Thursday, 1 October 2026
  • Home  
  • ఆర్జేసీ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- ఖమ్మం

ఆర్జేసీ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించిన స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతిలో, సమాజ వికాసంలో ఖమ్మం జిల్లావాసుల పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేలా కళాశాలలో విద్యాబోధన కొనసాగుతోందని గుండాల కృష్ణ తెలిపారు. తమ కళాశాల విద్యార్థి ప్రస్తుతం ఇస్రోలో పనిచేస్తున్నారని, పలువురు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో విద్యార్థులు ర్యాంకులు సాధించారని వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ, శాంతిభద్రతలు, సహోదరభావాన్ని పెంపొందించి దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. లింగయ్య, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. లక్ష్మీపతి, ఇన్‌చార్జిలు ఆంజనేయులు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించిన స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతిలో, సమాజ వికాసంలో ఖమ్మం జిల్లావాసుల పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేలా కళాశాలలో విద్యాబోధన కొనసాగుతోందని గుండాల కృష్ణ తెలిపారు. తమ కళాశాల విద్యార్థి ప్రస్తుతం ఇస్రోలో పనిచేస్తున్నారని, పలువురు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో విద్యార్థులు ర్యాంకులు సాధించారని వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ, శాంతిభద్రతలు, సహోదరభావాన్ని పెంపొందించి దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. లింగయ్య, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. లక్ష్మీపతి, ఇన్‌చార్జిలు ఆంజనేయులు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.