Friday, 24 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా ఆలయాల అభివృద్ధిపై మంత్రి ఆనం సమీక్ష

జిల్లాలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన ఆలయాల నిర్మాణం, ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న కోట్లాది రూపాయల పనుల పురోగతిపై చర్చించారు. ఆలయాల పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశానికి రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్, అసిస్టెంట్ కమిషనర్ కోవూరు జనార్దన్‌రెడ్డి, వివిధ ఆలయాల ఈవోలు హాజరయ్యారు. Uploaded Video:

జనగాం

మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మత్తు పదార్థాల నియంత్రణపై సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ప్రచారం, రవాణాపై నిఘా పెంచాలని సూచించారు. దాబాల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేయాలని తెలిపారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News

తిరుపతిలో మానవ హక్కుల సంఘం పేరుతో బెదిరింపులు

మానవ హక్కుల సంఘం పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి పడమర సీఐ మురళీమోహన్, ఎస్ఐ హరీషా వివరాల మేరకు.. ‘వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన అన్నపురెడ్డి రాణి, వేంపల్లికి చెందిన నాగేంద్ర, వీరపనాయునిపల్లెకి చెందిన శేఖర్, కృష్ణారెడ్డి ఆదివారం తిరుపతి లోని రమాదేవి హాస్పిటల్కు వెళ్లారు. తమను తాము మానవహక్కుల సంఘం ఎండీపీఎస్ ప్రతినిధులు, న్యాయవాదిగా పరిచయం చేసుకున్నారు. ఆస్పత్రిలో అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని.. ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందించడం లేదనే ఫిర్యాదులపై మూడు రోజు లుగా రోగుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. సంబంధిత వీడియోలు ఉన్నాయని.. రూ. 20 లక్షలు ఇవ్వకుంటే సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఘటనపై హాస్పిటల్ ఎంఎస్ డాక్టర్ కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నింది – తులను విచారిస్తున్న’ట్లు తెలిపారు.

తిరుపతి

సెవెన్ హిల్స్ ఫార్మసీ కణశాలలో జంతు పరిశోధనలో నైతికత పై అవగాహన సదస్సు

పున్నమి ప్రతినిధి 31 మార్చి రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాలలో మంగళవారం నాడు కళాశాల ఫార్మాకాలజీ విభాగం ఆధ్వర్యంలో, జంతు ప్రయోగాల నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిటీ ( సి సి ఎస్ ఈ ఏ)సహకారంతో “ఫార్మకాలజీలో జంతు పరిశోధన, నైతికత మరియు శాస్త్రానికి మధ్య “సమతుల్యం” అనే అంశంపై ఒక రోజు సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో వక్తలుగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఫార్మా స్యూటికల్ టెక్నాలజీకి చెందిన డి. సుజాత, చెన్నై కేకే కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి చెందిన ప్రేమ్ కుమార్, గుంటూరు చెబ్రోలు హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాణాలకు చెందిన సందీప్, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటికి చెందిన ఆర్.వి. సురేష్ కుమార్ హజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జంతు ప్రయోగాల్లో రిఫైన్ మెంట్ యొక్క ప్రాముఖ్యతను, బయో మెడికల్ పరిశోధనలో నైతికత మరియు జంతు సంక్షేమం పై అవగాహన “కల్పించారు. ఈ సదస్సులో వివిధ కళాశాలల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ పరిశోధనలను ఈ- పోస్టర్ రూపంలో ప్రదర్శించి, శాస్త్రీయి చర్చలో చురుకుగా పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రసన్నరాజ, ఫార్మకాలజీ విభాగాధిపతి జ్యోతి బసిని బోధన సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటO

*ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం* దుర్గమ్మ కొలువైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అసలైన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్‌గా మార్చేందుకు యత్నించారు. అనుమానంతో ట్రస్ట్‌ బోర్డు సభ్యులు తనిఖీలు చేయగా విషయం వెలుగుచూసింది. తనిఖీలో సిబ్బందిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

E-పేపర్ తెలంగాణ మహబూబాబాద్

పార్టీ వేరైనా… స హృదయంతో మానవత్వంతో సోనియాగాంధీని పరమర్శించిన ప్రధాని

*రాజకీయ జీవితం వేరు- వ్యక్తిగత జీవితం వేరు…*కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియమ్మ గారి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని వెళ్లి వారిని పరామర్శించిన మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ.ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిన మన నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం వ్యక్తులు మెచ్చే విధంగా ఉంటుంది.వ్యక్తిత్వం కాపాడే విధంగా ఉంటుంది.ఏది ఏమయినప్పటికిని వారి ఔన్నత్యనికి,వారి సేవా భావానికి,వారి రాజనీతికి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బిజెపి పార్టీ చేస్తున్న అభివృద్ధిపై, అనేక రకాల సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఒక బాధ్యత గల వ్యక్తిగా పార్టీలను పక్కన పెట్టి మోడీ గారు సోనీయమ్మ గారిని వెళ్లి కలవడం, పరామర్శించడం అనేది ఎంతో గొప్ప విషయమే కదా….!

ఖమ్మం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా ఖమ్మం జిల్లా కి చెందిన నలుగురు ఎంపిక

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఖమ్మం జిల్లాకు చెందిన నలుగురు నేతలకు చోటు కల్పించారు. ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్య నారాయణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, ఖమ్మం నగరానికి చెందిన రుద్ర ప్రదీప్, సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం చెందిన ఇవి రమేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. వీరి నియామకం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

E-పేపర్ News తెలంగాణ మహబూబాబాద్

క్రీడా పాఠశాల కొరకు మహబూబాబాద్ జిల్లాస్థాయిలో ఎంపికలు

తెలంగాణ ప్రభుత్వము క్రీడా పాఠశాల గురించి ఇటీవల నాలుగో తరగతి ప్రవేశానికై 2025 2026 సంవత్సరానికి అడ్మిషన్లు కోరుచున్నవి కావున మండల స్థాయిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులను జిల్లా స్థాయిలో ఈరోజు పోటీ నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఇందులో బాల బాలికలు 18 మండలాలు నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది . జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన విద్యార్థులను రాష్ట్రస్థాయిలో ఏప్రిల్ 27 నుండి మే ఒకటో తారీకు వరకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది .ఇందులో మహబూబాబాద్ జిల్లా క్రీడానిర్వకలు సిబ్బంది అందరూ పాల్గొన్నారు అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

కడప

P4 లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి:MLA వరద

సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎండీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉన్నవారు లేని వారిని దత్తత తీసుకొని వారి అభివృద్ధికి సహాయం అందించాలన్నారు. హెల్త్ యూనివర్సిటీ మెంబర్ డా. వరుణ్, అధికారులు, దాతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొమ్మలపూడి వద్ద మిల్క్ ట్యాంకర్ బోల్తా – రైళ్లకు అంతరాయం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 31మార్చి ( పున్నమి ప్రతినిధి) .మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో మిల్క్ ట్యాంకర్ బోల్తా పడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి తిరుమలకు పాలతో వెళ్తున్న ట్యాంకర్ జంక్షన్ వద్ద అదుపుతప్పి పట్టాలు తప్పింది. ఈ ఘటన కారణంగా విజయవాడ–చెన్నై మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.