Thursday, 23 April 2026

Blog

తిరుపతి

ఘనంగా చిమ్నివరల్డ్ ఎ స్మార్ట్ కిచెన్ షోరూం ప్రారంభం

తిరుపతి, ఏప్రిల్ 2 పున్నమి ప్రతినిధి మహిళలు నచ్చేలా మెచ్చేలా.. మన్నిక.. నాణ్యత.. సౌలభ్యత చిమ్నే వరల్డ్ ఎ స్మార్ట్ కిచెన్ సొంతమని ఇటువంటి షోరూం తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని పేర్కొన్నారు. గురువారం తిరుపతి ఎంఆర్ పల్లి పోలీస్ సమీపంలో చిమ్నే వరల్డ్ ఎ స్మార్ట్ కిచెన్ షోరూం ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి షోరూమ్ అందుబాటులోకి రావడం తిరుపతి ప్రజలకు గర్వకారణం అన్నారు. ఇంటికి కావాల్సిన కిచెన్ వస్తువులన్నీ ఒకే చోట అందుబాటులో ఉండటం మహిళలకు ఎంత సౌకర్యంగా ఉంటుందన్నారు. మంచి నాణ్యమైన కిచెన్ సామాగ్రిని సరసమైన ధరలతో ప్రజలకు అందుబాటులోకి రావడం శుభ పరిణామం అన్నారు. రామచంద్ర పురానికి చెందిన హేమంత్, వంశీ లు నూతనంగా ఈ వ్యాపారం లోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వారు వ్యాపారం లో దినదినాభివృద్ధి చెందాలని దేవుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా షోరూం అధినేతలు హేమంత్, వంశీ ఎమ్మెల్యేని ఇతర అతిథులను ఘనంగా సత్కరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేటలో సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం – గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 2 (పున్నమి ప్రతినిధి) .నెల్లూరు డిసిసీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అక్కంపేట గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. మనుబోలు మండలం అక్కంపేటలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వారిని సన్మానించారు. 12 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. వైసిపి హయాంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలను హైకోర్టు స్టేతో కాపాడి పదోతరగతి వరకు విస్తరించామని పేర్కొన్నారు. గ్రామస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

E-పేపర్ తెలంగాణ మహబూబాబాద్

ఉత్సాహంగా మరిపెడ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర🚩🚩

హనుమాన్ జయంతి పురస్కరించుకొని మరిపెడ పట్టణంలో ఘనంగా శోభయాత్రను జై హనుమాన్ జైశ్రీరామ్ జైశ్రీరామ్, శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ హనుమా జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంటూ నినాదాలతో పట్టణవాసులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు🚩🚩 🙏 యత్ర యత్ర రఘునాథ కీర్తనంతత్ర తత్ర కృత మస్తకాంజలిమ్‌ |బాష్పవారి పరిపూర్ణ లోచనమ్‌మారుతిం నమత రాక్షసాంతకమ్‌ ||శ్రీ హనుమాన్ విజయోత్సవ పర్వదిన శుభాకాంక్షలు 🚩#JaiHanuman

ఎన్ టి ఆర్ జిల్లా

*రంగా అభిమానుల సంక్షేమమే లక్ష్యం*

*తెలుగు రాష్ట్రాల రంగా అభిమానుల చర్చించిన తర్వాతే రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం* *అన్నయ్యకు నాకు ఎలాంటి విభేదాలు లేవు, అన్నయ్య ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉన్నాయి* *కొండపల్లి వంగవీటి కుటుంబానికి పుట్టినిల్లు లాంటిది* *కొండపల్లికి ఆహ్వానించిన అల్తాఫ్ బాబాకు ధన్యవాదాలు* _వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్_ _శ్రీ శిరిడి సాయిబాబా మందిరం పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మార్చి మైలవరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఆశా కిరణ్_ ఇబ్రహీంపట్నం, పేద ప్రజల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ అభిమానుల సంక్షేమమే లక్ష్యం గా ప్రయాణం చేస్తున్నానని, రంగా అభిమానుల ఆలోచన ప్రకారం తన రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు రంగా కుమార్తె ఆశా కిరణ్. కొండపల్లిలో హజ్రత్ సయ్యద్ షాబుఖారి నిత్య అన్నదాన లంగర్ఖానా ద్వారా షిరిడి సాయిబాబా మందిరం అన్నసమారాధన కార్యక్రమం పాల్గొన్నారు ఆశా కిరణ్. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం పలికారు. బీ కాలనీ వద్దగల రంగా విగ్రహానికి ఆశ కిరణ్ మరియు అల్తాఫ్ బాబా పూలమాలవేసి నివాళులర్పించారు. సాయి బాబా గుడి లో ధర్మకర్త రాంబాబు ఆశ కిరణ్ దంపతులను బాబా కండువా మరియు చిత్రపటం తో సత్కరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆప్యాయంగా మహిళలకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా అభిమానులు తెలుగు రాష్ట్రాలలో, అన్ని పార్టీలలో, కుల మతాల అతీతంగా ఉన్నారని అన్నారు. వారి సంక్షేమం చూడవలసిన బాధ్యత రంగా కుమార్తెగా తనపై ఉందని అన్నారు. అందుకే రంగా- రాధా మిత్రమండలిని బలోపేతం చేస్తూ రంగా అభిమానులను ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. రంగా కు రాధా తాను రెండు కళ్ళు లాంటి వాళ్ళమని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తన ప్రయాణానికి అన్నయ్య పూర్తి మద్దతు ఉందని అన్నారు. రంగా అభిమానులను అందరితో చర్చించిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కొండపల్లి వంగవీటి కుటుంబానికి పుట్టినిల్లు లాంటిదని, ఇక్కడికి రావడం, ప్రజల ఆప్యాయత చూస్తుంటే సంతోషకరంగా ఉందని చెప్పారు. కొండపల్లి ఆహ్వానించిన సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా కు ధన్యవాదాలు తెలిపారు. అల్తాఫ్ బాబా మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే శ్వాసగా జీవించిన రంగా అభిమానులకు, పేద ప్రజలకు సేవలు అందించాలని లక్ష్యంతో ముందుకొచ్చిన ఆశా కిరణ్ ను అభినందించారు, షాబుఖారి బాబా, షిరిడి సాయిబాబా, ఏసుప్రభు ఆశీస్సులతో ఆమె ఉన్నత స్థాయి పదవులు అధిరోహించి తండ్రికి తగ్గ కూతురు లాగా పేద ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. తాము సూఫీ ఇజాన్ని ఆచరిస్తూ దైవమార్గంలో ఉన్నామని,సేవ చేయటమే తన లక్ష్యమని తమకు ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదని ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్

అష్టావధానిసురభికి ఉగాది జాతీయ సాహిత్యఫురస్కారం

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, మనంఫౌండేషన్ శ్రీపరాభవఉగాది జాతీయపురస్కారాలసభ రవీంద్రభారతిలో మంగళవారం ఉదయం ఘనంగానిర్వహించింది.ఈసందర్భంగా వివిధరంగాల ప్రముఖులను ఘనంగాసత్కరించిం ది.మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, విశ్రాంత జిల్లాప్రధానన్యాయమూర్తి నేరెళ్ళమాల్యాద్రి, సినీదర్శకులు రేలంగినరసింహారావు, అష్టావధాని సురభి శంకరశర్మ, తదితరులుఅతిథులుగాపాల్గొన్నారు. మనం వ్యవస్థాపకులు అధ్యక్షులు చక్రవర్తి మాట్లాడుతూ నేటి పురస్కారాలందుకున్న ప్రముఖులందరూ పరాభవను విజయీభ వ సూచకంగా భావించి వారి వారి రంగాలలో విశేషంగా కృషిచేసి సామాజిక దేశసేవ ధ్యేయంగా ముందుకు సాగాలన్నారు.వేణుగోపాలాచారి మట్లాడుతూ, పురస్కారగ్రహీతలను అభినందిస్తూ జాతి శ్రేయస్సు, సమాజాభ్యుదయం , ప్రస్తుత దేశసమస్యలపట్ల అవగాహన, ప్రతిఒక్కరి బాధ్యత కావాలన్నారు. రేలంగి వారు ప్రసంగిస్తూ, ఆసక్తి ఉంటే, ఆశక్తి వస్తుందని ,కవులు కళాకారులు సంఘసేవకులపాత్ర దేశఉజ్వల భవితకు ఎంతో దోహదమౌతుందన్నారు. సురభి మాట్లాడుతూ, కృషిచేసేదేరంగమైనా సరే పవిత్రత ,ఐక్యత, నిబద్ధత, స్పష్టత, ఉండాలన్నారు. సురభికి జాతీయ సాహిత్యపుస్కారం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నేకాకుండా తమిళనాడు ,కర్ణాటక, మహారాష్ట్ర, తదితరప్రాంతాలలో 217అవధానాలు చేశారు . అవధానధుని అభినవ భర్తృహరి, అవధానసురభి, బిరుదులందుకొన్నారు. అవధానరంగంలో తెలుగువిశ్వవిద్యాలయంపురస్కారం , అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుచే రవీంద్రభారతిలో సత్కారం , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్టేట్ యూత్అవార్డ్ ,పద్మశ్రీ శోభారాజ్ గారిచే అన్నమయ్య సాహితీపురస్కారం,విజయవాడ సిద్ధార్థ మహిళాకళాశాల గిడుగువారిపురస్కా రం , నెహ్రూ యువకేంద్ర వివేకానంద యువశక్తి సాహితీపురస్కారం అందుకున్నారు. ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వివిధప్రాంతాలలో పలుసాహిత్యసంస్థలచే సాహిత్యపురస్కారాలందుకొన్నారు. అప్పటిగవర్నర్లు కృష్ణకాంత్ నరసింహన్ రోశయ్యలచే సన్మానాలందుకొన్నారు. అధ్యాపకునిగా జిల్లాప్రభుత్వపురస్కారమందుకున్నసురభి పలు టీవీ మాధ్యమాల‌లో తమసేవలంలదించారు. టీవీ9,సంస్కృతి, సీవిఆర్, ఆస్థా, యోగి, పియమ్ సి ,చానెళ్ళలోసమున్నత కార్యక్రమాలు నిర్వహించారు పద్యాలతోరణం వేదికగా సామాజిక శతక పద్యహేలకు పిలుపునిచ్చి నూటయాభై శతకరచనలకు ప్రేరకులయ్యారు కవిగా అవధానిగా,వ్యాఖ్యాతగా సభానిర్వాహకునిగా, ప్రవచనకర్తగా , సాహితీవేత్తగా, వివిధమాధ్యమాల ప్రతినిధిగా, విశేషసేవలనందిస్తున్నసురభి ఇంకా విశిష్ట విజయాలందుకోవాలని ఆశిద్దాం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రవిచంద్ర ఇంట రవిచంద్ర పోటెత్తిన ఎమ్ ఎల్ ఎ వైరి వర్గం

కావలి లోని తెలుగుదేశం పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర నివాసానికి తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు, యమ్.యల్ .సి బీద రవిచంద్ర గురువారం విచ్చేశారు. ఇటీవల ఆయన బావమరిది వెంకటసుబ్బయ్య మృతి చెందడంతో పరామర్శించేందుకు రాగా ఆయనతో పాటు ఎ.ఎమ్.సి చైర్మన్ అలేఖ్య, మాజీ ఛైర్మన్ వెంకటేశ్వర్లు, శ్రీహరి నాయుడు మరి కొందరు అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయానికి మాజీ యమ్ యల్ ఎ వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా అక్కడికి చేరడంతో, సమాచారం అందుకున్న పలువురు దేశం నేతలు అక్కడికి చేరుకోవడంతో మన్నవ ఇంట రాజకీయ సందడి నెలకొంది. ఇటీవల జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిన కార్యక్రమంకు ఈ నేతలందరూ గైర్హాజరు అయ్యి మరలా అందరూ మన్నవ ఇంటికి మూకుమ్మడిగా చేరుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆనం అంటే కొండంత అభిమానం.* *ప్రముఖ డాక్టర్ రజనీకాంత్.*

* *ఆత్మకూరులో లివర్ వ్యాధుల పైన, లివర్ మార్పిడి పైన అవగాహన సదస్సు* *ముఖ్య అతిథిగా పాల్గొన్న* *మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.* *మర్రిపాడు ఏప్రిల్ (పున్నమి ప్రతినిది)* ఇది మంచి ప్రోగ్రాం అని, ఆత్మకూరుకు ఇది తప్పకుండా కావాలని చెప్పారు. బిజీ షెడ్యూల్‌లో కూడా మంత్రి అనంరామ నారాయణ రెడ్డి గారు ఈ సభకు హాజరయ్యారంటే అది వారి నిబద్ధతకు నిదర్శనం. రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు, కానీ ప్రజల కష్టాన్ని తమ కష్టంగా భావించే నాయకులు చాలా అరుదు. ఆ అరుదైన నాయకుల్లో మొదటి వరుసలో ఉండే వారు ఆనం రామనారాయణ రెడ్డి గారు. గతంలో ఆర్థిక మంత్రిగా, ఆనం గారు మురగళ్ళ గ్రామ ప్రాంతంలో ఉన్న బంజరు భూములను మాగాణిగా మార్చినటువంటి భగీరథుడు. అప్పట్లో ఒక పంటకే కష్టపడే రోజులు ఉండేవి, ఇప్పుడు రెండు పంటలు పండించుకుని ప్రజలందరూ చాలా సుఖశాంతులతో ఉన్నారు. మురగళ్ళ ప్రజల తరపున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్. ఆనం ప్రజల సమస్యలు వినడానికి ఎప్పుడూ ముందుంటారు. రాత్రి అయినా, పగలైనా ఏ టైమ్‌లో ఫోన్ చేసినా విని, దానికి స్పందించి, ఇచ్చిన మాటకి కట్టుబడి పని చేస్తారు.నియోజకవర్గ అభివృద్ధికి ఆనం గారు వచ్చినప్పటి నుంచి ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా సాగునీరు, తాగునీరు అనేది ఆయన స్లోగన్. రైతులకు సాగునీరు, ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు కల్పించడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే విద్యకు, ఆరోగ్యానికి మొదటి పీట వేస్తారు. * మన ఆత్మకూరులోనే 100 పడకల హాస్పిటల్ రావడానికి ఎంతో కృషి చేసి, దాన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా తీసుకురావడంలో ఆయన కృషి అనిర్వచనీయం. * ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి యువకుడికి అవకాశాలు రావాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన సేవ చేస్తున్నారు అని కొనియాడారు… గ్లెనీగల్స్ హాస్పిటల్స్,చెన్నై వారి ఆధ్వర్యంలో డాక్టర్ పచ్చా రజనీకాంత్ నిర్వహించిన లివర్ మార్పిడీ అవగాహన మరియు విజయోత్సవ సభ విజయ వంతం చేశారు. ఆత్మకూరు తేదీ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆర్య వైశ్య మహాసభలో రమేష్ కు పదోన్నతి

ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పరిపాలనా కార్యదర్శి గా కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తిరమేష్ కు పదోన్నతి లభించింది. ఇప్పటికే కార్యదర్శి గా ఉన్న ఆయన అంకిత భావం కు ముగ్ధుడైన టి.జి.వెంకటేష్ రమేష్ సేవలు రాష్ట్ర స్థాయిలో అందించాలనే ఆలోచనతో ఈ పదవి కి ఎంపిక చేశారు. 24 మంది ఉన్న రాష్ట్ర కార్యవర్గంలో రమేష్ ఒకరు కీలక పదవి పొందడం పట్ల కావలి వాసులు హర్షం వ్యక్తంచేశారు. అమరావతి ఆర్యవైశ్య భవన నిర్మాణానికి ఇటీవలే రమేష్ 25 లక్షల భారీ విరాళం అందించారు.అలాగే కావలిలో కోటిరూపాయలతో ఆర్యవైశ్య భావన నిర్మాణం కు రమేష్ చర్యలు చేపట్టారు. కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు గా కొత్త చరిత్ర కు శ్రీకారం చుట్టిన రమేష్ తన సామాజిక వర్గానికే కాక, ఆధ్యాత్మిక సేవల్లో కూడా ముందంజలో ఉన్నారు. లభించిన పదవి తో ఆర్యవైశ్యల సంక్షేమం కోసం పాటు పడుతాను అని , తనకు ఇంత అవకాశం కల్పించిన టి.జి.వెంకటేష్,ఇల్లూరి లక్ష్మయ్య, సోమిశెట్టి వెంకటేశ్వర్లు కు రమేష్ ధన్యవాదాలు తెలిపారు. తనకు వెన్నంటి ఉండి సహకరిస్తున్న కావలి వైశ్యుల సహకారం మరువలేనిదని తెలిపారు.

హెల్త్ టిప్స్

హై కొలెస్ట్రాల్ లక్షణాలు – ముందస్తు జాగ్రత్తలు అవసరం

హై కొలెస్ట్రాల్ అనేది సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే వ్యాధి కావడంతో చాలా మందికి లక్షణాలు కనిపించకుండా ఉంటుంది. అయితే కొంతమందిలో ఛాతి నొప్పి, తరచుగా అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కనిపించవచ్చు. అదేవిధంగా మెడ, చేతులు, దవడ ప్రాంతంలో నొప్పి, కళ్ల చుట్టూ పసుపు రంగు మచ్చలు, నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించే సమయానికి సమస్య తీవ్రమై ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నిరంతరం రక్త పరీక్షలు చేయించుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

జనగాం

జాతీయ స్థాయి కబడ్డీ క్రీడా పోటీలకు చెన్నూరు విద్యార్థిని ఎంపిక

Zphs చెన్నూరు పాఠశాల కు చెందిన 9 తరగతి విద్యార్ధిని మంచాల అంజలి జాతీయ స్థాయి కబడ్డీ సబ్ జూనియర్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుస్కూరి రమేష్ గారు ఓ ప్రకటనలో తెలియజేశారు. మహారాష్ట్రలోని పూణే లో ఈ నెల 3,4,5,6 తేదీలలో జరుగుతున్న జాతీయస్థాయి లో తెలంగాణ రాష్ట్రం కబడ్డీ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం జరుగుతుంది. అంజలి ఎంపిక పట్ల పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కోడిశాల అశోక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ గుప్తా, శోభ, శ్రీహరి, శ్రీష్మ, ఫాతిమా మేరీ, రాణి, ప్రతిభ, వకుళ, ఉమ రాణి, వెంకటేష్ , వరలక్ష్మి, చైతన్య,kranthikumar ,Dhanalaxmi మరియు యువకులు గ్రామ వార్డు సభ్యులు,AAP ఛైర్మెన్& సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.