Thursday, 23 April 2026

Blog

తిరుపతి

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం బాసట – లేబర్ కార్డుల పంపిణీ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మికులు తమ హక్కులను, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ సంకల్ప భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఆదివారం శ్రీకాళహస్తిలో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇటీవల భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునర్నిర్మించిందని, తద్వారా నిలిచిపోయిన పలు సంక్షేమ పథకాలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ప్రమాద బీమా, పెళ్లి కానుక, ప్రసూతి సాయం వంటి పథకాల గురించి అవగాహన కల్పించారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు లేబర్ కార్డు పొంది, ప్రభుత్వ పథకాలను పొందేలా యూనియన్ కృషి చేస్తోందని తెలిపారు. ఇంకా పెద్ద సంఖ్యలో కార్మికులు యూనియన్ లో సభ్యులుగా చేరి తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని కోరారు.

తిరుపతి

ఆధ్యాత్మికత..అధికారిక గుర్తింపు-శ్రీకాళహస్తిలో కమిషనర్ కృష్ణతేజ పర్యటన

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఆదివారం నాడు తన కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కమిషనర్ దంపతులకు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. కమిషనర్ కృష్ణతేజ కుటుంబ సభ్యులకు స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, చైర్మన్ సాయి ప్రసాద్ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడుతో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీల ముఖ్య నాయకులు కుమార్, జయప్రకాష్, మహేష్, చిరంజీవి, పగడాల ప్రతాప్, ఉప్పు కిష్టయ్య, ఢిల్లీ బాబు, లీలాధర్, మహిళా నాయకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒక ప్రత్యేక కార్యక్రమంలో, జాతీయ స్థాయిలో ‘మహిళా సాధికారత’ విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న బొక్కసంపాళెం గ్రామ సర్పంచ్‌ను కమిషనర్ కృష్ణతేజ ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మహిళా శక్తికి, అభివృద్ధికి ఈ జాతీయ అవార్డు ఒక గొప్ప గుర్తింపు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎంపీడీవో, డీపీఆర్ఓ, ఇతర మండల అధికారులు పాల్గొని సర్పంచ్‌ను ప్రశంసించారు.

తిరుపతి

విశ్వబ్రాహ్మణులాభివృద్ధికి ప్రభుత్వ పథకాల వినియోగం అవసరం-డా. దశరథ చారి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని పిచ్చాటూరు రోడ్‌లో ఉన్న వీర బ్రహ్మంగారి దేవస్థానంలో విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యుల సమావేశం ఘనంగా నిర్వహించారు. పట్టణ విశ్వబ్రాహ్మణ నాయకుడు ఎం. చంద్రచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డా. గుమ్మిడిపూడి దశరథ చారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను విశ్వబ్రాహ్మణులు ఘనంగా సన్మానించారు. అనంతరం డా. దశరథ చారి మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పలు పథకాలు అందిస్తున్నాయని వివరించారు. ముఖ్యంగా పీఎంఈజీపీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు సబ్సిడీతో కూడిన రుణాలు లభిస్తాయని, తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవా రంగానికి రూ.20 లక్షల వరకు సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ పథకానికి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరిశ్రమల బోర్డు, జిల్లా పరిశ్రమల కేంద్రాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయని, ఆసక్తిగల వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా హస్తకళాకారులు, స్వర్ణకారులు, కోయ బొమ్మల తయారీదారులు, ఎంబ్రాయిడరీ కళాకారులు తదితరులు చేనేత మరియు హస్తకళల శాఖ ద్వారా గుర్తింపు కార్డులు పొందవచ్చని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ పథకం ద్వారా సమూహంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి తాను కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యచారి, రేణుకాదేవి, ఆనందాచారి, మంతుల నాగేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. కార్పెంటర్లు, స్వర్ణకారులు, వివిధ హస్తకళాకారులు, రైతులు, వ్యాపారవేత్తలు సమావేశంలో హాజరయ్యారు.

తిరుపతి

ఆధ్యాత్మిక పరిమళం.. భక్తి తత్వ ప్రబోధం-శ్రీకాళహస్తిలో సద్గురు జయంతి మహోత్సవం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని సుఖబ్రహ్మ ఆశ్రమం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. ఆశ్రమ స్థాపకులు, సద్గురు స్వర్గీయ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారి 113వ జయంతి వేడుకలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి పాదుకలకు శాస్త్రోక్తంగా విశేష అభిషేక పూజలు, అర్చనలు జరిగాయి. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి, ఉత్తరాధికారి శ్రీ సంపూర్ణానందగిరి స్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ వేడుక ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాళీ వనాశ్రమ అధిపతులు యోగిని శ్రీ చంద్ర ప్రసాద కాళీ మాతాజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సనాతన ధర్మానికి నిలయమైన భారతదేశంలో ఆధ్యాత్మిక చింతన, భక్తి తత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మమార్గాన్ని అనుసరిస్తూ సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ మహోత్సవంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ శాసనసభ్యులు ఎస్.సి.వి. నాయుడు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సహా పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొని స్వామివారికి నివాళులర్పించారు. ఆశ్రమ ప్రతినిధులు భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు.

తిరుపతి

జనసేన కార్యకర్త కుటుంబానికి కొండంత అండ – బీమా చెక్కు అందజేత

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త బుర్రా చైతన్య కాంత్ కుటుంబానికి ఆ పార్టీ అండగా నిలిచింది. ఇటీవల చైతన్య కాంత్ సతీమణి బుర్ర ప్రియాంక అకాల మరణం చెందడం పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్రమంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి బాధిత కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ఆదివారం నాడు పట్టణంలోని చైతన్య కాంత్ నివాసానికి వెళ్లారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను ఒక కుటుంబ సభ్యునిలా చూసుకోవడం జనసేన పార్టీ సంప్రదాయం. బుర్ర ప్రియాంక మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. బాధలో ఉన్న ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తిరుపతి

దిగువరామాపురంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం..!

నూతన పట్టువస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి దంపతులు గ్రామస్తులతో మమేకమై కల్యాణం తిలకించిన చెవిరెడ్డి పున్నమి ప్రతినిధి ,రామచంద్రాపురం మండలం సి.రామాపురం గ్రామ పంచాయతీ దిగువ రామాపురంలోని శ్రీరామాలయంలో శనివారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలు తీసుకు వచ్చిన చెవిరెడ్డి దంపతులకు గుడి కమిటీ సభ్యులు మరియు గ్రామస్థులు స్వాగతం పలికారు .వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామ స్మరణల మద్యన కల్యాణోత్సవం వేడుకగా సాగింది. అనంతరం గ్రామస్తులతో మమేకమైన చెవిరెడ్డి అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ వారి బాగోగులు అడగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులతో కలసి చెవిరెడ్డి దంపతులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. *చెవిరెడ్డి దంపతులకు సత్కారం* శ్రీ సీతారాముల కల్యాణోత్సవంకు ముఖ్యతిథులుగా హాజరైన చెవిరెడ్డి దంపతులను గ్రామస్తులు శాలువతో ఘనంగా సత్కరించడంతో పాటు కల్యాణోత్సవంకు ఉపయోగించిన అక్షితలు, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి – అంబేద్కర్, జగజీవన్ రామ్ విగ్రహాలకు యువత నివాళులు..

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 5 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్) : ఏటికొప్పాక గ్రామంలో బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సతీష్, వైస్ ప్రెసిడెంట్ నర్సింగరావు నాయకత్వంలో కుల పెద్దలు, కులస్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ గారికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ వేడుకలు గ్రామంలో సామాజిక ఐక్యత, యువత చైతన్యానికి ప్రతీకగా నిలిచాయి.

అనకాపల్లి

ఏటికొప్పాకలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి – అంబేద్కర్, జగజీవన్ రామ్ విగ్రహాలకు యువత నివాళులు..

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 5 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్) : ఏటికొప్పాక గ్రామంలో బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సతీష్, వైస్ ప్రెసిడెంట్ నర్సింగరావు నాయకత్వంలో కుల పెద్దలు, కులస్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ గారికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ వేడుకలు గ్రామంలో సామాజిక ఐక్యత, యువత చైతన్యానికి ప్రతీకగా నిలిచాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య: ఎంఈఓ రమేష్ కుమార్

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 5 (పున్నమి ప్రతినిధి) మల్లి.మనుబోలు మండలం లక్ష్మీనరసింహాపురం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఇక్కడ నాణ్యమైన విద్యతో పాటు భోజనం, పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో శుశ్రుత స్కూల్ వార్షికోత్సవం సందడి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 5 (పున్నమి ప్రతినిధి )మల్లి .మనుబోలులోని శుశ్రుత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శనివారం 26వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా స్థిరపడినట్లు తెలిపారు. డైరెక్టర్ డాక్టర్ మైధిలి సిబ్బందికి అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.