Friday, 24 April 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

ఇరాన్ యుద్ధం ప్రభావం – ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ

ఇరాన్‌పై యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. చమురు ధరలు భారీగా పెరగడంతో పాటు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత్‌లో సుమారు ₹51 లక్షల కోట్ల నష్టం అంచనా వేస్తుండగా, అమెరికాలో ఒక్కరోజులోనే లక్షల కోట్ల డాలర్లు ఆవిరయ్యాయి. ముడి చమురు ధరలు రెట్టింపు కావడంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచం మళ్లీ స్టాగ్‌ఫ్లేషన్ వైపు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా ‘పెట్రో యువాన్’కు బలం చేకూరుతుండగా, అమెరికా డాలర్ ఆధిపత్యం కూడా సవాల్‌కు గురవుతోంది.

ఆంధ్రప్రదేశ్

భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు హక్కుల్లేవు – హైకోర్టు కీలక తీర్పు

తల్లిదండ్రుల నుంచి హిందూ మహిళకు లభించిన ఆస్తిపై ఆమె భర్తకు హక్కులు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. సంతానం లేకుండా మహిళ మరణిస్తే ఆ ఆస్తి ఆమె తండ్రి వారసులకే చెందుతుందని పేర్కొంది. అనకాపల్లి జిల్లా పెంటకోటకు చెందిన శ్రీవిరిత కేసులో, గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన భూమిపై భర్త హక్కుల వాదనను కోర్టు తిరస్కరించింది. దేవిక మానస పేరును రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించింది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15(2)(a) ప్రకారం జాయింట్ కలెక్టరు ఉత్తర్వులు చట్టవిరుద్ధమని తేల్చి, ఆర్డీఓ నిర్ణయాన్ని సమర్థించింది.

ఆంధ్రప్రదేశ్

క్వాంటం టెక్నాలజీకి ఊపు – ఏప్రిల్ 14న టెస్టింగ్ ప్రారంభం

క్వాంటం కంప్యూటర్ టెస్టింగ్‌ను ఏప్రిల్ 14న అమరావతిలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. క్వాంటం వ్యాలీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, రాష్ట్రాన్ని గ్లోబల్ క్వాంటం హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ క్వాంటం వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జెవిబి రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో వెయ్యి స్టార్టప్లు ఏర్పడే అవకాశం ఉందని ఐఐటీ డైరెక్టర్ కామకోటి తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

అమరావతి బిల్లుకు లోక్సభలో ప్రవేశం – జూన్ 2, 2024 నుంచి అమలు

రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు నేడు లోక్సభలో ప్రవేశపెట్టబడుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. బిల్లు ఆమోదం పొందితే 2024 జూన్ 2 నుంచి అమల్లోకి రావాల్సి ఉంటుంది. ఈ చర్యతో అమరావతి అభివృద్ధికి స్పష్టత రావడంతో పాటు, పరిపాలన వ్యవస్థలో స్థిరత్వం ఏర్పడుతుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుకు ఇది కీలక నిర్ణయంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

జాతీయ అంతర్జాతీయ

యుద్ధంతో వ్యాపారం ఆరోపణలు – అమెరికాపై విమర్శలు

ఇరాన్‌పై దాడికి ముందు అమెరికా ఆయుధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అమెరికా రక్షణ మంత్రిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ “మా వద్ద కొనండి లేదా స్వాధీనం చేసుకుంటాం” అన్న వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. మరోవైపు, అమెరికా యుద్ధ విమానాలను అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతుండగా, యుద్ధం ద్వారా వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.

ఖమ్మం

అమెరికా పర్యటన కేటీఆర్..*

T.Ravinder పుప్నమి News ఖమ్మం ప్రతినిధి ఎప్రిల్ 1/2026 *కొలంబియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026 లో ప్రసంగం* బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారంరోజులు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికా పర్యటనలో భాగంగా కొలంబియా యూనివర్సిటీ సందర్శిస్తారు. యూనివర్సిటీలో జరిగే కొలంబియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026 లో ఆయన ప్రసంగిస్తారు. అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న తన కుమారుడు హిమాన్షు ను కూడా కేటీఆర్ ఈ పర్యటనలో కలుస్తారు..

అనకాపల్లి

జాతీయ హాకీ పోటీలకు ఎంపికైన యలమంచిలి విద్యార్థిని దుర్గ శావణి

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 1పున్నమి (న్యూస్ ప్రతినిధి ఆనంద్) యలమంచిలి పట్టణానికి చెందిన ప్రతిభావంతురాలు దుర్గ శావణి జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. స్థానిక క్రీడా వేదికల్లో తన ప్రతిభను చాటుకున్న దుర్గ శావణి, రాష్ట్ర స్థాయి పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచి సెలక్షన్ కమిటీని ఆకట్టుకుంది. దీంతో ఆమెను నేషనల్ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక చేశారు. ఏప్రిల్ 1, 2026 నుండి రాంచీ (ఝార్ఖండ్)లో జరగనున్న సబ్ జూనియర్ నేషనల్ హాకీ పోటీలలో దుర్గ శావణి పాల్గొననుంది. ఈ సందర్భంగా జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కె. నరేష్, కార్యదర్శి, కోచ్‌లు, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

నేటి నుంచి చికెన్ షాపులు బంద్

T.Ravinder పున్నమి News Apr 01, 2026, నేటి నుంచి చికెన్ షాపులు బంద్ తెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు నేడు మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు తమ మార్జిన్‌ను కేజీకి రూ.30కి పెంచాలని రిటైల్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేటి నుంచి చికెన్ షాపుల బంద్ పాటిస్తున్నారు. గతంలో మార్జిన్ కేజీకి రూ.26 ఉండగా, ఇటీవల దాన్ని రూ.16కు తగ్గించడంతో తాము నష్టపోతున్నామని యజమానులు పేర్కొన్నారు. ఈ నిరసన కారణంగా చికెన్ దుకాణాలు 2-3 రోజుల పాటు మూతపడే అవకాశం ఉంది. దీంతో కోడి మాంసం ప్రియులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

E-పేపర్

ఈరోజు నుంచి తెలంగాణలో చికెన్‌ షాపులు బంద్‌ ఫౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌ తగ్గించాయని నిరసన

ఈరోజు నుంచి తెలంగాణలో చికెన్‌ షాపులు బంద్‌ ఫౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌ తగ్గించాయని నిరసన పున్నమి న్యూస్ ప్రతినిధి 01 ఏప్రిల్ 2026 చికెన్‌ విక్రయాల్లో మార్జిన్‌ పెంచాలని డిమాండ్‌ తగ్గించిన మార్జిన్‌ పెంచేవరకు నిరవధిక బంద్‌ ఫౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చే వరకు బంద్‌ కొనసాగిస్తాం *-తెలంగాణ చికెన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌.*

E-పేపర్

శ్రీశైలం ప్రాజెక్టులో అడుగంటిన నీటి నిల్వలు

శ్రీశైలం ప్రాజెక్టులో అడుగంటిన నీటి నిల్వలు పున్నమి న్యూస్ ప్రతినిధి 1 ఏప్రిల్ 2026 శ్రీశైలం జలాలను ఆంధ్రా యధేచ్చగా తరలిస్తుందని బీఆర్ఎస్ నేతలు నిలదీసినా పట్టించుకొని తెలంగాణ ప్రభుత్వం నేడు రిజర్వాయర్‌లో 44 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వలు దీంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన రెండు తెలుగు రాష్ట్రాలు (File Pic)

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.