*ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పూదత్తు భాస్కర్ గారికి ఘనంగా పదవీ విరమణసన్మానం*
*పున్నమి ప్రతినిధి జోగులాంబ గద్వాల జిల్లా:: తేదీ:: 23/04/2026*
*దాదాపు 24 సంవత్సరాలు ఉపాధ్యాయ ప్రస్థానంలో ఎంతోమంది ఉత్తమ పౌరులుగా వివిధ రంగాలలో తీర్చిదిద్దిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పూదత్తు భాస్కర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతలకుంట, కేటి దొడ్డి మండలం గారి పదవి విరమణ సన్మాన కార్యక్రమం విద్యార్థులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, గ్రామ ప్రథమ పౌరులు, సింగిల్ విండో అధ్యక్షులు, రాజశేఖర్, రఘురామయ్య శెట్టి ,వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన శ్రేయోభిలాషులు, మిత్రులు, ఉపాధ్యాయ బృందం ఘనంగా పదవి విరమణ కార్యక్రమంలో సన్మానించడం జరిగింది ఆయన సేవలు కొనియాడారు,*
*ఇంకా ఈ కార్యక్రమంలో, కేటిదొడ్డి మండల విద్యాధికారి విజయభాస్కర్ ,ఆలూరు గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కే నాగరాజు రంగారెడ్డి గూడా ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వేణాచారి, గోవర్ధన్ రెడ్డి, జూనియర్ లెక్చరర్ నరేందర్ గౌడ్ ,రాజశేఖర్ గౌడ్ ,వరలక్ష్మి ఇందిరా, పాతపాలెం గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాఘవేందర్ ,రిటైర్డ్ ఉపాధ్యాయులు రాంప్రసాద్ గారు నాగన్న, మాజీ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ లు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం. ఎన్ విజయకుమార్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు*


