Thursday, 23 April 2026

Blog

News

మున్నూరు కాపు సంఘం కార్యవర్గం ఎన్నిక – అధ్యక్షులుగా కేతి పోచమల్లు, ప్రధాన కార్యదర్శిగా కాసర్ల ప్రవీణ్

మున్నూరు కాపు సంఘం కార్యవర్గం ఎన్నిక – అధ్యక్షులుగా కేతి పోచమల్లు, ప్రధాన కార్యదర్శిగా కాసర్ల ప్రవీణ్ బుగ్గారం : జగిత్యాల జిల్లా బుగ్గారంలోని పడమటి వాడలో గల శ్రీ సాంబశివ నాగేశ్వర మున్నూరు కాపు సంఘం కార్యవర్గం ఎన్నిక బుధవారం జరిగింది. అధ్యక్షులుగా కేతి పోచమల్లు. ఉపాధ్యక్షులుగా కప్పల భూమన్న, సుంకం గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కాసర్ల ప్రవీణ్, కోశాధికారిగా కప్పల లచ్చన్న, సహాయ కార్యదర్శిగా కేతి రవి, పెరుక రాజన్న (చిలుకయ్య) లు ఎన్నికయ్యారు. అనంతరం గత అధ్యక్ష, కార్యవర్గం పొలంపల్లి మల్లేశం, కూతురు పోచమల్లు లు సంఘం బాధ్యతలు నూతన కార్యవర్గానికి అప్పగించారు. శాలువాలతో నూతన కార్యవర్గాన్ని సత్కరించి అభినందించారు.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ – బాధిత కుటుంబాలకు రూ.24 లక్షల సహాయం

ముస్తాబాద్/ ఏప్రిల్ /పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని బాధిత కుటుంబాలకు సుమారు 40 చెక్కుల గాను మొత్తం రూ.24 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఇలాంటి ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఉపసర్పంచ్ తాళ్ల విజయ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్ తెలంగాణ మహబూబాబాద్

తెలంగాణలో భారీగా పెరిగిన మీసేవ చార్జీలు

తెలంగాణలో భారీగా పెరిగిన మీసేవ చార్జీలుఏ కేటగిరీ సర్వీసులకు రూ.62, బీ కేటగిరీ సర్వీసులకు రూ.80 వసూలు చేయాలని ఆదేశాలుగతంలో మినిమం చార్జీలు రూ.35 ఉండగా, దాన్ని రూ.62కు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

E-పేపర్ తెలంగాణ మహబూబాబాద్

రేపటి నుంచి భూభారతి సేవలు అందుబాటులో

_*భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం*__*స‌మీకృత‌ భూభార‌తి పోర్ట‌ల్‌తో తొలి అడుగు*__*రేప‌టి నుంచి ఐదు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు*__*స్మార్ట్ ఫోన్‌తో ఇంటినుంచే భూ సేవ‌ల ల‌భ్య‌త*_ రాష్ట్రంలో భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాల‌న్న సంక‌ల్పంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచ‌న మేర‌కు రెవెన్యూ శాఖ‌లో విప్ల‌వాత్మ‌క‌మైన సంస్క‌ర‌ణ‌లకు శ్రీ‌కారం చుట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు అన్నారు. ఇందులో భాగంగా రైతుల‌కు పార‌ద‌ర్శ‌కంగా, సుల‌భ‌త‌ర‌మైన‌ సేవ‌లు అందించ‌డానికి ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను త‌యారు చేశామ‌న్నారు. ఈ పోర్ట‌ల్‌ను ఈనెల 2వ తేదీ నుంచి ఐదు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించి భూ వివాదాల ప‌రిష్కారానికి తొలి అడుగు వేయ‌బోతున్నామ‌ని వెల్ల‌డించారు. ఇక్క‌డ వ‌చ్చే ఫ‌లితాల‌ను బ‌ట్టి అవ‌స‌ర‌మైన మార్పులు చేర్పులు చేసి భ‌విష్య‌త్తులో ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.కేర‌ళం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి గారు బుధ‌వారం నాడు ఈ పోర్ట‌ల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ ఈ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను రైతు కోణంలో రూపొందించామ‌ని సామాన్య ప్ర‌జానీకానికి ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఏప్రిల్ 2నుంచి ఖ‌మ్మం జిల్లా కుసుమంచి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వ‌రావుపేట‌, రంగారెడ్డి జిల్లా అమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి, నారాయ‌ణ‌పేట జిల్లా కొస్గి మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని సూచించారు.గ‌తంలో మాదిరిగా రైతులు త‌మ భూ సేవ‌ల కోసం మీ సేవ కేంద్రాల‌కు వెళ్లవ‌లసిన ప‌నిలేకుండా త‌న‌ ఇంటి నుంచే భూ సేవ‌లు పొందేవిధంగా పోర్ట‌ల్‌ను రూపొందించామ‌ని అన్నారు. రైతులు త‌మ భూమి హ‌ద్దులు తేల్చాల‌ని స‌ర్వే అధికారుల చుట్టూ తిరిగేవార‌ని, ఇప్పుడు ఎక్క‌డికీ వెళ్ల‌కుండా ఇంటి నుంచే భూభార‌తి పోర్ట‌ల్ ద్వారా పొంద‌వ‌చ్చ‌న్నారు. రైతు లాగిన్ అయిన వెంట‌నే త‌న‌కు ఉన్న భూమి వివ‌రాలు క‌నిపిస్తాయి. ఎన్నిఎక‌రాల‌కు స‌ర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు ఎంత‌చెల్లించాలో క‌నిపిస్తుంది. ఫీజు చెల్లించిన త‌ర్వాత ఆ వివ‌రాలు ఆ గ్రామంలో ఉన్న లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ లాగిన్‌కు వెళుతుంది. ఆత‌ర్వాత రెండు రోజ‌ల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతుల‌కు నోటీసులు జారీ చేస్తారు. త‌ర్వాత ఏడు రోజుల్లోపు స‌ర్వే తేదీని స‌ద‌రు లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ ఖరారు చేయ‌డ‌మేగాక స‌ర్వేకూడా రోవ‌ర్లతో పూర్తి చేస్తారు. దీనిని సిస్ట‌మ్‌లో న‌మోదు చేశాక అది మండ‌ల స‌ర్వేయ‌ర్ స్య్రూటినీకి వెళుతుంది. ఆపై మండ‌ల త‌హ‌శీల్దార్ ఆమోదం పొందాక ద‌ర‌ఖాస్తుదారైన రైతుకు ఎల్‌పిఎమ్‌, భూధార్ నెంబ‌ర్‌ల కేటాయింపు జ‌రుగుతుంది. ఈ వివరాలు భూభార‌తి పోర్ట‌ల్‌లో కూడా నిక్షిప్త‌మ‌వుతాయి. స‌ర్వే పూర్త‌యిన త‌ర్వాత స‌ర్వే మ్యాప్ ను జ‌న‌రేట్ చేసి భూభార‌తి పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ ప్ర‌క్రియ‌లో రిజిస్ట్రేష‌న్ ద‌ర‌ఖాస్తు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి పూర్త‌య్యేవ‌ర‌కు ప్ర‌తి ద‌శ‌లో పౌరుల రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్‌కు ఎస్ ఎమ్ ఎస్ అల‌ర్ట్స్ పంపిస్తారు.భూభార‌తి చ‌ట్టంలో పేర్కొన్న‌విధంగా వ్య‌వ‌సాయ భూముల‌కు సంబంధించి క్ర‌య విక్ర‌యదారుల‌కు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ర్వే మ్యాపును జ‌త‌ప‌ర‌చే నిబంధ‌న‌ను ఈ ఐదు మండ‌లాల్లో అమ‌లు చేస్తున్నామ‌ని ఈ ఐదు మండ‌లాల్లో ప్ర‌తి స‌ర్వే మ్యాప్ (ఎల్‌పిఎమ్‌) యూనిక్‌ నెంబరు, అదేవిధంగా ప్ర‌తి స‌ర్వే నెంబ‌ర్‌కు ఆధార్ నెంబ‌ర్ మాదిరిగానే భూధార్ నెంబ‌ర్‌ను కూడా ఇస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ ఐదు మండ‌లాల్లో రైతులు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌త‌ర్వాత స‌ర్వే నిర్వ‌హించ‌డానికి అవ‌స‌ర‌మైన స‌ర్వేయ‌ర్ల‌ను అందుబాటులో ఉంచామ‌ని అలాగే గొలుసులు, క‌ర్ర‌లు, క్రాస్ స్టాఫ్‌, మెజ‌రింగ్ టేప్ వంటి పాత స‌ర్వే ప‌రిక‌రాల‌కు స్వ‌స్తి చెప్పి రోవ‌ర్ల‌తో స‌ర్వే నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. దీనివ‌ల్ల స‌ర్వే ప్ర‌క్రియ త్వ‌రిత‌గ‌తిన పూర్త‌వుతుంద‌ని, క‌చ్చిత‌మైన స‌ర్వే వివరాలు వ‌స్తాయ‌ని తెలిపారు. భూ స‌మ‌స్య‌లు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారాయ‌ని వాటికి శాశ్వ‌త ప‌రిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్ ఒక కీల‌క‌మైన ముంద‌డుగు అని రైతు ఇంటి నుంచే అన్నిసేవ‌లు పొందేలా పార‌ద‌ర్శ‌క వ్య‌వ‌స్ధ‌ను తీసుకువ‌స్తున్నామ‌ని ఇది రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌లో చారిత్రాత్మ‌క మార్పున‌కు నాంది అవుతుందని మంత్రి పొంగులేటి గారు అన్నారు.

విశాఖపట్నం

86వ వార్డులో రూ.4 కోట్లతో ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమిపూజ

విశాఖపట్నం: ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గం 86వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి.టిడిపి రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దువ్వాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి క్రింద రూ.4 కోట్ల వ్యయంతో 60కి పైగా కంటైనర్ ఆధారిత ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ప్రజలకు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.స్థానిక నాయకులు ఎమ్మెల్యేను అభినందిస్తూ కూటమి సమన్వయంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.ఈ సందర్భంగా కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్ వరకు రెండు వైపులా రోడ్డు పూర్తి చేయాలని,ఫ్లైఓవర్ జాయింట్ రబ్బర్ సమస్యతో గర్భిణీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారని,ఫకీర్తకియ 100 అడుగుల కనెక్టివిటీ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో ప్రసాదుల శ్రీను,లేళ్ల కోటేశ్వరరావు,నల్లూరు సూర్యనారాయణ,వేగుంట శ్రీను,చదరం తులసిరామ్,గణపతి,లోవబాబు,తలారి వెంకటరమణ,బొడ్డపల్లి అప్పారావు,మోటూరు బాబురావు,అశోక్,గంధం వెంకటరావు,కాదా శ్రీను,జివిఎంసి అధికారులు మరియు భారీ సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు. Uploaded Video:

విశాఖపట్నం

పేదల సంక్షేమ మే కూటమి లక్ష్యం – పల్లా

విశాఖపట్నం, గాజువాక ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి): సంక్షేమం,అభివృద్ధి లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు.గాజువాక 86వ వార్డు షకీలా జంక్షన్ వద్ద నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ప్రతి నెల 1వ తేదీన అర్హులందరికీ ఎన్టీఆర్ ఆసరా పెన్షన్ క్రమం తప్పకుండా అందజేస్తున్నామని,ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచామని పేర్కొన్నారు.రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వేగుంట శ్రీనివాస్ రావు,జగదీష్,కొర్లాన రమేష్,నాగార్జున వెంకటేష్,గణపతి,సుబ్బయ్య,కాదా శ్రీనివాస్,గంధం వెంకటరావు,అశోక్,బొబ్బిలి శీను,బాలకృష్ణ,సింహాద్రి,నాయక్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలి మాదాసు మురగయ్య

వార్డు సభ్యులకు ఘన సన్మానం పున్నమి ప్రతినిధి రామచంద్రపురం రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు గ్రామపంచాయతీ సర్పంచ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో రాయలచెరువు పేటలో వార్డు సభ్యులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాయలచెరువు పేట సర్పంచ్ మాదాసు మురగయ్య, శ్రీమతి హేమలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధికి కృషి చేసిన వార్డు సభ్యులను బుధవారం ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులకు పసుపు, కుంకుమ, చీరలు, స్టీల్ తట్టులు బహూకరించడంతో పాటు సాలువాలతో సన్మానించారు. పంచాయతీ అభివృద్ధి, ప్రజాసేవలో భాగస్వాములైన సభ్యులకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాదాసు మురగయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. “మనందరం కలిసికట్టుగా పనిచేస్తేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో మరింత బలపడుతుంది” అని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.గ్రామ ప్రజలకు అందించిన సేవలు, సహకారం గుర్తుంచుకుంటూ వార్డు సభ్యులను సత్కరించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలచెరువు పేట పంచాయతీ కన్వీనర్ మధు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

*హనుమాన్ జయంతి శుభాకాంక్షలు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ::01/04/2026* *శ్రీ ఆంజనేయ రూపంలో వేషధారణలో భక్తులను ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులను అభినందించిన భక్తులు*

మహబూబ్ నగర్

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

*హనుమాన్ జయంతి శుభాకాంక్షలు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ::01/04/2026* *శ్రీ ఆంజనేయ రూపంలో వేషధారణలో భక్తులను ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులను అభినందించిన భక్తులు*

E-పేపర్

*కలెక్టర్ ఆదేశాలు లెక్కచేయని యాచారం తాసిల్దార్…!*

*కలెక్టర్ ఆదేశాలు లెక్కచేయని యాచారం తాసిల్దార్…!* పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జ్: *యాచారం ఏప్రిల్ 01()*:-రంగారెడ్డి జిల్లా,యాచారం మండలం,మాల్ గ్రామంలోని నల్లవెల్లి రెవెన్యూ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 567,531 లలో ఖాళీ స్థలాలకు గతంలో పనిచేసిన సెక్రెటరీ ఇంటి నెంబర్లు మంజూరు చేసినట్టు జనవరి 12న జిల్లా కార్యాలయంలో కలెక్టర్ కి ప్రజావాణి ద్వారా ఫిర్యాదు అందింది.అట్టి ఫిర్యాదు పై జనవరి 20 తేదీ లోపు నివేదిక సమర్పించాలని,అట్టి వివాద భూమికి కంచెను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించగా నేటికీ ఆ భూమిలో కంచె ఏర్పాటు చేయకపోవడం అధికారుల తీరుకు అద్దం పడుతుంది.కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమిని కాపాడటంలో అధికారులు విఫలమయ్యారని వారి పనితీరు ద్వారా…పలువురు చర్చించుకుంటున్నారు.జిల్లా పాలనాధికారి ఆదేశాలను లెక్కచేయకుండా తాసిల్దార్ విధులు నిర్వహించడం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కలెక్టర్ ఆదేశాలనే లెక్క చేయని అధికారులు సామాన్య ప్రజలకు న్యాయం చేయడం కలగా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫిర్యాదు పై మండల స్థాయి అధికారులను వివరణ కోరగా ఒక్కో అధికారి ఒక్కో విధంగా సమాధానం ఇవ్వడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.