Thursday, 23 April 2026

Blog

జనగాం

రాష్ట్ర సదస్సు మరియు ఈద్ మిలాబ్ కు తరలివెళ్ళిన జనగామ జిల్లా తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీసు యూనియన్ TSMESA

జనగామ జిల్లా నుండి ఉద్యోగులు హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర సదస్సు మరియు ఈద్ మిలాబ్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలీ మాట్లాడుతూ మైనారిటీ ఎంప్లాయీస్ యూనియన్ జనగామ జిల్లాలో చాల మంచి కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఓటర్ ఎన్రోల్మెంట్ క్యాంప్ , ఇఫ్తార్ విందు, 317 Go బాధితుల avareness camp, representation Best teacher awards for monority employees లాంటి కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఉపయోగపడే పనులు చేసిందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ అహ్మెద్ రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు ను తెచ్చాడని ఫరూక్ గారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనగామ మైనారిటీ ఉద్యోగులను ఫరూక్ అహ్మెద్ సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలీ, తహసీన్, జహీరుద్దీన్ , ఖలీల్, మోహసిన్, గౌస్ పాషా, అజీజ్ పాషా, ఇమ్రాన్, రిజ్వాన్ మరియు పాషా తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

రెండేళ్ల విజయోత్సవం – కేవి హాస్పిటల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

)మదర్, చైల్డ్ & మల్టీ స్పెషాలిటీ సేవలతో ప్రజల విశ్వాసాన్ని పొందిన కేవి హాస్పిటల్ తన రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా పోస్ట్ డెలివరీ సేవలు, శిశు వైద్యం, మహిళల ప్రత్యేక చికిత్సలు, అత్యవసర సేవలు అందిస్తూ ప్రజలకు చేరువైంది. ఈ శిబిరంలో నిపుణుల ద్వారా ప్రత్యేక పరీక్షలు, సలహాలు అందించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది. ఈ కార్యక్రమం గూడూరులోని మాయాబజార్ రోడ్, సమీపంలోని కేవి హాస్పిటల్‌లో జరుగుతుంది.కాబట్టి..గూడూరు మరియు ఇతర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని…సద్వినియోగం చేసుకోవాలని, కోరుతున్నారు,

ఆంధ్రప్రదేశ్

సూర్యశక్తితో ప్రపంచానికి మార్గదర్శకంగా భారత్ – మౌంట్ అబులో అతిపెద్ద సౌర వంటగది

భారతదేశంలో పునరుత్పాదక శక్తి వినియోగానికి ఒక అద్భుతమైన నమూనాగా మౌంట్ అబులో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర వంటగది నిర్మించబడింది. ఈ సౌర కిచెన్ రోజుకు సుమారు 50,000 మందికి భోజనం సిద్ధం చేస్తూ, గ్యాస్ లేదా విద్యుత్ అవసరం లేకుండా పూర్తిగా సూర్యశక్తినే వినియోగిస్తోంది. భారీ సౌర ప్రతిఫలకాలు సూర్యకాంతిని సేకరించి ఆవిరిని ఉత్పత్తి చేసి, ఆ ఆవిరితో వంట ప్రక్రియ నిర్వహించబడుతోంది. ఇది పర్యావరణానికి మేలు చేయడంతో పాటు ఇంధన ఖర్చులను కూడా గణనీయంగా తగ్గిస్తోంది. కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ, స్థిరమైన శక్తి వినియోగానికి ఇది ఉత్తమ ఉదాహరణగా నిలుస్తోందని బి.కె. పద్మజ సిస్టర్, కొత్తపేట సెంటర్ హెడ్, విజయవాడ తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దూరదృష్టి ఫలితం… 16 ఏళ్ల తర్వాత AS పేటకు సాగునీటి శుభవార్త!

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దూరదృష్టికి మరోసారి ఫలితం లభించింది. 2013లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపాదించిన సాగునీటి ప్రణాళికలు, ప్రస్తుతం NDA ప్రభుత్వంలో ఆమోదం పొందడం విశేషం. 16 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతూ RRR పథకం కింద రూ.3.84 కోట్లతో AS పేట మండలంలో 13 చెరువుల పునరుద్ధరణ పనులకు GO RT No.174 ద్వారా అనుమతి లభించింది. కొండమీద కొండూరు, గుడిపాడు, రాజవోలు వంటి చెరువులు పునరుద్ధరించబడనుండటం రైతులకు ఆశాకిరణంగా మారింది. ఈ పనులతో సాగునీటి సౌకర్యం మెరుగుపడటమే కాకుండా భూగర్భ జల మట్టం పెరిగే అవకాశం ఉంది. రైతు సంక్షేమానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతున్నదానికి ఇది నిదర్శనం. ప్రాంతీయ వ్యవసాయాభివృద్ధికి ఇది కీలక మలుపుగా మారనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

కొత్త ఏపీ మ్యాప్ – 28 జిల్లాలతో APSDMA విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కొత్త భౌగోళిక మ్యాప్‌ను APSDMA విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో అమరావతిని అధికారిక రాజధానిగా స్పష్టంగా చూపించారు. ఇటీవల అమరావతికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త మ్యాప్‌లో మొత్తం 28 జిల్లాలు చూపించబడగా, తాజాగా ఏర్పడిన పోలవరం మరియు మార్కాపురం జిల్లాలు కూడా ఇందులో చేర్చబడ్డాయి. ప్రకృతి విపత్తుల నిర్వహణ, ప్రణాళికలు, మరియు పరిపాలనలో స్పష్టత కోసం ఈ మ్యాప్ కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్ర భౌగోళిక నిర్మాణంలో వచ్చిన ఈ మార్పు పాలనలో వేగాన్ని పెంచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

టెన్త్ విద్యార్థులకు 7 మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం

AP: SSC పరీక్షల్లో సందిగ్ధ సమాధానాలను ప్రశ్నలను అటెంప్ట్ చేసిన వారికి మార్పులు కలపాలని బోర్డు నిర్ణయించింది. HINDIలో 2, ENGLISHలో 5 మార్పులు కలవనున్నాయి. మరో 3 ప్రశ్నలైన పాయింట్స్ వివరించారు. కాకా ప్రశ్నల్లో పొరపాట్లు లేవని, విద్యార్థి సమగ్రత పరీక్షకు వివిధ రూపాల్లో అడుగుతుంటారని బోర్డు వర్గాలు వివరించారు. సందిగ్ధం ఉన్న వాటిపై ప్రిన్సిపల్ వాల్యుయేషన్ సూపర్వైజన్ DEOలకు పంపుతున్నట్లు తెలుస్తోంది

అనకాపల్లి

ఏటికొప్పాకలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి ఘనంగా నిర్వహణ..

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 5 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్), ఏటికొప్పాక గ్రామంలో మహానేత బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కులపెద్దలు, యువత తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా నర్సింగరావు, సాగర్, ఆనంద్, చిన్ని, శామ్యూల్ రాజు, శాంతరాజు, చందు, విజయ్ బాబు, ప్రవీణ్ కుమార్, యేసు రాజు, దావీదు కుమార్, సతీష్, రాజ్ కుమార్ (చింటూ), రవి (యోబు), రమేష్, u.v.n.రమణ, సిద్దు, శివ, ప్రేమ దాసు, రిషి, శామ్యూల్, నాగేంద్ర, ఆనంద్ కుమార్, జైశీను, అప్పారావు (ఆర్మీ), తేజ, ఇషాక్ రాజ్, ప్రభాస్, సుశాంత్, రజిని, బాబ్జి, కిషోర్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం, సేవాభావం పెంపొందించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ వేడుకలు ఉత్సాహభరితంగా, ఐక్యతను ప్రతిబింబిస్తూ ఘనంగా ముగిశాయి.

News

💐ఒంగోలులో సురభి అష్టావధానం 💐

ఒంగోలులో సురభి అష్టావధానం💐💐💐 షిరిడిసాయి కల్చరల్ మిషన్ ఆధ్వర్యంలో, జాతీయ సాహిత్య పురస్కార గ్రహీత సురభిశంకరశర్మ అష్టావధానంను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు డాక్టర్ రావిపాటి ప్రసాద్ తెలియచేశారు.ఈకార్యక్రమం ఒంగోలు లాయర్ పేట షిరిడీ సాయిమందిరంలోఏప్రియల్ 5వతేది ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆరంభమౌతుందని , ఏ.పి.జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ డా.బి.శ్రీకృష్ణవేణి,ముఖ్య అతిథిగాపాల్గొంటారని తెలిపారు. అష్టావధాని మానేపల్లి నాగకుమార్ సభాసంచాలకులు గావ్యవహరిస్తారని చెప్పారు. నిషిద్ధాక్షరికి- అష్టావధానిదూపాటి రామాచార్యులు,న్య స్తాక్షరికి- అష్టావధాని డా.జిల్లెళ్ళవరప్రసాద్, దత్తపదికి-డా.రామచంచంద్రుని రమేష్, సమస్యకు-గుడ్లూరి వేంకటేశ్వరరాయకవి, వర్ణనకు- తెలుగు ఉపన్యాసకులు యడ్లపల్లి శ్రీరామమూర్తి,ఆశువు కు-తెలుగు అధ్యాపకులు యం.వి.యస్. శాస్త్రి, మీమాట-నాపాటకు విశ్వకళాభారతి అధ్యక్షులు నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వరశర్మ,అప్రస్తుతప్రసంగం-సంస్కృతోపన్యాసకులు దొప్పలపూడి వేంకటరావులు ప్రాశ్నికులుగా పాల్గొనబోతున్నారని డా.రావిపాటి తెలిపారు.

తిరుపతి

శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

గూడలి కోట మండలం ఏప్రిల్ ( పున్నమి ప్రతినిధి ) శతాబ్దాల సాంస్కృతిక చరిత్రకు, వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా, అద్భుత శిల్పకళా సంపద ఈ ఆలయం సొంతం. స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన శైవ క్షేత్రాల్లో ప్రత్యేకత సంతరించుకున్న కోట మండలం గూడలిలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయం చోళరాజుల చరిత్రకు నిదర్శనం. ఈ నెల 5వ తేదీ నుంచి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గూడలిలోని సంగమేశ్వరస్వామి ఆలయానికి పురాతన చరిత్ర ఉంది. తైత్రా యుగమున ఆగస్త్య మహాముని కాశీ నుంచి కన్యాకుమారికి వెళుతూ మార్గమధ్యమున శివపూజకు వేళయినందున స్వర్ణముఖి నది కూడలి వద్ద తన రుద్రాక్ష మాలను ఉంచి శివుని ప్రార్ధించడం వలన ఆ రుద్రాక్ష మాల లింగరూపమును దాల్చిందని చరిత్ర చెబుతుంది. 12వ శతాబ్ధంలో చోళరాజు కళింగతుంగ చోళుడు వేటకు వచ్చి కాంతులీనుతున్న రుద్రాక్ష లింగాన్ని పూజించి ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం తెలుపుతుంది. స్వర్ణముఖి నది మూడు పాయలుగా చీలిపోవడంతో కూడలి ప్రాంతం గూడలిగా మారినట్లు చరిత్ర చెబుతుంది. సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు. సంతానం లేని మహిళలు బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ రోజు కొడి వస్త్రాన్ని కట్టుకుని కొడి ముద్దలు భక్తిభావంతో స్వీకరిస్తే సంతానం కలుగుతుందని చెప్తున్నారు. అదే సమయంలో స్వామివారి కల్యాణంతో పాటు అనేక జంటలు ఆలయ ప్రాంగణంలో వివాహాలు చేసుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఉత్సవాల వివరాలు : ——————- ఈ నెల 5వ తేదీన అంకురార్పణ, గ్రామోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 6న ధ్వజారోహణ, కొడి వస్త్రాలు, 7న శేష వాహనసేవ, 8న హంసవాహన సేవ, 9న బృంగిసేవ, 10న రావణ సేవ, 11న నందిసేవ, 12న రథోత్సవం, 13న గజవాహన గ్రామోత్సవం, 14న స్వామివారి కల్యాణం, 15న ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొంటారని ఆలయ నిర్వాహకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పల్లెముల్లు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయశాఖ ఏఓ పెంచల వర ప్రసాద్ తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బొల్లినేని ప్రాపర్టీస్ సేవలు విస్తరణ

నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందుతున్న బొల్లినేని ప్రాపర్టీస్, వినియోగదారులకు విశ్వసనీయ సేవలను అందిస్తూ ముందుకు సాగుతోంది. ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, ల్యాండ్స్, ఇళ్లు వంటి విభిన్న ఆస్తుల కొనుగోలు, విక్రయం, పెట్టుబడులపై సలహాలు అందిస్తోంది. ఆధునిక సౌకర్యాలు, పారదర్శక వ్యవహారశైలి, నాణ్యత ప్రమాణాలు సంస్థ ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. కస్టమర్లకు సురక్షిత పెట్టుబడి అవకాశాలను అందించడమే లక్ష్యంగా బొల్లినేని ప్రాపర్టీస్ కృషి చేస్తోంది. నెల్లూరు మగుంట లేఅవుట్‌లోని కార్యాలయం ద్వారా సేవలు అందిస్తూ, మరింత విస్తరణకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.