శ్రీకాళహస్తి, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్( చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని స్వగృహంలో జరిగిన వారి కోడలి శ్రీమంతం వేడుక గురువారం వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన మాతృమూర్తి బృందమ్మతో కలిసి హాజరయ్యారు. ఆయనతో పాటు పొన్నూరు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ రావు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీమంతం జరుపుకుంటున్న కాబోయే తల్లిని ఎమ్మెల్యేలు ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టబోయే బిడ్డ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. పులివర్తి నాని కుటుంబంతో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. చాలా కాలం తర్వాత మిత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. శుభకార్యం అనంతరం నేతలందరూ కాసేపు సరదాగా గడుపుతూ రాజకీయ, వ్యక్తిగత విషయాలపై ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, పులివర్తి నాని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఆత్మీయ వేడుకలో ఎమ్మెల్యేల కలయిక-పులివర్తి నాని కోడలి శ్రీమంతానికి హాజరైన బొజ్జల సుధీర్ రెడ్డి