Friday, 24 April 2026

Blog

సాహితీ

“జాతీయ జెండా” రూపకల్పన మరియు ప్రాముఖ్యం – డా. బద్రి పీర్ కుమార్

పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా నమూనాకు 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఒక విశిష్టమైన గుర్తింపు లభించినందుకు మార్చి 31ని మన జాతీయ జెండా పుట్టిన రోజుగా స్మరించుకుంటాము. చరిత్రలోకి వెళితే.. 1921 మార్చి 31 మరియు ఏప్రిల్ 1 తేదీల్లో విజయవాడలోని విక్టోరియా మెమోరియల్ హాల్ ప్రస్తుత బాపూ మ్యూజియంలో మహాత్మా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. అప్పటికే వివిధ దేశాల జెండాలపై అధ్యయనం చేసిన పింగళి వెంకయ్య, గాంధీజీ ఆదేశం మేరకు కేవలం మూడు గంటల వ్యవధిలో జెండా నమూనాను సిద్ధం చేసి ఆయనకు అందించారు. మొదట ఆయన రూపొందించిన జెండాలో ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. గాంధీజీ సూచన మేరకు శాంతికి చిహ్నంగా తెలుపు రంగును, అలాగే మధ్యలో దేశ ప్రగతికి మరియు స్వరాజ్యానికి గుర్తుగా రాట్నం గుర్తును చేర్చారు. ఈ డిజైన్‌ను గాంధీజీ ఆమోదించి, కాంగ్రెస్ సమావేశాల్లో ప్రతిపాదించారు. అప్పటి నుండి పింగళి వెంకయ్య జెండా వెంకయ్య’గా ప్రఖ్యాతి చెందారు. ఈ సందర్భంగా *జాతీయ జెండా* పై ఈ గేయం/కవిత. జెండా జెండా భారత జెండా ఇది భారత జెండా రోజు మనము తలచే జెండా మన మదిలో నిండా ఐక్యతేచ్చకు ప్రాణంగా త్రివర్ణ స్వచ్ఛత భావంగా ఆశయసిద్ధికి నేత్రంగా ఏకత రక్షకు నిలయంగా ఎగురుతున్న జెండా భారత జెండా ప్రతి మదిలో నిండా //జెండా// భిన్నత్వంలో ఏకత్వం సఖ్యతయే మన తత్వం అంటూ కాషాయం కమనీయం శౌర్యానికి తగు నియమం అంటూ తెలుపు శాంతికి సంకేతం ఆ తెలుపే జన సమ్మత మంటూ పచ్చదనం పాడిపంటలు పసిడిదనంగా మెరిసే జెండా నిత్యం సత్యం విజయంగా నిత్యం సత్యం విజయంగా చూపే అశోక చక్రపు జెండా //జెండా// జాతి కీర్తిని చాటే జెండా దేశభక్తిని నింపే జెండా రాజ్యమంతటా ఎగిరే జెండా రాజసమునకే ఊపిరి నిండా త్యాగమూర్తుల సంపద జెండా తరతరాలు నిలిచే జెండా విజయపథంతో ఎగిరే జెండా నాటి స్ఫూర్తిని నిలిపే జెండా భారతమాత భావహంగులే భారతమాత భావహంగులే మూడు రంగులై నిలిచిన జెండా //జెండా//

E-పేపర్

కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్…! ప్రజల ఆరోగ్యాలను గాల్లో వదిలేసిన అధికారులు…!

కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్…! ప్రజల ఆరోగ్యాలను గాల్లో వదిలేసిన అధికారులు…! పున్నమి న్యూస్ ప్రతినిధి 31 మార్చి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్: బహిరంగంగా చెత్త కాల్చివేయడం రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ రంగారెడ్డి జిల్లాలో దీనికి విరుద్ధంగా ఉంది. ప్లాస్టిక్ దీర్ఘాలు చెత్త బహిరంగంగా కాల్చోద్దని కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశాలు ఉండగా ఆదిభట్ల గ్రేటర్ పరిధిలో ఎక్కడికక్కడ చెత్త కాల్చితూనే ఉన్నారు. గతంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని అధికారిని విశ్వసనీయ సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని జరిమానా విధించారు. గ్రేటర్లు విలీనమయ్యాక అధికారుల తీరు విభిన్నం గా మారింది. బ్రాహ్మణపల్లి లోని గోడౌన్లో నిత్యం ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చడమే అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది. అధికారుల మధ్య సమన్వయ లోపమా శాఖ పరమైన లోపమా అనేది అధికారులు తీర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేదని స్థానికులు అంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చడం ద్వారా గాలిలో నాణ్యత లోపిస్తుందని ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయని కంటిచూపులో సమస్యలు ఎదురవుతాయని ప్రభుత్వం చెత్త కాల్చివేయడం నిషేధం విధించింది. కానీ ప్రజలకు వ్యాపార సంస్థలకు చిత్త కాల్చివేయడం నిషేధంపై అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని పలువురు వాపోతున్నారు.

మహబూబ్ నగర్

అవార్డు గ్రహీతకు అభినందనలు

*అవార్డు గ్రహీతకు అభినందనలు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 31/03/2026* 🌷మాగ్నెట్ విద్యాసంస్థల అధినేత ఎండి .వాజిద్ పాషా గారిని వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ (WHRPC) దేశ రాజధాని న్యూఢిల్లీ నందు WHRPC న్యూయార్క్ సంస్థ నుండి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు .అదేవిధంగా యాక్టివ్ మెంబర్ గా ఎన్నుకోబడినారు, ఈ సందర్భంగా వారిని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ ,జిల్లా శాఖ, రాష్ట్ర బాధ్యులు నర్సింలు, విజయకుమార్ ,అమీర్ పాష అభినందించారు

E-పేపర్ తెలంగాణ మహబూబాబాద్

ఎమ్మెల్సీలను కలిసిన సేవలాల్ సేన బృందం

♦ సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు *”గౌ! “శ్రీ బాణోత్ హుస్సేన్ నాయక్ గారి ఆధ్వర్యంలో.**”గౌరవ MLC తీన్మార్ మల్లన్న మరియు MLC ప్రో” కోదండరాం గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది.*✉️విషయం:తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్లలో ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మరియు వాటిని అసెంబ్లీలో ప్రస్తావించాలని వినతి. ✉️*♦ ప్రధాన డిమాండ్లు …*1️⃣ శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గౌరవార్థం,, జయంతి నిధులుగా రూ. 2.5 కోట్లు వెంటనే విడుదల చేయాలిహైదరాబాద్‌లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలిసేవాలాల్ ట్రైబల్ మ్యూజియం స్థాపించాలి . 2️⃣ తండా పంచాయతీల అభివృద్ధిప్రతి తండా పంచాయతీకి రూ. 25 లక్షలు నిధులు వెంటనే విడుదల చేయాలి.3️⃣ గిరిజన నిధుల పరిరక్షణగిరిజనులకు కేటాయించిన బడ్జెట్ నిధులను దారి మళ్లించడం ఆపాలిఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలి.4️⃣ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిGO No. 3 పునరుద్ధరించాలిఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి.5️⃣ ఉద్యోగావకాశాలుగిరిజన శాఖలలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.6️⃣ చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్ అమలుచేవెళ్లలో ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలి.⚠️ ప్రత్యేకంగా గమనించవలసిన అంశం,, ♦గత రెండు సంవత్సరాలుగా గిరిజనులకు కేటాయించిన బడ్జెట్‌ను సక్రమంగా వినియోగించకుండా దారి మళ్లించిన విషయంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరపాలని సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఈ రోజు వారిని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు *”శ్రీ బాణోత్ హుస్సేన్ నాయక్ గారు*రాష్ట్ర ఉపాధ్యక్షులు లకావత్ భాస్కర్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ గారు, రాష్ట్ర కార్యదర్శి జర్పుల లాలు ప్రసాద్ నాయక్ గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, సుమన్ నాయక్ గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ జవహర్లాల్ నాయక్ గారు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజు నాయక్ గారు, యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ నాయక్ గారు, విద్యార్థి సేన వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతి నాయక్ నాయక్ గారు , మరియు సేవాలాల్ సేన సైనికులు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. *జై” సేవాలాల్ జై” జై” సేవాలాల్ ,, 🚩🏳🚩🏳🚩*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా? – కాకాణి గోవర్ధన్ రెడ్డి

జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. పలు ప్రాంతాల్లో ధాన్య రాశులను పరిశీలించిన ఆయన, గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తేమ పేరుతో అధిక బరువు చూపించి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు లేక, గోనె సంచులు, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పెరిగాయని అన్నారు. వెంటనే మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. Uploaded Video:

జాతీయ అంతర్జాతీయ

*ఊపిరి కోసం క్యూబా పోరాటం*

కోవిడ్‌ వేళ .. రోగులకు చికిత్స అందించేందుకు ప్రపంచ దేశాలు నానా అగచాట్లు పడుతున్నప్పుడు ఓ చిన్న దేశం ‘నేనున్నా’ అంటూ ముందుకు వచ్చింది. ఆంక్షలు, నిర్బంధాల మధ్య అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థతో కుదేలవుతున్నా కోవిడ్‌ మొదటి దశలో ప్రపంచంలోని ఇరవై దేశాలకు ఆ దేశం 26 వైద్య బృందాలను పంపింది. ఆ సమయంలో దాదాపు 30 వేల మంది రోగులకు చికిత్స అందించిన ఆ దేశం .. ప్రపంచానికి ఆశాకిరణంలా కనిపించిన ఆ దేశం.. ‘క్యూబా’. వైద్య చరిత్రలో ఇంతటి ఘన చరిత్ర గల ఈ దేశంలో ప్రస్తుతం అమెరికా విధించిన ఆంక్షలతో తరచూ విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతోంది.ఈ అంతరాయం దేశాన్ని మాత్రమే అంధకారంలో నెట్టేయడం లేదు. ఆరోగ్య వ్వవస్థను కూడా ఛిన్నాభిన్నం చేస్తోంది. విద్యుత్‌ కోత వల్ల సకాలంలో వైద్యం అందక ఆస్పత్రుల్లో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు.నవజాత శిశు మరణాలు పెరిగాయి.డీజిల్‌,పెట్రోలు కొరతతో వైద్య సిబ్బంది సకాలంలో ఆస్పత్రులకు చేరుకోలేక పోతున్నారు. నైపుణ్యమైన వైద్యం అందించడంలో ప్రపంచానికే దిక్సూచిగా నిలబడిన క్యూబాలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఆ దేశానికే కాదు,ప్రపంచానికే పెద్ద ముప్పు. ప్రస్తుతం క్యూబా ఆస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై అక్కడి డాక్టర్లు ఎంతో ఆవేదన చెందుతున్నారు. *విద్యుత్‌ లేదు.. వెంటిలేటర్‌ లేదు*.. క్యూబా రాజధాని హవానాలోని ఓ ఆస్పత్రిలో జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న 21 ఏళ్ల యువకుడు వైద్యం తీసుకుంటున్నాడు.ఊపిరి తీసుకోవడం కష్టమైన అతడికి చాలా రోజుల నుండి వెంటిలేటర్లపై వైద్యం చేస్తున్నారు.ఈ చికిత్స అతడు కోలుకోవడానికి చాలా కీలకం.కానీ ఇప్పుడు విద్యుత్‌ అంతరాయంతో వెంటిలేటరు సరిగ్గా పనిచేయడం లేదు. గంటల తరబడి విద్యుత్‌ కోతల వల్ల మిషన్‌ చార్జింగ్‌ అవ్వడం కూడా కష్టంగా ఉంటోంది.దీనిపై యువకుడి తల్లి ఇలా అంటోంది…: ‘ఈ పరిస్థితుల్లో నా కొడుకును ఎలా రక్షించుకోవాలో అర్థం కావడం లేదు. వాడి జీవితం విద్యుత్‌ పైనే ఆధారపడి ఉంది’. ఇటీవల ఆరుగురు వైద్యుల బృందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ‘ఇక్కడి పరిస్థితులు ఎంతలా దిగజారిపోయాయంటే .. నివారించ గలిగే మరణాలు కూడా తరచూ సంభవిస్తున్నాయి.ఎన్ని మరణాలు సంభవించాయో చెప్పలేం కానీ,గతేడాదితో పోల్చితే కచ్చితంగా ఎక్కువే అని చెప్పగలం’ అని హవానాలోని అతిపెద్ద పిల్లల ఆస్పత్రి చీఫ్‌ అనస్థిషియాలజిస్ట్‌ డాక్టర్‌ అలియోత్‌ ఫెర్నాండెజ్‌ అన్నారు. వైద్యులు,నర్సులు విధుల్లోకి హాజరు కాలేకపోవడం వల్ల ఆస్పత్రులు శస్త్రచికిత్సలు రద్దు చేసి రోగులను ఇంటికి పంపించేస్తున్నాయి.విద్యుత్‌ అంతరాయాల వల్ల కీమోథెరపీ,డయాలసిస్‌ వంటి చికిత్సలు అందించడానికి క్లినిక్‌లు ఇబ్బంది పడుతున్నాయి. గ్యాస్‌ దొరక్క చాలా అంబులెన్సులు నిలిచిపోయాయి. దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. మందులు కొనడానికి కూడా వీలులేక ఫార్మసీలు మూతబడుతున్నాయి. ఫ్యాక్టరీలు డీజిల్‌తో నడుస్తున్నందున మందుల ఉత్పత్తి చాలావరకు నిలిచిపోయింది.జెట్‌ ఇంధనం కొరత వల్ల విమానాలు రద్దు అయ్యాయి.ఈ కారణంగా వ్యాక్సిన్‌ తయారీదారులు ముడిపదార్థాల కోసం తలమునకలవు తున్నారు.విద్యుత్‌ కోతలు ఇలానే కొనసాగితే శీతలీకరించిన వ్యాక్సిన్‌ నిల్వలు త్వరలోనే పాడైపోయే అవకాశం ఉంది. *నిపుణుల హెచ్చరిక* ‘ఇది సాధారణ విషయం కాదు. చాలా తీవ్రమైనది’ అని ఆప్ఘనిస్తాన్‌, ఉక్రెయిన్‌,గాజాలలో ప్రజారోగ్య సహాయక చర్యలకు నాయకత్వం వహించిన జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయంలోని ప్రజారోగ్య నిపుణుడు పాల్‌ స్పీగెల్‌ చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచ సగటు కంటే దాదాపు రెట్టింపుగా, క్యూబా ప్రభుత్వం తన బడ్జెట్‌లో ఐదవ వంతును ఆరోగ్యంపై ఖర్చు చేసేది. ప్రపంచ బ్యాంకు ప్రకారం, కోవిడ్‌-19కు ముందు వరకు క్యూబాలో ఆయుర్దాయం, శిశు మరణాల రేట్లు అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉండేది. అదే సమయంలో వైద్యుడు- రోగి నిష్పత్తి ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండేది. ట్రంప్‌ మొదటిసారి అమెరికా గద్దె ఎక్కినప్పటి నుండి క్యూబాపై ఆంక్షలు మరింత ముదిరాయి.ఆస్పత్రులు పాతబడిన పరికరాలను మార్చకుండా నిరోధించేంతగా ఆర్తిక వ్యవస్థ అతలాకుతలమైంది. అమెరికాపై ఉన్న భయం కారణంగా యూరోపియన్‌ వైద్య సరఫరదారులు ఒప్పందాలను నిలిపివేశారు. దీంతో ప్రభుత్వానికి వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. *నవజాత మరణాలు అధికమయ్యాయి* 2018లో క్యూబాలో ప్రతి వెయ్యి జననాలకు శిశుమరణాల రేటు 4 ఉండేది.ఇది యునైటెడ్‌ స్టేట్స్‌ కంటే తక్కువ. 2025 నాటికి ఆ రేటు రెట్టింపు కంటే ఎక్కువై 10 మరణాలకు చేరింది.ఆంక్షల ప్రభావంపై ప్రజారోగ్యంపై అధ్యయనం చేసే స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ వైద్యురాలు రూత్‌ గిబ్సన్‌ దీనిపై మాట్లాడారు. ‘ఆంక్షల ప్రభావం ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపడానికి చాలా కాలం పట్టింది. అయితే ఇప్పుడు పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది’ అంటున్నారు. క్యూబాలోని ప్రముఖ ప్రసూతి ఆస్పత్రిలో ప్రసూతి-స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్‌ లిలియం డెల్గాడో పెరుయెరా ‘ఇప్పటికే ఆ నష్టం స్పష్టంగా కనిపిస్తోంది’ అంటున్నారు. ‘ఆంక్షల కారణంగా ఆస్పత్రిలో యాంటీబయాటిక్స్‌, మందులు,పరికరాల కొరత ఏర్పడింది. ఆహార కొరత వల్ల గర్భిణీలు, నవజాత శిశువుల బరువు మరింత తగ్గిపోయింది. ఇంధన కొరత వల్ల వైద్యులు,నర్సులు, పారిశుధ్య కార్మికులు, గర్భిణీలు ఆస్పత్రికి సకాలంలో చేరుకోలేక పోతున్నారు. దీనివల్ల ప్రసూతి గదులు మురికిగా మారుతున్నాయి. ప్రమాదకర పరిస్థితికి వచ్చిన తరువాత ప్రసవం కోసం వస్తున్నారు’ అని ఆమె అంటున్నారు. ‘ఫిబ్రవరిలో ముగ్గురు నవజాత శిశువులు మరణించారని, ఒక నెలలో ఇంత ఎక్కువ మంది మరణించడం తన సర్వీసులో ఎప్పుడూ చూడలేదని ఆమె అన్నారు. ముఖ్యంగా ఇటీవలి వారాల్లో నెలలు నిండని జననాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయని, యాంటీబయాటిక్స్‌ కొరత కారణంగా పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల వల్ల ఈ రకమైన జననాలు పెరుగుతున్నయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *పిల్లలకు టీకాలు లేవు* క్యూబన్‌ ప్రభుత్వం ఈ నెలలో చెప్పిన గణాంకాల ప్రకారం 96 వేల 400 మంది రోగులు శస్త్రచికిత్స కోసం ఎదురు చూస్తున్నారు.ఇంధన కొరత కారణంగా 30 వేల మందికి పైగా పిల్లలకు టీకాలు ఆలస్యమయ్యాయి. దాదాపు 20 వేల మంది రోగులకు రేడియేషన్‌ థెరపీ, కిడ్నీ డయాలసిస్‌ సక్రమంగా అందడం లేదు. మందుల కొరత తీవ్రంగా ఉండడం వల్ల ఫార్మసీలకు తాళం వేస్తున్నారు. *దుర్భరంగా చికిత్సలు* ఒక బాలుడికి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఎదురైన పరిస్థితిని చీఫ్‌ అనస్థీషియాలజిస్ట్‌ డాక్టర్‌ ఫెర్నాండెజ్‌ ఇలా గుర్తు చేసుకున్నారు.”రెండు నెలల బాలుడికి శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు కరెంట్‌ పోయింది. జనరేటర్‌ పనిచేయడం మొదలుపెట్టేవరకు శిశువు ప్రాణ సంకేతాలను చూపించే మోనిటర్‌ కొన్ని నిమిషాల పాటు ఆగిపోయింది. ఆ పరిస్థితిలో ఉన్న మాకు ఆ సమయం కొన్ని గంటల్లాగా అనిపించింది. మరోచోట పిల్లల వార్డులో కరెంటు పోయినప్పుడు డాక్టర్లు, నర్సులు ఆ వైపు పరుగులు పెట్టారు.అక్కడ అనారోగ్యంతో ఉన్న శిశువులకు వెంటిలేటర్లపై వైద్యం చేస్తున్నారు. కరెంటు పోయి అవి ఆగిపోయాయి.వాటి బ్యాటరీ వ్యవస్థలు సంవత్సరాల క్రితమే పాడైపోయాయి. ఈ పరిస్థితుల్లో జనరేటర్లు పనిచేయడం మొదలుపెట్టేంత వరకు శిశువులు శ్వాస తీసుకునేలా ఆరోగ్య కార్యకర్తలు తమ చేతులతో రబ్బరు పంపును నొక్కారు”. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచానికి ఆదర్శం కొత్త తల్లులకు,శిశువులకు క్రమం తప్పకుండా ఆహారం, సప్లిమెంట్లు,మందుల ప్యాకేజీలను అందించడం క్యూబన్‌ ఆరోగ్య సంరక్షణ వ్వవస్థ ముఖ్య లక్షణం. ఈ కారణంగానే కోవిడ్‌ ముందు వరకు ఈ ప్రాంతంలో పిల్లల పోషకాహార లోపం రేటు అత్యంత తక్కువగా వుండేదని యునిసెఫ్‌ తెలిపింది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. హవానాలోని కమ్యూనిటీ డాక్టరుగా పనిచేస్తున్న డాక్టర్‌ రొక్సానా మార్టినెజ్‌ రోడ్రిగ్జ్‌ దీనిపై మాట్లాడారు. ‘తల్లులకు,పిల్లలకు సమకూర్చే మందులు,ఆహారం ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా లేదు.ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక జీతం అల్పాహారానికి కూడా సరిపోవడం లేదు. క్యాబేజీ కొనుక్కోవడం విలాసవంత విషయంగా మారిపోయింది.అమెరికా విధిస్తున్న ఈ ఆంక్షలు ఇప్పటివరకు మమ్మల్ని ప్రభావితం చేశాయి. ఇప్పుడు మీరు కోరుకున్నా, కోరుకోపోయినా అవి మీ వరకు వస్తాయి’ అని రోడ్రిగ్జ్‌ అంటున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*గ్రామ అభివృద్ధికి సేవలు – నాగేంద్రకు ప్రశంసా పత్రం…*

మర్రిపాడు మండలంలోని చిన్నమాచనూరు పంచాయతీ పరిధిలోని నేర్దనంపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎడమ కంటి నాగేంద్ర గ్రామ అభివృద్ధికి చేసిన విశేష సేవలకు గాను ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది.P4 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా నాగేంద్ర ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి నాగేంద్ర చేసిన సేవలను అభినందిస్తూ, గ్రామ అభివృద్ధికి ఇలాంటి సేవాభావంతో ముందుకు వచ్చే నాయకులు మరింత అవసరమని పేర్కొన్నారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆయన చూపిన కృషి ప్రశంసనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని నాగేంద్రను అభినందించారు.

E-పేపర్

టియుడబ్ల్యూజే (హెచ్ 143) కి తిరుగులేదు, ఎవరు పోటీ రారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పర శేఖర్ సాగర్.

టియుడబ్ల్యూజే (హెచ్ 143) కి తిరుగులేదు, ఎవరు పోటీ రారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పర శేఖర్ సాగర్. నూతన నియోజకవర్గ తెంజు అధ్యక్షుడిగా వరికుప్పల అశోక్. టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీగా మోలుగు శ్రీనివాస్. పున్నమి న్యూస్ ప్రతినిధి ఇబ్రహీంపట్నం, మార్చి31: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వైష్ణవి గార్డెన్ లో టీయూడబ్ల్యూజే (హెచ్ 143) ఇబ్రహీంపట్నం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నియోజకవర్గ అధ్యక్షులు సురమోని సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్, ప్రధాన కార్యదర్శి గాదం రమేష్ లు హాజరయ్యారు. ముందుగా నూతన నియోజకవర్గ తెంజు అధ్యక్షుడిగా వరికుప్పల అశోక్ ను, టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీగా మోలుగు శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అప్పటి 10 జిల్లాలలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి టియుడబ్ల్యూజే జర్నలిస్టుల పాత్రని నెంబర్ వన్ స్థానం ఉందని, అప్పటి మొదటి ప్రభుత్వం కేసీఆర్ యొక్క ప్రభుత్వం ప్రభుత్వం పాలకులు కొద్దిసేపు పక్క పెడితే మన హక్కుగా మనం ఒక ట్రేడ్ యూనియన్ విధానంలో మనకు ఉన్నటువంటి పరిధిలో పోరాటం చేసి ఆ ప్రభుత్వం మీద స్నేహపూర్వకమైనటువంటి సంప్రదింపులు కావచ్చు లేదంటే తేడా వచ్చినప్పుడు కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు ఉవ్వెత్తున ఉద్యమానికి రెడీ అవుతున్నమని చెప్పేసి ఒక ఆందోళన కార్యక్రమం తీసుకుంటే 24 గంటలలో హక్కుల సాధన కోసం మన యూనియన్ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించింది. మన యూనియన్ మొదటి నుంచి కూడా పోరాటం కొనసాగిస్తూ వచ్చింది. జర్నలిస్ట్ ల కుటుంబలకు నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని పొందారు. ఈ విషయం ఇతర యూనియన్ వాళ్లు మననం చేసుకోవాలి అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాలో కూడా కేటగిరి వయసుగా బిగ్ పేపర్స్ లేదంటే మీడియం స్మాల్ అని విభజన చేసి సర్కులేషన్ ను బట్టి దాని యొక్క విధానాన్ని విధివిధానాలు పర్ఫెక్ట్ గా అప్పుడున్నటువంటి అక్రిడేషన్ కమిటీ చైర్మన్ అల్లం నారాయణ కృషి చేశారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి వాళ్ళ యొక్క పత్రికలకు, వారి యొక్క ఛానల్ లకు రేటింగ్ పెంచుకుంటున్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడు ఒక యూనియన్ నాయకులను చెప్పుకుంటూ తన యూనియన్ నాయకులను పక్కన కూర్చోబెట్టుకుని మీరు స్వప్రయోజనాలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత జర్నలిస్టు నాయకునిగా మీడియాకు చైర్మన్ గా ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి నాయకుడిగా మీరు ఏం చేశారో చెప్పండి అన్నారు. అల్లం నారాయణ టియుడబ్ల్యూ యూనియన్ జర్నలిస్టులకు ప్రాధాన్యత వచ్చిందని, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇవ్వాల్సిందె అని ప్రభుత్వానికి చెప్తే మొట్టమొదటి ప్రభుత్వం 100 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటన చేసి 42 కోట్ల రూపాయల నిధులను విడుదల చరిత్ర ఈ యూనియన్ ఇది అన్నారు. 250 జీఓకు వ్యతిరేకంగా డిసెంబర్ 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి వేలాది మంది జర్నలిస్టులు రోడ్డు మీదకు వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో కలెక్టర్లకు మెమొరండం ఇస్తే తప్పని పరిస్థితుల్లో దిగి వచ్చినటువంటి ప్రభుత్వము ఐ.ఎన్.పి.ఆర్ ఏదైతే అధికారులు సమాచార శాఖ మంత్రి యొక్క ఆదేశానుసారం దిగివచ్చి ఆ జీవోను మల్లి మార్పులు చేశారో అందరికీ తెలుసు అన్నారు. టీయూడబ్ల్యూజే (హెచ్ 143) కు తిరుగులేదు, మాకు పోటీ ఎవరూ లేరు, వాళ్ళు మాతో పాటు ఎవడు సాటి రాడు. మెజారిటీ జర్నలిస్టులు ఇబ్రహీంపట్నంలో మన యూనియన్ సభ్యులుగా ఉన్నారు. జర్నలిస్ట్ లకు ఏ ఆపద వచ్చిన అర్ధరాత్రి రెండు గంటలకు సమాచారం అందించిన ఎక్కడ ఆపద ఉన్నది అంటే అక్కడ వాలిపోయేటువంటి నాయకులుగా అందరిలో అందరి సంక్షేమం కోసం మన భవిష్యత్తు కోసం పనిచేయడానికి త్యాగంతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు మాత్రమే వాళ్లకు మాత్రం మన దగ్గర అవకాశం ఉంటుంది అలాంటి ఆలోచనలు వున్నది ఇప్పుడు కూడా ఎవరైనా కూడా వెళ్ళిపోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బిరుదు చందర్, జిల్లా కోశాధికారి పి.వెంకటేష్, జిల్లా సంముక్త కార్యదర్శి పల్లె వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు రాఘవేంద్ర చారి, జిల్లా కార్యవర్గ సభ్యులు దెంది హరికృష్ణ రెడ్డి, చెరుకూరి మహేందర్, చెరుకూరి రాజు, సీనియర్ జర్నలిస్టులు ఆర్ కే.యాదవ్, హనుమంతు సుదర్శన్, సురమోని బాబు, చెరుకూరి మల్లేష్, సంతోష్, సురేష్, వెంకటేష్, రాజు, భూ చక్రం గౌడ్, గోవర్ధన్, మహేష్ చారీ, విజేయ్, గిరి, నరేందర్ రెడ్డి, నరేందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా ఆలయాల అభివృద్ధిపై మంత్రి ఆనం సమీక్ష

జిల్లాలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన ఆలయాల నిర్మాణం, ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న కోట్లాది రూపాయల పనుల పురోగతిపై చర్చించారు. ఆలయాల పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశానికి రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్, అసిస్టెంట్ కమిషనర్ కోవూరు జనార్దన్‌రెడ్డి, వివిధ ఆలయాల ఈవోలు హాజరయ్యారు. Uploaded Video:

జనగాం

మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మత్తు పదార్థాల నియంత్రణపై సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ప్రచారం, రవాణాపై నిఘా పెంచాలని సూచించారు. దాబాల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేయాలని తెలిపారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.