Thursday, 23 April 2026

Blog

కర్నూలు

ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగమహేశ్వర సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం

పున్నమి ప్రతినిధి కర్నూల్ జంగమ మహేశ్వర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ​శ్రీశైలంలో వీరశైవ ఆగమ పద్ధతులే పాటించాలి: రాష్ట్ర అధ్యక్షులు జేపీ మల్లికార్జునయ్య కర్నూలు టౌన్ బంగారు పేటలోని MRB ట్రేడ్ సహాయ్ కన్సల్టెన్సీ కార్యాలయంలో జంగమ మహేశ్వర సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ మరియు శ్రీశైల క్షేత్రంలోని సంప్రదాయాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ​ప్రధానాంశాలు: ​శ్రీశైలంలో సంప్రదాయాల రక్షణ: శ్రీశైల దేవస్థానంలో వీరశైవ ఆగమ ప్రకారమే కార్యక్రమాలు జరగాలని, వైకుంఠ ఏకాదశి పేరుతో వైకుంఠ ద్వారం ఏర్పాటు చేయడం సరికాదని, దానికి బదులు కైలాస ద్వారం ఏర్పాటుపై ఆలోచించాలని రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. ​అర్చకుల బదిలీపై చర్చ: రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేసినట్లుగానే, శ్రీశైలంలోని తెలంగాణ ప్రాంత అర్చకులను కూడా బదిలీ చేయాలని, రాయలసీమ ప్రాంత వీరశైవ అర్చకులకే ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ​జగద్గురువుల పర్యవేక్షణ: శ్రీశైలంలో ప్రతి కార్యక్రమం పండితారాధ్య జగద్గురువుల ఆధ్వర్యంలోనే జరగాలని, ఆలయ అధికారులు జగద్గురువులతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోరాదని ఇతవు పలికారు. అలాగే మల్లికార్జునయ్య సమాధిపై రాతి మండపం నిర్మించాలని కోరారు. ​సంఘం అభివృద్ధిపై నేతల పిలుపు: ​సంఘం ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని, సభ్యుల నుంచి విరాళాలు సేకరించి అభివృద్ధి పనులకు వెచ్చించాలని ప్రధాన కార్యదర్శి మహర్షి విజయ్ కుమార్ సూచించారు. జంగమహేశ్వరులు అయాచార దీక్షలు చేపట్టాలని కోరారు. ​కులగణనపై అప్రమత్తత: ​ఉప కోశాధికారి R. శివకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న కులగణనలో తలుపులు వేసి ఉన్న ఇళ్లను వదిలేయకుండా, సరైన మార్గంలో ప్రతి ఇంటిని లెక్కించాలని, కులగణన సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. ​ఐక్యతాయే లక్ష్యం: ​సంఘంలో ఎలాంటి మనస్పర్థలు లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలని గౌరవ అధ్యక్షులు కె.వి. నాగేశ్వరయ్య, టౌన్ ప్రెసిడెంట్ R. మల్లేశ్వరయ్య కోరారు. కొందరు వ్యక్తులు సంఘాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారని, వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఒకే విధానంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ​పాల్గొన్న ముఖ్యులు: ఈ సమావేశంలో కోశాధికారి చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు చెన్న బసయ్య, చంద్రయ్య, ఉపాధ్యక్షులు నటరాజ్, N. గంగాధర శాస్త్రి, రామలింగయ్య, R. శివకుమార్ మరియు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు. అలాగే యు.ఎమ్ రుద్రయ్య గారికి జ్యోతిష్య రత్న అవార్డు వచ్చిన సందర్భంగా రాష్ట్ర నాయకులు శాలువాతో సన్మానించి గౌరవించారు పాదయాత్రలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు గాను మహర్షి విజయ్ కుమార్ కి శాలువాతో ఘనంగా సత్కరించారు మరియు కవిగా అనేక ప్రశంసలు అందుకున్న కె.వి నాగేశ్వరయ్య వారిని కూడా ఘనంగా సత్కరించారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలిగిరి శివాలయ పునఃనిర్మాణంపై సమగ్ర సమీక్ష – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనలు

కలిగిరి మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయ పునఃనిర్మాణంపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. నేషనల్ హైవే విస్తరణ ప్రభావం నేపథ్యంలో ఆలయానికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు. స్థల పరిమాణం, నిర్మాణ రూపకల్పన, భక్తుల సౌకర్యాలపై అధికారులతో పాటు ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సంప్రదాయాలను కాపాడుతూ ఆధునిక సదుపాయాలతో ఆలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో “ఆపరేషన్ వజ్ర ప్రహార్” – డ్రగ్ ఫ్రీ జిల్లాకై పోలీసుల విస్తృత అవగాహన

పోలీసులు “ఆపరేషన్ వజ్ర ప్రహార్” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ సౌజన్య సూచనలతో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై వివరించి, వాటి నుంచి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. యువతలో చైతన్యం కల్పించడం ద్వారా సమాజాన్ని రక్షించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ముత్తుకూరులో టీ-10 క్రికెట్ పోటీలు – రాష్ట్రవ్యాప్తంగా 300 మంది పాల్గొననున్నారు

ఈ నెల 4, 5 తేదీలలో ముత్తుకూరు మండల పరిషత్ క్రీడా మైదానంలో టీ-10 క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సుకుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 16 జిల్లాల నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ప్రతి జట్టు తరఫున 15 మంది క్రీడాకారులు కోచ్‌లతో కలిసి పాల్గొంటారని వెల్లడించారు. మొత్తం 300 మంది క్రీడాకారులు, కోచ్‌లు మరియు సహాయక సిబ్బంది హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ రాంబాబు, ఆర్గనైజర్ ప్రకాష్ తదితరులు సమావేశంలో పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరులో నేతాజీ వికాస్ విద్యాసంస్థల 29వ వార్షికోత్సవం ఘనంగా

వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ హైస్కూల్ అండ్ కాలేజ్ 29వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎ మ్మెల్యే కాకర్ల సురేష్ సరస్వతి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేడుకలను ప్రారంభించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా వీక్షించి వారి ప్రతిభను అభినందించాను. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తోందని పేర్కొన్నాను. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే వేదికలని, వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించాను. ఉపాధ్యాయుల కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు .

తూర్పు గోదావరి

రాజమండ్రి మున్సిపాలిటీ నిర్లక్ష్యం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూ.గో.జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ 45వ వీధిలో గత మూడు రోజులుగా డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తుంది డ్రైనేజీ మరమ్మత్తుల నిమిత్తం అడ్డువేసినారు డ్రైనేజీ మరమ్మత్తులు పూర్తి కాకపోవడంతో ఇలా రోడ్లమీద నీరు ప్రవహిస్తుంది దానివల్ల అక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు . వ్యాధులు వస్తాయేమో అని భయపడుతున్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని అధికారులు త్వరగా చేస్తారని ప్రజల ఆకాంక్ష End Uploaded Video:

News

బుగ్గారం మండల కేంద్రంలో కాకుండా షేకళ్లలో శిక్షణనా…? ఎటు పోతోంది పరి పాలన – ఏమౌతోంది ప్రజా స్వామ్యం…?? బుగ్గారం కు ఇంకా కూడా అన్యాయమేనా…??? గళమెత్తి గర్జిస్తున్న మహిళా వార్డ్ సభ్యురాలు

బుగ్గారం మండల కేంద్రంలో కాకుండా షేకళ్లలో శిక్షణనా…? ఎటు పోతోంది పరి పాలన – ఏమౌతోంది ప్రజా స్వామ్యం…?? బుగ్గారం కు ఇంకా కూడా అన్యాయమేనా…??? గళమెత్తి గర్జిస్తున్న మహిళా వార్డ్ సభ్యురాలు బుగ్గారం / జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కాకుండా శేఖల్ల గ్రామ రైతు వేదికలో ఈనెల 6 నుండి 10 వరకు ఐదు రోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాల నూతన వార్డ్ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని శనివారం రాత్రి నోటీసులు జారీ చేశారు. షేకళ్లలో శిక్షణనా…? ఇది పూర్తిగా అన్యాయం, పూర్తిగా ఇబ్బంది కరం, అసౌకర్యం కూడా అని బుగ్గారం గ్రామ పంచాయతీ 11 వ వార్డ్ సభ్యురాలు చుక్క లతశ్రీ ఆరోపించారు. అధికారులు, పాలక వర్గం ఆలోచించాలని, పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు పునరాలోచన చేసి ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. మండల కేంద్రంలోనే వార్డ్ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె అభ్యంతరం తెలుపుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయి సంబంధిత అధికారులతో పాటు సాక్షాత్తు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లకు కూడా సోషల్ మీడియా వేదికగా సందేశం పంపించినట్లు తెలిపారు. నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉన్నతాధికారులు సైతం ఇంకా కూడా మండల కేంద్రమైన బుగ్గారం గ్రామానికి తీరని అన్యాయం చేసే కుట్రలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్ర పూరిత చర్యలు ఇలాగే కొనసాగితే తగు న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆమె హెచ్చరించారు.

తిరుపతి

మనిషిని ఆధ్యాత్మికంగా నడిపించే దివ్య సాధనం యోగా-యోగాచార్యులు మార్కండేయులు

నేటి ఆధునిక కాలంలో మానవ సమాజం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, శారీరక సవాళ్లకు యోగాభ్యాసమే సరైన పరిష్కారమని ప్రముఖ యోగాచార్యులు మార్కండేయులు పిలుపునిచ్చారు. స్వర్గీయ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానంద స్వామివారిచే స్థాపించబడిన పవిత్ర శ్రీ శుకబ్రహ్మాశ్రమం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగ శిక్షణ శిబిరం శనివారంతో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా పరిచయ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు విద్యా వికాస పరిషత్ తరపున సర్టిఫికేట్లను అందజేశారు. ఈ వేడుకలో యోగాచార్యులు మార్కండేయులు మాట్లాడుతూ.. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది మన ప్రాచీన భారతీయ మనో-శారీరక దివ్య సాధన అని పేర్కొన్నారు. శారీరక భంగిమలు (ఆసనాలు), శ్వాస పద్ధతులు (ప్రాణాయామం), ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్యకృత్యం చేసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు భాస్కర్ నాయుడు, రాజేశ్వరరావు పాల్గొని శిక్షణార్థులకు పలు సూచనలు చేశారు. సర్టిఫికేట్లు అందుకున్న వారిలో యోగాభ్యాసకులు నివేదిత, రేణుశ్రీ సరస్వతీ, మణిదీప్ తదితరులు ఉన్నారు. ఆశ్రమ భక్తులు, యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

తిరుపతి

రేపటి నుంచే అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ: ఐసీడీఎస్ సీడీపీఓ శాంతిదుర్గ వెల్లడి

శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహాయక (హెల్పర్) పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు శ్రీకాళహస్తి ఐసీడీఎస్ (ICDS) సీడీపీఓ బి. శాంతిదుర్గ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 36 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నియామకాలు జరగనున్నాయని, అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తు తేదీలు: ఈ నెల 6వ తేదీ (సోమవారం) నుండి 15 రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించబడతాయి. వయస్సు: 01.07.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుండి 35 ఏళ్ల లోపు ఉండాలి. నిబంధనలు: ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్లలోని కేంద్రాలకు సంబంధిత సామాజిక వర్గ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తప్పనిసరిగా స్థానికులై ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారాలను పొంది, వాటితో పాటు క్రింది ధృవీకరణ పత్రాలను జతచేయాలి. 1. పదవ తరగతి మార్కుల మెమో. కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC అయితే). 2. నివాస ధృవీకరణ పత్రం. 3. పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం.4. ఆధార్ కార్డు నకలు. 5. వికలాంగులైన పక్షంలో సంబంధిత ధృవీకరణ పత్రం. ప్రభుత్వ జి.ఓ. నెం. 13 (26.06.2019) ప్రకారం, అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 11,500/-, సహాయకులకు (హెల్పర్స్) నెలకు రూ. 7,000/- గౌరవ వేతనం చెల్లించబడుతుందని సీడీపీఓ వివరించారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు నేరుగా శ్రీకాళహస్తిలోని ఐసీడీఎస్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆమె సూచించారు.

తిరుపతి

ఏర్పేడు ఐఐటీలో పరిశోధన చేసే సువర్ణావకాశం-జేఆర్ఎఫ్ (JRF) భర్తీకి నోటిఫికేషన్

ఏర్పేడు, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఐఐటీ తిరుపతి (ఏర్పేడు) లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పొందేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న యువతకు ఇది ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి M.Tech (కెమికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్) లేదా M.Sc (కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్) పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగాల్లో ప్రావీణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ తిరుపతి అధికారిక వెబ్‌సైట్ https://www.iittp.ac.in/Project_Positions ను సందర్శించి, ప్రాజెక్ట్ పొజిషన్స్ విభాగంలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వయస్సు, ఎంపిక విధానం, పారితోషికం వంటి పూర్తి సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 15. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.