Friday, 24 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బైరవ ప్రసాద్‌కు చిన్నా జనసేన సత్కారం

నెల్లూరు జిల్లాలో శుభకార్యానికి విచ్చేసిన కదిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బైరవ ప్రసాద్ గారిని, మార్గమధ్యంలో మర్రిపాడు మండల కేంద్రంలో చిన్నా జనసేన మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా బైరవ ప్రసాద్ గారు మాట్లాడుతూ, మర్రిపాడు మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి చిన్నా చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో చిన్నాకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నా సేవలను అభినందిస్తూ నాయకులు మద్దతు తెలిపారు. పార్టీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బైరవ ప్రసాద్‌కు చిన్నా జనసేన సత్కారం

నెల్లూరు జిల్లాలో శుభకార్యానికి విచ్చేసిన కదిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బైరవ ప్రసాద్ గారిని, మార్గమధ్యంలో మర్రిపాడు మండల కేంద్రంలో చిన్నా జనసేన మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా బైరవ ప్రసాద్ గారు మాట్లాడుతూ, మర్రిపాడు మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి చిన్నా చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో చిన్నాకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నా సేవలను అభినందిస్తూ నాయకులు మద్దతు తెలిపారు. పార్టీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బైరవ ప్రసాద్‌కు చిన్నా జనసేన సత్కారం

నెల్లూరు జిల్లాలో శుభకార్యానికి విచ్చేసిన కదిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బైరవ ప్రసాద్ గారిని, మార్గమధ్యంలో మర్రిపాడు మండల కేంద్రంలో చిన్నా జనసేన మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా బైరవ ప్రసాద్ గారు మాట్లాడుతూ, మర్రిపాడు మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి చిన్నా చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో చిన్నాకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నా సేవలను అభినందిస్తూ నాయకులు మద్దతు తెలిపారు. పార్టీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

E-పేపర్

కోటి రూపాయల విలువైన హషీష్ ఆయిల్ స్వాధీనం – ఒకరి అరెస్ట్*

*కోటి రూపాయల విలువైన హషీష్ ఆయిల్ స్వాధీనం – ఒకరి అరెస్ట్* ఫ్యూచర్ సీటీ కమిషనరేట్ – తేదీ: 30 మార్చి 2026. పున్నమి న్యూస్ రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం పోలీసులు మరియు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) బృందం సమిష్టిగా నిర్వహించిన తనిఖీలలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 9.402 కిలోల హషీష్ ఆయిల్ (గంజాయి ద్వారా తయారు చేసే నూనె)ను పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 1 కోటిగా అంచనా వేశారు. *నిందితుల వివరాలు:* A-1: కొరాబు చాంటి బాబు (35 సంవత్సరాలు) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా నివాసి (అరెస్ట్) A-2: రాజారావు (ఒరిస్సా) – పరారీలో ఉన్నారు A-3: గుర్తుతెలియని వ్యక్తి – పరారీలో ఉన్నారు పోలీసుల వివరాల ప్రకారం, A-1 చంటి బాబు, A-2 రాజారావు వద్ద నుండి ఈ డ్రగ్స్‌ను సేకరించి హైదరాబాద్‌లోని గుర్తుతెలియని వ్యక్తులకు సరఫరా చేయడానికి ప్రయత్నించాడు. మార్చి 29 సాయంత్రం మహేశ్వరం గేట్ బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్న సమయంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 10 పాలిథిన్ కవర్లలో ఉన్న హషీష్ ఆయిల్ మరియు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చంటి బాబుపై గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని కంచరపాలెం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలలో 4 NDPS కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. *ప్రజలకు విజ్ఞప్తి:* యువత మరియు విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఫ్యూచర్ సిటీ పోలీసులు సూచించారు. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని కోరారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే మహేశ్వరం జోనల్ కంట్రోల్: 8712662664 లేదా Dial 100కు సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన అధికారులను పోలీస్ కమిషనర్ శ్రీ జి. సుధీర్ బాబు, ఐపిఎస్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.

తిరుపతి

కోలాహలంగా క్రీడాభారతి కబడ్డీ పోటీలు

* క్రీడలో మానసిక శారీరక దృఢత్వానికి సోపానాలు * తిరుచానూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మౌనిక మునిశేఖర్ తిరుపతి, మార్చి 30 పున్నమి ప్రతినిధి క్రీడలు మానసిక శారీరక దృఢత్వానికి సోపానాలని తిరుచానూరు మార్కెట్ యార్డ్ పాలమండలి చైర్మన్ ఊరుబిండి మౌనిక మునిశేఖర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు చెరుకూరి వెంకటేశ్వర ప్రసాద్,హెచ్ ఎన్ ఆర్ ప్రాజెక్టు ప్రోపరేటర్ కామసాని నరసింహారెడ్డిలు పేర్కొన్నారు. క్రీడాభారతి, హెచ్ఎన్ఆర్ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కబడ్డీ పోటీలను నిర్వహించారు. చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి అండర్ 14, అండర్ 19 బాలుర,బాలికల జట్లకు కబడ్డీ పోటీలు నిర్వహించారు.70 జట్లు పోటీపడ్డాయి.సోమవారం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న ప్రాచీన క్రీడలను ప్రోత్సహించడానికి క్రీడా భారతి ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. నెట్ సెల్ ఫోన్ ప్రపంచంలో క్రీడాలను యువత విద్యార్థులు పూర్తిగా మర్చిపోతున్నారన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం ఏర్పడుతుందని తెలిపారు. క్రీడలతో నాయకత్వ లక్షణాలు, క్రీడా స్ఫూర్తి ఏర్పడుతుందని తెలిపారు. కబడ్డీ వంటి భారతీయ ప్రాచీన క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.క్రీడాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంయోజక్ చంద్రశేఖర్ జాగీర్, అఖిల భారత క్రీడా భారతి కేంద్ర ప్రముఖ్ అశోక్,జిల్లా క్రీడా భారతి అధ్యక్షులు, ధనజయ రెడ్డిలు మాట్లాడుతూ భారతీయ ప్రాచీన క్రీడలను కాపాడుకునేందుకు నేటి యువతలో స్ఫూర్తిని నింపేందుకు దేశవ్యాప్తంగా కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2039 ఒలంపిక్ లో కబడ్డీ పోటీలను ప్రవేశపెట్టాలన్నదే క్రీడభారతి లక్ష్యం అని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3000 కేంద్రాలలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. . కబడ్డీ పోటీలో విజేతలు వీరే.. అండర్ 14 విభాగంలో ఏడు బాలికల జట్లు, 17 బాలుర జట్లు పోటీపడ్డాయి. అండర్ 19 విభాగంలో 9 బాలికల జట్లు 21 బాలురు జట్లు పోటీపడ్డాయి. అండర్ 14 గర్ల్స్ విభాగంలో ఏ ఎస్ ఏ స్పోర్ట్స్ క్లబ్, అనుంపల్లి జడ్.పి.హెచ్,ఎస్, నారాయణ ఓఎంసీఎస్ వాడు వరుస మూడు స్థానాల్లో నిలిచాయి. అండర్ 19 గర్ల్స్ విభాగంలో కె వి ఎస్ -ఎ జట్టు, కెవిఎస్ -b జట్టు, కేశవరెడ్డి జట్లు వరుస మూడు స్థానాల్లో నిలిచాయి. అండర్ 14 బాయ్స్ విభాగంలో వెరిటాస్ సైనిక్ స్కూల్, నిండ్ర ప్రభుత్వ పాఠశాల, ప్రశాంత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వరుస మూడు స్థానాల్లో నిలిచాయి. అండర్ 19 బాయ్స్ విభాగంలో ఎస్వి డిఫెన్స్ పాఠశాల మొదటి స్థానంలో, బిఆర్ పల్లి ప్రభుత్వ పాఠశాల రెండో స్థానంలో ,ఎస్వి డిఫెన్స్ అకాడమీ నింద్ర ప్రభుత్వ పాఠశాలలు సంయుక్తంగా మూడవ స్థానంలో నిలిచాయి. ఓవరాల్ ఛాంపియన్షిప్ జూనియర్ బాయ్స్ వెరిటేజ్ సైనిక్ స్కూల్ సీనియర్ బాయ్స్ మంత్ర జట్లు నిలిచాయి. గెలుపొందిన విజేతలకు ఛాంపియన్ ట్రోపీలను మెడల్స్ ను ప్రధానం చేశారు. కబడ్డీ పోటీలు నిర్వహణకు కృషిచేసిన రామస్వామి నరసింహారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడభారతి రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, దక్షిణ భారత క్రీడా భారతి సబ్యులు, సురేంద్ర రెడ్డిమిట్టపల్లి, ఆర్ సి పురం టిడిపి మహిళా అధ్యక్షురాలు గుణసుందరి, గాజుల రవి, కాలనీ సామాజిక సాధికారిక సంక్షేమ కమిటీ సభ్యులు రాజారామ్ ,ఉమేష్ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కోచ్ లను గ్రామ కమిటీ పెద్దలను ఘనంగా సత్కరించారు.

కడప

ప్రొద్దుటూరులో ఫిజిక్స్ వాలా కన్సల్టెన్సీ పేరుతో మోసం: ఏఐఎస్ఎఫ్

ప్రొద్దుటూరు హోమస్ పేటలోని ఫిజిక్స్ వాలా యాజమాన్యం ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఫిజిక్స్ వాలా కన్సల్టెన్సీ పేరుతో విద్యార్థులను మోసం చేసింది కాక ఉద్యోగులకు 4 నెలల జీతాలు ఇవ్వలేదని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బాధితులు వారి కుటుంబ సభ్యులు కన్సల్టెన్సీ సెంటర్ ఎదుట బైఠాయించి చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, కర్నూలు, పులివెందులలో ఫిజిక్స్ వాలా పేరుతో సెంటర్లు ఉన్నాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు స్వాతంత్ర్య సమర చరిత్ర గ్రంథావిష్కరణ – 30 ఏళ్ల పరిశోధనకు సార్థక ఫలితం

1996 మార్చ్ 17-18 తేదీలలో నెల్లూరు వి ఆర్ కళాశాలలో రెండు రోజుల పాటు మల్లంపల్లి సోమశేఖర శర్మ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ సంస్థ నిర్వహించిన నెల్లూరు జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర అంశం మీద పలువురు ఆహ్వానిత అధ్యాపకులు చేసిన పత్రసమర్పణ విషయాలు 30 ఏళ్ల తర్వాత గ్రంథ రూపంలో వెలుగులోకివచ్చి ఈ రోజు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ద్వారా ఆవిష్కరణ జరిగింది. యువతలో జాతీయ భావనలు పూర్తిగా కనుమరుగవుతున్న నేపథ్యంలో జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర పుస్తకం ఆవిష్కరణ చేయడం ఒక మహద్భాగ్యం గా భావిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ చెప్పారు. నేటి తరం యువతకు స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు చేసిన వారి గురించి విస్తృతంగా చర్చ జరగాలని వారు తెలుసుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ గిద్దలూరు వేంకటేశ్వర రావు, కాంజీవరం రాధాకృష్ణ అప్పట్లో సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు హాజరైన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి సలహా మేరకు ఈ సదస్సు వివరాలు గ్రంథ రూపంలో వస్తేనే విజయవంత మయ్యినట్లు అని చేసిన సూచన మేరకు ఇది 480 పేజి ల బృహత్ గ్రంథం అయింది. అనివార్య కారణాల రీత్యా ఆలస్యం అయినా భవిష్యత్ తరాలకు జిల్లా స్వాతంత్య్ర చరిత్ర తెలిసేలా వెలువరించమని కాంజీవరం రాధాకృష్ణ పుస్తక సమీక్ష లో వివరించారు. సుమారు 84 మంది రాసిన పలు అంశాల వ్యాసాలు ఇందులో ఉన్నాయని రాధాకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా కు చెందిన కొందరు వదాన్యులు ఈ గ్రంథ ప్రచురణలకు సహకరించారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గ్రంథ సంపాదక బృందంలో ఒకరైన డాక్టర్ లెనిన్ ధనిశెట్టి ఈ పుస్తకం వెలువరించేందుకు ఇద్దరు అధ్యాపకులు పడిన శ్రమ ఫలించిందని అన్నారు. అనంతరం విచ్చేసిన గ్రంథంలోని వ్యాస రచయితలు బొగ్గవరపు రాధాకృష్ణ మూర్తి, డా గంగి శెట్టి శివకుమార్, రంగారావు, కార్యక్రమ సమన్వయ కర్తలు డాక్టర్ పెరుగు రామకృష్ణ, డాక్టర్ లెనిన్లకు ఉపకులపతి గ్రంథ ప్రతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర విద్యా సంస్థల చైర్మన్ రవీంద్ర రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గూడూరు పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు..!

జనగాం

ప్రజావాణి అర్జీలకు వేగవంతమైన పరిష్కారం కల్పించాలి కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్‌తో కలిసి ఆయన మొత్తం 232 అర్జీలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. భూమి మ్యుటేషన్, ఇందిరమ్మ ఇల్లు, రిజిస్ట్రేషన్ సమస్యలు, పింఛన్ మంజూరు వంటి అంశాలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని వేగంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నారాయణపేట

తంగిడిగి గ్రామంలో ఎంపీ అరుణమ్మ మంజూరు చేసిన సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగప్ప బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాంరెడ్డి

క్రిష్ణ మండలం తంగిడిలో ఇటీవల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారు VBG RAM జీ నిధుల ద్వారా మంజూరు చేసిన 5 లక్షల రూపాయలు సీసీ రోడ్డు ను కుర్వ వాడలో 120 మీటర్లు పనిని ప్రతేక పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి,మండల అధ్యక్షులు నల్లే నర్సప్ప గారు పార్లమెంట్ సభ్యురాలగా ఎన్నికైన 2 సంవత్సరాలల్లొ మన నియోజకవర్గనికి అనేక అభివృద్ధి కార్యక్రమం లకు పెద్ద ఎత్తున నిద్దులు తెచ్చిన ఘనత అరుణమ్మ ది అని భవిష్యత్ లో క్రిష్ణ మండలానికి మరి నిధులు వస్తాయని అన్నారు. కార్యక్రమం లో ఉపసర్పంచ్ కీర్లింగ,జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకట్రాములు,మక్తల్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర, స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ గుంతల్ హన్మంత్రాయ, జెంసేర్ నర్సింగప్ప, కంప్లి రాజు, బూత్ అధ్యక్షులు నర్సింగ, వార్డు సభ్యులు హన్మంతి బీరప్ప, వడ్డె చిన్నప్ప, ఛిగనూర్ మల్లప్ప, అలంపల్లి జుక్కప్ప,రవిగౌడ, బసవలింగ,, మల్లిఖార్జున,

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కుంకువారి పాలెం లో తెదేపా ఆవిర్భావ వేడుకలు

తెలుగుదేశం పార్టీ 44వఆవిర్భావ దినోత్సవ వేడుకలను కొండాపురం మండలం కుంకువారిపాలెంలో సీనియర్ నేత బొట్లగుంట హరిబాబు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం , తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో పార్టీ పతాకo ఆవిష్కరించిన అనంతరం హరిబాబు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీఅని. “సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు” అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన, బడుగు, బలహీనవర్గాలకు రాజకీయంగా,సామాజికంగా గుర్తింపు వచ్చింది. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు అందరికీ హరిబాబు శుభాకాంక్షలు తెలిపారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.