Thursday, 23 April 2026

Blog

తిరుపతి

గిరిజన బాలలకు ‘యువనేస్తం’ చేయూత-కొత్త బట్టల పంపిణీ

ఏర్పేడు, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలంలోని చిందేపల్లి ఎస్టీ కాలనీ పిల్లలకు ‘యువనేస్తం అసోసియేషన్’ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మధురాంతకం మునిశేఖర్, యువనేస్తం ట్రస్ట్ అధ్యక్షులు వినోద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మునిశేఖర్, వినోద్‌లు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే ఆ కాలనీలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతికి దాతల సహకారంతో తమ సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. నిరుపేద గిరిజన పిల్లలకు అండగా నిలిచేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో వాలంటీర్ మౌనికతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. తమ పిల్లలకు కొత్త బట్టలు అందజేయడంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

జనసేన మాజీ మండలాధ్యక్షుడి అంత్యక్రియాల్లో పాల్గొన్న చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): రేణిగుంట మండలం జనసేన పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ముని కుమార్ హఠాన్మరణం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో జరిగిన ఆయన అంత్యక్రియల్లో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని నివాళులర్పించారు. జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర హస్తకళా అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ ముని కుమార్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పార్టీ అభివృద్ధికి ముని కుమార్ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. అనంతరం శోకసప్తప్త కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముని కుమార్ కి తుది వీడ్కోలు పలికారు.

తిరుపతి

న్యాయమూర్తిగా ఎంపికైన న్యాయవాది తిరుకాల ఉమా మహేష్

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన తిరుకాల ఉమా మహేష్ అరుదైన ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విడుదల చేసిన జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలలో ఆయన ప్రతిభ చాటి, న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. తిరుకాల మల్లికార్జున్ కుమారుడైన ఉమా మహేష్, చిన్నతనం నుంచే క్రమశిక్షణతో చదువుకుని నేడు ఉన్నత స్థాయికి చేరుకోవడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమా మహేష్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారన్న వార్త తెలియగానే శ్రీకాళహస్తి న్యాయవాద లోకంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. న్యాయవాద వృత్తిలో నిబద్ధతతో పనిచేసి, ఇప్పుడు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతుండటం గర్వకారణమని వారు కొనియాడారు. పట్టణ ప్రముఖులు, తోటి న్యాయవాదులు, మిత్రులు ఉమా మహేష్ నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన, కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకోవడం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు ప్రశంసించారు. తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, గురువులకు ఉమా మహేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

అమరావతి శాశ్వత రాజధాని నిర్ణయం-శ్రీకాళహస్తిలో టిడిపి నేతల ఘన సంబరాలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొంది, అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్ణయించిన నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కీర్తిశేషులు నందమూరి తారకరామారావు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. తదుపరి కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ, టపాకాయలు పేల్చుతూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. “జై అమరావతి – జై జై అమరావతి” నినాదాలతో పట్టణం మార్మోగింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అమరావతి రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని, వారి పోరాట ఫలితంగానే అమరావతి రాజధానిగా చట్టబద్ధత పొందిందని అన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టేందుకు కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ క్లస్టర్ ఇన్‌చార్జిలు, బూత్ ఇన్‌చార్జిలు, బిఎల్ఏలు, తెలుగు మహిళల నాయకులు, టిడిపి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

E-పేపర్

ఆరవ తరగతి విద్యార్ధి కూడా మూడవ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు – రేవంత్ రెడ్డి

ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి మీద రూ.50,000 ఖర్చు చేస్తుంది పున్నమి న్యూస్ ప్రతినిధి 03 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒక్క విద్యార్థి మీద, ప్రభుత్వం రూ.1,08,000 ఖర్చు చేస్తుంది కానీ ఆరవ తరగతి విద్యార్ధి కూడా మూడవ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు – రేవంత్ రెడ్డి Uploaded Video:

E-పేపర్

ఇబ్రహీంపట్నంలో AVN Lake field school ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

*ఇబ్రహీంపట్నంలో AVN Lake field school ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి* పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇన్చార్జ్ : 03 ఏప్రిల్ 2026 రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలల్ కేంద్రంలోని చర్లపటేల్ గూడ రోడ్డు నూతనంగా ఏర్పాటు చేసిన AVN Lake field Global School ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. ఎనుముల రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్,MLC AVN REDDY,కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి,శాసన మండలి విధాన సభ చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘునందన్ రావు,MLC లు కొమురయ్య,అద్దంకి దయాకర్,రాజ్యసభ సభ్యులు వెం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు వెంకటరమణ రెడ్డి,పైడి రాకేష్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

సి.రామపురంలో పర్యటించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

పున్నమి ప్రతినిధి , రామచంద్రాపురం రామచంద్రాపురం మండలం సి.రామాపురంలో పర్యటించిన వైఎస్‌ఆర్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి*.సి.రామాపురం సర్పంచ్‌ సుబ్రమణ్యంరెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన ఇంట జరిగిన ఆత్మీయ విందుకు హాజరైన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి రాకతో గ్రామంలో ఉత్సాహంగా పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చిన యువత .గ్రామ పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపించడానికి తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డిS పూర్తిగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ సర్పంచ్‌ సుబ్రమణ్యం రెడ్డి.సి.రామాపురం గ్రామ అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిందని, సర్పంచ్‌గా అవకాశం కల్పించినందుకు గ్రామంలో తనవంతు బాధ్యతగా కష్టపడి పనిచేశానని చెప్పిన సుబ్రమణ్యం రెడ్డి పదవీ కాలం ముగిసేంత వరకు నమ్మిన పార్టీ, నమ్ముకున్న నాయకుని వెంట నడుస్తూ ప్రజలకు సేవ చేసిన సర్పంచ్‌ సుబ్రమణ్యంరెడ్డి, ఆయన కుమారుడు పవన్‌కుమార్‌ రెడ్డిలను ఘనంగా సత్కరించిన చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి. సర్పంచ్‌గా పదవీ కాలం ముగిసినప్పటికీ పనిచేయాల్సిన సమయం చాలా ఉందని, మీరంతా జగనన్న సైనికులుగా ముందుకురావాలని మోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

తిరుపతి

సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలంవెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాగాలలో గురువారం నాడు కేరీర్ గైడెన్స్, ప్లేస్ మెంట్ & ట్రైనింగ్ సెల్ ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన లయనిక్స్ ఎల్.ఎల్. పి సంస్థ ప్రాంగణ ఎంపికల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయనిక్స్ సంస్థ తరపున హెచ్ ఆర్ మేనేజర్ విజయ్ కుమార్, హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ సతీష్ పాల్గోని గ్రూప్ డిస్కషన్, టెక్నికల్ మరియు హెచ్ ఆర్ ఇంటర్వూ రౌండ్లు చేపట్టారు. ఉద్యోగాలకు ఎంపికైన మంది . 65 విద్యార్థులకు నియామక పత్రిలను అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వార్షిక వేతనంగా రూ.2.5 లక్షలు వేతనంగా అందజేయ నున్నట్లు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో బి. ఫార్మసీ, ఫార్మా & చివరి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లయకిన్స్ సంస్థ ప్రతినిధులు , కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రసన్నరాజు, పరీక్షల నియంత్రణాధికారి సతీష్ కుమార్ పాల్గన్నారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో 140 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తిరుమలపై పైలట్‌ చారిత్రాత్మక ఫ్లైట్

తిరుమల సమీపంలో సాధారణంగా జరిగిన ఒక విమాన ప్రయాణం, ఇండిగో పైలట్‌కు ఎంతో ప్రత్యేకమైన మైలురాయిగా మారింది. పైలట్ మంజీత్ సింగ్‌కు ఇది పూర్తి సర్కిల్ క్షణంగా నిలిచింది, ఎందుకంటే అతను తన కాక్‌పిట్‌లో ఎదుర్కొన్న పోరాటాలను గుర్తు చేసుకున్నాడు. మార్చి 30న అహ్మదాబాద్-చెన్నై విమానం తిరుమల కొండల సమీపంలో ప్రయాణిస్తూ, అక్కడి దేవాలయాన్ని గౌరవిస్తూ సురక్షిత దూరంలో వలయం వేసింది. ఈ క్షణం పైలట్‌కు ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది. తన అనుభూతిని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఏళ్ల క్రితం ఖాళీగా తిరుపతికి వచ్చిన నేను, ఈరోజు పైలట్‌గా తిరుమలపై ఎగురుతున్నాను. ఇది జీవితమే ఒక పూర్తి చక్రంలా అనిపిస్తోంది” అని మంజీత్ సింగ్ చెప్పారు. ఈ ప్రయాణంలో ప్రయాణికులు కూడా ప్రశాంతతను అనుభవించినట్లు తెలిపారు. విమాన ప్రయాణం సుమారు 15,000 అడుగుల ఎత్తులో జరిగింది. తిరుపతి ఎయిర్‌స్పేస్‌లో విమానాలు సాధారణంగా నేరుగా ప్రయాణించవు, భక్తుల భావాలను గౌరవిస్తూ ఆలయం పైన నేరుగా ఎగరడం నివారిస్తారు. అయితే కొందరు ఈ చర్యను ప్రశంసించగా, మరికొందరు ఇలాంటి సున్నితమైన మత స్థలాల సమీపంలో విమాన ప్రయాణం సరైనదేనా అనే సందేహాలు వ్యక్తం చేశారు.

తిరుపతి

అమరావతి యే శాశ్వత రాజధాని ,బీజేపీ జిల్లా కార్యదర్శి కాయం హరినాధ రెడ్డి

పున్నమి ప్రతినిధి ,తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన తరువాత రాజధాని ఫై వున్న అపోహలు అన్నిటికీ స్వస్తి పలుకుతూ పార్లమెంట్ మరియు రాజసభ లొ అమరావతి రాజధానిగా గుర్తిస్తూ విభజన చట్టాన్ని సవరించిన బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి పంపడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ని నెరవేర్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ఆమోదం తెలిపిన 40 రాజకీయ పార్టీలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ నాయకులకు ఐదుకోట్ల ఆంధ్రులు ధన్యవాదములు తెలుపుతున్నారు. ఇదీ స్ఫూర్తి తో 1947 కి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ కలను సాకారం చేసుకుందాం అని బీజేపీ తిరుపతి జిల్లా కార్యదర్శి హరినాధరెడ్డి అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.