Thursday, 23 April 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

కాలం మారినా… భూమి అందం శాశ్వతం!

చంద్రుడి కక్ష్యలో మనిషి ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి 54 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాసా ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. 1972లో అపోలో-17 వ్యోమగాములు తీసిన భూమి ఫోటోను, తాజాగా ఆర్టెమిస్-2 బృందం తీసిన చిత్రంతో పోల్చింది. “కాలం ఎంత మారినా, అంతరిక్షం నుంచి కనిపించే భూమి అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు” అని నాసా పేర్కొంది. ఈ రెండు చిత్రాలు ఒకవైపు అంతరిక్ష పరిశోధనలో జరిగిన విప్లవాత్మక పురోగతిని, మరోవైపు భూమి సహజ సౌందర్యం ఎంత శాశ్వతమో మనకు గుర్తుచేస్తున్నాయి.

జాతీయ అంతర్జాతీయ

ప్లాస్టిక్ వ్యర్థాల నియమాల్లో సడలింపు – కంపెనీలకు గడువు పొడిగింపు

భారత ప్రభుత్వం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాల్లో కీలక సవరణలు చేసింది. రీసైక్లింగ్ లక్ష్యాలను యథాతథంగా ఉంచినా, వాటి అమలులో కంపెనీలకు గడువు సడలింపు కల్పించింది. 2025–26లో లక్ష్యాలు సాధించలేకపోతే, లోటును మూడు సంవత్సరాల వరకు మోసుకెళ్లే అవకాశం ఇచ్చింది. అయితే ప్రతి సంవత్సరం కనీసం మూడో వంతు లోటును భర్తీ చేయాలి. గతంలో కంపెనీలు ప్రతి ఏడాది లక్ష్యాలు పూర్తి చేయాల్సి ఉండేది. ఈ మార్పుతో పరిశ్రమలకు ఊరట లభించినప్పటికీ, పర్యావరణ పరిరక్షణపై ప్రభావం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

జాతీయ అంతర్జాతీయ

ఇరాన్‌లో అమెరికా యుద్ధ విమానం కూల్చివేత – రక్షణ చర్యలు ఉత్కంఠ!

ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేశాయని ఇరాన్ మీడియా ప్రకటించింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. విమానంలోని సిబ్బందిని వెతికేందుకు ఇరాన్ దళాలు గాలింపు చర్యలు ప్రారంభించి, సమాచారం ఇచ్చేవారికి బహుమతి ప్రకటించాయి. ఇదే సమయంలో, అమెరికా ప్రత్యేక దళాలు ఇద్దరు సిబ్బందిలో ఒకరిని సురక్షితంగా రక్షించినట్లు అమెరికా మీడియా తెలిపింది. దక్షిణ పశ్చిమ ఇరాన్‌లోని కోహ్గిలుయెహ్–బోయెర్ అహ్మద్ ప్రాంతంలో కూలిన విమాన అవశేషాల వీడియోను స్థానిక టీవీ ప్రసారం చేసింది. ఈ ఘటనతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

News

అమరావతి శాశ్వత రాజధాని: పార్లమెంట్ చారిత్రక బిల్లు అంగీకారం 2000 ఏళ్ల పురాతన వారసత్వానికి కొత్త ఊపిరి**

విశాఖపట్నం, మధురవాడ, ఏప్రిల్ 4, పున్నమి న్యూస్ ప్రతినిధి** పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన **ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026**తో అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధ స్థాయి పొందింది. లోక్‌సభలో ఏప్రిల్ 1న, రాజ్యసభలో ఏప్రిల్ 2న వాయిస్ వోట్ ద్వారా ఆమోదం పొందిన ఈ బిల్లు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 5ని సవరించి, అమరావతిని జూన్ 2, 2024 నుంచి రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తించింది. ఈ నిర్ణయం రాజధాని వివాదానికి చివరి ముద్ర వేసి, అభివృద్ధి పనులకు కొత్త ఊపిరి పోసింది. అమరావతి గత చరిత్ర: బౌద్ధ సంస్కృతి కేంద్రం నుంచి ఆధునిక రాజధాని వరకు అమరావతి చరిత్ర 2000 ఏళ్లకు పైగా పాతది. క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచి సతవాహన రాజవంశం రాజధానిగా (ధాన్యకటకం / ధరణికోట) ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న **అమరావతి స్తూపం (మహాచైత్యం)** ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపాల్లో ఒకటి. సతవాహనులు, ఇక్ష్వాకులు కాలంలో బౌద్ధ భిక్షువులు, విద్యార్థులు, వాణిజ్యవేత్తలు ఇక్కడి నుంచి శ్రీలంక, సుమత్రా, జావా వరకు వ్యాపించారు. అమరావతి శిల్పాలు (అమరావతి స్కల్ప్చర్స్) ప్రపంచ ప్రసిద్ధి ఇవి లండన్ బ్రిటిష్ మ్యూజియం, చెన్నై గవర్నమెంట్ మ్యూజియంలలో ఉన్నాయి. మధ్యయుగ కాలంలో పల్లవులు, చోళులు, విజయనగర సామ్రాజ్యం పాలనలో కూడా ఇక్కడి ఆమరేశ్వర స్వామి ఆలయం (పంచారామ క్షేత్రం) హిందూ భక్తులకు ప్రముఖ తీర్థస్థలంగా మిగిలింది. ఆధునిక కాలంలో 2014లో తెలంగాణ విభజన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హోదా కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని అవసరమైంది. 2015లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా ఎంపిక చేసి, 54,000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నగరం నిర్మాణం ప్రారంభించింది. రైతులు భూములు పూలింగ్ చేసి రాజధానికి త్యాగం చేశారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల (అమరావతి లెజిస్లేటివ్, విశాఖ ఎగ్జిక్యూటివ్, కర్నూలు జ్యుడీషియల్) ప్రతిపాదనతో అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. రైతుల ఉద్యమాలు, కోర్టు కేసులు, ఇన్వెస్టర్ల అనిశ్చితి ఏర్పడ్డాయి. బిల్లు అంగీకారం: విశ్లేషణ రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాముఖ్యత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి ఏకైక రాజధాని నిర్ణయానికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రానికి తీర్మానం పంపింది. మార్చి 28, 2026న ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన తీర్మానం ఆధారంగా కేంద్రం ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. **విశ్లేషణ:** **రాజకీయ స్థిరత్వం:** బిల్లు రాజధాని మార్పు భవిష్యత్ ప్రయత్నాలను అడ్డుకుంటుంది. ఇక మూడు రాజధానుల డిబేట్ ముగిసింది. వైఎస్‌ఆర్‌సీపీ వాకౌట్ చేయడం రాజకీయ వ్యతిరేకతను సూచిస్తుంది. **ఆర్థిక ప్రయోజనాలు:** ఇన్వెస్టర్లకు నిశ్చయత వచ్చింది. సింగపూర్ మోడల్‌లో ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఫార్మా, ఎడ్యుకేషన్ హబ్‌గా అమరావతి అభివృద్ధి వేగవంతం అవుతుంది. రైతులకు ఇచ్చిన హామీలు (రిటర్న్ ల్యాండ్, కాంపెన్సేషన్) త్వరగా అమలు కావాలి. **సామాజిక సాంస్కృతిక ప్రాముఖ్యత:** 2000 ఏళ్ల బౌద్ధ హిందూ వారసత్వానికి ఆధునిక రాజధాని హోదా లభించడం ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. కృష్ణా నది ఒడ్డున గ్రీన్ సిటీగా అమరావతి భవిష్యత్ తరాలకు ఆదర్శ నగరంగా నిలుస్తుంది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్‌గా మారిన తర్వాత అధికారికంగా అమలు అవుతుంది. రాజధాని నిర్మాణం 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అమరావతి చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు మూడింటినీ ఒకేసారి అలంకరించుకున్న చారిత్రక నిర్ణయం ఇది!

మహబూబ్ నగర్

*టెట్ అంశాన్ని పరిష్కరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించిన అదనపు ప్రధాన కార్యదర్శి

*కేంద్ర మంత్రి సహాయకులకు టెట్అంశం పై వినతిపత్రం అందజేసిన అదనపు ప్రధాన కార్యదర్శి* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ::0 4/ 04 /2026* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు అదనపు ప్రధాన కార్యదర్శి ఎం డి అమీర్ పాషా దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యాలయంలో మంత్రి సహాయకులకు టెట్ అంశంపై వివరించడం జరిగిందని వారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ అంశాన్ని సంబంధిత విద్యాశాఖ మంత్రికి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లి త్వరలో టెట్ గందరగోళానికి ముగింపు పలికి పరిష్కరింప చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందని అమీర్ పాషా తెలిపారు. ఆయన కృషికి రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ, రాష్ట్ర బాధ్యులు, రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశి యాదవ్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,ఎం.ఎన్ విజయకుమార్, రాష్ట్ర సలహాదారులు గోపాల్ జి, సుధాకరాచారి తదితరులు అభినందనలు తెలిపారు*

మహబూబ్ నగర్

*టెట్ అంశాన్ని పరిష్కరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించిన అదనపు ప్రధాన కార్యదర్శి

*కేంద్ర మంత్రి సహాయకులకు టెట్అంశం పై వినతిపత్రం అందజేసిన అదనపు ప్రధాన కార్యదర్శి* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ::0 4/ 04 /2026* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు అదనపు ప్రధాన కార్యదర్శి ఎం డి అమీర్ పాషా దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యాలయంలో మంత్రి సహాయకులకు టెట్ అంశంపై వివరించడం జరిగిందని వారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ అంశాన్ని సంబంధిత విద్యాశాఖ మంత్రికి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లి త్వరలో టెట్ గందరగోళానికి ముగింపు పలికి పరిష్కరింప చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందని అమీర్ పాషా తెలిపారు. ఆయన కృషికి రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ, రాష్ట్ర బాధ్యులు, రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశి యాదవ్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,ఎం.ఎన్ విజయకుమార్, రాష్ట్ర సలహాదారులు గోపాల్ జి, సుధాకరాచారి తదితరులు అభినందనలు తెలిపారు*

E-పేపర్

బరువు చూపకుండానే గ్యాస్ డెలివరీ…! అమలుకు నోచుకోని ఎల్పిజి చట్టాలు ఎన్నో..!

బరువు చూపకుండానే గ్యాస్ డెలివరీ…! అమలుకు నోచుకోని ఎల్పిజి చట్టాలు ఎన్నో..! నిత్యవసర వస్తువుల్లో ప్రధానమైనది గ్యాస్ అలాంటి గ్యాస్ వినియోగదారులకు అందించే సమయంలో దాని బరువుని నిర్ధారించి ఇవ్వాల్సి ఉంది. పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 04 ఏప్రిల్ 2026 9640204826 నిత్యవసర వస్తువుల్లో ప్రధానమైనది గ్యాస్ అలాంటి గ్యాస్ వినియోగదారులకు అందించే సమయంలో దాని బరువుని నిర్ధారించి ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి నిబంధనలు ఎన్నో ఎల్పిజి చట్టాల్లో ఉండగా చట్టానికే పరిమితమయ్యాయి. ఏదైనా పెద్ద సమస్య వస్తే తప్ప హడావిడి చేసే అధికారులు మిగతా సమయాల్లో కంటికి కూడా కనిపించరని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు దళారులు గ్యాస్ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకున్నప్పటికీ కృత్రిమ కొరతతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ రెండింతల ధరకి అమ్ముతున్నారు. ఎన్ని కఠిన నిబంధనలు వచ్చిన గ్యాస్ దారి మల్లక తప్పడం లేదు ఇదే అధికారుల పనితీరుకు అడ్డం పడుతుందని పలువురు వాపోతున్నారు. మూడు నెలలు రావాల్సిన గ్యాస్ ఇప్పుడు రెండు నెలలు మాత్రమే వస్తుందని వినియోగంలో మార్పులేకున్నా గ్యాస్ త్వరగానే అయిపోతుందని ఈ విషయంలో అధికారులు కిందిస్థాయి వ్యక్తుల పనితీరును నెగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిస్థితులు చెబుతున్నాయి. కొందరు డీలర్ల పనితీరు అధికారులకే సవాల్ విసురున్నట్లు ఉంది. ఇకనైనా డీలర్లు అధికారులు నిద్రలేచి ప్రజలకు వినియోగదారులకు గ్యాస్ డెలివరీ చేసే సమయంలో బరువు చూపించి ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.

విశాఖపట్నం

డా. పీర్ కుమార్ కు ఎన్టీఆర్ జాతీయరత్న అవార్డు

ఏప్రిల్ 3 @విశాఖపట్నం ఏప్రిల్ 3వ తేది శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం విశాఖ పౌరగ్రంధాలయం ఆడిటోరియంలో జరిగిన దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ ఉగాది సంబరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రంగాలలో ప్రముఖులకు అవార్డులు అందజేశారు. ఇందులో భాగంగా నెల్లూరుకు చెందిన డాక్టర్ బద్రి పీర్ కుమార్ తన రచన నటన బోధన రంగంలో చూపిస్తున్న ప్రతిభకు కొలమానంగా ఎన్టీఆర్ జాతీయ రత్న పురస్కారాన్ని అందజేశారు. సినీ నటులు, నిర్మాత, దర్శకులు అయిన ప్రసన్న కుమార్, సినీ దర్శకులు, యన్.టి.ఆర్ అవార్డు గ్రహీత డా. దుగ్గివలస దివాకర్, మాజీ డిప్యూటి మేయర్ దాడి సత్యనారాయణ, శంఖారావం కల్చరల్ అకాడమి అధ్యక్షులు బొమ్ముడి సత్యనారాయణ, కళాభూషణ్ డా. పి.ఎ. భాస్కరరావు తదిరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పీర్ కుమార్ ని అభినందించి సత్కరించారు.

తిరుపతి

మన ఊరు – మన జెండా-శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ శ్రేణులకు కోలా ఆనంద్ పిలుపు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గవ్యాప్తంగా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ కోలా ఆనంద్ తెలిపారు. శుక్రవారం నాడు స్థానిక బిజెపి కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు పోకల వంశీ నాగేంద్ర మాధవ్ సూచనల మేరకు ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను ఎగురవేసి, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో జెండా దిమ్మెల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు కునాటి నాగరాజ, మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞాశ్రీ, అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు బాగీతి వెంకటేష్, పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నేతలు జీవి అమర్నాథ్, కుప్ప ప్రసాద్, శ్రీపురం సుధాకర్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

తిరుపతి

సర్పంచులకు ఘన సన్మానం – తొట్టంబేడు మండలంలో జోరుగా అభినందన సభ

తొట్టంబేడు, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని తొట్టంబేడు మండల సర్పంచుల పదవీకాలం ముగిసిన సందర్భంగా వారి సేవలను కొనియాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ‘సర్పంచుల అభినందన సభ’ నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి వారు చేసిన కృషిని ప్రశంసిస్తూ సభలో ప్రత్యేకంగా సత్కరించారు. సభలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్ల కాలంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో వారి సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆనంతరం సర్పంచులు మాట్లాడుతూ….తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించి, గ్రామాభివృద్ధికి మార్గనిర్దేశం చేసిన మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. తమకు సర్పంచులుగా సేవ చేసే అవకాశం కల్పించి, ఎల్లప్పుడూ అండగా నిలిచిన నాయకుడిగా ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని సర్పంచులు భావోద్వేగంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.