శ్రీకాళహస్తి పట్టణంలో గత నాలుగు రోజులుగా శ్రీకాళహస్తి పట్టణంలో నెలకొన్న పెట్రోల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మంగళవారం పట్టణంలోని బంకులకు ఇంధనం చేరుకున్నప్పటికీ, నిర్వాహకుల మొండి వైఖరి వల్ల సామాన్య ప్రజలు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిప జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ (NHRC) రాష్ట్ర ఇంచార్జ్ ఎం. రవీంద్ర తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. బాటిళ్లలో పెట్రోల్ నిరాకరణ: సుదూర ప్రాంతాల్లో ఇంధనం అయిపోయి వాహనాలు నిలిచిపోవడంతో, వినియోగదారులు బాటిళ్లతో బంకుల వద్దకు వస్తున్నారు. అయితే, “కేవలం వాహనాలకే పోస్తాం, బాటిళ్లలో ఇవ్వము” అంటూ నిర్వాహకులు నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపిస్తున్నారు. అయోమయంలో వాహనదారులు: ప్రభుత్వ నిబంధనల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టడంపై వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన బండ్లు కనీసం బంకు వరకు తెచ్చుకోవడానికి కూడా ఇంధనం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల స్పందన అవసరం: ఈ గందరగోళంపై సంబంధిత శాఖాధికారులు తక్షణమే స్పందించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి కనీస ఇంధనాన్ని విడిగా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని రవీంద్ర డిమాండ్ చేశారు. దూర ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయి ఇబ్బంది పడుతున్న వారికి మానవతా దృక్పథంతో ఇంధనం అందించాలి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే బంక్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

శ్రీకాళహస్తిలో పెట్రోల్ తిప్పలు-బంక్ నిర్వాహకుల తీరుపై NHRC రాష్ట్ర ఇంచార్జ్ ఆగ్రహం