Thursday, 23 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగంలో సాగునీటి భద్రతపై రైతులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశం

సంగం మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ముఖ్య సమావేశం జరగనుంది. పాత బ్యారేజి ఇరిగేషన్ ఏఈ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ రైతులతో సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతలపై చర్చించనున్నారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పూడికతీత పనులను ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతు నాయకులు, కూటమి పార్టీల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని టిడిపి నాయకులు కోరారు.

అనకాపల్లి

“ఇంటింటికీ టీచర్ల పిలుపు – ప్రభుత్వ బడిలో చేరితేనే పిల్లల భవిష్యత్ బలంగా”

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 6 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్) : ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం జడ్‌పీహెచ్ఎస్ హైస్కూల్ ఉపాధ్యాయులు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఎం అరుణ గారి సమక్షంలో టీచర్లు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రభుత్వ బడులే పిల్లల భవిష్యత్‌కు పునాది అని ఉపాధ్యాయులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు బైపాస్ కూడలిలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 6 మల్లి( పున్నమి ప్రతినిధి).బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ కూడలిలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల బిజెపి అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మహబూబ్ నగర్

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది… రికగ్నైజ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ అదనపు ప్రధాన కార్యదర్శి ఎండి అమీర్ పాషా

*ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది…రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు అదనపు ప్రధాన కార్యదర్శి:: అమీర్ పాష* *పున్నమి ప్రతినిధి, మహబూబ్నగర్ జిల్లా ::తేదీ 6/04/202* *టీ ఆల్ మేవా మాజీ అధ్యక్షులు శ్రీ ఫారూఫ్ హుస్సేన్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మదనాపూర్ మండల విద్యాధికారి గా అనేక సంవత్సరాలు సేవలందించి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానంలో అనేక మైలురాళ్లు అధిగమించి నేడు పదవి విరమణ పొందిన సందర్భంగా వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈకార్యక్రమంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాల్గొన్నారు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు అడిషనల్ జనరల్ సెక్రెటరీ అమీర్ పాషా గారు, తదితరులు పాల్గొన్నారు*

ప్రతి వ్యక్తి జీవితంలో నడక, వ్యాయామం ఓ భాగమైపోవాలి

*ప్రతి వ్యక్తి జీవితంలో నడక… ఆరోగ్యాన్ని అందించే మొదటి సోపానం* *పున్నమి ప్రతినిధి:: మహబూబ్నగర్ జిల్లా:: తేదీ::06/04/2026* **సుశ్రుత ప్రజా వైద్యశాల మహబూబ్నగర్, ఇరవై అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా టూకే రన్ లో ముఖ్యఅతిథిగా టీవీ నటుడు జబర్దస్త్ రాంప్రసాద్ గారు మరియు సుశ్రుత ప్రజా వైద్యశాల యజమాన్యం డాక్టర్ మధుసూదన్ రెడ్డి మరియు డాక్టర్ ప్రతిభ మేడం వారి సిబ్బంది ఆర్గనైజర్లు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు స్థానిక పట్టణానికి చెందిన డాక్టర్లు, అధికారులు, అనధికారులు శ్రేయోభిలాషులు, మిత్రులు, అందరూ న్యూటౌన్ యందు ఉన్న సుశ్రుత ప్రజా వైద్యశాల నుంచి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు టూకే రన్ నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా జబర్దస్త్ రాంప్రసాద్ మాట్లాడుతూ నేడు ఆధునిక యుగంలో ప్రతి వ్యక్తి కనీసం అర్థ గంట నడవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది అప్పుడే వారి జీవితానికి జీవితంలో అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందేందుకు వీలుంటుందని, ఆరోగ్యవంతంగా జీవించగలుగుతాడని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి మరియు మేయర్ మమత తోపాటు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్ పాల్గొన్నారు*

తిరుపతి

శ్రీకాళహస్తి సమీపంలో పిడుగుపాటుకు రైతు బలి – ఎర్పేడు మండలంలో విషాదం

ఎర్పేడు, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): ప్రకృతి ప్రకోపానికి ఓ నిరుపేద రైతు బలయ్యాడు. పొలం పనుల కోసం వచ్చిన రైతుపై అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఆయన దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన శ్రీకాళహస్తి మండలంలోని కోట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్పేడు మండలం పరమరపల్లి గ్రామానికి చెందిన వి. కామరాజు (రైతు) వ్యవసాయ పనుల నిమిత్తం శ్రీకాళహస్తి మండలం కలవగుంట పంచాయతీ పరిధిలోని కోట గ్రామానికి వచ్చారు. పొలంలో పని చేసుకుంటుండగా, ఒక్కసారిగా వాతావరణం మారి భారీ శబ్దంతో ఆయనపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కామరాజును గమనించిన తోటి రైతులు, స్థానికులు వెంటనే స్పందించి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రికి చేరుకోకముందే మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే కామరాజు అకాల మరణంతో పరమరపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామరాజు మృతి పట్ల స్థానిక నాయకులు, గ్రామస్థులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తిరుపతి

ఆత్మీయ నేతకు అంతిమ నివాళి-చెంజి సుబ్రహ్మణ్యం మృతి పట్ల అసోసియేషన్ దిగ్భ్రాంతి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చెంజి సుబ్రహ్మణ్యం (మణి) అకాల మరణం పట్టణంలోని టైలరింగ్ వృత్తిదారుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల అసోసియేషన్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆదివారం అసోసియేషన్ అధ్యక్షులు తొట్టంబేడు బాలయ్య ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి సుబ్రహ్మణ్యం గారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం గారు అసోసియేషన్ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన మరణం సంఘానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సభ్యులందరూ కలిసి మృతుడి కుటుంబానికి తమ వంతు బాసటగా రూ. 10,116 నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. వారి కుటుంబానికి అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం చెంజి సుబ్రహ్మణ్యం గారి అంతిమ యాత్రను అసోసియేషన్ సభ్యులు, స్థానికుల కన్నీటి వీడ్కోలు మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టైలర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొని ఆయనకు తుది నివాళులు అర్పించారు.

తిరుపతి

బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు.. టిడిపి కార్యాలయంలో జగ్జీవన్ రామ్ స్మరణ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, పట్టణ టిడిపి అధ్యక్షులు గేడిపూడి విజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గేడిపూడి విజయ్ మాట్లాడుతూ.. బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, అలుపెరగని సంఘ సంస్కర్త అని కొనియాడారు. బీహార్‌లోని వెనుకబడిన వర్గం నుండి వచ్చి, 40 ఏళ్ల పాటు పార్లమెంటులో వివిధ కీలక మంత్రి పదవులు చేపట్టి, దేశ ఉప ప్రధానిగా ఎదిగిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన బోర్డు సభ్యులు గాదిపాకుల గోపీనాథ్, గుర్రప్ప శెట్టి, కంట రమేష్, కాస్రం రమేష్ పాల్గొన్నారు. అలాగే 19వ వార్డు అధ్యక్షులు జి. మధు, పట్టణ సెక్రటరీ మున్నంగి కార్తీక్, చింత వెంకట్, దావల రాజేష్, టౌన్ బ్యాంక్ చైర్మన్, సభ్యులు, వెంకటసుబ్బయ్య, మైనార్టీ విభాగం పెద్దలు, టిడిపి మహిళా నాయకురాళ్లు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎస్. సురేష్, వైస్ ప్రెసిడెంట్ ఎస్. దివాకర్, సెక్రటరీ పి. కుమార్, జనరల్ సెక్రటరీ ఎం. గురవయ్య, జాయింట్ సెక్రటరీ జి. రమణయ్య, సహాయ వైస్ ప్రెసిడెంట్ పి. గురునాథం, సలహా కమిటీ సభ్యులు పి. బాలాజీ, ట్రెజరీ మరియు సోషల్ మీడియా కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.