Tuesday, 28 April 2026
  • Home  
  • ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కోలా ఆనంద్
- తిరుపతి

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కోలా ఆనంద్

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మంగళవారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, పాలక మండలి సబ్యులు భానుప్రకాష్ రెడ్డిలు ఆయనతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి, బిజెపి నేతలకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపరాష్ట్రపతితో కలిసి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఇతర బిజెపి ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.