*జర్నలిస్టులపై దాడులపై ప్రత్యేక కమిటీ పునరుద్ధరణ*జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనుంది.*కమిటీ సభ్యులు*▪️హోం మంత్రి – చైర్మన్.▪️సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి – వైస్ చైర్మన్.▪️హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ.▪️సాధారణ పరిపాలన (Poll) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ.▪️సాధారణ పరిపాలన (I&PR) శాఖ ఎక్స్-ఆఫీషియో సెక్రటరీ.▪️IGP (Law & Order)▪️గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు.▪️పెద్ద దినపత్రికలు/పీరియాడికల్స్ మేనేజ్మెంట్ ప్రతినిధి.▪️చిన్న, మధ్య తరహా దినపత్రికల సంఘం ప్రతినిధి.▪️ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం ప్రతినిధి.▪️ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధి.▪️డైరెక్టర్, I&PR – మెంబర్ కన్వీనర్.▪️అవసరాన్ని బట్టి మరో సభ్యుడిని కో-ఆప్ట్ చేసే అధికారం కూడా డైరెక్టర్, I&PRకు కల్పించారు.*జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించి, సంబంధిత అంశాలపై చర్యలకు దోహదపడే విధంగా ఈ కమిటీ వ్యవహరిస్తుంది.*


