Friday, 24 April 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తిలో నేడు ఘనంగా అయ్యప్ప జన్మదినోత్సవ వేడుకలు-విశేష పడిపూజ, అన్నదానం

శ్రీకాళహస్తి, మార్చి 31 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టనంలోని స్థానిక ఫైర్ స్టేషన్ సమీపంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఏప్రిల్ 1వ తేదీన శబరిమల అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ‘శబరిమల అయ్యప్ప స్వామి వారి తత్వమసి సేవా సమితి’ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. స్వామి వారి 18 మెట్ల ప్రాశస్త్యాన్ని చాటిచెబుతూ, సుగంధ ద్రవ్యాలు, రంగురంగుల పుష్పాలతో మంగళ వాయిద్యాల నడుమ కనుల పండువగా పడిపూజ నిర్వహిస్తారు. అనంతరం భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో అయ్యప్ప భక్తులు, స్వాములు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తత్వమసి సేవా సమితి నిర్వాహకులు కోరుతున్నారు.

ఖమ్మం

తెలంగాణ చికెన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌.*

రేపటి నుంచి తెలంగాణలో చికెన్‌ షాపులు బంద్‌ ఫౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌ తగ్గించాయని నిరసన చికెన్‌ విక్రయాల్లో మార్జిన్‌ పెంచాలని డిమాండ్‌ తగ్గించిన మార్జిన్‌ పెంచేవరకు నిరవధిక బంద్‌ ఫౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చే వరకు బంద్‌ కొనసాగిస్తాం *-తెలంగాణ చికెన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌.*

అన్నమయ్య

చిట్వేల్ మండలంలో అధికారుల వింత ధోరణి: మారిన జిల్లాలు.. మారని బోర్డులు!

పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించి ఏళ్లు గడుస్తున్నా, కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం పాత బోర్డులే దర్శనమిస్తున్నాయి. తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలోని కే.ఎస్. అగ్రహారం గ్రామ పంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. వైఎస్ఆర్ కడప జిల్లా పోయి, అన్నమయ్య జిల్లా వచ్చి, ప్రస్తుతం చిట్వేల్ మండలం తిరుపతి జిల్లాలో విలీనమైనప్పటికీ.. ఈ పంచాయతీ కార్యాలయం మాత్రం ఇంకా పాత జిల్లా పేరుతోనే కాలం వెళ్లదీస్తోంది. -నిర్లక్ష్యానికి నిలువుటద్దం.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టినప్పుడు చిట్వేల్ మండలం తొలుత అన్నమయ్య జిల్లాలోకి, ఆ తర్వాత పరిపాలన మార్పుల వల్ల తిరుపతి జిల్లాలోకి చేరింది. కానీ, కే.ఎస్. అగ్రహారం పంచాయతీ అభివృద్ధి అధికారి మాత్రం ఈ మార్పులను అస్సలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న బోర్డులపై గానీ, ఇతర ప్రభుత్వ రికార్డుల వద్ద గానీ ఇప్పటికీ “వైఎస్ఆర్ కడప జిల్లా” అనే అక్షరాలే కనిపిస్తున్నాయి. -అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు జిల్లా కేంద్రం మారినప్పుడల్లా బోర్డులు, అధికారిక ముద్రలు మార్చడం కనీస బాధ్యత అని స్థానికులు గుర్తు చేస్తున్నారు. “జిల్లాలు మారి మూడేళ్లవుతున్నా, ఇంకా పాత జిల్లా పేరునే ఉంచారంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు” అని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన ఫైళ్లు లేదా దరఖాస్తుల విషయంలో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.”ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడంలో ఉన్న ఉత్సాహం, పంచాయతీ బోర్డులను అప్డేట్ చేయడంలో లేదు. కొత్త జిల్లా తిరుపతి అని అందరికీ తెలుసు కానీ, మా పంచాయతీ అధికారికి మాత్రం తెలియకపోవడం విడ్డూరం.” స్థానిక గ్రామస్థుల ఆవేదన -అసలు కారణం ఏమిటి? సాధారణంగా జిల్లా మారిన వెంటనే బోర్డులకు రంగులు వేయించి కొత్త జిల్లా పేరు రాయించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం లేకపోయినా, పంచాయతీ అభివృద్ధి అధికారి (సెక్రటరీ) కనీస బాధ్యతగా కూడా దీనిని తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. పై అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. -ఉన్నతాధికారులు స్పందించాలి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కే.ఎస్. అగ్రహారం పంచాయతీలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోర్డులను మార్పించాలని ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ అభివృద్ధి అధికారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే మండలంలోని ఇతర పంచాయతీల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందో లేదో తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తిరుపతి

వైసిపిప్రభుత్వంలోతిరుపతిలో డీకేటీ భూములు కబ్జా చేసింది ఎవరు మీరు కాదా!

తిరుపతి ప్రెస్ క్లబ్ లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రెస్ మీట్. పున్నమి ప్రతినిధి , 31 మార్చి తిరుపతి సోమవారం రోజు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ పై కౌంటర్ గా మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుచానూరు ఆలయానికి సమీపంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయడం చాలా దారుణం. మా అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు ని, నారా లోకేష్ ని విమర్శించే స్తాయి కరుణాకర్ రెడ్డికి లేదు. మీ వైసీపీ పాలనలో తిరుపతిలో డీకేటి ప్రభుత్వ భూములను కబ్జా చేసింది మీరు కాదా. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు, ఆర్థికంగా ఎదుగుదలకు అవకాశం కల్పిస్తుంది మా కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రైవేట్ హోటల్ కి ప్రభుత్వ ధర ప్రకారమే స్థలాన్ని నియమ నిబంధనలకు లోబడి వారికి ఇచ్చారు. స్థలాన్ని కేటాయించిన వ్యక్తులకు గాని సంస్థలకు గాని లోకేష్ బాబు కి ఎలాంటి సంబంధం లేదు. బినామీ వ్యక్తులతో స్థలాలు సేకరించాల్సినంత అవసరం లోకేష్ కి లేదు…. వారి కుటుంబం ప్రజాసేవ చేయడానికి పరితపిస్తుంది. మంత్రి నారా లోకేష్ ని గోటికి కూడా సరిపోరు మీరు మీ నాయకులు .కరుణాకర్ రెడ్డికి శాపం ఉంది … ఆయన మాట్లాడే ప్రతి మాట అపద్ధమే.కూటమి ప్రభుత్వం లో అన్యాయానికి , భూకబ్జాలకు ,రౌడీ రాజకీయాలకు తావులేదు.గత వైసిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సర్వనాశనాశనం చేశారు. అభివృద్ధి అంటే మీ వైసిపి భాషలో గంజాయి సెంటర్లు , మీ నాయకులు బయట రాష్ట్రాలలో స్థిరపడడం కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధి పరుగులు తీస్తుంది.తిరుమల తిరుపతి ని అడ్డంపెట్టుకొని రాజకీయం చేయడం తగదు కరుణాకర్ రెడ్డి.తిరుపతి అభివృద్ధి కి అడ్డుపడకండి.మీ పాలనలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఐఏఎస్, ఐపీఎస్ లు ఇతర ఉన్నతాధికారులను జైళ్లకు పంపిన ఘనత వైసిపి నాయకులది . మా అధి నాయకుడు , కార్యకర్తలు అందరూ నియమ నిబంధనలు లోబడి ఉంటాం. ప్రజా పాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం మాత్రమే …. కరుణాకర్ రెడ్డి మరియు వైసిపి నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న తిరుపతి అభివృద్ధిని ఓర్వలేక అడ్డుపడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి , నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు ముస్తాబైన వింజమూరు

సీఎం రాకతో ఉదయగిరి అభివృద్ధికి నూతన దిశ – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు మండలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో శోభాయమానంగా ముస్తాబైంది. “పేదల సేవలో” భాగంగా నిర్వహించనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సీఎం రేపు విచ్చేయనున్న నేపథ్యంలో అన్ని విధాలుగా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.ఈ ఏర్పాట్లను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమ స్థలంలో భద్రతా ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, ప్రజల కోసం కూర్చోవడానికి సౌకర్యాలు, రాకపోకల సదుపాయాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు అందించారు.ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనతో ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా వంటి పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని, రాబోయే రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గానికి మరింత అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, నియోజకవర్గ ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

తిరుపతి

తిరుపతి జిల్లా సహకార శాఖ సిబ్బందికి శిక్షణ తరగతులు

పున్నమి ప్రతినిధి 31 మార్చి తిరుపతి తిరుపతి జిల్లా సహకార శాఖా సిబ్బంది కి తిరుపతి లోని యూత్ హాస్టల్ తిరుపతి జిల్లా సహకార శాఖ సిబ్బందికి మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సహకార శాఖ అధికారి ఎస్.వి. నాగవర్ధన, జిల్లా సహకార ఆడిట్ అధికారి బ్రహ్మానంద రెడ్డి , సహకార శాఖ డివిజనల్ ఆఫీసర్ సురేష్ హాజరై నాగభూషణం సబ్-డివిజనల్ ఆఫీసర్ వారు ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏ. ఝాన్సీ ఉద్యోగులకు శిక్షణ అందించారు. శిక్షణలో భాగంగా సెక్షన్ 71 మరియు రూల్ 52, ఎగ్జిక్యూషన్ అఫ్ డిక్రెస్ ననుసరించి కీలక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార విద్యాధికారి కె. సుధాకర్ ఈ కార్యక్రమమునకు సహాయ సహకారులు అందించిన సహకార అధికారులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ హాజరైన సహకార శాఖ సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి వందన సమర్పణ తో విజయవంతంగా ముగిసింది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో “జీరో పావర్టీ – P4 MBK 10-20” వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ

ఉదయగిరి నియోజకవర్గంలో “జీరో పావర్టీ – P4 MBK 10-20” కార్యక్రమం ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా అమలు చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, బంగారు కుటుంబాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం పురోగతి, సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లైవ్ సందేశాన్ని వీక్షించారు. ఆయన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలియజేస్తూ, పేదరిక నిర్మూలన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కార్యక్రమంలో విశేష సేవలు అందించిన మార్గదర్శులను సన్మానించి ప్రశంసా పత్రాలు (సర్టిఫికెట్లు) అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, “జీరో పావర్టీ” లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను సాధించేందుకు ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అబ్దుల్ అజీజ్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శ

నెల్లూరు హరనాథపురం ప్రాంతంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెళ్లి పరామర్శించారు. ఇటీవల అజీజ్ గారి మాతృమూర్తి మరణం నేపథ్యంలో ఆయనను కలిసి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అజీజ్ మాతృమూర్తి చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన అనిల్ కుమార్ యాదవ్, అనంతరం అబ్దుల్ అజీజ్‌తో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆయనకు ఆత్మీయంగా ఓదార్పు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొని అజీజ్ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా అజీజ్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనకాపల్లి

ఏటికొప్పక షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు న్యాయం చేయాలి – జనసేన, టీడీపీకి వినతి

అనకాపల్లి జిల్లా మార్చి 31(పున్నమి న్యూస్ ప్రతినిధి – ఆనంద్): ఏటికొప్పక షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల జీతాలు, గ్రాట్యుటీ, పీఎఫ్ సమస్యల పరిష్కారం కోరుతూ జనసేన పార్టీ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. డైలీ వేజ్ కార్మికులకు కూడా శాశ్వత ఉద్యోగుల మాదిరిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డైరెక్టర్ తో ఫోన్‌లో మాట్లాడగా, ప్రభుత్వం వద్దకు వివరాలు పంపినట్లు తెలిపారు. ఇదే వినతిని టీడీపీ కార్యాలయంలో కూడా సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నాగిరెడ్డి అప్పారావు, కార్యదర్శి దారా పోలిశెట్టి, కోశాధికారి కాండ్రకోట సత్యనారాయణ పాల్గొన్నారు.

సాహితీ

“జాతీయ జెండా” రూపకల్పన మరియు ప్రాముఖ్యం – డా. బద్రి పీర్ కుమార్

పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా నమూనాకు 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఒక విశిష్టమైన గుర్తింపు లభించినందుకు మార్చి 31ని మన జాతీయ జెండా పుట్టిన రోజుగా స్మరించుకుంటాము. చరిత్రలోకి వెళితే.. 1921 మార్చి 31 మరియు ఏప్రిల్ 1 తేదీల్లో విజయవాడలోని విక్టోరియా మెమోరియల్ హాల్ ప్రస్తుత బాపూ మ్యూజియంలో మహాత్మా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. అప్పటికే వివిధ దేశాల జెండాలపై అధ్యయనం చేసిన పింగళి వెంకయ్య, గాంధీజీ ఆదేశం మేరకు కేవలం మూడు గంటల వ్యవధిలో జెండా నమూనాను సిద్ధం చేసి ఆయనకు అందించారు. మొదట ఆయన రూపొందించిన జెండాలో ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. గాంధీజీ సూచన మేరకు శాంతికి చిహ్నంగా తెలుపు రంగును, అలాగే మధ్యలో దేశ ప్రగతికి మరియు స్వరాజ్యానికి గుర్తుగా రాట్నం గుర్తును చేర్చారు. ఈ డిజైన్‌ను గాంధీజీ ఆమోదించి, కాంగ్రెస్ సమావేశాల్లో ప్రతిపాదించారు. అప్పటి నుండి పింగళి వెంకయ్య జెండా వెంకయ్య’గా ప్రఖ్యాతి చెందారు. ఈ సందర్భంగా *జాతీయ జెండా* పై ఈ గేయం/కవిత. జెండా జెండా భారత జెండా ఇది భారత జెండా రోజు మనము తలచే జెండా మన మదిలో నిండా ఐక్యతేచ్చకు ప్రాణంగా త్రివర్ణ స్వచ్ఛత భావంగా ఆశయసిద్ధికి నేత్రంగా ఏకత రక్షకు నిలయంగా ఎగురుతున్న జెండా భారత జెండా ప్రతి మదిలో నిండా //జెండా// భిన్నత్వంలో ఏకత్వం సఖ్యతయే మన తత్వం అంటూ కాషాయం కమనీయం శౌర్యానికి తగు నియమం అంటూ తెలుపు శాంతికి సంకేతం ఆ తెలుపే జన సమ్మత మంటూ పచ్చదనం పాడిపంటలు పసిడిదనంగా మెరిసే జెండా నిత్యం సత్యం విజయంగా నిత్యం సత్యం విజయంగా చూపే అశోక చక్రపు జెండా //జెండా// జాతి కీర్తిని చాటే జెండా దేశభక్తిని నింపే జెండా రాజ్యమంతటా ఎగిరే జెండా రాజసమునకే ఊపిరి నిండా త్యాగమూర్తుల సంపద జెండా తరతరాలు నిలిచే జెండా విజయపథంతో ఎగిరే జెండా నాటి స్ఫూర్తిని నిలిపే జెండా భారతమాత భావహంగులే భారతమాత భావహంగులే మూడు రంగులై నిలిచిన జెండా //జెండా//

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.