Thursday, 23 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బాధాకరం

రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం హైదరాబాదులో చికిత్స పొందుతూ రిటైర్డ్ ఎస్సై శ్రీ ఎన్. సుధాకర్ గారు ఈరోజు తెల్లవారుజామున మరణించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలుపుతున్నాము.వారు గతంలో అత్యుత్తమైన సేవలు అందించి ఇండియన్ పోలీస్ మెడల్ పథకాన్ని సాధించి ఉన్నారు. వారు గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం, నెల్లూరు జిల్లా శాఖకు అధ్యక్షులుగా ఉన్నారు..మద్దిపాటి ప్రసాద్ రావు… నెల్లూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం.

ఆంధ్రప్రదేశ్

భారత అణు ప్రోగ్రామ్ విజయం – గర్వించదగ్గ క్షణం: సీఎం చంద్రబాబు

భారత్ రెండో దశ అణు విద్యుత్ కార్యక్రమంలో సాధించిన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని దేశ అణు శక్తి రంగంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. మూడో దశ అణు ప్రోగ్రామ్‌కు ఇది బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో థోరియం నిల్వలను సమర్థంగా వినియోగించి దేశానికి ఇంధన భద్రతను సాధించేందుకు ఈ ముందడుగు ఎంతో కీలకమని తెలిపారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన ఘట్టమని చంద్రబాబు ట్వీట్ ద్వారా వెల్లడించారు.

E-పేపర్

డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 07 ఏప్రిల్ 2026 డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి..! హయత్ నగర్ డివిజన్లోని నూతనంగా నిర్మించిన డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం భవనం ప్రారంభోత్సవంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి , హయత్ నగర్ తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ… డిఫెన్స్ కాలనీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ భవనం కాలనీ అభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ సంఘ భవనం ద్వారా కాలనీ ప్రజలకు సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు మంచి వేదిక లభిస్తుందని తెలిపారు. కాలనీ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా కాలనీ అభివృద్ధికి అవసరమైన ప్రతి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారం, ఐక్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరూ కలిసికట్టుగా కాలనీ పురోగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్, కాలనీ అధ్యక్షులు సురేష్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శ్రవణ్, సోమేశ్వర్ రావు, నర్సింహా, N. శ్రీనివాస్ రెడ్డి, కోటేశ్వర్ రావు, రాఘవేంద్ర రెడ్డి, బాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..

E-పేపర్

అక్రమ రేషన్ బియ్యం గోదాం పై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు

అక్రమ రేషన్ బియ్యం గోదాం పై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 07 ఏప్రిల్ 2026 పున్నమి న్యూస్ దినపత్రిక లో వచ్చిన అడ్రస్ల ఆధారంగా దాడులు పున్నమి న్యూస్ దినపత్రిక, లలో అక్రమ రేషన్ బియ్యం మాఫియా పై వస్తున్న వరుస కథలతో జిల్లా సివిల్ సప్లై అధికారులు స్పందించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం లు ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పున్నమి న్యూస్ దినపత్రికతో పాటు చానల్ లో మంగళపల్లి (బొంగులూరు) గేటు వద్ద భారీ అక్రమ రేషన్ బియ్యం గోదాం పై వచ్చిన కథనాలపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి భారీ స్థాయిలో రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ షెడ్డు ని అద్దె కోసం ఇచ్చిన యజమాని కూడా ఈ అక్రమ రేషన్ బియ్యం దందా లో పార్ట్నర్ అని స్థానికులు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టుపక్కల భారీ స్థాయిలో అక్రమ రేషన్ బియ్యం మాఫియా పొంచి ఉందని దీనిపై వెంటనే అధికారులు దాడులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పున్నమి న్యూస్ దినపత్రిక, లో వస్తున్న కథనాలపై ప్రజలు అభినందిస్తున్నారు.*

తిరుపతి

సుధీర్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు ఖండన… అసత్య ప్రచారాలపై టీడీపీ నేతల ఆగ్రహం

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై జనసేన బహిష్కృత నేత కోట వినుత చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. వైసిపి పాలనకు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. తెదేపా నాయకులు మాట్లాడుతూ…సుధీర్ రెడ్డి ఎప్పుడూ అధికారులను ప్రభావితం చేయరని, చట్ట నిబంధనల ప్రకారం పరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు తీసుకునే చర్యలకు ఎమ్మెల్యేతో సంబంధం లేదని తెలిపారు. టీడీపీ–జనసేన పొత్తు 2023లో ప్రకటించబడిందని, అంతకుముందు విడివిడిగా రాజకీయ కార్యకలాపాలు సాగాయని గుర్తు చేశారు. ఆ సమయంలో జరిగిన విషయాలను వక్రీకరించి ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. ఎన్డీయే కూటమి పార్టీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా, అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనూ సమన్వయం బలంగా ఉందని, జనసేనతో సంబంధం లేని వ్యక్తులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇకపై ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని స్పష్టం చేస్తూ, కోట వినుత దంపతులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్, తిరుపతి పార్లమెంటు నాయకులు గంగనపల్లి రమేష్,సులేమాన్,కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

యువతలో చైతన్యం కోసం సైకిల్ యాత్ర… పోలీసుల సహకారంతో ర్యాలీ

యువతలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించేందుకు తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ఏప్రిల్ 6 నుండి 22 వరకు నిర్వహిస్తున్న మహా సైకిల్ యాత్ర శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకుంది. VIBRANTS KALAM ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ యాత్రకు స్థానికంగా విశేష స్పందన లభించింది. శ్రీకాళహస్తి పోలీస్ శాఖ ఆదేశాల మేరకు, పట్టణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఏపీ టూరిజం కేంద్రం నుంచి పొన్నాలమ్మ గుడి వరకు సైకిల్ ర్యాలీ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా AISF తిరుపతి జిల్లా సహాయక కార్యదర్శి కొగిలి మునిచందు మాట్లాడుతూ, “డ్రగ్స్ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోంది. అందుకే ఇలాంటి యాత్రల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత అవసరం” అని తెలిపారు. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం మాదకద్రవ్యాలకు “NO” చెప్పడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం, యువతను సరైన దారిలో నడిపించడం అని నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ కారణంగా అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోతున్న నేపథ్యంలో, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు కలిసి నిర్మూలన కోసం చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. వతరం ముందుకు వచ్చి డ్రగ్స్ నిర్మూలన కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రకు మద్దతుగా ప్రజలు సైకిళ్లతో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వన్ టౌన్ సిఐ ప్రకాశ్ కుమార్, టూ టౌన్ సిఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది, ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

తిరుపతి

సురవారిపల్లెలో కలెక్టర్‌తో కలిసి వంద రోజుల’ ప్రణాళికాకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గ రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ ద్వారా చేపట్టిన “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సోమవారం నాడు ఘనంగా ప్రారంభించారు. శ్రీకాళహస్తి మండలం సురవారిపల్లె గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో, ఇరిగేషన్ శాఖాధికారులతో కలిసి ఆయన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్రస్థాయిలో ప్రారంభించిన ఈ కార్యక్రమం, నేటి నుండి జూలై 14, 2026 వరకు (100 రోజుల పాటు) నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ వంద రోజుల్లో నియోజకవర్గంలోని చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ మరియు భూగర్భ జల మట్టాలను పెంచడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలోనూ నీటి వనరులను కాపాడుకుంటూ సాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. నియోజకవర్గాన్ని సుభిక్షం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం” అని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. రైతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

న్యాయవాద వృత్తికి గర్వకారణం-జూనియర్ సివిల్ జడ్జి ఉమామహేష్‌కు ఘన సన్మానం

స్థానిక బార్ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉంటూ, ఇటీవల వెలువడిన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన తిరుకాల ఉమామహేష్‌ను శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం అత్యంత ఘనంగా సన్మానించారు. న్యాయవాద వృత్తి నుంచి న్యాయమూర్తిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఉమామహేష్‌ను అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ నుంచి ఒక సభ్యుడు సివిల్ జడ్జిగా ఎంపిక కావడం తమ అందరికీ గర్వకారణమని కొనియాడారు. క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం, వృత్తి పట్ల అంకితభావం ఉంటే న్యాయవాదులు ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఉమామహేష్ నిరూపించారని వారు పేర్కొన్నారు. జూనియర్ న్యాయవాదులకు ఆయన విజయం ఒక గొప్ప స్ఫూర్తి అని తెలిపారు. సన్మాన గ్రహీత ఉమామహేష్ మాట్లాడుతూ.. తన ఎదుగుదలకు సహకరించిన సీనియర్ న్యాయవాదులకు, తోటి మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, సామాన్యులకు త్వరితగతిన న్యాయం అందేలా, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని మరింత పెంచేలా కృషి చేస్తానని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉమామహేష్‌ను అభినందనల్లో ముంచెత్తారు.

తిరుపతి

బీజేపీ ఆవిర్భావ దినోత్సవం… శ్రీకాళహస్తిలో ఘనంగా వేడుకలు

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రీకాళహస్తి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సూచనల మేరకు, స్థానిక నాయకత్వంలో పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. రాఘవకుప్పం హరీష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో రామసేతు బ్రిడ్జి సమీపం, పూసల వీధి, త్రిశూలాంబ గుడి ప్రాంతాల్లో సీనియర్ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… జనసంఘ్ నుంచి ప్రారంభమైన బీజేపీ 47 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అంత్యోదయ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, సుపరిపాలన అందించాలనే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. “సేవయే పరమావధి – దేశమే ప్రథమం” అనే నినాదంతో పనిచేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సేవకే అంకితమై నిరంతరం శ్రమిస్తున్న కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు రాఘవ కుప్పం హరీష్ రెడ్డి, సీనియర్ నాయకులు చిలకా రంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా, జిల్లా నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు అబద్ధం… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై జనసేన పార్టీకి చెందిన మాజీ, బహిష్కృత నేతలు కోట వినుత, కోట చంద్రబాబు నాయుడు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పోలీసు వ్యవస్థ ఎమ్మెల్యేకు అనుకూలంగా “గుండాల్లా వ్యవహరిస్తోంది” అన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు విజయ్ కుమార్, కాసరం రమేష్, నాగమల్లి దుర్గాప్రసాద్, జి. గోపీనాథ్, షకీర్ అలీ, కె. సుధాకర్ రెడ్డి, మహిళా నాయకులు అనిత, సుమతమ్మ మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా బహిష్కరించిన కోట వినుతకు ప్రస్తుతం పార్టీతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధం లేకుండా, చట్టబద్ధ అనుమతులు లేని అక్రమ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారని తెలిపారు. చట్టపరమైన వ్యవహారాల్లో ఎవరైనా తప్పు చేస్తే, వారు తమ పార్టీ వారైనా సరే ఎమ్మెల్యే ఎప్పుడూ సహించరని అన్నారు. అలాంటి నిష్పక్షపాత నాయకుడిపై అసత్య ఆరోపణలు చేయడం, అసభ్యంగా మాట్లాడడం పూర్తిగా అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట వినుత, ఆమె భర్త కోట చంద్రబాబు నాయుడుకు గట్టి హెచ్చరిక జారీ చేస్తూ, ఇకముందు ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే అదే స్థాయిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కోట వినుత, కోట చంద్రబాబు నాయుడులపై ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించి, సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ జరిపి, ఇలాంటి రాజకీయ కుట్రలకు చెక్ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.