పున్నమి న్యూస్ పెళ్లకూరు
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో ప్రభుత్వ భూమి విషయంలో వైకాపా, తెదేపా నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు, తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు.
వైకాపా నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను తెదేపా శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం,
తోపులాట చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో శేఖర్‌పై దాడి జరగడంతో, అక్కడే ఉన్న తెదేపా నాయకుడు బాలయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయారు
వెంటనే బాలయ్యను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
టీడీపీ నేత మృతితో చిల్లకూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
గ్రామంలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొంది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

