Friday, 24 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కుంకువారి పాలెం లో తెదేపా ఆవిర్భావ వేడుకలు

తెలుగుదేశం పార్టీ 44వఆవిర్భావ దినోత్సవ వేడుకలను కొండాపురం మండలం కుంకువారిపాలెంలో సీనియర్ నేత బొట్లగుంట హరిబాబు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం , తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో పార్టీ పతాకo ఆవిష్కరించిన అనంతరం హరిబాబు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీఅని. “సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు” అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన, బడుగు, బలహీనవర్గాలకు రాజకీయంగా,సామాజికంగా గుర్తింపు వచ్చింది. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు అందరికీ హరిబాబు శుభాకాంక్షలు తెలిపారు*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నె.ర.సం ఆధ్వర్యంలో శ్రీ పరాభవ ఉగాది సత్కారం

….. ప్రాచీన క ళలను సంస్కృతిని ఆదరించవలసిన బాధ్యత అందరిపై ఉందనిజిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ మేకపాటి శాంతకుమారి అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జిల్లా గ్రంధాలయంలో నిర్వహించిన శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది పురస్కారాలు కవి సమ్మేళనం కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీవీలు సెల్ఫోన్ వల్ల విద్యార్థులలో సామాజిక స్పృహ తగ్గిందని ప్రాచీన కళలను ఆరాధించడం తగ్గిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాల నుంచి వస్తున్న భారతదేశ సంస్కృతి తెలియజేసే భరతనాట్యము త్యాగరాజ కృతులు వేమన పద్యాలను చిన్నప్పటి నుండి విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు.యాభై మందికి పైగా కవులు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెరసం తరఫున ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర సం చాలకులు మాడభూషి సంపత్ కుమార్ ని , పద్యకవి చీమకుర్తి వెంకటేశ్వర్ రావు ని, సాహితీ వేత్త వేదం సూర్యప్రకాష్ రావుని గురుకృపాకళా క్షేత్రం నాట్య గురువు శ్రీమతి సురభి గాయత్రిని, ప్రముఖ గాయని వినయ రెడ్డి చేజర్లని ఉగాది పురస్కారం తో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ కార్యదర్శి కుమార్ రాజా,తోట సులోచన అతిధులుగా పాల్గొన్నారు..ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాశ్ అధ్యక్షత వహించాడు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు చేసిన నృ త్యాలను అందరూ అభినందించారు.బాలకవులు సైతం కవితలు వినిపించారు.

కాకినాడ

బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు యనమల రామకృష్ణుడు, యనమల రాజేష్‌కు ఆహ్వానం..!

కాకినాడ జిల్లా, మార్చి 30 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎస్. అన్నవరం గ్రామంలోని ఎస్.సి కాలనీలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విగ్రహ ఆవిష్కరణకు యనమల రామకృష్ణుడు గారు మరియు యనమల రాజేష్ గారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు తుమ్మలపల్లి నాని, మధు, రామ్ దుర్గ, సందీప్, చరణ్ మరియు కుల పెద్దలు పాల్గొననున్నారు.

అన్నమయ్య

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో కోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు తనిఖీ

ఈ రోజు కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ D. శ్రీనివాసులు చిట్వేల్ మరియు పెనగలూరు మండలాల్లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షలు ప్రశాంతంగా మరియు నిష్పాక్షికంగా జరగాలని, ఎటువంటి కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి సూచనలు ఇచ్చారు.పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా ప్రజలు గుంపులుగా చేరకుండా చూడాలని, అకతాయిలు తిరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

మహబూబ్ నగర్

*ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించిన విద్యార్థులు

*సాంస్కృతిక కార్యక్రమాలు.. అబ్బురపరిచిన విద్యార్థులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 30/03/ 2026* *స్థానిక బికే రెడ్డి కాలనీ ఆటో స్టాండ్ యందు శివాలయం లో మహబూబ్నగర్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు నృత్య శిక్షకురాలు విజయలక్ష్మి మేడం ఆధ్వర్యంలో దాదాపుగా 50 మంది పైచిలుకు విద్యార్థులుసాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా అబ్బురపరిచాయి విద్యార్థులు వివిధ ప్రాచీన ఘట్టాలకు సంబంధించిన రామ నామం, రామాయణం గురించి తెలియజేస్తూ వాటి విశిష్టతను తెలియజేస్తూ నృత్య రూపంలో అద్భుత ప్రదర్శన చేశారు భక్తులను వారి నృత్యం, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి వారి నృత్యాన్ని భక్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ శాంత, నృత్య శిక్షకురాలు విజయలక్ష్మి, మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు*

మహబూబ్ నగర్

*ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించిన విద్యార్థులు

*సాంస్కృతిక కార్యక్రమాలు.. అబ్బురపరిచిన విద్యార్థులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 30/03/ 2026* *స్థానిక బికే రెడ్డి కాలనీ ఆటో స్టాండ్ యందు శివాలయం లో మహబూబ్నగర్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు నృత్య శిక్షకురాలు విజయలక్ష్మి మేడం ఆధ్వర్యంలో దాదాపుగా 50 మంది పైచిలుకు విద్యార్థులుసాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా అబ్బురపరిచాయి విద్యార్థులు వివిధ ప్రాచీన ఘట్టాలకు సంబంధించిన రామ నామం, రామాయణం గురించి తెలియజేస్తూ వాటి విశిష్టతను తెలియజేస్తూ నృత్య రూపంలో అద్భుత ప్రదర్శన చేశారు భక్తులను వారి నృత్యం, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి వారి నృత్యాన్ని భక్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ శాంత, నృత్య శిక్షకురాలు విజయలక్ష్మి, మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు*

మహబూబ్ నగర్

*కొత్త ట్రాన్స్ఫారం కాలనీలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్న కాలనీవాసులు

*కొత్త ట్రాన్స్ఫారం కాలనీలో ఏర్పాటు చేయుట గురించి మేయర్ కు విజ్ఞప్తి చేస్తున్న మహేశ్వరి కాలనీవాసుపలు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ 30/03/2026* *ఈరోజు స్థాని*క కార్పొరేషన్ మహబూబ్నగర్ యందు మేయర్ మమత మేడం గారిని 49వ డివిజన్లో కరెంటు సమస్యతో బాధపడుతున్న సమస్యను వినతి పత్రం ద్వారా వివరించడం జరిగింది. తక్షణమే 49వ డివిజన్ మహేశ్వరి కాలనీ యందు కొత్త ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయుటకై మేడంతో సవివరంగా వివరించడం జరిగింది ఆమె సానుకూలంగా స్పందించి సమస్యను త్వరలో పరిష్కరింప చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మహేశ్వరి కాలనీ అభివృద్ధి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, ఎం.ఎన్ విజయకుమార్, కోశాధికారి రిటైర్డ్ హెడ్మాస్టర్ వెంకటకృష్ణయ్య,గారు పాల్గొని వినతిపత్రం అందించడం జరిగింది*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు లో వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం (ఉస్మాన్ పున్నమి రిపోర్టర్ ) నందిపాడు ఎస్సీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో బక్కా ప్రసాద్ (32) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు, కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన తెలిసిన వెంటనే గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు. కుటుంబ సభ్యులు, పొరుగువారిని ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రాంతంలో ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు

విశాఖపట్నం

ఓటీపీ మాయతో 30 గ్యాస్ సిలిండర్లు మాయం – డెలివరీ బాయ్ అరెస్ట్

విశాఖపట్నం, గాజువాక మార్చి (పున్నమి ప్రతినిధి) గ్యాస్ సిలిండర్ల సరఫరాలో మోసం చేసిన ఘటన గాజువాకలో వెలుగుచూసింది. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న అప్పారావు కస్టమర్ల ఓటీపీలు సేకరించి సుమారు 30 గ్యాస్ సిలిండర్లను మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మణికంఠ ఏజెన్సీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడు కస్టమర్లతో వరుసలు కలిపి ఓటీపీలు తీసుకొని సిలిండర్లను సరఫరా చేయకుండా మళ్లించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో అప్పారావును అరెస్ట్ చేసినట్లు గాజువాక ఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐ పార్థసారథి తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవనున్నాయి. Uploaded Video:

విశాఖపట్నం

విశాఖలో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన నేవీ టెక్నీషియన్

విశాఖపట్నం మార్చి (పున్నమి ప్రతినిధి) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన విశాఖపట్నం నగరంలోని ఎల్వీనగర్‌లో వెలుగుచూసింది. నేవీ టెక్నీషియన్ రవీంద్ర(35) తన ప్రియురాలు మౌనిక(29)ను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల సమాచారం ప్రకారం, రవీంద్ర భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లిన నేపథ్యంలో ఆదివారం రాత్రి మౌనికను తన ఫ్లాట్‌కు పిలిచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తగా ఆగ్రహంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆధారాలు చెరిపివేయడానికి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు. తర్వాత నేరభారం తట్టుకోలేక రవీంద్ర స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, మౌనిక శరీర భాగాల్లో తల కనిపించకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఆ దిశగా పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ అమానుష ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.