శ్రీకాళహస్తి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం శ్రీకాళహస్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కోతలు లేకుండా సరఫరా: పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా వినియోగదారులకు ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు: ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

విద్యుత్ అధికారులతో బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్ష.. లో-వోల్టేజ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి