైర్డ్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి భవిష్యత్తు జీవితంలో సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగి, భావోద్వేగ వీడ్కోలుతో ముగిసింది.

అనకాపల్లి

యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక ఓపీ భవనం ప్రారంభం – ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్..

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 8 : ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన అవుట్ పేషెంట్ (ఓపీ) భవనాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ భవనం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. టోయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా సంస్థ CSR నిధులతో నిర్మించిన ఈ సదుపాయం ఆధునిక వైద్య పరికరాలతో సిద్ధమైంది. ప్రజలకు సౌకర్యవంతమైన చికిత్స అందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

తిరుపతి

సి కె పల్లి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా ఎంఈఓ బాధ్యతలు

సత్కరించిన కూటమి నాయకులు పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలం సికె పల్లి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా మండల విద్యాశాఖ అధికారి మార్కొండ నాయుడు ను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నియమించారు. ఏప్రిల్ రెండవ తేదీతో సర్పంచులు పదవీకాలం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. బుధవారం స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎంఈఓ మార్కొండ నాయుడిని, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కూటమి నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, వేసవికాలం ప్రారంభం అవడంతో ముఖ్యంగా పంచాయతీ గ్రామాలలో త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించి నీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. పంచాయతీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పవన్, పంచాయతీ సెక్రటరీ శిరీష, కూటమి నాయకులు బి. కోటేశ్వర్ రెడ్డి,బి. రామకృష్ణారెడ్డి, ఎస్ ప్రభాకర్, కుప్పారెడ్డి, బాబయ్య, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు పిహెచ్‌సీపై ఆకస్మిక తనిఖీ – 24 గంటల సేవలపై అధికారుల సమీక్ష

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 8 (మల్లి పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు జిల్లా వైద్యశాఖ అధికారి మరియు నెల్లూరు డివిజనల్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఖాదరవల్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో 24 గంటల సేవలు అందుతున్నాయా అనే అంశంపై పరిశీలించారు. సాయంత్రం సమయంలో ఓపీ సేవలు నిర్వహిస్తున్నారా అని ఓపీ, ఐపీ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రాజయ్య, పబ్లిక్ హెల్త్ నర్స్ జయలక్ష్మి, స్టాఫ్ నర్స్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

కడప

ప్రొద్దుటూరులో కానిస్టేబుల్ ఆత్మ హత్యయత్నం..!

ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ AR కానిస్టేబుల్ సురేశ్ బుధవారం ఉదయం కుటుంబ సమస్యలతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సురేశ్ భార్య నీలిమతో గొడవ పడి విడిగా కాపురం ఉంటున్నాడు. శ్రావణి అనే మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. సురేశ్ తనను మోసం చేశాడని శ్రావణి ఫిర్యాదు చేసింది. ఈమేరకు స్థానిక 1టౌన్ సీఐ కొండారెడ్డి విచారణ చేస్తున్నారు.

ఖమ్మం

ప్రభుత్వ ఆసుపత్రి లో భద్రతా వైఫల్యం – వరుస దొంగతనాలతో ప్రజల్లో భయం బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ తీవ్ర ఆందోళన:

ఖమ్మం ఏప్రిల్ ( పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీలు సాధారణ ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రిని ఆశ్రయించే రోగులు, వారి బంధువులు వాహనాలు సురక్షితంగా ఉంచే స్థలం కూడా లేక ఇబ్బందులు పడుతుండటం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా? అన్న అనుమానాలకు తావిస్తోంది. బుధవారం ఈ సమస్యపై ఆసుపత్రి ఆవరణలో బీజేపీ ఆందోళన నిర్వహించిన బీజేపీ శ్రేణులు కార్యక్రమం లో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ మాట్లాడుతూ వాహనాలు చోరీకి గురైతే రోగులు పడే మానసిక వేదన, ఆర్థిక భారం ఎవరు భరిస్తారు?” అంటూ ప్రశ్నించారు ఆసుపత్రి లోపల సీసీ కెమెరాలు ఉన్నట్టే ఉన్నప్పటికీ, అవి పనిచేయడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కెమెరాలు పనిచేయనివి అన్న విషయం ఆసుపత్రి వర్గాలకే ముందుగా ఎలా తెలిసిందన్న అనుమానం కూడా అయన వ్యక్తం చేశారు. మునుపు టోకెన్ సిస్టమ్ ఉండేది. రద్దీ లేకుండా పార్కింగ్ నిర్వహించేవారు. కానీ, పార్కింగ్ కాంట్రాక్టర్ లీజ్ తీసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయిందని ఆయన అన్నారు. ఒక్కరోజులోనే మూడు వాహనాలు చోరీకి గురవడం ఆసుపత్రి ఆవరణ భద్రతపై మరింత అనుమానాలు పెంచుతోందన్నారు. జర్నలిస్టులు, ఆసుపత్రి సిబ్బంది వాహనాలే సురక్షితంగా లేకపోతే సాధారణ ప్రజలకు భద్రత ఎలా లభిస్తుందని ధనియాకుల వెంకట్ నారాయణ ప్రశ్నించారు. అనారోగ్యంతో వచ్చిన రోగులు, వారి కుటుంబాలు వాహనాల భయం కూడా భరించాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఆసుపత్రిలో నిఘా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అని ధనియాకలు వెంకటనారాయణ విమర్శించారు. పోలీసులు, ఆసుపత్రి అధికారులు కలిసి భద్రత కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రి ఆవరణలో వెంటనే పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పార్కింగ్ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. వాహనదారుల భద్రత కోసం అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని , లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ధనియాకుల వెంకట్ నారాయణ. హెచ్చరించారు. అనంతరం హాస్పిటల్ సూపర్ఇంటెండ్ అధికారి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సమస్య లని త్వరలో నే పరిష్కారసిస్తాము అని ఆయన బీజేపీ శ్రేణులు లకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో తాజనూత భద్రం, రుద్ర గాని మాధవ్, పాశం శ్రీనివాసరెడ్డి, ఈశ్వర ప్రగడ, లలిత దాసరి, వీరభద్రం, ఇనుగుర్తి ఉపేంద్ర, శ్రీజర్ల వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఉచిత ప్రవేశాలకు గడువు పొడిగింపు – ఏప్రిల్ 10 వరకు అవకాశం

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అమలవుతున్న ఆర్టిఈ చట్టం 12(1)(C) ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి అర్హుల జాబితాను రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ విడుదల చేసిన విషయం విదితమే. ఈ జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన మొత్తం 808 మంది విద్యార్ధులు ఉచిత ప్రవేశాలకు అర్హత పొందినవారిగా ఎంపిక చేయబడ్డారు. వీరికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25% రిజర్వేషన్ కోటా కింద ఉచిత ప్రవేశాలు కేటాయించబడినవి. మునుపుగా అడ్మిషన్ ప్రక్రియను 07 ఏప్రిల్ 2026 లోపు పూర్తిచేయవలసిందిగా సూచించగా, పలు తల్లిదండ్రుల అభ్యర్ధనలు దృష్ట్యా, విద్యార్ధుల ప్రయోజనార్ధం అడ్మిషన్ గడువును 10 ఏప్రిల్ 2026 వరకు పొడిగించడం జరిగినది. అందువల్ల అర్హత పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల అర్హత ధృవపత్రాలు (ఇన్కమ్, కాస్ట్, ఆధార్, జనన ధృవీకరణ పత్రాలు మొదలైనవి) మరియు ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీతో పాటు, తమకు కేటాయించిన సంబంధిత పాఠశాలలో 10 ఏప్రిల్ 2026 లోపు సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తిచేయవలెను. ముఖ్యంగా, ఉచిత ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థులకు కేటాయించిన పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్మిషన్ నిరాకరించరాదు. గడువు లోపు ప్రక్రియ పూర్తిచేయని పక్షంలో, అలాటెడ్ సీటు రద్దు చేయబడుతూ తదుపరి అర్హులకు అవకాశం కల్పించబడుతుంది.. అభ్యర్ధులు తమ ఎంపిక స్థితి మరియు కేటాయించిన పాఠశాల వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చును. ఎటువంటి సందేహాలు ఉన్నా సంబంధిత పాఠశాల నిర్వాహకులు, మండల విద్యాశాఖ కార్యాలయం (MEO Office) లేదా జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయాన్ని సంప్రదించవచ్చును. మండల విద్యాశాఖాధికారులు (MEOలు) ఈ గడువు పొడిగింపు విషయాన్ని తమ పరిధిలోని తల్లిదండ్రులకు విస్తృతంగా తెలియజేయడంతో పాటు, ప్రైవేట్ పాఠశాలలు ఎటువంటి నిరాకరణలు చేయకుండా అడ్మిషన్లు చేపట్టేలా పర్యవేక్షించి, జరిగిన అడ్మిషన్ వివరాలను ధృవీకరించి పూర్తి నివేదికను లిఖితపూర్వకంగా జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి సమర్పించవలసిందిగా ఆదేశించబడింది. ఈ సందర్భంగా ఏపీసీ డి. వెంకటసుబ్బయ్య గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించే ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని, గడువు లోపు ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలని, వారి పిల్లల భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా మారుతుందని పేర్కొన్నారు.

పల్నాడు

నాగార్జునసాగర్ కుడికాల్వలో యువకుడు గల్లంతు*

*తన స్నేహితులతో కలిసి ఈతకి కాల్వలోకి దిగి గల్లంతైన యువకుడు శోకసముద్రంలో యువకుడు కుటుంబం* *పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో చోటు చేసుకున్న విషాద సంఘటన* ప్రమాదం ఆపదలు ఎటువైపు నుంచి వస్తాయో కూడా తెలియని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి, ఈలాంటి సంఘటనే ఈ రోజు జరిగింది పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని వినుకొండ రోడ్ లో గల కొమెర రాజారావు 13 సంవత్సరాలు, అనే యువకుడు తన స్నేహితులతో తన ఇంటి సమీపంలో ఉన్న నాగార్జునసాగర్ కుడికాల్వలోకి ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది, విషయం తెలుసుకున్న అక్కడ కాలనీ వాసులు గ్రామ ప్రజలు ఎంత వెతికినా యువకుడు ఆచూకీ తెలియలేదు,

తిరుపతి

అడ్వకేట్ల సంక్షేమంపై దృష్టి – ఏపీ బార్ కౌన్సిల్ సత్తు అంకయ్య స్పష్టం

శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని మంగళవారం నాడు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సత్తు అంకయ్య సందర్శించారు. ఈ యనకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరంభాకం ముని ప్రసాద్ నేతృత్వంలో న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సత్తు అంకయ్య మాట్లాడుతూ, న్యాయవాదుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానన్నారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం, వెల్ఫేర్ ఫండ్ బలోపేతం, ఆరోగ్య బీమా, మరణానంతర లాభాలు, వాలంటరీ రిటైర్మెంట్ వంటి కీలక అంశాలపై సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. న్యాయవాదులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. తనను ఎప్పుడైనా కలిసేందుకు అందుబాటులో ఉంటానని, న్యాయవాదులు తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తనకు అఖండ విజయం అందించిన న్యాయవాదులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశం అనంతరం శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్తు అంకయ్యకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.