Thursday, 23 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారాంపురం టన్నెల్స్ పనులను పరిశీలించిన యువ నాయకులు

ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనయుడు, యువ నాయకులు మేకపాటి అభినవ్ రెడ్డి ఈరోజు సీతారాంపురం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న NH-544G టన్నెల్స్ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ టన్నెల్స్ సౌత్ ఇండియాలోనే అత్యంత పొడవైన టన్నెల్స్‌గా రూపొందుతున్నాయి. ఈ సందర్భంగా సీతారాంపురం మండల కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి, వైస్సార్సీపీ అధికార ప్రతినిధి గూడపురెడ్డి శేఖర్ రెడ్డి, యువ నాయకులు చింతంరెడ్డి లోకేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వారు అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను సమగ్రంగా పరిశీలించి, అధికారుల నుండి పనుల పురోగతి గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రాంత అభివృద్ధికి ఈ టన్నెల్స్ కీలకంగా మారనున్నాయని నాయకులు అభిప్రాయపడ్డారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించడంలో ఈ ప్రాజెక్ట్ ముఖ్య పాత్ర పోషించనుందని వారు పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలిగిరి మండలంలో నీటి భద్రతపై దృష్టి – చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం

కలిగిరి మండలం తూర్పు గుడ్లదొన గ్రామంలో చెరువు వద్ద నిర్వహించిన “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని చెరువు పరిస్థితులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, రైతులు, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి నీటి నిర్వహణ, చెరువుల అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా సాగునీటి, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. అధికారులు, నాయకులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే ఈ లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. గ్రామస్థులు కూడా నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తూర్పు గుడ్లదొన, పడమర గుడ్లదొన, ఎరుకులరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన ఉమ్మడి చెరువు కట్ట విస్తరణ పనులను పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే ప్రాంతంలో సాగునీటి వసతి మెరుగుపడి రైతులకు ఎంతో మేలు కలుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

E-పేపర్

బాటసింగారం పండ్ల మార్కెట్ ని సందర్శించి (AMC) చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి రైతులను కమిషన్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 06 ఏప్రిల్ 2026 మామిడి పండ్ల సీజన్ నేపథ్యంలో సోమవారం ఉదయం బాటసింగారం పండ్ల మార్కెట్ ని సందర్శించి మామిడి క్రయ విక్రయాలు పరిశీలించిన మార్కెట్ కమిటీ పాలకవర్గం..పాల్గొన్న అధికారులు,సిబ్బంది. రైతులను కమిషన్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు…అధిక రసాయినాలు వాడితే లైసెన్సు రద్దు చేస్తాం. మామిడి సీజన్ సందర్భంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం…తగిన సౌకర్యాలు కల్పిస్తాం. AMC చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి. ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ. గత ఏడాది ఒక లక్ష నలభై వేల మెట్రిక్ టన్నుల దిగుబడి జరిగిందని…ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో రావొచ్చని అంచనా వేస్తున్నామన్నారు…మామిడి సీజన్ సందర్భంగా రైతులకు వ్యాపారులకు వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.రైతులకు ఇప్పుడు మంచి ధర వస్తుందని అన్నారు..అధిక కమీషన్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసిన వారికి రావాల్సిన బకాయిలు ఇవ్వకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..అదేవిధంగా పండ్లను పండడానికి( FSSAI )అనుమతించిన ఇతనాల్ నే ఉపయోగించాలని దానిని ఎక్కువ మొత్తంలో ఉపయోగించిన క్రిమినల్ కేసులు నమోదు చేపిస్తామని తెలిపారు..ప్రతి వారం మా పాలకవర్గం తిరిగి పరిశీలిస్తామని చెప్పారు..ఎప్పటికప్పడు అధికారులను అప్రమత్తం చేస్తూ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ CH,బాస్కర చారి…సభ్యులు బండి మధుసూదన్ రావు…మచ్చెందర్ రెడ్డి…గణేశ్ నాయక్…నరసింహ…రఘుపతి రెడ్డి…గోవర్ధన్ రెడ్డి…అంజయ్య…వెంకటేశ్వర్లు గుప్తా…ఇబ్రహీం..తో పాటు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి L,శ్రీనివాస్ తో పాటు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యతపై 100 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని

చెరువులు, కాలువలు, భూగర్భ జలాల సంరక్షణపై సమగ్ర చర్యలు ప్రజాభూమి ప్రతినిధి, రామచంద్రపురం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” అనే 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట పైన ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు . ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టే ముఖ్య కార్యక్రమాలను వివరించారు: చెరువులు మరియు కాలువల పునరుద్ధరణ: చెరువుల పూడికతీత, కాలువల శుభ్రత, మరమ్మత్తులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం. చెరువుల అనుసంధానం: సమీప చెరువులను పరస్పరం అనుసంధానం చేసి వర్షపు నీటిని సమర్థంగా నిల్వ చేసి వినియోగించడం. నీటి సంరక్షణ నిర్మాణాలు: చెక్‌డ్యామ్‌లు, పెర్కొలేషన్ ట్యాంకులు, రీచార్జ్ పిట్స్ వంటి నిర్మాణాల ద్వారా నీటి నిల్వ మరియు భూగర్భ జలాల పునాదరణ. పచ్చదనం పెంపొందించడం: నీటి వనరుల చుట్టుపక్కల చెట్లు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడం. భూగర్భ జలాల పునాదరణ: వర్షపు నీటిని నేలలోకి చొచ్చుకుపోయే విధంగా చర్యలు తీసుకుని భూగర్భ జలాల స్థాయిని పెంచడం. సమీకృత నీటి నిర్వహణ గ్రామ స్థాయిలో నీటి వినియోగంపై సమగ్ర ప్రణాళికలు రూపొందించి, సాగు నీటి సంఘాల భాగస్వామ్యంతో అమలు చేయడం. సాగు నీటి సంఘాలు నీటి పంపిణీ, సంరక్షణ, నిర్వహణలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. రైతులు నీటి వినియోగంలో బాధ్యతగా వ్యవహరించి, నీటి వృథాను తగ్గించే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆమె ప్రకారం రాయలచెరువుని అభివృద్ధి చేసే దిశగా పనులు ప్రారంభించామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి మరియు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. చెరువులు, కాలువలు పునరుద్ధరణ ద్వారా సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు లాభదాయకంగా మారుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే అధికారులు చెరువులు, కాలువల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన పనులపై తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు, సూచనలు స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు , ఇరిగేషన్ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, సాగు నీటి సంఘాల సభ్యులు, మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

గత వైసిపి ప్రభుత్వం చెత్త పన్ను వేసి చెత్తను ప్రజల మధ్యనే వదిలేసింది చెత్త ప్రభుత్వం ఎమ్మెల్యే పులివర్తి నాని

పున్నమి ప్రతినిధి, తిరుపతి రూరల్ తిరుపతి గ్రామీణ మండలం దుర్గసముద్రం పంచాయతీ వద్ద గల డంపింగ్ యార్డును పురపాలక శాఖ మంత్రి నారాయణ ,ఇతర అధికారులతో కలిసి పరిశీలించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాల వల్లే రాష్ట్రంలోని మునిసిపాలిటీలలో చెత్త పేరుకుపోయింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇతర దేశాలలో పర్యటించినప్పుడు చెత్త నుండి సంపద సృష్టి ఎలా అన్నదానిపై అధ్యయనం చేశారు. మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు 100 డంపింగ్ యార్డ్ లలో చెత్త నుండి సంపదను సృష్టించే విధంగా ఏర్పాట్లను చేశారు. అంతేకాకుండా సాలీడు వేస్ట్ మేనేజ్మెంట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాట్లకు కృషి చేస్తున్నారు. అందుకోసం దుర్గ సముద్రం వద్ద గల డంపింగ్ యార్డ్ ఆనుకునే సుమారు పది ఎకరాలు స్థల పరిశీలన చేస్తామన్నారు. ఇందులో కొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయి. చుట్టూ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమీకరించిన చెత్త నుండి విద్యుత్తుతోపాటుగా బ్రిక్స్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. రాబోయే రోజులలో చెత్త రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు మరి కొన్ని సమస్యలను మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు జేసీ గోవింద రావ్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య , కూటమి నాయకులు, కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి

ఘనంగా పులివర్తి వినీల్ జన్మదిన వేడుకలు

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినిల్ జన్మదిన వేడుకలు రామచంద్రపురం మండలంలో ఘనంగా జరిగాయి. 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి పులివర్తి వినీల్ చేసిన కృషి అమోఘమని తిరుమలరెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ జన్మదిన వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో భారీ కేకను కట్ చేసి పలుగురికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా తిరుమలరెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే పులివర్తి నాని విజయానికి తనయుడు చేసిన కృషి అమోఘం అన్నాడు. ఇప్పుడు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల సింగల్ విండో అధ్యక్షుడు జనార్దన్ చౌదరి, కోర హరిప్రసాద్ నాయుడు, సుబ్రహ్మణ్యం యాదవ్, ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తిరుపతి

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

మన ఊరు మన జెండా రెపరెపలాడిన కాషాయ జెండా పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలం లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు జనార్ధన్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి ఘనంగా చేశారు. ఇదే సందర్భంగా మన ఊరు మన జెండా ను ఆవిష్కరించి కాషాయ జెండాను ఎగురవేశారు. అలాగే కార్యకర్తలు నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తరువాతనే భారత దేశంలో హిందుత్వానికి రక్షణ కలిగిందని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అంథోదయ స్ఫూర్తితో సుపరిపాలన లక్ష్యంగా సేవయే పరమావధిగా, అంటూ దేశమే ప్రథమంగా అంటూ జన సంఘ కాలం నుండి నేటి వరకు పార్టీ జెండాను మోసిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాయం హరినాథ్ రెడ్డి, ప్రభాకర్ నాయుడు, మునయ్య, గోపినాదరెడ్డి, రాజీవ్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

E-పేపర్

హయత్ నగర్ డివిజన్ లో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 06 ఏప్రిల్ 2026 హయత్ నగర్ డివిజన్ లో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!🪷* హయత్ నగర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలో హయత్ నగర్ డివిజన్ బీజేపీ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అధ్యక్షునితో కలిసి వివిధ ప్రాంతాల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కార్యకర్తలకు మిఠాయిలు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వివిధ ప్రాంతాలు.. 🪷హయత్ నగర్ అనుమగల్ శివాలయం వద్ద 🪷హయత్ నగర్ హైవే బావార్చి వద్ద 🪷పెద్దమ్మ దేవాలయం వద్ద 🪷రంగ నాయకుల గుట్ట 🪷భాగ్యలత మెయిన్ రోడ్ 🪷భూలక్ష్మి నగర్ 🪷శారదా నగర్ 🪷 సుభద్ర నగర్ 🪷కమలా నగర్ 🪷ముదిరాజ్ కాలనీ 🪷ఆంధ్ర కేసరి నగర్ మరియు ఇతర ప్రాంతాల్లో బీజేపీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి, ప్రజా సేవే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న పార్టీ అని, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశాన్ని శక్తివంతమైన, స్వాభిమానభారతంగా తీర్చిదిద్దడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి వర్గానికీ న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఇకపై కూడా హయత్ నగర్ డివిజన్‌లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉగాది ఎల్లప్ప, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు పారంద మహేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవిందా చారి, మహిళా అధ్యక్షురాలు గీత, సీనియర్ నాయకురాలు పార్వతి, నాయకులు Dr. అప్పారావు, వస్పరి వెంకటేష్,ఎర్ర శ్రీకాంత్,మర్రి మధుసూదన్, లింగ రెడీ, సురేష్, వెంకట్ రెడ్డి, అమల్ నాయక్, సూర్య నాయక్,బాలు నాయక్, మొగులయ్య, శంకర్ నాయక్,అంజయ్య, రమేష్, లింగ రెడ్డి, రితిక్, రాజా శేఖర్, విష్ణు, మహిళా నాయకులు సుజాత, సైదమ్మా, బీజేవైఎం నాయకులు ప్రేమ్, అఖిలేష్, ప్రణవ్, అభిలాష్,మరియు ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై బీజేపీ… జై భారత్…! మాజీ కార్పొరేటర్ గారి కార్యాలయం. హయత్ నగర్ డివిజన్

E-పేపర్

నక్కర్త మేడిపల్లి లో ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం అందజేసిన జాల నాగరాజు (JNR) స్వాతి దంపతులు

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 06 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని నక్కర్త మేడిపల్లి లో ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం నక్కర్త హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ నిర్మాణానికి దాతలు ముందడుగు వేశారు. ఆలయ నిర్మాణానికి జాల స్వాతి నాగరాజు దంపతులు రూ.5 లక్షల విరాళాలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందులో మొదటి విడతగా రూ.2 లక్షల విరాళాన్ని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. మానవ ఆధ్యాత్మిక దైనందిన చింతనకు, ఆలయాల నిర్మాణాలకు దాతలు ముందుకు రావాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దాతకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగంలో సాగునీటి భద్రతపై రైతులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశం

సంగం మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ముఖ్య సమావేశం జరగనుంది. పాత బ్యారేజి ఇరిగేషన్ ఏఈ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ రైతులతో సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతలపై చర్చించనున్నారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పూడికతీత పనులను ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతు నాయకులు, కూటమి పార్టీల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని టిడిపి నాయకులు కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.