Thursday, 23 April 2026

Blog

E-పేపర్

దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించాల్సిందే..

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూ.గో.జిల్లా రాజమహేంద్రవరం దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించాల్సిందే.. -కాంగ్రెస్ అఖిల పక్ష సమావేశంలో నాయకుల డిమాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాసేలా దేశంలో పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పలు రాజకీయ పార్టీలు, క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు, ప్రజా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన స్థానిక ఎపి పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో మంగళవారం అఖిల పక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకుడు టి.మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్‌కుమార్ జైన్, కెకె సంజీవరావు, ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపకుడు దేశిరెడ్డి బలరామ నాయుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తాళ్లూరి విజయకుమార్ సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునర్ సమీక్ష చేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేసారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరూ ఏ మతాన్నైనా అనుసరించే హక్కు ఉందని, మతం ప్రకారం రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమని తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్‌లో దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించేలా చర్చించి రాజ్యాంగాన్ని సవరణ చేపట్టాలని డిమాండ్ చేసారు. దేశవ్యాప్తంగా దీనిపై పోరాటం చేయడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు ఎవరికి అవకాశం ఉండకూడదన్నారు. మతం మారితే రిజర్వేషన్లు కోల్పోవాలనే నిర్ణయం తీసుకోవాన్ని పెద్ద కుట్రగా అభివర్ణించారు. దీనిపై తక్షణం ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేయించాలని డిమాండ్ చేసారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించే వరకు అఖిల పక్ష కమిటీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసారు. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కూడా సమావేశంలో తీర్మానం చేసారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార్టిన్ లూథర్, డాక్టర్ వడయార్, బెజవాడ రంగారావు, వివిధ పక్షాల నాయకులు పవన్, కొండలరావు, కూండ్రపు రాంబాబు, పూర్ణిమారాజ్, సింధియా రాణి, శ్రీనివాస్, యాళ్ల వీరభద్రరావు, నిల్లా వీర్రాజు, తాడి సూరిబాబు, బర్రే సుబ్రహ్మణ్యం, నల్లా రామారావు తదితరులు పాల్గొన్నారు.

కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు: డ్రైనేజీలో మృతదేహం

ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం రోడ్డులోని డ్రైనేజీ కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారు 1టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్ బాషా కార్మికులతో మృతదేహాన్ని బయటకి తీయించారు. మృతుడి వివరాల కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు.

E-పేపర్

కోహెడ పండ్ల మార్కెట్ పై హరీశ్ రావు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు..పండ్ల మార్కెట్ రైతులను,వ్యాపారులను మోసం చేసిన చరిత్ర BRS పార్టీది.

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 07 ఏప్రిల్ 2026 కోహెడ పండ్ల మార్కెట్ పై హరీశ్ రావు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు..పండ్ల మార్కెట్ రైతులను,వ్యాపారులను మోసం చేసిన చరిత్ర BRS పార్టీది.* *మార్కెట్ ను సర్వం ముంచిన చరిత్ర హరీశ్ రావు కే దక్కుతుంది..BRS నాయకులు ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు..* *రెండు స్థలాలు మార్కెట్ కి సంబంధించినవే..ఒకటి హాల్ సెల్ మార్కెట్..మరొకటి అంతర్జాతీయ స్థాయి మార్కెట్.(ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్) దుష్ప్రచారాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.* …….*AMC చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి హెచ్చరిక.* *కోహెడ పండ్ల మార్కెట్ స్థలం పైన మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై కాంగ్రేస్ నాయకులపై ఈర్ష్వ భావజాలంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి ఆరోపించారు..* *మంగళవారం ఉదయం తొర్రూరు లోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యుల తో కలిసి చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…….* *కోహెడ లో పండ్ల మార్కెట్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011 సంవత్సరంలో కాంగ్రేస్ ప్రభుత్వం సుమారు 178:09 ఎకరాలు కేటాయించింది…గడిచిన 10 సంవత్సరాల BRS పాలనలో ఎలాంటి పురోగతి సాధించలేదని ఆరోపించారు..కొత్తపేట లో ఉన్న పండ్ల మార్కెట్ ను కరోనా వైరస్ పేరుతో కమీషన్లకు కక్కుర్తి పడి రాత్రికి రాత్రి 2020 సంవత్సరంలో ఎలాంటి జీవో జారీ చేయకుండా రోడ్డు మీదకి పంపించారని అన్నారు….అప్పటి BRS ప్రభుత్వం MLA లు కోహెడ కి సుమారు 5 కోట్లు కేటాయించి తాత్కాలిక టెంట్లతో ఏర్పాటు చేస్తే ఒక్క గాలివాన కు కొట్టుకుపోయిందని అన్నారు..ఆ తర్వాత 2021 సంవత్సరంలో సుమారు 4 కోట్లు ఖర్చు పెట్టి KTR బినామీల మీద ఉన్న బాటసింగారం HMDA లాజిస్టిక్ పార్కు కు తరలించారని తెలిపారు..వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ నిర్మాణం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు..* *ఇప్పుడు ఉన్న 178:09 ఎకరాల మార్కెట్ స్థలాన్ని మార్కెట్ ఎగుమతులు దిగుమతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు అనుమతి కోసం TGIIC కి ఇవ్వడం జరిగింది అన్నారు..దీనిలో వేరే ఉద్దేశం లేదని చెప్పారు..ఇప్పటికే ఉన్న భూమికి అదనంగా సర్వే నంబర్ 169/1 లో సుమారు 239 ఎకరాలు కొహెడ మార్కెట్ కి ఇస్తూ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది..రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అంతర్జాతీయoగా ఎగుమతులు దిగుమతులు చేసేందుకు ఈ రెండు స్థలాలు ఉపయోగపడతాయని అన్నారు…హరీష్ రావు గారు ఇతర సంస్థలకు భూములు ఇస్తున్నారన్న ఆరోపణలు పచ్చి అబద్ధాలు అన్నారు..పని లేని విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు..త్వరలోనే కోహెడలో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ కి శంకుస్థాపన చేస్తామని రైతుల ఉద్యానవన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పారు.ఒక స్థలం హాల్ సెల్ వ్యాపారం కోసమని,మరొకటి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతుల దిగుమతుల కోసమని చెప్పారు..రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు..BRS పార్టీ MLA లు ఇబ్రహీంపట్నం నాయకులు కోహెడ పండ్ల మార్కెట్ గురుంచి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు..రైతుల భూములు ఉంటే తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు…BRS నాయకులతో సమావేశం పెట్టడం కాదని…దమ్ముంటే మార్కెట్ వ్యాపారులు రైతులతో మాట్లాడాలని సవాల్ చేశారు.* *ఈ సమావేశంలో వైస్ చైర్మన్ Ch,బాస్కర చారి…సభ్యులు బండి మధుసూదన్ రావు…పన్యాల జైపాల్ రెడ్డి…మేకం లక్ష్మి…గణేష్ నాయక్…మచ్చెందర్ రెడ్డి.. రఘుపతి రెడ్డి…గోవర్ధన్ రెడ్డి…నవరాజ్…వెంకటేశ్వర్లు గుప్తా…ఇబ్రహీం…తో పాటు పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.*

ఆంధ్రప్రదేశ్

శాశ్వత రాజధాని అమరావతిపై NTA హర్షం – 30% IR ప్రకటించాలని విజ్ఞప్తి

నెల్లూరు, ఏప్రిల్ 7 (పున్నమి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి రాజముద్ర వేయడంపై నెల్లూరు జిల్లా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ (NTA) హర్షం వ్యక్తం చేసింది. దేశాధినేత శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌ శ్రీ అమిత్ షా గారికి, అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే 30 శాతం మధ్యంతర భృతి (IR) ప్రకటించాలని సంఘం వినమ్రంగా కోరింది. నాటకం తిరుమలయ్య (అధ్యక్షులు), చెన్నయ్య (ప్రధాన కార్యదర్శి) ఈ మేరకు తెలిపారు

తిరుపతి

వైభవంగా శ్రీరాములు పట్టాభిషేకం కన్నుల పండుగగా శ్రీ సీతారాముల గ్రామోత్సవం

పున్నమి ప్రతినిధి, రామచంద్రాపురం రామచంద్రపురం మండలం సికె పల్లి పంచాయతీ చిట్టత్తూరు గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు 11 రోజులు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామ నవమి నుంచి ప్రతిరోజు ఒక పురవీధికి సంబంధించిన గ్రామస్తులు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు సోమవారం శ్రీరాములు వారికి పట్టాభిషేకం, శ్రీ సీతారాముల దేవరులకు గ్రామోత్సవం గ్రామంలోని యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వసంతోత్సవం కార్యక్రమం నిర్వహించి గ్రామ వీధుల్లో స్వామివారిలను ఊరేగించారు. రాత్రి స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించి, దేవదేవేర్లను గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం చేశారు. శ్రీ సీతారాములు ఊరేగింపుగా పురవీధులలో చెక్కభజనలు, భజన కార్యక్రమాలతో భక్తులను కటాక్షించారు. ఇంటి ముందరికి వచ్చిన శ్రీ సీతారాములకు మహిళలు కర్పూర హారతులు ఇచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. శ్రీరామనామం స్మరణ తో పిల్లలు పెద్దలు మహిళలు ఆనంద పరవశమయ్యారు. ఉభయ దాతలుగా తూకువాకం భాను కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. భక్తులందరికీ అన్నదాన వితరణ చేశారు.

తిరుపతి

వైభవంగా శ్రీరాములు పట్టాభిషేకం కన్నుల పండుగగా శ్రీ సీతారాముల గ్రామోత్సవం

పున్నమి ప్రతినిధి, రామచంద్రాపురం రామచంద్రపురం మండలం సికె పల్లి పంచాయతీ చిట్టత్తూరు గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు 11 రోజులు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామ నవమి నుంచి ప్రతిరోజు ఒక పురవీధికి సంబంధించిన గ్రామస్తులు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు సోమవారం శ్రీరాములు వారికి పట్టాభిషేకం, శ్రీ సీతారాముల దేవరులకు గ్రామోత్సవం గ్రామంలోని యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వసంతోత్సవం కార్యక్రమం నిర్వహించి గ్రామ వీధుల్లో స్వామివారిలను ఊరేగించారు. రాత్రి స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించి, దేవదేవేర్లను గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం చేశారు. శ్రీ సీతారాములు ఊరేగింపుగా పురవీధులలో చెక్కభజనలు, భజన కార్యక్రమాలతో భక్తులను కటాక్షించారు. ఇంటి ముందరికి వచ్చిన శ్రీ సీతారాములకు మహిళలు కర్పూర హారతులు ఇచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. శ్రీరామనామం స్మరణ తో పిల్లలు పెద్దలు మహిళలు ఆనంద పరవశమయ్యారు. ఉభయ దాతలుగా తూకువాకం భాను కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. భక్తులందరికీ అన్నదాన వితరణ చేశారు.

E-పేపర్

**ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు

*కాకినాడ* : పున్నమి న్యూస్ ప్రతినిధి కాకినాడ జిల్లా పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజాఅర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమం ఈ సోమవారం కూడా నగర పాలక సంస్థ కార్యాలయంలో యథావిధిగా జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ పాల్గొని స్వయంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.డ్రైనేజీ సమస్యలు, వీధిలైట్లు, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి వివిధ అంశాలపై ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. మొత్తం 14 అర్జీలు అందగా, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాధికారులకు కమిషనర్ సూచించారు.అంతకుముందు నిర్వహించిన “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమంలో ఇద్దరు ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కే శ్రీనివాస్,, టిపిఆర్వో శైలజ, ,ఈ ఈ కనకారావు , మేనేజర్ శిరీష్ కుమార్ ,సచివాలయ ఉద్యోగులుతదితర అధికారులు పాల్గొన్నారు.

E-పేపర్

అంటువ్యాధులకు కేంద్రాలుగా మారుతున్న స్విమ్మింగ్ పూల్స్!

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 07 ఏప్రిల్ 2026 అంటువ్యాధులకు కేంద్రాలుగా మారుతున్న స్విమ్మింగ్ పూల్స్! స్విమ్మింగ్ పూల్స్‌లో స్నానం కాదు… వ్యాధులకు ఆహ్వానం! అంటు వ్యాధులకు అడ్డగా స్విమ్మింగ్ పూల్స్ నిబంధనలకు “నీళ్ళు”..! జిల్లాలో అడుగడుగునా స్విమ్మింగ్ పూల్స్ పుట్టుకొచ్చాయి. నిబంధల ప్రకారం స్విమ్మింగ్ పూల్ లోకి దిగే ముందు జలధార స్నానం చేయాలి.కానీ ఎక్కడ కూడా నిబంధనలు పాటించకుండానే నిర్వహిస్తున్నారు.నీటిని తరచూ శుద్ధిచేయాలి,మార్చాలి.ముఖ్యంగా భూగర్భ జలశాఖశాఖ అనుమతులు తప్పనిసరి గా ఉంది.స్థానిక మున్సిపల్,గ్రేటర్ కార్యాలయంలో అనుమతులు తీసుకోవాలి.కానీ ఇలాంటి అనుమతులు లేకుండానే యదేచ్ఛగా,విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరిగ్గా స్పందించి దాడులు చేస్తే ప్రభుత్వానికి ఎంతో ఆదాయం చేకూరుతుందని అంటున్నారు. నిబంధనలు పాటించకుండా స్విమ్మింగ్ పూల్స్ నిర్వహించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, పలు అంటూ వ్యాధులకు కారణం అవుతుందని ఇకనైనా అధికారులు ప్రేక్షక పాత్ర విడాలని అధికారుల తీరుపై ప్రజలు మార్పు కోరుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్రైమ్ విభాగంలో కీర్తి గడించిన రిటైర్డ్ ఎస్‌ఐ నాటకంసుధాకర్ గారు ఇక లేరు

*07.04.2026 నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పోలీస్ శాఖలో ఎక్కువ శాతం క్రైమ్ విభాగంలో సేవలందించి సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ కాబడిన నాటకం సుధాకర్ గారు ఈరోజు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నందు మరణించడం జరిగిందని, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నామని ఏపీజిఈఎఫ్ మరియు ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైమ్ విభాగంలో నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టించి పోలీస్ డిపార్ట్మెంట్ కి వన్నెతెచ్చిన నాటకం సుధాకర్ గారు ఇండియన్ పోలీస్ మెడల్ సాధించడంతోపాటు 252 అవార్డులు రివార్డులు అందుకోవడం జరిగిందని, 24 గంటలు డ్యూటీ డ్యూటీ అని పరితపించే గొప్ప వ్యక్తిని, అదేవిధంగా అనేక మంది పేద ప్రజలకు ఆర్థికంగా సహాయపడటం పలువురిని చదివించడం, కుటుంబ కలహాలు వచ్చినప్పుడు అవి పరిష్కరించి వారిని ఒకటి చేయడం ఇలా సమాజంలో ఎంతో మందికి సహాయపడ్డారని, తనకు తెలిసిన వారు ఎవరికీ బాగా లేకపోయినా ఎవరు చనిపోయినా నన్ను ఆహ్వానించలేదు అని అనుకోకుండా ఎంత దూరమైనా వెళ్లి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వారికి సహాయం చేసి వచ్చే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు సుధాకర్ గారు అని విధినిర్వహణలోను అదేవిధంగా కమ్యూనిటీ కి ఎంతో తోడ్పాటును అందించిన నాటకం సుధాకర్ గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నామని సుధాకర్ అన్న ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రేపు 08.04.2026 బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు బుజబుజ నెల్లూరు అంబేద్కర్ కాలనీ వారి నివాసం వద్ద నుండి పార్థివ దేహం అంతిమయాత్ర బయలుదేరుతుందని అన్నారు*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విషాదకర వార్త

గత నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం హైదరాబాదులో చికిత్స పొందుతూ రిటైర్డ్ ఎస్సై శ్రీ ఎన్. సుధాకర్ గారు ఈరోజు తెల్లవారుజామున మరణించారు. వారు గతంలో నెల్లూరు జిల్లాలో పోలీసు శాఖ క్రైమ్ వింగ్లో అత్యుత్తమైన సేవలు అందించి ఇండియన్ పోలీస్ మెడల్ పథకాన్ని సాధించి ఉన్నారు. వారు గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం, నెల్లూరు జిల్లా శాఖకు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించి ఉన్నారు. వారి మరణానికి సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను 🙏 వై .శ్రీహరి

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.